సో కాల్డ్ ....
సో కాల్డ్ ....
ఎవరినైనా యధాతధంగా ఫాలో అవుతూ నమ్మము అంటే వాళ్ళ వెంట పడ్డామన్నమాటే .... అలా వెంట పడ్డాక మనిషి తన ఉనికిని మరిచి విచక్షణారహిత రూపమెత్తడమే నైజం అవుతుంది .
ఓ సామాన్యుడి ఆవేశం కన్నా ఓ మేధావి మౌనమే దేశానికి చాలా ప్రమాదకరం ... కానీ ఓ మేధావి మూర్ఖత్వం ఎప్పుడూ ప్రపంచానికి పరమచేటే ...
ఆ మూర్ఖత్వానికి జేజేలు పలికే నోళ్లు ,
సలాం చేసే చేతులున్నంత కాలం మేధావులలానే చెలామణి అవుతారు ..
అప్పుడప్పుడూ అనుకుంటాము కదా ,
మహా జ్ఞాని రావణడు , ధైర్య శాలి దుర్యోధనుడు ఎందుకు తమ తమ చివరిరోజుల్లో ఇతరుల మాటలను పెడచెవిన పెడుతూ చావుని కొని తెచ్చుకున్నారో ...
ఎన్ని సార్లు తాము చేస్తుందే లోక కళ్యాణము అనుకొని విర్రవీగారో కదా ..
ఇప్పుడర్ధమవుతోంది ఆ లక్షణాలు మనిషి రూపంలో ఎలా ఉంటాయో ...
ఏమి చేసినా కరెక్ట్ అని అడుగులకు మడుగులెత్తే అభిమాన అలాగా జనాన్ని పోగుచేసుకొని ,
p>
ఏ కల నైతే ఉపోయోగించి దేవుడనిపించుకున్నాడో , ఆ కళ నే అడ్డుపెట్టుకొని అడ్డుగోలు చర్యలకు ఆలింగనం చేసుకుంటూ శిష్యులను పావులు వలే వాడుకుంటున్న తీరు నిజంగా నిస్తేజమే ....
తానెలాగు పోయినా , తనతో పాటు వంద మందిని తీసుకెళ్లినట్లు ,
తన చేష్టలతో ఎలాగూ చివరిదశకు వచ్చేసినా ,
అతని చర్యలను ఇంగిత జ్ఞానం మరిచి ఫాలో చేస్తున్న ఆతని పావులనేమనాలో ...
తనకంటూ కొత్త పంథా పేరుతో ,
ప్రతీ విషయంలో తనదైన ముద్ర వేయాలన్న మూసధోరణికి తలొగ్గి ఎన్నెన్ని పనులను ,మాటలను మనుషుల మీద కొదిలి పరువు తీసుకున్నారో అతనికే తెలియాలి ...
అధర్మము వైపు ఉన్నందున ప్రియ శిష్యుడైన అర్జునుడు కూడా గురువు ద్రోణాచార్యుడు పైకి యుద్ధముకెళ్లినట్లు ,
సో కాల్డ్ గురు/దేవుళ్ళు చేసే వాటిపై నిజాలు ఆలోచించకుండా వాస్తవాలకు దూరంగా ముసుగేసుకున్న సో కాల్డ్ శిష్య/భక్తులు ఉన్నంతవరకూ .. ఆ ఇద్దరినీ అనుసరించేవాడి గతెప్పుడూ అధః పాతాళమే ...