prasanthi pakala

Drama

3  

prasanthi pakala

Drama

మనదే కదా బాధ్యత

మనదే కదా బాధ్యత

3 mins
257ఇక చదివింది చాలు తల్లి, భోజనానికి రామ్మ అన్న నా పిలుపుకి, "హా మా..! వస్తున్నాను" అని నా కూతురు అమల చెప్పి, పది నిమిషాలైనా రాకపోవడం చూసి నేనే వెళ్లాను.

ఎంత బాగా చదువుకుంటుందో నా కూతురు అని సంతోషంతో నుదిటిపైన ముద్దు పెట్టుకుని, భోజనం చేసాక చదువుకుందువు రారా తల్లి అంటూ వంట గదిలోకి వెళుతూ, ఒక్కసారిగా వెనక్కి తిరిగెళ్లి చెంప చెల్లుమనిపించాను.

ఆ శబ్దం విని, అమల తండ్రి రామారావు గారు బయటకి వచ్చారు.

"శారద, ఎందుకు అమ్ముని అరుస్తున్నావ్? నా బిడ్డ ఏమి తప్పు చేసిందని" అంటూ కోపంగా నా వైపు చూసాడు.

"నన్ను చూసింది చాలు కానీ, తమరి గారాల పట్టి ఏమి చేసిందో చూడండి" అన్నాను. అంతే, అమ్ముని చూసి తనకి కూడా కోపం వచ్చి, కొట్టడానికి చేయి పైకి ఎత్తాడు. భర్త కోపం తెలిసిన నేను, తనని ఆపి ఎందుకు ఇలా చేసిందో అని అడిగే ప్రయత్నంచేశాను.

మా ఇద్దరి నుండి అలాంటి రియాక్షన్ ఊహించని అమ్ము," భయంతో వణుకుతూ చూస్తుంది" ఎలా చెప్పాలా అని.

ముందు నువ్వు చెప్పు "కను రెప్పలు మీద అలా కన్ను ఆకారం ఎందుకు వేసుకున్నావ్? అసలు నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది?" అని రెట్టించి అడిగాడు వాళ్ళ నాన్న.

నాన్న అది.., మరే, "నిన్న మీరు టిక్ టాక్ లో ఓక వీడియో చుస్తూన్నారు కదా...! తర్వాత, మిమ్మల్ని బయట ఎవరో పిలిస్తే వెళ్లారు కదా..", హా వెళ్లాను అయితే? అప్పుడు, "మీ మొబైల్లో ఆ వీడియో చూసాను" అంటూ ఆగిపోయింది.

"ఏ వీడియో అమ్ము సరిగా చెప్పు" అని నేను కాస్త గట్టిగా అడిగాను. "అందులో ఒక అమ్మాయి తన కళ్ళ పైన ఇలాగే, తెరిచి ఉన్న కను గుడ్డును అలా రెప్పల మీద వేసుకుంది. అది అచ్చం కళ్ళు తెరిచి చూస్తున్నట్లే అనిపించింది. నాకు ఈరోజు చదవాలని అనిపించలేదు. కానీ, చదవకపోతే మీరు ఇద్దరు అరుస్తారు కదా, అందుకే ఇలా చేశాను" అని చెప్పడం ఆపి మా ఇద్దరినీ భయంతో అలా చూస్తూ ఉండిపోయింది.

తను చెప్పింది విన్న తరువాత, విస్తుపోవడం మా వంతైంది. ముందుగా, "నేను కాస్త తేరుకుని మాట్లాడోద్ధు అని మా వారికి కళ్ళతోనే చెప్పి", అమ్ముని అక్కడనుండి తీసుకుని వెళ్లి అన్నం కలిపి ఇందాకటి విషయం గురించి ఏమి మాట్లాడకుండా, ఎప్పటిలాగానే ప్రేమతో నోటిలో పెట్టి తినిపిస్తూన్న నన్ను చూసి బాధతో, "అమ్మ సారీ! ఇంకెప్పుడు ఇలాంటివి చేయను ప్రామిస్" అని కళ్ళనిండా నీళ్ళతో చెప్తున్న అమ్ముతో, "ఇలాంటివి ఇంకెప్పుడు చేయద్దురా, మేమెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోము తల్లి. మీరు ఆనందంగా ఉన్నప్పుడే మేము కూడా ఆనందంగా ఉంటాము. మేమె కాదు ప్రతి తల్లిదండ్రులు, ఎప్పుడు పిల్లల బాగోగులునే కోరుకుంటారు. నీకు ఏ ఇబ్బంది ఉన్న నాతోనే, నాన్నతో చెప్పాలి. ఇంకెప్పుడు ఇలా చేయకు అని జో కొడుతుంటే, నా మాటలలో ఓదార్పు కనిపించిందేమో ప్రశాంతంగా నా ఒడిలో నిద్రపోయింది."

అమ్ము నిద్ర పోయింది అని నిర్దారించుకుని, తనని మంచం మీద సరిగా పడుకోబెట్టి బయటకి వచ్చాను. అన్నం ప్లేట్లో వడ్డిస్తూ, మా వారిని భోజనానికి పిలిచాను.

"ఇందాక జరిగిన దాని వలన భోజనం చేయాలనిపించడం లేదు శారద" అని బదులిచ్చాడు మా శ్రీ వారు.

ఏవండీ, ఆ విషయం గురించి ఆలోచించకండి నేను అమ్ముతో మాట్లాడాను మీరు ప్రశాంతంగా తినండి.

ఎలా తినమంటావ్ శారద, అమ్ముని ఇంతవరకు మనం కోప్పడింది కానీ, కొట్టింది కానీ లేదు. కానీ, ఈరోజు నా వల్ల, కేవలం నావల్ల మనమిద్దరం ఆ పని చేసాం. అసలు తప్పు మనదేనండీ, తను బాగా చదువుతుంది అనుకున్నాము కానీ, మనకి భయపడి చదువుతుంది అని గ్రహించలేక పోయాము.

అవును శారద, పిల్లలు మనం ఏది చేస్తే, అదే చేస్తారని ఈరోజు అర్ధం అయ్యింది. నేను పని ఒత్తిడి నుండి కాస్త రిలాక్స్ అవుదామని టిక్ టాక్ రోజు చూస్తాను. కానీ, అందులో ఇలాంటి వీడియోస్ పిల్లల పై ఇంతటి ప్రభావం చూపుతుందని తెలుసుకోలేకపోయాను.

అవునండీ మీరన్నట్టు ఆ యాప్ వలన మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందేమో కానీ, అమ్ము లాంటి వాళ్ళు మీరో, నేనో, చూస్తున్నప్పుడు మనతో చూస్తారు. కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులకి తెలియకుండా, ఏమి చేయడానికైనా వెనకాడట్లేదు.

మొన్న ఈ మధ్య నేను పేపర్లో చదివానండీ, "ఒకతను లైకులు కోసం, ట్రెండీగా వీడియో చేయడానికి కాస్త ఎక్కువ రిస్క్ తీస్కుని మరీ ప్రయత్నించాడట. అది బెడిసి కొట్టడంతో ప్రాణాలే కోల్పాయాడు". ఇప్పుడు వాళ్ళ తల్లితండ్రులకి, "టిక్ - టాక్ యాజమాన్యం, లేదో లైకులు ఇచ్చేవారో తమ కన్న బిడ్డని తీసుకురాగలరంటారా ?"

"పిల్లలు వాళ్ళకేమి తెలుసండీ?" అన్ని మనమే జాగ్రత్తలు చెప్పాలి. ఆ జాగ్రత్తలో మనం వాళ్ళని కట్టుదిట్టం చేస్తున్నాం అన్న భావన వాళ్ళకి రాకూడదు.


అలా ఎలా అనుకుంటున్నారా, మీరు ఇందాక చెప్పారు కదా, ఆఫీస్ ఒత్తిడి వలన ఇలాంటివి చూస్తున్న అని. దాని బదులు మన అమ్ముని తీస్కుని ఏదైనా ప్లే గ్రౌండుకి తీసుకువెళ్లి తనతో కాస్త సరదాగా గడపుదాం. తరువాత ఉదయం నుండి స్కూల్ లో జరిగిన విషయాల్ని అడిగి తెలుసుకుందాము, ఏదైనా సమస్య అనుకున్నప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుని అర్ధం అయ్యేలా చెబుదాం అండీ.


ఇలా అలవాటు చేయడం వలన, "అమ్ముకి కూడా, మనతో ఏ విషయాన్నైనా పంచుకోవడానికి ఇబ్బంది పడదు ఏమంటారు?". ఇంకేమంటాను నా శ్రీమతి గారు చెప్పాక రేపటి నుండి అలాగే చేద్దాం డార్లింగ్. "చాల్లేండి సంబడం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పదండి రేపు ఉదయాన్నే పరుగులు పెట్టిస్తారు తండ్రి, కూతురు" అనగానే నవ్వుతు, నిద్రకి ఉపక్రమించారు.

*****

అమ్ము, ఆ చిన్న తప్పు నుండి పశ్చాత్తాపంతో, "ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మేము తనకి అమ్మ నాన్నలుగానే కాకుండా మంచి స్నేహితులుగా, తనతో ఎప్పటికీ ఉంటాము" అనే దైర్యంతో తన భావాల్ని మాతో పంచుకుంటూ ఆనందంగా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తుంది.


ఇంత కష్ఠపడి రూపాయి సంపాదించేది, "మన పిల్లలు బాగుండాలనే కదా!.."

కానీ, పనుల బిజీ వలన మన పిల్లల్ని మనమే పట్టించుకోకపోతే, అంత సెటిల్ అయ్యాక పిల్లలు తప్పుదోవలో పడ్డారు అని తర్వాత బాధపడడం "బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతుంది". అలా కాకుండా, ముందే మేలుకుంటే అందరి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

అయినా, "కన్న తల్లిదండ్రులుగా పిల్లల బాగోగులని చూసుకునే బాధ్యత మనదే కదా...!" ఏమంటారు?Rate this content
Log in

Similar telugu story from Drama