మంచి మనిషి
మంచి మనిషి
ఎప్పుడూ నవ్వడం తెలిసినవారు
ఎంత అదృష్టవంతులో
ఎవరి మీద కోపం
ఎవరి మీద చూపిస్తావో
నీలోని కోపమే
నిన్ను దహించి వేస్తుంది
గాయపడే వాళ్ళెప్పుడూ
మనసుతో మాట్లాడకూడదు
స్త్రీ మనసుతో ససేమిరా
లెక్కల్లో పడ్డావా
మనశ్శాంతి కోల్పోయినట్లే
మాటలు తగ్గించుకుంటావా
మనశ్శాంతి కోల్పోతావా
మరీ అంత సున్నితమైన మనిషివైతే
మనుషులతో మాట్లాడకు
అతికిందని సంతోష పడకు
పిగిలిపోయే ప్రమాదం
పొంచే ఉంటుంది
ఎవరూ ఎవరినీ రక్షించలేరు
ఎవరికి వారే రక్షకులు
ఎంత సంక్లిష్టమై పోయిందో
జీవితం
రాను రాను