STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ఎ. పి. జె. అబ్దుల్ కలాం

ఎ. పి. జె. అబ్దుల్ కలాం

3 mins
24

ఎ. పి. జె. అబ్దుల్ కలామ్.


   టీచర్ : పిల్లలూ! క్షిపణి శాస్త్రవేత్తగా ఎంతో ఖ్యాతి పొంది, మనదేశానికి 11 వ రాష్టపతిగా పదవిని అలంకరించిన గొప్ప సామాజిక సేవా తత్పరుని గురించి మీకు తెలుసా?

   పిల్లలు : తెలుసు టీచర్! ఆయన అబ్దుల్ కలామ్ గారు.

  టీచర్ : గుడ్!గుడ్! ఆయన గురించి వివరాలు చెప్పండి! ఆయన ఎక్కడ పుట్టారు? ఏం చదివారు? ఇలా ఆయన గురించి చెప్పగలరా?

  పిల్లలు : పూర్తిగా తెలియవు టీచర్! కొద్దిగా మాత్రమే తెలుసు.

  టీచర్ : అయితే నేను మీకు ఈ రోజు ఎ. పి. జె. అబ్దుల్ కలామ్ తాతగారి గురించి వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి!

  పిల్లలు : అలాగే టీచర్!

  టీచర్ : అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబరు 15 న తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి, పెరిగాడు.అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్ తండ్రి జైనులబ్దీన్. తల్లి ఆషియమ్మ. తండ్రి ఒక పడవ యజమాని. 

   రామనాథపురములో హైస్కూల్ వరకు చదివారు. కలామ్ గారు తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్రం చదివారు.తరువాత కలామ్ గారు చెన్నైలోని మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు.

   పిల్లలు: తండ్రి పడవ యజమాని అయినా కలామ్ గారు కాలేజీ చదువులు ఎలా చదువగలిగారు టీచర్?

  టీచర్: కలామ్ గారు చిన్నప్పుడు తండ్రికి ఆర్థికంగా సహాయము చేయుటకు చిన్న చిన్న పనులు చేసేవాడు. కష్టపడి చదివేవాడు. అందువలన అతని ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడు చదువుకొనుటకు సహాయపడేవారు.

  పిల్లలు: శాస్త్రవేత్తగా ఎప్పుడు అయ్యారు?

  టీచర్: 1960లో కలామ్ గారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్( డి.ఆర్.డి. ఓ.) వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు.మొదటగా కలామ్ గారు భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ ను తయారు చేశారు . డి.ఆర్. డి.ఓ.లో పనిచేస్తూ భారతదేశ 'మిస్సైల్ మాన్ 'గా పేరు పొందారు 

   1970 నుంచి 1990 మధ్య కలామ్ గారు పి.ఎస్.ఎల్.వి మరియు ఎస్.ఎల్. వి.3. ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పని చేశారు .ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి.1970లో ఎస్. ఎల్.వి.రాకెట్ ఉపయోగించి రోహిణి 1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం అనేది ఇస్రో చరిత్రలో ఒక ఘన విజయం అయింది.1970 లోనే అగ్ని, పృథ్వి క్షిపణులను తయారుచేయటంలో కలామ్ గారు ముఖ్యసూత్రధారిగా వ్యవహరించారు 

    కలామ్ గారు 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా డి.ఆర్.డి.ఓ. లో పనిచేశారు .ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్  అణు పరీక్షల్లో కలామ్ గారు తన ప్రతిభనంతా చాటారు.

   పిల్లలు: సామాన్య ప్రజలకు కూడా ఏమైనా ఉపయోగపడేవి చేసారా టీచర్ ?

  టీచర్: 1998 లో కలామ్ ప్రముఖ హృద్రోగ నిపుణులైన డాక్టర్ సోమరాజు గారితో కలిసి సంయుక్తంగా ఒక స్టంట్ తయారు చేశారు. దీనిని 'అబ్దుల్ కలామ్-రాజు స్టంట్' అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ ను తయారు చేశారు. దీనిని' కలాంమ్ - రాజు టాబ్లెట్ 'అంటారు.

  పిల్లలు: మరి ఎప్పుడు భారత రాష్ట్రపతి అయ్యారు?

  టీచర్: 2002 జూలై 18న అబ్దుల్ కలామ్ గారు భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు.

   పిల్లలు : టీచర్! కలామ్ తాతగారు గొప్ప రచయిత అని విన్నాము. ఆయన ఏ ఏ పుస్తకాలు రచించారు?

  టీచర్ : కలామ్ తాతగారు పిల్లలను ప్రోత్సహిస్తూ, ప్రేరణాత్మక రచనలెన్నో చేసారు. వారు రచించిన గ్రంథాలు దేశ విదేశాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. వాటిలో కొన్ని:

వింగ్స్ ఆఫ్ ఫైర్

సైంటిస్ట్ టు ప్రెసిడెంట్

ఇండియా 2020

ఇగ్నైటెడ్ మైండ్స్ అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా

ఇండియా మై ఫ్రీడమ్

వంటి గొప్ప పుస్తకాలు రచించారు.

  పిల్లలు: అబ్దుల్ కలామ్ తాతగారికి వచ్చిన పురస్కారాలు ఏమిటి?

  టీచర్: అబ్దుల్ కలామ్ విదేశీ యూనివర్సిటీల నుంచి 7 గౌరవ డాక్టరేట్లు పొందారు. అందులో రాయల్ సొసైటీ యూకే నుండి కింగ్ చార్లెస్ పతకం ప్రముఖమైనది.

       భారత ప్రభుత్వం కలామ్ గారికి' పద్మభూషణ్,పద్మ విభూషణ్,భారతరత్న,'వంటి అత్యున్నతమైన పురస్కారాలను అందజేసింది.కలామ్ గారి పుట్టినరోజును అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 'యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం'గా జరుపుకుంటారు. రాష్ట్రపతిగా కూడా సేవలు అందించిన మహనీయుడు ఎ. పి. జె.అబ్దుల్ కలామ్ గారు 2015 జూలై 27న సోమవారం, సాయంత్రం షిల్లాంగ్ లోని ఐ.ఐ.ఎం.లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించారు. అప్పటికి ఆయన వయసు 84 సంవత్సరాలు.

   చూశారా!పిల్లలూ!అబ్దుల్ కలామ్ తాతగారు కడు పేదరికంలో జన్మించినా తన చదువుతో, తన ప్రతిభతో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవినలంకరించాడు. ప్రతిభకు పేదరికం అడ్డు రాదనటానికి అబ్దుల్ కలామ్ గారి జీవితం ఒక ఉదాహరణ. ఆయన జీవితచరిత్రను తెలిసికొని మనం ఏం చెయ్యాలి?

   పిల్లలు : బాగా చదివి ఎప్పుడూ మన తెలివితేటల్ని పదును పెట్టుకుంటూ ఉండాలి.

   టీచర్ : అవును సరిగ్గా అర్థం చేసుకొన్నారు. అప్పుడు మనం ఎదగటానికి మంచి అవకాశాలు వస్తాయి.


సమాప్తం.



Rate this content
Log in

Similar telugu story from Inspirational