Dhavaleswari Gorantla

Drama

5.0  

Dhavaleswari Gorantla

Drama

అక్షరదోషం

అక్షరదోషం

2 mins
279


"ధబర్లు బాగా పాతవి అయిపోయాయండి; ఎప్పుడో మన పెళ్ళైన కొత్తల్లో కొన్నాం. ఇప్పుడు రఖరఖాల పాత్రలు వస్తున్నాయి బజారులో ", పొద్దున్నే మొదలుపెట్టింది శ్రీలక్ష్మి, పాత్రల దండకం. ' పెళ్ళయి ఏడు సంవత్సరాలే కదా అయింది, అపుడే కొత్తవి కొనాలి అంటావేంటీ?, మా అమ్మ పాతికేళ్ళు వాడింది అంట తెలుసా?. అయినా, ఆ తెలుగు ఏమిటే?, దబర్లు, రకరకాలు అనాలి. నీకు పూరీలు ఒత్తడం రాదనుకున్నా కానీ, ఇలా తెలుగు ఒత్తులు కూడా సరిగ్గా రావని అర్ధం ఔతుంది. నువ్వూ, నీ తెలుగు మారిన రోజున కొనిస్తాను నీ దబర్లు! ' అన్నాడు ఏకబిగిన బ్రహ్మానందం.


" వస్తున్నానండి " హడవిడిగా వంటగదిలో నుండి వచ్చింది, భర్త కేకలు విని. ' రా శ్రీ, చూడు, నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను కదా, తెలుగు సంగీత కచేరి ప్రాంగణం కట్టాలని, దానికి భూమి పట్టా దొరికింది ఈ రోజు '. " ఎంత సుబవార్త చెప్పారండి, ఇప్పుడే మీ నోట్లో పంచదార పోస్తా ". ' అబ్బా, అది శుభవార్తే! '


" ళేవండి, ళేవండి శ్రీవారు " అంటూ ఒకటే ఆదుర్దాగా లేపింది ఆనందాన్ని. ' దేవుడా! ఈటీవీ2 లో సఖీ కార్యక్రమం లో తెలుగు మాట్లాడే అమ్మాయిలాంటి వాళ్ళు కావాలి అనుకుంటే, జెమిని టీవీలో పుట్టినరోజు, సినీవార్తలు చదివే మొద్దుమొహాన్ని ఇచ్చావా? శ్రీలక్ష్మీ, అది లేవండీ నే '.

" అబ్బా, ఏదో ఒకటిలెండి. చూడండి, పేపర్లో మీ పాటల కచేరి గురించి వేశారు ". ' అది వేయించింది మనమేనే మొద్దు, పాటలు పాడే వాళ్ళు కావాలి ' అని. " శ్వరం ముఖ్యం, అక్షరాలదేముంది, నన్ను తీసుకోండి మీ పాటల కచేరికి, ఎంత బాగ పాడతానో కదా నేను " అంది లక్ష్మి. వినకూడని విషయాన్ని విన్నట్లు ఉలిక్కిపడి, చెవులు మూసుకుని, ' హరీ, స్వరం అనే పదాన్ని సరిగ్గా పలకలేని నీ గళంతో పాటలు వింటే మాకు వచ్చిన తెలుగు మర్చిపోతాం తల్లీ!. ఐనా, మన ప్రకటనకి మంచి స్పందనే వచ్చింది, ఇంకొక వారంలో కచేరి కూడా మొదలుపెట్టబోతున్నాం; ముందు నువ్వు తెలుగు అచ్చు తప్పులు లేకుండా నేర్చుకో '. "రిబ్బను కత్తెరనైనా నన్ను చేయనివ్వండి, నేను నోరు ఎత్తకుండా వుంటాను ఆ రోజంతా, అలానే తెలుగు కూడా నేర్చుకుంటాను" అని ఆశగా అడిగిన భార్య మాటలు విని, ' మంచిపని, ఎంత చక్కనైన మాట చెప్పావు. అయితే మన కార్యక్రమం భేషుగ్గా జరుగుతుంది. కొంటానులే నీకు ధబర్లు. '

అబ్బా!, నీ భాష నాకు అంటుకున్నట్లుందే!!!


--ధవళేశ్వరి


Rate this content
Log in

More telugu story from Dhavaleswari Gorantla

Similar telugu story from Drama