వదిన గారి అబ్బాయి

Others

4.0  

వదిన గారి అబ్బాయి

Others

ఒంటరి..?

ఒంటరి..?

2 mins
256


   అందరికీ నమస్కారం....అందరూ బాగున్నారుగా...మీరందరూ కూడా నాలాగే హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....

    

     ఏంటి వీడు నేను ఒంటరిని అంటున్నాడు హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు. పిచ్చి ఏమన్నా పట్టిందా...? అని అనుకుంటున్నారా.....?

ప్రస్తుతానికి ఇంకా పిచ్చి పట్టలేదు...?

       

    ఇంకా స్టోరీలోకి వెళ్తే....ఇది నా జీవితంలో జరిగిన అనుభవం....

       ఈ రోజు నేను తెలుసుకొని..... హ్యాపీగా ఫీల్ అయి రాస్తున్నాను...

    

    అదేమిటంటే...... నా చిన్నప్పటి నుంచి నేను తెలుసుకోలేనిది. ఈ రోజు నేను తెలుసుకుంది. మీతో చెపుతున్నాను.....

     

   మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత.....జరిగింది.

                                                                             నన్ను చూసి ఎవరో ఒకరు జాలి పడేవారు... ఎందుకంటే తల్లి తండ్రిలేరు అని.....

    ఎవరైనా నన్ను చూసి జాలి పడితే...నాకు చాలా బాధ కలుగుతుంది...,

   ఇక్కడే నాకు స్టార్ట్ అయ్యాయి  ప్రాబ్లమ్స్... ఏమిటి అంటే....

    ఇలాగే నన్ను చూసి జాలిపడే వారు మాఊరిలో చాలామంది ఉన్నారు..... ఇప్పటికీ కూడా....

           ఐతే......

         మా అన్నయ్య వ్యవసాయం చేస్తాడు 15 ఎకరాలు కవులుకు వేస్తాడు......

       

     నాది డిప్లమో కంప్లీట్ అయిన తర్వాత, నేను జాబ్ లేక కలిగా ఉన్నప్పుడు,నేను మా అన్నయ్య వాళ్ళతో మా పొలంలోనే పనికి వెళ్లేవాడిని.......

         

    మా అన్నయ్యకు కొడుకు ఉన్నాడు వాడు పని చేసేవాడు కాదు. వాడికి పని అసలు చెప్పారు, నీకే చెపుతారు అని బైటవాళ్ళు నాతో అనేవారు....

          

    నేను పనిబాగా చేసేవాడిని, ఐతే బైటా వాళ్ళు నన్ను చూసి జాలిపడేవారు......

         

    పాపం పని మొత్తం నీతోనో చెపిస్తారు,వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు అని నామీద జాలి పడేవారు.....

         

     ఇంకా నేను నిజమే అని అనుకొని నేను చాలా బాధ పడేవాడిని, అప్పుడప్పుడు ఏడిచే వాడిని. మా అన్నయ్య వాళ్ళు చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ గుర్తుకు వచ్చింది అని (అబద్ధం) చెప్పి ఏడిచే వాడిని......

               

       ఒంటరిగా ఉన్నప్పుడు ఏడిచేవాడిని,అలాగే మేము వంకాయల తోట వేసేవాలం, అప్పుడప్పుడు వంకాయలు నేను ఒక్కడినే కోసేవాడినీ,ఒంటరిగా ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది.......

           

     నాకు ఇతరులు చెప్పే మాటలకు ఏడుపు కూడా వస్తుంది,వంటరిగా ఉండి ఆలోచించి బాధపడే వాడిని..అప్పుడప్పుడు చనిపోవాలని కూడా అనిపించేది....

          

        నా మీద మా అన్నయ్య వాళ్ళకి చాలా ప్రేమ ఉంది.వాళ్లకు నా మీద ప్రేమ లేక పోతే ఇంజినీరింగ్ ఏలా చదివిస్తారు......

           

         వాళ్ల ప్రేమని నేను అర్థం చేసుకోలేక పోయాను, ఇతరులు నా మీద చూపించేదానిని ప్రేమ అనుకున్నాను.......

           

           కానీ మా అన్నయ్య వాళ్ళు చూపించింది ప్రేమ అని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. బైట వాళ్ళ జాలిని నేను ప్రేమ అనుకున్నను......

      

       బైట వాళ్ళు చెప్పిన వాటిని వినడం వల్ల  నాకు ఇన్ని సం// రాలు బాధే మిగిలింది.

        

         అంతకు ముందు నా మీద ఎవరైనా జాలి చూపిస్తే నాకు బాధ కలుగుతుంది,ఇప్పుడు జాలి చూపిస్తే కోపం వస్తుంది.......

        

             ఎందుకు అంటే....... అప్పుడు నాకు మా అన్నయ్య వాళ్ళు ఉన్నాకూడా వాళ్ల ప్రేమని నేను అర్థం చేసుకోలేక పోయాను,కాబట్టి అప్పుడు నేను బాధ పడేవాడిని.....

  

          ""కానీ ఇప్పుడు నాకు అమ్మలాంటి వదిన, నాన్నలాంటి అన్నయ్య ఉన్నారు"" ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

      

         నా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకున్నారు కానీ అప్పుడు నేను తెలుసుకోలేక పోయాను, ఇప్పుడు తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.....

     

     (చివరిగా.. మీకు.నా మనవి ఏమిటి అంటే....?)

              

          మీరు కూడా తల్లి తండ్రి లేనివారిని చూసి జాలి పడకండి. కొంత మంది నాలంటోల్లు ఉంటారు,బాధ పడతారు......

         

     కుదిరితే సహాయం చేయండి అంతే కానీ జాలి మాత్రం పడకండి చాలా బాధపడతారు.

        

""చివరిగా నా మాట""......నేను ఒంటరిని కాదు......?నాకు అమ్మ నాన్న ఉన్నారు"".       

            (అన్నయ్య- వదినమ్మ)

                 

            THANKING YOU

   YOUR'S వదిన గారి అబ్బాయి  

         god bless you all & me

         



Rate this content
Log in