Srinivas Cv

Drama

4.3  

Srinivas Cv

Drama

మరక మంచిదే

మరక మంచిదే

7 mins
12.3K


మరక మంచిది

పదకొండు గంటలకి పెట్టిన అలారం తెల్లవారుజామున తొమ్మిది గంటలకే ఎందుకు మోగుతోంది అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న మొబైల్ ఫోన్ తీసి కోపంగా చూశాడు రాము. నా తప్పు ఏమీ లేదు నేను సైలెంట్ మోడ్లో నిద్రపోతునా అన్నటు ఒక బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్ పెట్టింది ఆ ఫోను, ఈ కాలం తెలుగు సినిమాలో పని చేసి ముంబై హీరోయిన్ లాగ. ఎంతైనా స్మార్ట్ ఫోన్ కదా ఇంత తెలివి తక్కువ పని అయితే చెయ్యదు అని అనుకుంటుండగానే మల్లి గణ, గణ మని శబ్దం అయ్యింది, అప్పుడు అర్థం అయ్యింది అది ఫోను కాదు డోర్ బెల్ అని. అయినా నిద్ర లేచే ఓపిక లేక కదలకుండా పరుపులోనే ఉన్నాడు, అలసిపోయి వచ్చిన వాడు వెళ్ళిపోతాడు అని ఆశతో. కాని వచ్చిన వాడు ఎవడో విక్రమార్కుడి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు వదలకుండా బెల్లు కొడుతూనే ఉన్నాడు. ఇక చేసేది లేక తలుపు తీయడానికి లేచాడు. 


తలుపు తెరవగానే, సారూ నేను రాట్నం పార్టి నుంచి గోవర్థన్. ఈ రోజు ఓట్ వెయ్యా లి కదా సారూ, పదండి పోదాము అన్నాడు. అప్పుడు గుర్తు వచ్చింది ఆ రోజు ఎలక్షన్ అని దాని కోసమే సెలవు ఇచ్చారు అని. నేను వస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంత సేపు అది ఏ ఆదివారమూ అనుకోని సుఖంగా నిద్ర పోవాలి అనుకున్నాడు. అయినా నిద్ర వదులుకొని నేను ఓటు వేయకుండా ఉంటే ఎవరికి నష్టం అని అడుగుదాం అనుకున్నాడు కాని పోయిన సారి ఓటు వెయ్యికే వాళ్ళ కుక్క కి జబ్బు చేసింది అని అతని గట్టి నమ్మకం. మనుషులుకి ఏమైనా జరిగితే అది వారి స్వయం కృతాపారాథం, నాయకులు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే గడ్డం గురతాయనా ఉన్నపుడు రోజుకి ఎనిమిది గంటలే పని, పిడికిలి గురతాయనా వచ్చాక అదే ఎనిమిది గంటలు. గడ్డం గురతాయనా ఉన్నపుడు రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు, పిడికిలి గురతాయనా వచ్చాక అదే పరిస్థితి. ఇక మా అన్న కొడుకు బాధలు అయితే ఎవరికీ చెప్పాలి ఆ రోజులో ఎన్ని పరీక్షలు ఉన్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి. అది ఫ్రీ, ఇది ఫ్రీ , ఆ రుణం మాఫీ , ఈ రుణం మాఫీ అని ఓ ఊదరకొట్టేస్తున్నారు. మాకు కూడా పరీక్షా లేకుండా పాసు, ఫెయిల్ అయిన వాళ్ళకు ఊరకే మార్క్లు అని ఏమీ అయిన స్కీమ్ పెట్టచుగా అంటాడు. వాడికి ఏమీ తెలుసు ఈ స్కీమ్లు ఓటు ఉన్న వాళ్ళ కే అని. ఎన్ని చెప్పిన ఒక బాధ్యత కలిగినా దేశ పౌరుడిగా ఓటు వెయ్యడానికి బయల్దేరాడు.


కిందికి దిగగానే ఎదురోచ్చాడు ఏరియా ఎమ్. ఎల్.ఎ, రంగుల రత్నం డండనక. డండనక ఆయన కులం పేరు, నా కర్మ కాలి నేను అదే కులమ్ అది ఆయనకీ ఎలా తెలిసిందో నన్ను అడగదు. ఏమీ బాబు ఈ సారి మన డండనక కులం గెలవాలి, ఇది మన పరువు ప్రతిష్టల ప్రశ్న మరచిపొకు. మన గుర్తు పిడికిలి. ఇంతలో ఎక్కడ నుండి వచ్చా డో వచ్చేశాడు గోవర్థన్ డండనక. తమ్ముడు మనది రాట్నం గుర్తు, ఆ పిడికిలి గుర్తు వాళ్ళు దొంగలు. ఇంత కాలం డబ్బులు ఖర్చు పెట్టిన నన్ను కాదు అని కొత్తగా ఎవడో నాకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అని వాడికి టికెట్ ఇచ్చారు . నువ్వు మాత్రం రాట్నం గుర్తుకే ఓటు వేసి మన డండనక కులానే గెలిపించాలి అన్నాడు. గోవర్థన్ నా బూత్ స్లిప్ ఇచ్చి, ఓటు గుంటల వీధిలో ఉంది. అక్కడికి వెళ్లి ఓటు వేయాలి అన్నాడు.


 సరేలే టిఫిన్ తినేసి వెళ్తా అని హోటల్ వైపు వెళ్తున , గోవర్థన్ నన్ను ఆపి సారూ టిఫిన్ నేను పెట్టిస్తాను సారు రండి అన్నాడు. ఊరికే వచ్చేది నాకు ఎందుకు అనుకున్న, కాని గోవర్థన్ గురించి నాకు బాగా తెలుసు నేను కాదు అన్నా ఊరుకోడు. సారూ కోడి, మేక , పిల్లి, జింక, కప్ప , కుక్క ఏవి కావాలి సారూ అన్నాడు. ఆ మెను విని భయం వేసి రెండు ఇడ్లి మాత్రం చాలు అన్నా . అదేమీ సారూ తిను బాగా అంటు నాలుగు ఇడ్లి , రెండు వడ తెప్పించాడు. ఎక్కడ బాత్‌రూంకు, బెడ్ రూం కి మధ్య సీజన్ టికెట్ తీసుకోవాల్సి వస్తుందో అని భయపడుతూనే ఒక ముక్క నోట్లో పెట్టుకున్న . అమోఘంగా ఉంది టిఫిన్, ఏదో మంచి హోటల్ నుండే తెప్పించారు. ఎవడైనా ఎమైన అంటాడో అన్న సిగ్గు కూడా లేని అవినీతి మంత్రి లాగ ఎవాగా తినేసా. సరే ఇక నెమ్మదిగా బయల్దేరి వెళ్దాం పోలింగ్ బూత్ కి అనుకుంటునా , అప్పుడే పడ్దింది మల్లి భుజం పై చెయ్యి గోవర్థన్ ది. సారూ ఉండండి నేను మన వాళ్లని పంపిస్తా మిమల్ని వదిలి పెడతారు అన్నాడు. 


ఎవడో బండిలో వచ్చాడు. గోవర్థన్ నన్ను పిలిచి బండి ఎక్కండి అన్నాడు. పరీక్షలో మాస్టారే చీటీలు అందిచినంత ఆనందం వేసినది. ఎక్కి కుర్చునాను, బండి బయల్దేరింది. బండిలో పోతూ ఇది తప్పు ఏమో అని అనుమానం వచ్చింది. ప్రజలని ప్రభావ పరచడం లాగ అనిపించింది. అన్ని పార్టిలు ఇదే పని చేస్తాయి , అది కాక నేను ఎవరికీ ఓటు వెయ్యాలో ముందే నిర్ణయం చెసెసా అని సర్ది చెప్పుకున్నాడు. ఒక ఐదు నిమిషాలలో వచ్చేశారు ఓటు వేసే బూత్ దగ్గరకు. బండి దిగి బూత్ వైపుకు నడిచాడు. 


అక్కడ ఎదురైంది మన ప్రజాస్వామ్యం లోని ముఖ్య పేజి. అదే నండి క్యూ. ఎక్కడ మొదలయిందో, ఎంత దూరం ఉందో తెలియని మన పాత ముఖ్యమంత్రి గారి ఆస్తుల చిట్టా అంతా పొడుగు ఉంది ఆ లైను . దీనుకంటే "తొడ కొడత -తొలు తీస్తా" సినిమా కి అయిన వెళ్లి ఉండాల్సింది అనుకున్నాడు. తొందరలో బయటకి అనేసాడో ఏమో గాని ముందర ఉన్నవాడు ఆ సినిమా బాగా లేదు అన్నారే అన్నాడు. అది కాకపోతే "మా ఆవిడా, వాళ్ళ ఆయన " కి వెళ్ళే వాడ్ని అన్నాడు రాము. ముందర ఉన్న ఇంకో పెద్దాయన ఈ రోజు సినిమా హాలు ఉండవు బాబు అన్నాడు . అవునులే సినిమా యాక్టర్లు ప్రచారానికి వస్తేనే ప్రజలు పని రోజులు కూడా సెలవులు పెట్టి, డబ్బులు వృథా చేసి మరి చూస్తున్నారు. ఇక సెలవు ఇస్తే ఎవ్వరు ఇక్కడ లైన్ లో నిలబడి ఓటు వేస్తాడు హ్యాపీగా ఎ.సి. హాలులో వేడి పెంచే ఏదో ఒక హీరోయిన్‌ని చూసుకుంటాడు కాని. సరే ఇక ఏమీ చేస్తాం, నిలబడి ఓటు వేసిపోద్దాం అని నిశ్చయించుకున్నాడు .


రాము నెమ్మదిగా జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి ఆటలు ఆడ్డదాం అనుకున్నాడు, కాని ఆ ఎండకి ఏమీ కనిపించటంలేదు. సరే చేసేది లేక తల ఎత్తి అట్టు ఇట్టు చూస్తున్నాడు . వెనక చూస్తే క్యూ ఇంకా రెండు, మూడు రౌండ్లు తిరిగింది. ఏమీ ఉందిలే పప్పు, ఉప్పే అందుకొని ఆకాశానికి చేరింది ఇది ఎంత అనుకున్నాడు . ఇంతలో వెనక ఉన్న పెద్ద మనిషి ఏమీ బాబు ఏమీ పేరు నీది అన్నాడు. తల తిప్పి ఆయన వైపు చూస్తూ, రాము సార్ అన్నాడు. ఉత్త రాము నా ముందు వెనక ఏమీ లేదు అని అడిగాడు? అర్థం అయ్యింది రాముకి ఏ కులం అని అడుగుతునాడు అని. కాని కులం, మతం అంటే ఇష్టం లేని రాము ఏమీ లేదు అన్నాడు. నా పేరు భూపాల్ డనకనక రిటైర్డ్ టీచర్నిఅన్నాడు. నేను ప్రైవేటు కంపెని లో పని చేస్తాను సార్ అన్నాడు రాము. ఆయన కోటీశ్వరుడు అని , కొడుకు అమెరికాలో ఉన్నాడు అని , కూతురికి ఎంతో కట్నం ఇచ్చి అమెరికా సంబంధం చేశాడు అని ఇలా ఆయన పిల్లల గురించి, మనవుల గురించి అంత చెప్పేశాడు. అదేమిటో కాని మన వాళ్ళు అడిగిన అడగక పోయిన వంశ చరిత్ర మొత్తం చెప్పేస్తా రు, అదేదో భాగవతమో, రామయనమో అయినట్టు అది వింటే మనకేదో పుణ్యం వచ్చేటట్టు. అలాగే రాము గురించి, రాము కుటుంభం గురించి అడిగి తెలుసుకున్నాడు. 


ఆ తర్వాత వేసాడు అస్సలు ప్రశ్న ఎవరికీ వేస్తున్నావు ఓటు అని. ఏదో ఆస్తి అడిగినట్టు పెట్టాడు మొహం రాము. సరేలే, చెప్పదులే అని అన్నాడు భూపాల్, రాము ఇబ్బంది గమనించి. నేను మాత్రం పిడికిలి గుర్తుకే వేస్తాను అన్నాడు. వాళ్ళు వస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకి మంచిది. రైతులని బాగా చూసుకుంటారు, అందరికి సమాన న్యాయం చెస్తారు. అబ్బో ఇన్ని విషయాలు నాకు తెలివే అని నాలుక కర్చుకున్నాడు రాము. భూపాల్ గారికి బాగా విషయాలు తెలిసినట్టు ఉన్నాయి ఆయ్యాననే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకున్నాడు. అనుకోని ఇంకా డీటెయిల్ గా చెప్పండి సార్ అన్నాడు . పిడికిలి పార్టి గెలిచాకే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో నేను ఎంతో సంపాదించుకున్నాను. ఇక రైతులకి అంటావా, మద్దతు ధర, విత్తనాలు, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకి ఎంతో డబ్బు ఇచ్చింది. సమానా న్యాయానికి వస్తే మా ఊరిలో ఒక జజనక కులం వాడు ఉండే వాడు వాడు డనకనక కులంలో వాడు తన దగ్గర అప్పు తీసుకున్నాడు అని కేసు పెట్టాడు . అది ఎవరికీ నొప్పి కలిగించకుండా న్యాయం చేశాడు మా పిడికిలి గుర్తు డనకనక నాయకుడు. ఎలా అని అడిగాడు రాము? ఏమీ ఉంది అందరికి తెలిసిందేగా జజనక కులం వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు. అయినా ఆ జజనక కులం వాడు ఏమిటి మన డనకనక కులం వాడికి అప్పు ఇవ్వడం ఏమిటి. అందుకే చెప్పేది పిడికిలి వాళ్ళకే ఈ విషయాలు సరిగా తెలుస్తాయి అని.


అప్పటి దాక వింటూ ఉన్న ముందర ఉన్న పెద్దాయన మాతో మాట కలిపాడు . గడ్డం గుర్తు వాళ్ళు కూడా ఈ సారి డనకనక కులం మనిషికే అవకాశం ఇచ్చారు. ఇంకా తెలుసా ఆయన అయితే పిడికిలి పార్టి ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ ఉపాధి, అలాగే ఉచితంగా చాల ఇస్తాను అన్నాడు. దానికి వెనక ఉన్న భూపాల్ గారు వాళ్ళ నాయకుడు ఎవరో తెలుసా డండనక కులమ్. వాళ్లని ఎవ్వరు నమ్మరు. అది కాక, పోయిన సారి ఏమీ చేశాడు అని ఈ సారి వెలగ పెట్టడానికి. పోయిన సారి ఉద్యోగస్థుల ఏదో ప్రశాంతంగా నిద్రపోడానికి, రిటైర్ అయ్యాక పెన్షన్ కోసం వస్తారు అని కూడా తెలుసుకోకుండా పని చెయ్యమన్నాడు. వెనకాల ఇంకొకడు అందుకున్నాడు ఆ గడ్డం పార్టి ఆయన చెప్పేవి అన్ని అబద్ధాలు సార్ నమ్మదు అన్నాడు. రాట్నం గుర్తు వాళ్ళు అయితే కరెక్ట్ సార్. పిడికిలి గుర్తు ఇప్పుడు జజనక కులం ఆయన నడుపుతున్నాడు . ఆయనకీ ఏమీ తెలియదు, పోయినా సారి మన డనకనక కులం ఆయనను తప్పు పట్టాడు. ఇంకా మన రాట్నం లోనే చాల మంది ఒకప్పటి పిడికిలి వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు అయితేనే మన లాంటి వాళ్లని కాపాడుతారు సార్ అన్నాడు. వెన్నకి తిరిగే మాట్లాడే వ్యక్తి వైపు చూద్దాం అని కళ్లలో ఎండా పడింది . ఎక్కడ నుండి ఎండా పడుతోంది అని చూస్తే, ఎండ ఆ వ్యక్తి మెడలో ఉన్న బంగారు ఛైను పై పడి ఆ రిఫ్లెక్షన్ వచ్చి నా కళ్లలో పడింది. పాపం కేవలం మూడు తుళ్లాలా బంగారం మెడలో , నాలుగు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి ఈయనకు ఎన్ని కష్టాలో అనుకున్నాడు రాము.


చూస్తుండగానే నాలుగు గంటలు గడిచింది లైన్ చివరికి వచ్చింది, ఇక ఓటు వేసే టైము వచ్చింది. సరే అని లోపాలకి వెళ్ళాడు రాము. బూత్ స్లిప్ ఇచ్చాడు ఆఫీసర్ చేతికి, నెంబర్ చూశాడు లిస్టు చూశాడు టక్కున రాముని చూశాడు. ఓటర్ ఐడి అన్నాడు. రాము జేబులో ఉన్న ఓటర్ ఐడి తీసి ఇచ్చాడు. వెంటనే ఆ ఐడి ఇంకో ఆఫీసర్ కి ఇచ్చాడు. ఆయన కూడా రాముని కార్డ్ ని రెండు సార్లు తేరి పార చూశాడు. రాముకి మనసులో గుబులు పుట్టింది, ఏమీ జరుగుతోంది. నాకు గోవర్థన్ కాని తప్పు స్లిప్ ఇచ్చాడా అని ఆలోచిస్తున్నాడు. ఆఫీసర్లు అందరు వెళ్లి బయట ఉన్న పోలీసుని పిలిచారు, అమో ఇదేదో పెద్ద గొడవ లాగ ఉందే అని ఇంకా ఎక్కువ భయ పడ్డాడు రాము. పోలీసు రాముని బయటకు రమ్మనాడు. రాము పోలీసు వెనుకే వెళ్ళాడు. పోలీసు ఏమీ చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు రాము. నెమ్మదిగా మొదలు పెట్టాడు పోలీసు , చూడు బాబు ఒకో సారి ఇలా జరుగుతుంది పెద్ద తప్పేమీ కాదు నువ్వు పట్టించుకోకు. ఏమీ జరిగిందా ఏమీ చెప్తాడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు రాము. ఏమీ లేదు చిన్న విషయమే నీ ఓటు ఆల్రెడీ ఎవరో వేసేశారు. నాకు తెలుసు నువ్వు ఏమీ అడగాలి అనుకుంటున్నావో.  అది నీ ఓటే, నీ ఓటర్ కార్డే, కాని ఏమీ చేస్తాం ఓటు ఆల్రెడీ పడిపోయింది ఎవరు దాని వెన్నకి తీయలేరు. కాబట్టి నువ్వు వెళ్లిపో అన్నాడు. 


పక్క దేశంతో యుద్ధం గెలిచి ఇంటి పక్కన వీధి కుక్కతో కరిపించుకున్నటు తయారు అయ్యింది రాము పరిస్థితి. ఈ రోజు కోసం ఎన్నో కుస్తీలు పడి ఓటర్ కార్డు , బూత్ స్లిప్ అన్ని రెడీ చేసుకొని కూర్చొంటే ఎవడో వెళ్లి ఓటు వెయ్యడం ఏమిటో. అది నాలుగు గంటలు లైన్ లో నిల్చున్నాక చల్లగా చెప్తున్నా డు పోలీసు అని బిక్క మొహం వేసుకున్నాడు రాము. అయినా ఇక చేసేది ఏమీ లేదు అని ఇంటికి బయల్దేరాడు రాము. అప్పుడు మల్లి కనిపించాడు గోవర్థన్. ఏమీ సారూ టిఫిన్ పెట్టి, బండిలో దింపినా ఓటు వెయ్యిలేదే అన్నాడు రాముతో. అప్పుడే వీడికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. జరిగింది చెప్పాడు గోవర్థన్ కి. ఓ అంతేనా రెండు గంటలు అయినా మీరు ఓటు వెయ్యకపోయే సరికి నేనే మన వాళ్ళ చేత వేయించాను అన్నాడు. నేను లైన్ లోనే ఉన్నానే వాళ్ళు ఎలా వేసారు అని అడుగుదాం అనుకున్నాడు. కాని ఆ రోజు జరిగినా అన్ని విషయాలకి విరక్తి కలిగి ఇంటికి బయల్దేరాడు. బూత్ బయట ఉన్న ఏదో బట్టల కంపెనీ వాడు సార్ “మరక మంచిది” వేసుకున్నారా మీ చేతికి మరక అన్నాడు. అప్పటికే బాగా మండి ఉన్నాడో ఏమో గాని ఆ వ్యక్తిని పక్కనే ఉన్న బురద కాలువ లోకి తోసి “మరక మంచిదే” అంటు ఇంటికి పరిగితాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama