అప్రియమయిన శ్రీవారు..
అప్రియమయిన శ్రీవారు..


అప్రియమయిన శ్రీవారికి......
ఏంటి అప్రియం అంటుంది అనుకుంటున్నారా..... ఇప్పుడు మీరు నాకు అప్రియమయిన శ్రీవారే..... ఎందుకు అంటే సమాధానం మీకే తెలుసు......
ఎలా ఉండేవారు పెళ్లయిన కొత్తలో.... ఎప్పుడు సమయం దొరుకుతుందా నాతో స్పెండ్ చేద్దామా అని ఎదురుచూసేవారు....
కాని ఇప్పుడు అసలు మీకు సమయమే లేదు..... ఒకవేళ వున్న అది మీ స్నేహితులతో తిరగటానికి సరిపోతుంది.....
నా ఇష్టమే మీ ఇష్టం అన్నారు.....
మరి ఇప్పుడు నీకు ఇష్టం కూడానా..... నోరు మూసుకుని నేను తెచ్చినవాటితో అడ్జెస్ట్ అవ్వు అంటారు......
పెళ్లయిన కొత్తలో ఏమండి బయటకు వెళ్దామా అంటే.... ఆమ్మో నా పెళ్ళాం అందాన్ని అందరు చూసి దిష్టి పెట్టేస్తే..... ఆమ్మో అసలు వద్దు మనం ఇంట్లోనే ఉందాం.... అంటూ నన్ను ముద్దులతో మురిపిస్తే అది నా మీద మీకు వున్న ప్రేమ అనుకున్న.....
పెళ్లయి 5 ఏళ్ళు అయినా నన్ను గడప దాటనివ్వకపోతే..... ఇప్పుడు అర్ధం అవుతుంది అది నా మీద ప్రేమ కాదు ఇంకేదో అని...... ఆ ఇంకేదో కూడా మీరే ఊహించుకోండి......
నా నోటితో చెప్పి నేను మీ మీద పెంచుకున్న ప్రేమని తక్కువ చేసుకోలేను....... అందుకనే మౌనంగానే భరిస్తున్న......
నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు ఒకసారి ఇవ్వు అంటే నా మొబైల్ తీసుకుని మీరు చేసిన పని నాకు ఆ రోజు
తెలియలేదు.... కానీ ప్రతి రోజు మీ ఫోన్ కి ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తుంది అని నాకు అర్థమయ్యాక... మీరు నన్ను ఫోన్ అడగ కూడదు అని.... నా ఫోన్ ఎప్పుడు హాల్లో ఉండేలా చేశాను.....
ఫోన్ లిఫ్ట్ చేయటం నిమిషం లేట్ అయినా మీరు పడే కంగారు చూసి నా భర్తకి నేను అంటే ఎంత ప్రేమ అనుకున్న.... కానీ అది ప్రేమ కాదు ఇంకేదో అని అర్థమయ్యాక..... మీ ఫోన్ ఎప్పుడు మొదటి రింగ్ కే ఎత్తడం అలవాటు చేసున్న.....
ఆషాడం అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళతాం బాబు అంటూ అమ్మ అడిగిన దానికి..... మీ సమాధానం.... ఆమ్మో నేను ఉండలేను అత్తయ్య అన్నప్పుడు......
నా అల్లుడు బంగారం నా కూతురి మీద ఎంత ప్రేమ అని అమ్మ మురిసిపోయింది...... పురిటికి కూడా నన్ను పుట్టింటికి పంపనప్పుడు కొంచెం బాధపడిన..... నా కూతురు సంతోషంగా వుంది కదా అని ఆనందపడింది నా పిచ్చి తల్లి...... కానీ పెళ్లయిన ఇన్నేళ్ళలో వాళ్ళ ఇంటికి వెళ్లనందుకు ఎంత బాధపడుతుందో......
అందుకే ఇప్పుడు వెళ్తున్న శాశ్వతంగా.....
ఏరా నీ పెళ్ళాం అంత చదువు చదివింది ఉద్యోగం చేపించవా అని నిన్ను ప్రశ్నించిన మీ బంధువులకి నువ్వు ఇచ్చిన సమాధానం......
నేను చేస్తున్నాగా అత్త మళ్ళీ అది కూడా కష్టపడాలా.....అంటూ నన్ను ఉద్దరించినట్టు నువ్వు మాట్లాడిన విధానం అప్పుడు నాకు అర్ధం కాలేదు......
మొన్న రాత్రి చెప్పావుగా మీ ఆఫీస్లో ఒక అమ్మాయిని మీ మేనేజర్ గాడు గోకాడు అని.... అప్పుడు అర్ధమయింది నువ్వు నన్ను ఎందుకు ఉద్యోగం వద్దు అన్నావో.....
ఎన్ని చేసిన నువ్వు నా మీద చూపించే ప్రేమతో అన్ని మర్చిపోయాను..... ఎందుకు అంటే నేను నా కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాను కాబట్టి......
అంటారుగా ఒక మనిషిని నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడితే వాళ్ళ మంచితో పాటు చెడుని కూడా యాక్సెప్ట్ చెయ్యాలి అని..... అందుకే నువ్వు చూపించే ప్రేమలో నీ అనుమానపు జబ్బుని నాలో దాచేసుకున్న......
మరి ఇప్పుడు ఎందుకు నేను వెళ్లిపోతున్నా అని అడుగుతారేమో చెప్తా......
గుడికి, బడి కి కూడా మీరు ఉంటే గాని గడప దాటని నేను మొదటిసారి పాపకి బాగోలేదు అని హాస్పిటల్ కి వెళ్ళాను అది కూడా మీరు ఊళ్ళో లేరు అని.....
అప్పుడు మీరు అన్న మాట..... ఏ నేను వచ్చేలోపు చచ్చిపోయిద్దా ఏంటి..... ఇంట్లో మందులు వున్నాయిగా వేయొచ్చుగా అని.......
ఆ మాటలో ఏ ప్రేమని వెతుక్కోను చెప్పండి......
మీరు అన్న మాటలు ఇన్నాళ్లు నన్ను బాధపెట్టలేదు కానీ ఇప్పుడు బాధిస్తున్నాయి..... ఎందుకు అంటే రేపు నా పరిస్థితి నా కూతురికి వస్తుందేమో అని.....
ఇవాళ నన్ను గడప దాటనివ్వకుండా చేసినట్టు రేపు దాన్నిఅలాగే చేస్తారేమో అని......
ఇవాళ నన్ను అనుమానించినట్టు దాన్ని అనుమానిస్తారేమో అని.....
మన రక్తాన్ని మనమే అనుమానిస్తే ఇంకా మనకి విలువ ఏముంది..... అందుకే ఆ పరిస్థితి రాకూడదు అని వెళ్లిపోతున్నా.......
నన్ను అనుమానించిన అది నా మీద మీకు వున్న ప్రేమ అని సరిపెట్టుకున్న కానీ రేపు మీరు మీకు పుట్టిన కూతురిని కూడా అనుమానిస్తే... అది మీ వంక అసహ్యంతో చూసే చూపుని నేను తట్టుకోలేను..... అందుకే వెళ్తున్న......
మనిషిలా మారి మమ్మల్ని అక్కున చేర్చుకుంటే మీ వెంట చావు వరకు నిలబడతాను....
కానీ మనిషి అన్న విషయం మరచి ప్రవర్తిస్తే మాత్రం ఇకమీదట ఎప్పుడు నన్ను కలవకండి....
ఇట్లు,
మీకు ఏమి కానీ మీ శ్రీమతి...
ఇది లవ్ లెటర్ ఏంటి అనకండి......
అంతులేని ప్రేమని చూపే భర్త అర్ధం లేని అనుమానాలతో కూతురు ముందుకు దోషిగా మిగలకూడదు అని..... తన భర్తని మార్చుకోవాలి అని చిన్న ప్రయత్నం....... అందుకే ఈ లేఖ.....