వదిన గారి అబ్బాయి

Romance Inspirational Others

4  

వదిన గారి అబ్బాయి

Romance Inspirational Others

నాకు జరగాల్సిందే..?

నాకు జరగాల్సిందే..?

3 mins
296


ఇప్పుడు జరిగిన దానికి నేనే కారణం..? ఇలా జరుగుతుంది అని అనుకోలేదు..?ఇప్పుడు వచ్చే లాభం గురించి ఆలోచించను కానీ తరువాత జరిగే నష్టం గురించి ఆలోచించలేదు.

 

   ఇప్పుడు నాకే నష్టం జరిగింది...? అప్పుడూ నేను ఆలోచించలేదు నాకు లాభం వస్తుంది అని ఆశ పడ్డాను కానీ తరువాత జరిగే నష్టం గురించి ఆలోచించలేక పోయాను.


  ప్రతి ఒక్కరం చేసే తప్పు అదే ఇప్పుడు లాభం వస్తుందిలే అని ఆలోచించం

అసలు ఏం జరిగింది...?ఏమిటి ఆ నష్టం నాకు...?

నాకు పెళ్ళి కాకముందు జరిగింది..?

నేను ఇష్టపడ్డ అమ్మాయి నాకు దక్కలేదు అని బాధలో ఉన్నప్పుడు..జరిగింది.


  

    నన్ను ఒక అమ్మయి ప్రేమించింది,..ఆ అమ్మాయి నాతో చెప్పింది నేను ఆ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాం.. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం.


  ఎందుకో తెలియదు ఆ అమ్మాయికీ నేనంటే పిచ్చి...నాకోసం ఎడిచిన రోజులు కూడా ఉన్నాయ్ అంతా ఇష్టం నేనంటే.


   అలా అలా ఒకరికి ఒకరం 1 సం//రం ప్రేమించుకున్నాం ఆ అమ్మాయితో మాట్లాడకుండా వుండలేక పోయేవాడిని ఆ అమ్మాయి నాతో మాట్లాడకుండా ఉండలేదు.


  అయితే నాకు ఒక రోజు మెసేజ్ చేసింది నాకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు అని ఏడిచింది అప్పుడు నాకు 22 సం//రాలు అప్పుడు నాకు ఉద్యోగం కూడా లేదు.


  ఏమి చేయాలో అర్థం కాలేదు..ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలి అంటే దైర్యం లేదు ఒక వేళ వెళ్లిన ఎక్కడకు వెళ్ళాలి..?ఎలా బ్రతకాలి..? అని ఆలోచించడం మొదలు పెట్టేను.


  కానీ ఆ అమ్మాయి చాలా బాధ పడింది నేను బాధ పడుతున్నాను ఏమి చేయాలో అర్థం కాలేదు.. అలా ఆ అమ్మాయికి పెళ్లి అయిపొయింది.


  

  అలా ఒక 7 నెలలకు నాకు ఫోన్ చేసింది ఎలా ఉన్నవు అని అడగడానికి.నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేను అలా ఒక 40 నిమిషాలు మాట్లాడుకొనే వాళ్ళం రోజు ఫోన్ లో.


  రోజు వాళ్ళ ఆయన డ్యుటి కి వెళ్ళేవాడు. వాళ్ళ ఆయన వెళ్లిన తరువాత నాకు ఫోన్ చేసేది వీడియో కాల్ మాట్లాడేది.


   ఎందుకో తెలియదు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా సంతోషించే వాడిని ఒక్క రోజు కూడా మిస్స్ అవ్వకుండా చేసేది. ఒక్క ఆదివారం మాత్రమే చేయదు.


   అలా కొన్ని నెలలు మాట్లాడుకునే వాళ్ళం. అలా నాకు పెళ్ళి ఫిక్స్ అయింది ఇంకా చేయకు అని చెప్పెను,అంటే నీకు ఆ అమ్మాయి వస్తుంది అనేగా నన్ను చేయొద్దు అని అంటున్నావు అని ఏడిచింది.


 ఆ అమ్మాయికి నేనంటే ఎంత ఇష్టమో అర్థం అయింది కానీ నాకు భయంగా వుంది ఎక్కడ వాళ్ళ ఇంట్లో తెలుస్తుందొ అని.


  నాకు వారం రోజుల్లో పెళ్లి అని చెప్పినప్పటి నుంచి ఫోన్ చేయలేదు ఆ అమ్మాయి నా పెళ్ళికి వచ్చింది.చూసింది ఫోటో దిగి వెళ్లిపోయింది.


  అలా అప్పటి నుంచి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయలేదు.నాకు కొత్తగా పెళ్లి అయింది ఇద్దరం హ్యాపీగా ఉన్నాము నేను జాబ్ చేస్తున్నాను మా ఆవిడ ఇంటి దగ్గరే ఉంటుందీ హైదరాబాద్ లో ఇద్దరమే అద్దెకి తీసుకుని ఉంటున్నాం.


 నేను డ్యూటీకి వెళ్తున్నాను మా ఆవిడకు కూడా టచ్ ఫోన్ ఉంది వాడుకుంటుంది.


  నేను ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తుంది తరువాత ఎవరు ఆని అడిగితే ఫ్రెండ్ అని చెప్పేది సరేలే అని వదిలేసాను.


  అలా నాకు 6 సార్లు అలాగే జరిగింది ఇంకా నాకు అనుమానం స్టార్ట్ అయింది..అనుమానించడం మొదలు పెట్టేను.


  నా అనుమానమే నిజం అయింది...తను ఎవరినో ప్రేమించింది అంట అతనితో రోజు మాట్లాడుతుంది.


  అప్పుడు నాకు కోపం వచ్చింది...?తరువాత బాధా కలిగింది..తరువాత నేను ఆలోచించను.నాకు ఇలా జరగాల్సిందే అని అనిపించింది.


  అవును నాకు ఇలాగే జరగాలి..?నాలాంటి వాళ్లకు ఇలాగే జరుగుతుంది...?జరగాలి..?


  నేను అప్పుడు పెళ్లి అయిన అమ్మాయితో ఫోన్ మట్లేడెను.నేను ఆ అమ్మయి ఇద్దరం తన భర్తను మోసం చేసేము.


  ఇప్పుడు నాకు అదే జరిగింది.. నా భార్య ఆ అబ్బాయి ఇద్దరు నన్ను మోసం చేసేరు.తప్పు లేదు అని అనిపించింది.


చివరిగా.. నా మాట..👇


  ముందు నేను వేరే వాళ్ళ భార్య తో మాట్లాడి సంతోషంగా ఉన్నాను. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడితే సంతోషించాను కానీ అప్పుడు నాకు తెలియలేదు పెళ్లి అయిన అమ్మాయితో ఫోన్ మాట్లాడకూడదు అని తెలియక ఆ అమ్మాయి,నేను ఇద్దరము తన భర్తను మోసం చేసేము.


   దీనిని బట్టి నాకు అర్దం అయింది ఎంటంటే....?

నువ్వు ఒకరిని మోసం చేయాలని చూస్తే నిన్ను మోసం చేసేవారు నీ పక్కనే ఉంటారు అని

అవును నాకు అదే జరిగింది ఇప్పుడు తెలిసింది నేను చేసింది తప్పు అని


  నేను వేరేవాడి భార్య దగ్గర సంతోషం కావాలి అని అనుకున్నాను అతనిని మోసం చేసెను..కానీ నా భార్య వేరేవాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది నన్ను మోసం చేసింది.


  మీరు చేసే తప్పు కూడా అదే మీ భర్త కానీ మీ భార్య కానీ ఇంట్లో లేనప్పుడు వేరే అతని భార్యతో.. లేదా వేరే వాళ్ళ భర్తతో ఇలా ఫోన్ మాట్లాడడం తప్పు ఎవరికి తెలియకుండా తప్పు చేయడం తప్పు.

  

  ఇప్పుడు మీరు తప్పు చేస్తే ఆ తప్పుకు శీక్ష అనుభవిస్తారు...నేను అనుభవిస్తున్నాను.


  నేను ఆలోచించలేదు నేను వేరే వాళ్ళని మోసం చేస్తే నన్ను మోసం చేసేవారు ఉంటారు ఆని అదే ఇప్పుడు నాకు జరిగింది...మీరు ఒక్కసారి ఆలోచించండి.

  

   అవును నేను చేసింది తప్పే..నాకు ఇలాగే జరగాలి.. తప్పు చేసే ప్రతి ఒక్కరికీ ఇలాగే జరుగుతుంది... మీ భర్తలను,భార్యలను మోసం చేయకూడదు.. ఒకవేళ అలా చేస్తే మీరు నాలాగ తరువాతా బాధ పడాల్సి వస్తుంది అని తెలియజేస్తూ శెలవు తీసుకుంటున్నాను. అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ..మీ JNF CHANDRA

(కేవలం కల్పితం మాత్రమే నాకు ఇంకా పెళ్లి కాలేదు)

    

      THANKING YOU

   YOUR'S JNF CHANDRA




Rate this content
Log in

Similar telugu story from Romance