STORYMIRROR

my dream stories (sindhu)

Drama

4  

my dream stories (sindhu)

Drama

నా బంగారం కు ప్రేమ తో

నా బంగారం కు ప్రేమ తో

1 min
24K

ఆకాశమంత ప్రేమని

గుప్పెడు గుండెల్లో

ఎలా దాచావు బంగారు

అవని లాగా అలిసి పోకుండా

ఉండటం ఎలా సాధ్యం బంగారం

చిరుకోపం కూడా ప్రదర్శించకుండా

చిరునవ్వుతో ఎలా ఉంటావు బంగారం

నా మనసులోని మాట నీ నేను

చెప్పకుండానే ఎలా తెలుస్తుంది

నేను ఎలా ఉన్నా నన్ను నన్నుగా ఇష్టపడతావు

ఆంక్షలు పెట్టకుండా ,అర్దం చేసుకుంటావు

అంతులేని నీ ప్రేమని కానుక గా ఇస్తావు

ఎప్పుడు నా మనసులో ఈ ప్రశ్నలు

మెదులుతూ ఉంటాయి .....

నిన్ను చాలా సార్లు అడుగుదాం అనుకున్నా...

కానీ అడగలేకపోయా....

కానీ తర్వాత తెలిసింది మనం అమితంగా ప్రేమిస్తే

ఆ ప్రేమ మనల్ని ఇలా మారుస్తుంది అని...

అది నిన్ను చూశాక అది ఇంకా అర్ధం అయింది

ఇంతలా చూసుకునే నికు ఏమి ఇవ్వగలను బంగారం

అంతే ప్రేమని నికు పంచడం తప్ప...

నీలాగే ప్రేమించడానికి ప్రేమని పంచడానికి

అనుక్షణం ప్రయత్నిస్తా.... బంగారం



Rate this content
Log in

More telugu story from my dream stories (sindhu)

Similar telugu story from Drama