వదిన గారి అబ్బాయి

Children Stories Others Children

3  

వదిన గారి అబ్బాయి

Children Stories Others Children

వదినే అమ్మ..?

వదినే అమ్మ..?

2 mins
360


   

   ఒక వ్యక్తికి ఆనందం వచ్చినా బాధ కలిగిన పంచుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ మీరే, అందుకే మీతో పంచుకుంటున్నాను......

            

     అందరికీ నమస్కారం నా పేరు చంద్ర నా వయసు 26 సంవత్సరాలు.నా చిన్నప్పుడే నా తల్లదండ్రులు చనిపోయారు. అప్పుడు నాకు 14 సం//రాలు.   

    అప్పటి నుంచి నన్ను మా అన్నయ్య వదిన పెంచారు. నన్ను కన్న కొడుకుల పెంచారు, మా అన్నయ్యకు కూతురు, కొడుకు. వాళ్ళతో పాటు నన్ను సమానంగా పెంచారు,పెంచుతున్నారు.

           

      నేను డిప్లొమా చదవాలని చేర్పించారు, సబ్జెక్ట్స్ పోతే ఎలాగోలా ఫీస్ లు కట్టి పాస్ చెపించారు.

 నేను దిప్లామో తో ఆపకూడదు అని మళ్లీ నేను ఎలాగైనా ఇంజనీరింగ్ చదవాలి అని ఇంజనీరింగ్ చేర్పించారు.

         నాది ఇంజనీరింగ్ పూర్తి అవడానికి కారణం అయ్యారు.నేను ఇంజనీరింగ్ చదివాను అంటే మా ఊరు వాళ్ళు నమ్మలేక పోయారు.

                 

               తల్లి దండ్రులు లేని వాడు ఎలా బ్రతుకు తాడో అని వాళ్ల వదిన సరిగ్గా చూసుకుంటుందో లేదో అని అందరూ అనుకునేవారు. కానీ మా వదిన మరిధిలా ఎప్పుడు చూసుకోలేదు,కొడుకుల చూసుకుంది,చూసుకుంటుంది.

                

     మా అన్నయ్య నన్ను తమ్ముడు లాగ కాకుండా సోంత కొడుకుల చూసుకున్నాడు.  ఇంత మంచి అన్నా వదినను ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

       పేరుకి వారు నాకు అన్న వదినే, కానీ వారు నాకు అమ్మ నాన్న.ఈరోజుల్లో ఎవరూ చూసుకుంటున్నారు, మా అన్నయ్య వదిన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు "తల్లి లేని లోటు" తీర్చింది. "తండ్రి లేని లోటు" తీర్చాడు..  

         

             మీకు పూర్తిగా అర్థం కావాలంటే, నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ముద్దు పేరు తో "చిన్నారి"అని పిలిచేది.

       

                 మా వదిన నాకు హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చిన చాలా బాగా చూసుకొనేది. చిన్నారి ఎలా ఉంది.మా అమ్మ ఎలా అడిగేదో అలాగే అడిగి చూసుకునేది.

             

           ఇప్పటికీ నన్ను మా వదిన నన్ను "చిన్నారి" అనే పిలుస్తుంది,నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు.

          

  నా దగ్గర డిప్లమా సర్టిఫికేటు, ఇంజనీరింగ్ సర్టిఫికేటు, ఉన్నాయంటే దానికి వారే కారణం.నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న అన్నా వదినలను నేను నమ్ముకున్న దేవునికి చాలా ఋణపడి ఉంటాను..

            

            నన్ను పెంచిన అన్న వదినను మరచిపోను. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నేను నమ్ముకున్న దేవుని మరచిపోను.

                  

 మా అన్న వదినలను రేపు చూసుకోవలసిన బాధ్యత నాదే. మా అన్న వదినలు చూసిన వారినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను .

          

    నాకు పెళ్లి అయిన తర్వాత కూడా ఉమ్మడి కుటుంబం గా అందరం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాను.రేపు నాకు వచ్చే ఆమెకూడా ఉమ్మడి కుటుంబం నే ఇష్ట పడలి అని అనుకుంటున్నాను .

                 

               "THANKING YOU"

     your's వదిన గారి అబ్బాయి (VGA) 

           god bless you all & me

              🙏🙈🙉🙊🙏



Rate this content
Log in