బావ మీద కోపం
బావ మీద కోపం


కాలేజ్లో జాయిన్ కావాల్సిన టైం అయిపోయింది.. అడ్మిషన్ దొరుకుతుందో లేదో అనే భయంతో బాబాయితో కలిసి కాలేజ్ లో అడుగుపెట్టాను.
లోపడికి వెళ్లడంతోనే అడ్మిషన్ లు దాదాపు అయిపోయాయని సర్ అన్నారు.. ఇక మీరు వేరే కాలేజ్ చూసుకోవడం మంచిదని చెప్పడంతో.. మా బాబాయి కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడుతానని ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు..
అక్కడే బాబాయి చిన్నప్పటి ఫ్రెండ్ ఉండటంతో.. హైడ్ లో ఉన్న ఒక్క సీట్ నాకు ఇప్పించాడు.
"బాగా చదువుకోరా అర్జున్" అని బాబాయి వెళ్తూ చెప్పాడు.
"సరే బాబాయి.. కానీ అగు. నేను ఎక్కడ ఉండాలో చెప్పి వెళ్ళు"
"ఎక్కడ ఏంటి రా.. కాలేజ్ హాస్టలోనే ఉండు"
"హాస్టలోనా.. నా వల్ల కాదు బాబాయి. నేను రూంలో ఉంటా"
"సరే ప్రస్తుతం ఒక వారం రోజులు హాస్టల్ లో ఉండు. నేను ఈలోపు ఒక రూం చూస్తా. మంచి ఫ్రెండ్స్ ఉంటే.. ఒక ముగ్గురితో కలిసి ఉందువు"
"సరే బాబాయి. ఇక నేను క్లాస్ లోకి వెళ్తా.."
"హా సరే రా బాగా చదువుకో.. జాగ్రత్త"
అప్పటికే క్లాస్ రన్ అవుతుంటే.. మధ్యలోనే క్లాస్ లోకి వెళ్ళా..
"ఏంటి బాబు న్యూ అడ్మిషనా.." అని గంబీరమైన గొంతుతో అడిగారు సర్.
"అవును సర్.." అని అమాయకంగా చెప్పాను..
"సరే సరే.. కూర్చో అని.." మళ్లీ ఆయన క్లాస్ చెప్పడం మొదలు పెట్టారు.
"పిజీ ఫస్ట్ ఇయర్ కావడంతో క్లాస్ లో చాలా మందే ఉన్నారు"
ఆ రోజు క్లాస్ అయిపోవడంతో.. అందరం వెళ్లిపోయాం.. నేను కూడా హాస్టల్ కి వెళ్లిపోయా
నేను కూర్చున్న బెంచ్ లోనే ముగ్గురు ఫ్రెండ్స్ క్లోజ్ అయ్యారు. ఇక బాబాయి కూడా బయట రూం చూడటంతో.. వెంటనే హాస్టల్ నుంచి రూం కి షిఫ్ట్ అయిపోయాం.
సరిగ్గా నేను వచ్చిన రోజు నుంచి ఒక్క అమ్మాయిని గమనిస్తున్న అనే విషయం నా పక్కనే ఉన్న రాజు గమనించాడు.
"ఏంటి మామ ఆ అమ్మాయిని పది రోజుల నుంచి అలా గమనిస్తున్నావ్.. లవ్ చేస్తున్నావా ఏంది..?"
"చా అదేం లేదు. తెలిసిన అమ్మాయిలా కనిపిస్తే చూసా అంతే"
"మామ నువ్వు చెప్పే మాటలు అబద్దం కావచ్చు. కానీ నీ కళ్ళు అబద్దం చెప్పవ్ కదా.."
"సరే రాజు ఆ అమ్మాయితో మాట్లాడాలి అని ఉంది. ఏం చేయమంటావ్?"
"మామ హూషార్ ఉన్నావ్ లే.. సరే ప్లాన్ చేద్దాం. వెంటనే ఒప్పుకోరు. నువ్వు కొంచెం స్ట్రాంగా ఉండు."
"అబ్బా అదంతా పక్కన పెట్టు బే.. ముందు ఆ అమ్మాయితో మాట్లాడే ప్లాన్ క్రియేట్ చెయ్యి.."
"హా నువ్వు కాలేజ్ లో.. లేట్ గా జాయిన్ అయ్యావ్ కదా.. వెళ్లి నోట్స్ కావాలి అని అడుగు.. అలా మాట మాట కలిసి దగ్గర అవుతారు."
"అబ్బా రాజు ఏ ఊరు రా నీది. భలే ఐడియాలు ఇస్తావ్"
"ఊరుకో మామ.. మా కరీంనగర్ అబ్బాయిలు అంటే అంతే. ఫ్రెండ్ షిప్ కోసం ఏమైన చేస్తాం"
"భలే చెప్తావ్ రా మాటలు.." అని వాడికో బిస్కెట్ వేసి అక్కడ నుంచి బయటకు వచ్చా.
నేను మాట్లాడాలి అనుకున్న అమ్మాయి అంజలి సరిగ్గా నాకు పది అడుగుల దూరంలో ఉంది.
తను నడుస్తునే.. నా వైపు చూపు మలిపింది. నాకు కరెంట్ పుట్టినట్టు అయ్యి ఒక్కసారి అంజలి అని పిలిచా.
"ఏంటి ? ఇక్కడ నిలబడ్డవ్.. వెళ్లి చదువుకోవచ్చుగా.. ఏం పని లేదా" అని నా మీద అరిచింది..
"అంజలి నేను ఏం అన్నా అని ఇప్పుడు నా మీద అరుస్తున్నావ్"
"ఇంకా ఏం అనాలి. ఇక్కడ నిలబడి అమ్మాయిలకి సైట్ కొట్టడం తప్పా"
"అది కాదు అంజలి. నేను చెప్పేది విను.."
"నేను ఏం చెప్పిన వినను.. నీ పని నువ్వు చూసుకో.." అని పెద్ద పెద్ద అడుగులు వెస్తూ అక్కడ నుంచి తుర్రుమంది.
ఇదంత గమనించిన రాజు. ఏంది మామ ఆ పిల్లకి అంత పొగరు. నువ్వు పిలిచినందుకే గంతగనం తిట్టిందంటే. నువ్వు ప్రేమ, గీమా అంటే.. లేపి లేపి కొడ్తాదేమో.. ఎందుకొచ్చిన ముచ్చట.. వెళ్లిపోదాం పదా అని అక్కడ నుంచి బలవంతగా లాక్కెల్లాడు.
సరే అంజలి నోట్స్ కావాలి అని నా క్లాస్ లోని ఫ్రెండ్ కవితకి చెప్పి పంపించాను.
"ఏ కవిత నీకు బుద్ది లేదానే.. వాడితో మాట్లాడటానికి.. ఆయన నేను నోట్స్ ఇవ్వను అని చెప్పు" అని నన్ను చుస్తూ కోపంగా చెప్పింది.
"సరే కవిత తన నోట్స్ వద్దు లే. నీ నోట్స్ ఉంటే ఇవ్వు. రాసుకొని రేప్ ఇచ్చేస్తా"
"కవితా.. నువ్వు వాడికి నోట్స్ ఇచ్చావ్ అంటే నేను నీతో మాట్లాడను" అని గట్టిగా అరిచింది.
దాంతో కవిత నాకు నోట్స్ ఇవ్వలేదు.
నా పక్కనే ఉన్న రాజు గాడికి దిమ్మతిరిగింది. బావ ఇది పిల్ల కాదు పిశాచి. నీకు సెట్ కాదు వదిలేయ్.
"పో బే. అది నా పిల్ల. నాకు కావాలి."
"పోరా.. నా మాట వింటే ఆ పిల్ల నుండి రక్షిస్తా. లేకుంటే నీ పని అంతే" అని నా మీద జాలిగా రాజుగా చెప్పి వెళ్లాడు.
కాలేజ్ కి వచ్చి నెల రోజులు అవుతున్న.. ఇంకా అంజలి నాతో మాట్లాడటం లేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు.
అప్పుడే రాజుగాడు వచ్చి.. మామ నీకో విషయం చెప్పాలి అని అన్నాడు.
"చెప్పు రా.."
"నీకు మన క్లాస్ లో ఉన్న నిత్యా లవ్ లేటర్ ఇవ్వమని పంపించింది రా.."
"నాకు లవ్ లేటర్ హ. ఎందుకు ఏ పని లేదా ? వెళ్ళి చదువుకోమను మంచిగా"
"కాదు మామ. నువ్వు అంటే ఆ పిల్లకి చాలా ఇష్టమట. ఒక్కసారి మాట్లాడి చూడు"
"బుద్ది ఉండే మాట్లాడుతున్నవా.. నాకు అంజలి ఇంపార్టేంట్.. నిత్యా కాదు"
"మామ నిత్యా మంచి పిల్ల నువ్వు వెళ్లు "
"సరే వెళ్తా.. ఎక్కడ ఉందో చెప్పు. కారాచీ బేకరీలో సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు"
"అదేం టైం రా.. తినే టైంలో లవ్ గురించి ఏ వెదవ అయిన మాట్లాడుతాడా"
"అవేం మాట్లాడకు మామ. నువ్వ ఆ అంజలి నుండి బయట పడే సమయం ఇదే వెళ్లు"
"సరే నువ్వు మాత్రం నేను వెళ్లాను అని క్లాస్ లో ఎవరితో అనకు"
"సరే సరే నువ్వు వెళ్ళు"
ఆ రోజు మధ్యాహ్నం నిత్యాని కలవడానికి బేకరికి వెళ్లాను.
"హాయ్ అర్జున్.." అని ప్రేమగా పిలిచింది
"హల్లో.." అని నేను మాములుగా అన్నా.
"చెప్పు అర్జున్. నా గురించి ఏం అనుకుంటున్నావో.."
"చూడు నిత్యా.. ఇది కరెక్ట్ కాదు. నా మాట విని నువ్వు ఫస్ట్ బాగా చదువుకో.. జాబ్ చేయ్యి.. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో"
"ఏ నేను నీకు నచ్చలేదా అర్జున్. నేను బాలేనా..?"
"చూడు నువ్వు చూడానికి చాలా బాగున్నావ్.. బాగా మాట్లాడుతావ్. అందరికి నచ్చుతావ్. కానీ నేను మాత్రం లవ్ చేయాలేను"
"నేను బాగున్నా అంటావ్ కానీ.. లవ్ మాత్రం చేయవ్. ఎందుకు ఆ అంజలి వెనకల పడ్తావ్.. ఆ పిల్ల వల్లనే కదా నన్ను వద్దు అంటున్నవ్"
"ప్లీజ్ ఇందులోకి అంజలిని లాగొద్దు. అది వేరే విషయం. నీకు తొందర్లోనే అర్దం అవుతుంది"
"నాకు ఏం అర్దం కావాల్సిన అవసరం లేదు. నువ్వు దాని మాయలోనే పడ్డవ్. ఆ పిల్ల నిన్ను చీ పో అన్నా దాని వెనకలే పడుతున్నావ్"
"అమ్మాయివి కాబట్టి ఏం మాట్లాడిన సైలెంట్ గా ఉంటున్నా. నీ ప్లేస్ లో వేరే అబ్బాయి ఉంటే దెబ్బలు ఎలా తినేవాడో చూసే దానివి"
"మరి చెప్పు అర్జున్. నేను నీకు ఎందుకు నచ్చలేదు"
"ఎస్ నా మనసులో అంజలి ఉంది. ఇక ఈ లైఫ్ తనకే. ప్లీజ్ అర్ధం చేసుకో"
"అర్జున్ ఆ అమ్మాయి నిన్ను లైఫ్ లో ప్రేమించదు"
"ఏ ఎందుకు అలా అంటున్నావ్ ?"
" తన ప్రవర్తన నీ మీద ఎలా ఉందో అందరికి తెలిసిందే. సో నిన్ను లవ్ చేయదు."
"తను ఇప్పుడు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏం లేదు లే." అంటూ చిన్న స్మైల్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయా.
రూంకి వెళ్లాగానే.. రాజు గాడు ఒక్క లేటర్ ఇచ్చాడు.
"ఏంది బే మళ్లీ లేటర్ ఇచ్చావ్. ఈ సారి ఏ పిల్ల ఇచ్చింది..?"
"ఈ సారి మాత్రం నీ పిల్లనే ఇచ్చింది. అందులో ఏం ఉందో చదువు మామ."
ఆ లేటర్ లో "అర్జున్ నీతో ఒక్కసారి మాట్లాడాలి. మనమందరం. అరకుకి వెళ్తున్నం కదా.. అక్కడ నీతో మాట్లాడతా."
సరే అని ఏం మాట్లాడుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
ఉదయనే బస్ ఎక్కాను. ఆమె వెనక సీట్ లోనే నేను రాజు కుర్చున్నాం. వెంటనే రాజుని పపించి ఎప్పుడు మాట్లాడుతుందో కనుకోమన్నా.
ఆమె చెప్తాను అన్నట్లు సిగ్నల్ ఇచ్చింది.
అరకు అందాలు ఎంత చూసిన తక్కువే. అరకు అందలు చూసేసరికి నాకు ఇక అక్కడే ఉండాలి అనిపించింది. ఇక అంజలి ఎప్పుడు మాట్లాడుతుందో చెప్పట్లేదు. అసలు ఏం మాట్లాడుతుందో కూడా చెప్పట్లేదు.
సరిగ్గా చికటి పడింది. అందరు ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లారు. నేను బయట కూర్చోని ఉన్నా. ఎవరో అర్జున్ అని పిలుస్తున్నట్లు అనిపించింది.
చికటి కావడంతో.. పిలుస్తుంది అంజలి కాదేమోని అనిపించింది.
సరిగ్గా తెరుకోని అంజలే పిలుస్తోంది అని గమనించి.. అందరు పడుకోవడంతో.. నిశేబ్ధంగా ఆమె దగ్గరకు వెలుతుంటే మధ్యలోనే నన్ను చూసిన నిత్యా.. "ఎక్కడికి వెళ్తున్నావ్" అర్జున్ అని అడిగింది.
"అదే నిద్ర సరిగ్గా రావడం లేదని ఇలా బయటకు వచ్చాను" అని కొంచెం డౌట్ గా చెప్పాను
"అవునా.. అయితే నేను నీతో పాటు వస్తాను పదా" అని ప్రేమగా అడిగింది.
"వద్దు.. నాకు కొంచెం పని ఉంది అయిపోయాక వెళ్దాం"
"ఏం పని ఆ అంజలిని కలవడం కోసం వెళ్తున్నావా ? ఆ పిల్ల రూంలో లేదు. సో ఆమె దగ్గరకే వెళ్తున్నావ్ అంతేనా..?"
"లేదు లేదు. రాజుగాడు ఎక్కడ ఉండో చూసి రావడం కోసం వెళ్తున్నా. రాగానే మనమిద్దరం వెళ్దాం" అని సున్నితంగా చెప్పాను..
"సరే అయితే.. వెంటనే వచ్చాయి" అని నిత్యా అంది.
ఆ టైంకి నిత్యాకి అలా చెప్పకుంటే.. అరుస్తుందని.. అలా చెప్పి ఆమె నుంచి తప్పించుకున్నా.
ఇక అంజలి దగ్గరకు వెళ్లాను.
చుట్టు గ్రీనరీ.. జలపాతాలు.. పైనుంచి వస్తున్న నీరు ఆమెపై పడుతుంటే.. ఆమె నవ్వు, ఆమె అందం నన్ను ఫిదా చేశాయి. సన్నగా ఉన్న ఆమె నడుము పదే పదే చూడాలి అనిపించింది. అమెకి మాత్రమే సరిపోయేలా ఆ చీరలో మెరిసిపోతుంది.
ఇక ఆగాలేక ఆమె దగ్గరకు వెళ్లి.. "ఏంటి పిలిచావ్" అని ప్రేమతో అడిగాను.
"నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా అర్జున్" అని మూగబోయిన గొంతుతో అడిగింది.
"ఏంటి అంజలి అలా అడుగుతున్నావ్ ? ఆ మాత్రం నీకు తెలియదా..?" అని మౌనంగా సమాదనం ఇచ్చాను.
"ప్రేమ ఉన్నవాడివే అయితే.. ఆ రోజు నిత్యాని కలవడానికి ఎందుకు వెళ్తావ్" అని కోపంగా అడిగింది.
ఏం చెప్పకుండా సైలెంట్ గా నిలబడ్డాను.
"మాట్లాడు" అని అంజలి అరిచేలోపే ఆమె చెయ్యిని పట్టుకున్నాను.
"ఏంటి అర్జున్ ఇది. దూరంగా జరుగు. ఎవరైన చూస్తే ప్రాబ్లమ్ అవుతుంది"
"అవన్ని అని ఆమెని నా దగ్గరకు లాకున్నాను"
"ప్లీజ్ అర్జున్.. వదిలిపెట్టు. నా వల్ల కావడం లేదు. నాకు ఊపిరి ఆడటం లేదు. వదిలి పెట్టు.."
"లేదు చాలా రోజులు అయింది. వచ్చిన దగ్గర నుంచి మాట్లాడవా. అంత తప్పు ఏం చేశాను. అని ఆమె మెడా మీద ముద్దు పెట్టాను."
"అబ్బా.. ఏంట్రా అర్జున్. ప్లీజ్ వదులుతావా లేదా"
"లేదు నేను వదలను అని ఆమె చెప్పల మీద ముద్దు పెట్టాను"
"దాంతో ఆమె ఇక నా నుంచి దూరంగా వెళ్ళాడానికి ఇష్టపడలేదు. నన్ను గట్టిగా వాటేసుకుంది"
ఇదంతా దొంగ చాటుగా మా ఇద్దరిని నిత్యా చూస్తున్న విషయం నేను గుర్తించలేకపోయాను. మా మాటలు ఆమెకి అర్ధం కాలేదేమో వెంటనే లేచి అందరినీ పిల్చుకోచ్చింది.
అంజలిని హాగ్ చేసుకోని ఆమెపై నా ప్రేమను చూపిస్తున్నా.
ఇంతలో సార్లు, స్టూడెంట్స్ అందరు వచ్చారు. ఇది గమనించిన అంజలి అర్జున్ అని గట్టిగా అర్చింది.
నేను, అంజలి షాక్.. ఏం చెప్పాలో అనుకుంటున్నాం.
"ఏర్రా అర్జున్. బుద్ది ఉందా. ఔటింగ్ అని తీసుకొస్తే.. అమాయికురాలు అయిన అంజలిని ఇలా చేస్తావా" అని కంఠరావు సర్ పెద్ద కంఠంతో నామీద మాటల యుద్ధం చేశాడు..
మరో సర్.. "నీలాంటోడు కాలేజ్ లోనే ఉండకుడదు. ఇలాంటోడివి అని తెలుస్తే ఇలా తీసుకొచ్చేవాళ్లమే కాదు " అని నన్ను తిట్టడం స్టార్ట్ చేసాడు.
అవకాశం దొరికింది కదా అని నిత్యా కూడా.." అవును అర్జున్ ఇలాంటోడే. నన్ను కూడా ఇలా బయటకు వెళ్దాం అని నాతో అన్నాడని" లేనిపోని మాటలు చెప్పింది.
ఎవరు ఎన్ని మాటలు అన్నా.. నన్నే అంటున్నారు అని సైలెంట్ గా ఉన్నా. అంజలిని ఉంటే గొడవ అయ్యేది.
కానీ అంజలి నాలా సైలెంట్ గా ఉండలేకపోయింది. కళ్ళు ఎర్రగా చేసి అపండి అని అరిచింది.
వీడు నా బావ.. నా ఇష్టం. మాకు చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది. అయినా నా బావ నాతో ఒంటరిగా ఉంటే తప్పా.. నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడోద్దు. ఎలాంటి పరిచయం లేని అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తే తప్పు. కానీ నా బావను నేను పిలిచాను అని ఇక్కడకు వచ్చాడే తప్ప తన సొంతంగా రాలేదు. అతని ఏం అనకండి అని ఏడుస్తూ చెప్పింది అంజలి.
అంజలి ఏడుపు చూడలేక తప్పు అయింది..ఇలా వచ్చి ఉండాల్సింది కాదు అని సారీ సర్ చెప్పాను.
సార్లు, స్టూడేంట్స్.. ముఖ్యంగా నిత్యా, రాజు గాడు షాక్ లో ఉన్నారు. వారికి ఏం అర్ధం కావడం లేదు.
విషయం అర్ధం చెసుకున్న నేను.. "అంజలి నా మెనత్త కూతురు. మీమిద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ లో చదువుకున్నాం. ఒకే కాలేజ్ కూడా. అయితే తను కాలేజ్ లో జాయిన్ కావడం కోసం ఇక్కడకు వచ్చే ముందు తనతో పాటు జాయిన్ అవ్వమని మారం చేసింది. ఆ టైంలో నాకు క్రికెట్ మ్యాచ్ నెషనల్ లేవల్ లో ఆడవల్సి ఉండటంతో ముంబై వెళ్లిపోయాను. దాంతో నా మీద అలిగి నాతో మాట్లాడకుండా వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడే జాయిన్ కావాలని వచ్చాను. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడం అవ్వడం లేదు. ఇప్పుడే మాట్లాడటం కోసం పిలిచింది. ఇంతలోనే ఇదంతా జరిగింది" అని చెప్పాను..
ఇంతలోనే ఏం జరిగింది అని మా ప్రిన్సిపాల్ దూరం నుంచి వచ్చాడు.
సంగతి తెలిసాక.. వారిద్దరు బావ మర్దలే. వాళ్ల బాబాయి జాయిన్ చేసిన రోజే చెప్పాడు అని ఆ ముచ్చటను అక్కడతో ఆపెసాడు.. ఈ విషయంను సమర్దిస్తున్న అని అందరు ఇలా చేయద్దు. ముందు అందరు ఎవరి రూంలోకి వాళ్ళు వెళండి. అర్జున్ పదా వెళ్దాం అని అక్కడ నుంచి తీసుకెళ్ళాడు.
విషయం తెలిసాక.. నిత్యా, రాజు ఫేస్ లు చూడాలి. ఏం చెయాలో అర్ధం కానీ పరిస్థితి నిత్యా కోపంగా ఉంటే... రాజు గాడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
మరోసటి రోజు సరదగా అందరం బొర్ర గృహల దగ్గరకు వెళ్లినప్పుడు అంజలి నన్ను పిలిచింది.
"బావ నాకు ముందు నీ మీద చాలా కోపంగా ఉండే.. నువ్వు నిత్యా దగ్గరకు వెళ్లావు అని. కానీ నీ మీద నమ్మకం ఉంది. ఆమెకి మంచి చెప్పి పంపించడానికి వెళ్తావ్ అని. సారీ బావ నీతో ఇన్ని రోజులు మాట్లాడనందుకు అని" బాధగా చెప్పింది.
"ఊరుకోరా అంజలి. ఎందుకు బాధపడుతావ్ నేను ఏం అన్లేగా.." అని ఆమె చెయ్యి పట్టుకున్నాను.
"బావ నీ చెయ్యి పట్టుకుంటే చాలు.. నాకు కొండంత దైర్యం వస్తుంది అని నా చెయ్యి మీద ముద్దు పెట్టింది"
"బంగారమే నువ్వు అని.. నేను కూడా తన నుదిటి మీద ముద్దు పెట్టి.. లవ్ యూ చెప్పాను.."
"లవ్ యూ టూ బావ" అని ప్రేమగా చెప్పింది.