STORYMIRROR

Ananya veer

Drama

4  

Ananya veer

Drama

మై డియర్ వైఫ్ !!_1

మై డియర్ వైఫ్ !!_1

3 mins
11


ఎటు చూసినా పచ్చదనం ఉట్టి పడే ముచ్చటైన పల్లెటూరు ఆ ఊరిలో 100 నుంచి 150 మధ్య ఇల్లు మాత్రమే ఉంటాయి.


ఆ ఊరిలో ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనడానికి సంకేతంగా ఆ ఇంటి ముందు కొబ్బరి ఆకులతో పెళ్లి పందిరి ఆ ఇంటికి మరింత అందాన్ని తెచ్చింది .. ఇల్లంతా బంధువులతో కళకళలాడుతుంది.. సూర్యుడు డ్యూటీ దిగి చంద్రుడు డ్యూటీ ఎక్కడంతో ఊరంతా ఆ విద్యుత్ దీపాల వెలుగులో అందంగా మెరుస్తుంది. పెళ్లి ఇళ్లు కావడంతో ఆ ఇల్లు మరి కాస్త స్పెషల్ గా కనిపిస్తుంది..


పెళ్లి పందిరిలో పంతులుగారు ఎలా చెప్తే అలా పూజ చేస్తూనే పెళ్లికూతురు కోసం ఎదురుచూస్తున్నాడు పెళ్ళికొడుకు సూర్యాన్ష్ (మన హీరో)


పెళ్లికూతురు గదిలో


ఇద్దరు బ్యూటీషియన్స్ పాలరాతి శిల్పం లా ఉన్న అమ్మాయికి పట్టుచీర కట్టి ఆమెను మరింత అందంగా మార్చేశారు ..


ఫ్రెండ్స్ ఆట పట్టిస్తుంటే పక్కనే ఉన్న తన మేనత్త (సూర్య తల్లి) ని చూసి అత్త ఇదంతా అవసరమా ఈ మేకప్ ఇది అంటుంది దిగులుగా సంధ్యరాణి (మన హీరోయిన్)


నాకు అదంతా తెలియదు బంగారం ఇదంతా మీ బావ పని అని నవ్వుతూ చెప్తుంది


సంధ్య ఇంకేం మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుంటుంది


తన ఫ్రెండ్స్ తనని కొంచెం దాచుకోమ్మా సిగ్గు అంటూ ఆట పట్టిస్తుంటారు


తర్వాత పంతులు గారి పెళ్లికూతురుని తీసుకు రమ్మనడంతో సంధ్య ను తీసుకొని పెళ్లి మండపంలోకి వెళ్లి సూర్య ముందు కూర్చోబెడతారు..


సంధ్య ఫ్రెండ్స్ ఇద్దరు చేరో వైపు అడ్డుతెర పట్టుకుని నిల్చుని ఉంటారు.. మధ్యలో ఏంటి ఇది అన్నట్లు సూర్య ఇద్దరినీ కోపంగా చూస్తాడు..


సూర్యుని చూసి ఇద్దరు నవ్వుకుంటారు.


వాళ్ళ నవ్వు చూసి సూర్య ఇంకా ఉడుక్కుంటాడు..


కొద్దిసేపటికి పంతులుగారు జీలకర్ర బెల్లం పెట్టిచ్చి అడ్డుతెర తొలగిస్తారు


సూర్య ఆనందంగా సంధ్య ని చూస్తుంటాడు.. 


సంధ్య సూర్యుని చూడలేక సిగ్గు తో తలదించుకొని ఉంటుంది .


ఎంతసేపటికి సంధ్య తన వైపు చూడక పోవడం చూసి విసుగ్గా "సంధ్య ఒకసారి నా వైపు చూడవే అసలు నీ ముఖం కనిపించట్లేదు" అంటాడు కొంచెం గట్టిగా..


భజంత్రీలు సౌండ్ కి కింద ఉన్న వాళ్ళకి వినిపించలేదు కానీ మండపం మీద ఉన్న వాళ్ళకి సూర్య మాటలు క్లియర్ గా వినిపించాయి.


అది విని అందరు ముసి ముసిగా నవ్వుకుంటారు..


సూర్య సడన్గా అలా అనడంతో సంధ్య టక్కున తల పైకెత్తి కోపంగా సూర్య వైపు చూసింది


సూర్య నవ్వుతూ కన్ను కొట్టాడు.


సంధ్య వెంటనే తలదించేస్తుంది సిగ్గుతో


మీనాక్షి చిరు కోపంగా సూర్య భుజంపై ఒక్కటి వేస్తుంది


"మామ్ ఇప్పుడు నేను ఏం చేశాను" అని అమాయకంగా అంటారు


మీనాక్షి నవ్వుతూ "చాలు నీ యాక్టింగ్ కాసేపు సైలెంట్ గా పంతులుగారు చెప్పేవి చేయి"


"ఛ మా మామ్ కి నా మీద అస్సలు జాలే లేదు "అనుకొని దిగులుగా సంధ్యని చూస్తూ పంతులు చెప్పేవి చేస్తున్నాడు


తరువాత మాంగల్య ధారణ , సప్తపది, ఉంగరాలు తీయడం, , అరుంధతి నక్షత్రం, అన్ని పూర్తి చేసేసి భోజనాలయ్యాక అప్పగింతలు కూడా పూర్తి చేసి సూర్య సంద్య ని తీసుకొని బయలుదేరుతారు మీనాక్షి , రాజేంద్ర ( సూర్య తండ్రి)


సంద్య వెళ్తూ వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి" మీరు రండి తాతయ్య" అని ఏడుపు ముఖంతో అడుగుతుంది..


"మేము ఇక్కడ పనులు చూసుకుని రెండు రోజుల్లో వస్తాము తల్లి "అంటాడు తాతయ్య రాఘవయ్య సంధ్య తల నిమురుతూ.


ఆదర్శ్( సంధ్య అన్నయ్య): అవును మా ఇక్కడ పనులు పూర్తి చేసుకొని తాతయ్య వాళ్ళని తీసుకుని రెండు రోజుల్లో వస్తాను. నువ్వు ఇలా ఏడవకుండా సంతోషంగా అత్తయ్య వాల్లతో వెళ్ళు..


మీనాక్షి :" ఇక్కడ పనులన్నీ పనివాళ్ళు చూసుకుంటారు మీరు మాతో పాటు రండి నాన్న" అని భర్త వైపు చూస్తుంది మీరు రమ్మని చెప్పండి అన్నట్లు..


ఇంక అందరు పట్టు పడటంతో ఇంకేం చేయలేక పనులన్నీ పని వాళ్ళకి అప్పగించి రాఘవయ్య, సీతామహాలక్ష్మి, ఆదర్శ్ సూర్య వాళ్ళతో హైదరాబాద్ బయలుదేరుతారు..


***********


బెంగళూర్


"చూడండి మనం పెళ్ళికి వెళ్లకపోతే కనీసం ఫోన్ చేసి ఎలాగో అలా కుదుర్చుకుని ఒక్కపూట రమ్మని మళ్లీ ఫోన్ కూడా చేయలేదు మీ నాన్న "అంటుంది సురేఖ..


"మనమే వెళ్ళదల్చుకొలేదు కదా ఇంక ఆయన ఫోన్ కోసం ఎదురు చూడటం ఎందుకు . ఆయన ఫోన్ చేస్తే మాత్రం మనం వెళ్తామా?" అన్నాడు ప్రభాకర్..


"అయినా అబ్బాయి ఎవరు అని కూడా చెప్పలేదు.. ఇంత సడెన్ గా పెళ్ళి చేశారు అంటే ఆ మహాతల్లి అక్కడ ఏం వెలగబెట్టిందో" అని నిష్టూరంగా అంటుంది సురేఖ..


ప్రభాకర్ కూడా మసుసులో" అవును అసలు పెళ్ళికొడుకు ఎవరు ?చదువుకుంటున్న పిల్లకి ఇంత అర్జంట్ గా ఎందుకు పెళ్లి చేసారు? అయినా నా అన్న కూతురు అలాంటిది కాదు తను బంగారం" అనుకుంటాడు..


మళ్ళీ అంతలోనే వాళ్ళ నాన్న ఫోన్ చేసి పెళ్ళికొడుకు ఎవరో చెప్పబోతుంటే సురేఖ ఫోన్ తీసుకుని "ఆ అబ్బాయి ఎవరైతే మాకెందుకు మాకు పెళ్ళికి రావడం కుదరదు. అలగే సిటీలో ఖర్చులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. నెల తిరిగే సరికి అద్దె, ఇంట్లో సరుకులు పిల్లల చదువులు అని అస్సలు రూపాయి మిగలట్లేదు" అని ఇండైరెక్ట్ గా పెళ్ళి ఖర్చులతో మాకు సంబంధం లేదు అని చెప్పడం గుర్తొచ్చి సురేఖ వైపు కోపంగా చూస్తాడు..


అతను ఎందుకు కోపంగా చూస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంది..


భార్య వైపు చిరాగ్గా చూసి బయటికి వెళ్లిపోతాడు..


సురేఖ ఇప్పుడు ఈయన గారికి ఏం గుర్తొచ్చిందో అని మూతి తిప్పుకుంటుంది..


***********


కొనసాగుతోంది


నచ్చితే నా ప్రొఫైల్ ను అనుసరించి ప్రోత్సహించండి.



Rate this content
Log in

Similar telugu story from Drama