మోసం చేసెను..?
మోసం చేసెను..?
నేను ఇంట్లో వాళ్ళనే ఇంతా మోసం చేస్తాను అని కలలో కూడా ఊహించలేదు. అసలు ఏమి జరిగింది అంటే...?
మీకు పూర్తిగా అర్ధం అవడం కోసం..... షార్ట్ కట్లో చెపుతా కొంచెం అర్దం చేసుకోవడానికి .. ప్రయత్నము..చేయండి.
మా నాన్న కీ మేము ముగ్గురం కొడుకులం... అలాగే మా పెద్ద నాన్నకు ముగ్గురు కుతురులు.... ఐతే నేనంటే మా అక్క వాళ్లకు. చాలా ఇష్టం అని నేను అనుకుంటున్న...
ఐతే మా అమ్మ నాన్న ఇద్దరు నా 14 సం//రాలు అప్పుడు చనిపోయారు.అప్పటినుంచి నన్ను మా అన్నయ్య వాళ్ళు పెంచారు.
మా అక్క వాళ్లకు మాకు నా విషయంలో గొడవ జరిగింది.......ఏమిటి అంటే..... మా ముగ్గురు అక్కలో మూడో అక్కకు ఒక కూతురు ఉంది.
మా చిన్నపుడు ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలని మా అమ్మ నాన్న వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు అనుకున్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళకి మాకు గొడవ జరిగింది....దేనికి అంటే... మేనరికం అయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే...పిల్లలు సరిగ్గా పుట్టారు అని వద్దు అన్నారు. చిన్న గొడవ జరిగింది వాళ్ళకి మాకు మాటలు లేవు.
నేను ఆ అమ్మాయి ఇద్దరము ప్రేమించుకున్నాం, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేక పోతున్న...? వాళ్ళ ఊరు వెళ్దామా....? మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధ పడతారు.....? అని ఆ అమ్మాయి ఎప్పుడు మా ఊరు వస్తుందా....? అనీ నేను ఎదురు చూస్తున్నాను.....?
ఐతే ఒక రోజు వాళ్ళు అనుకోకుండా మా ఊరు వచ్చారు....?
మా ఇంటి దగ్గర ఎవరు లేరు అందరూ పనికి వెళ్ళేరు మా పెద్దమ్మ మా ఇంటి వైపు వచ్చి నాకు సైగ చేసి రమ్మని చెప్పింది......?నాకు అర్దం కాలేదు.......?
సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి..... చూసేను... చూస్తే అక్కడ మా అక్క, నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయిని 4 సం//రాల తర్వాత చూసేసరికి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
సరే కొంచెం సేపు. మా అక్క, నేను, ఆ అమ్మాయి మాట్లాడుకున్నాము, ఆ అమ్మాయి నా ఫోన్ నెంబర్ తీసుకుంది...
ఐతే... సాయంత్రం. 4 గంటల సమయంలో నేను మా అక్క వాళ్ళని. బస్ ఎక్కించడానికి బండి మీద తీసుకు వెళ్ళెను.....
ఐతే మా అన్నయ్య వాళ్లకు తెలిసింది నేను వాళ్ళతో మాట్లాడటం...? ఇంటికి వెళ్ళడం...? వాళ్ళని కలవడం...?బస్ ఎక్కించడం తెలిసింది...?
""ఇంకా మా అన్నయ్య కోపంతో నన్ను కొట్టేడు""
వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పెనుకదా...?అని నన్ను తిట్టాడు పెద్దల్లో పెడతాను అని చెప్పి...పెద్దల్లో పెట్టాడు. (నా మీద కాదు మా అక్క వాళ్ళ మీద).
ఇంకా ఆ అమ్మాయి నాతో చాట్ చేస్తుంది,మా వదిన కూడా చూసింది.
చూసి...మా వదిన మమ్మల్నే మోసం చేస్తావా..? ఇన్ని సం// రాలు పెంచిన వారి కంటే నీకు వాళ్ళు ఎక్కువ అయిపోయారా..? ఇంతా మోసం చేస్తావు అని కలలో కూడా అనుకోలేదు చిన్నారి(ముద్దు పేరు)...? అనీ మా వదిన నన్ను అంది.
.
""అప్పుడు చాలా బాధ కలిగింది ఏడుస్తున్నాను"" నా మనసులో నేను బాధ పడుతున్నాను.
చా! నేను అనవసరంగా వెళ్ళేను అనిపించింది. వాళ్ళతో మాట్లాడి చాలా పెద్ద తప్పు చేసేను.
ఇంకా నేను మా అన్నయ్య వదిన మనసును చాలా బాధ పెట్టేను. నేను ఒక మోసగాడిని అనిపించింది.
నేను వాళ్ళని మర్చిపోకుండా తప్పు చేసేను....? అనీ నేను చాలా బాధ పడుతున్నాను...?ఏడుస్తున్నాను కూడా ఇప్పటి వరకు మా ఊరిలో నాకు మంచి పేరు ఉండేది, ఆ మంచి పేరు మొత్తం పోయింది.
నాకు నేనే నా జీవితం నాశనం చేసుకున్నాను అని నేను చాలా బాధ పడుతున్నాను.మా అన్నయ్య, వదిన నన్ను తిడుతున్నారు
""అంతలోకి నాకు మెలుకువ వచ్చింది""
sorry friend's ఇది జరగలేదు ఈ రోజు నాకు కలొచ్చింది.
""జరుగు తుంది ఏమో అని భయం గా ఉంది""
పొద్దునే వచ్చే కలలు, నిజం అవుతాయి అంటారు.. దేవుని దయ వల్ల ఇలా జరగక పోతే బాగుండు అనిపిస్తుంది........
ఈ కలను బట్టి నాకు అర్దం అయింది ఏమిటంటే......?
నేను వాళ్ళ గురించి మర్చిపోవడం మంచిది అనిపిస్తుంది........
"మరచిపోయి మంచి మనిషి లా బ్రతక మంటారా.....? లేదా..?మర్చిపోకుండా.... ఒక మోసగాడిలా మిగిలి పొమ్మంటారా...?
👉"ఏమంటారు...ఏమి చేయమంటారు" 👈
thanking you
your's JNF CHANDRA
God bless you all & me
