STORYMIRROR

Anjani Gayathri

Inspirational Others

4  

Anjani Gayathri

Inspirational Others

🌹మా మంచి నాన్న🌹

🌹మా మంచి నాన్న🌹

2 mins
306

" మా మంచి నాన్న "


రచన :- అంజనీగాయత్రి 


"మా మంచి నాన్న " అన్నది ప్రియ, తను కాలేజీ కి వెళ్లడానికి అని స్కూటి కొని పుట్టినరోజు బహుమతి గా కూతురికి ఇచ్చాడు జనార్ధన్. అందుకే ప్రియ అంత సంతోషంగా ఉంది.


 స్కూటీ ఎక్కబోతున్న ప్రియని అప్పుడే నడపద్దు అని వారించింది తల్లి. " నిమ్మకాయలు కట్టి గుడికి తీసుకెళ్ళి పూజ చేయించాలి, టైర్ కింద నిమ్మకాయ తొక్కించితే గాని నడపకూడదు, " అని ఆంక్షలు పెట్టింది తల్లి.


" ఈ రోజుల్లో కూడా అటువంటి చాదస్తాలు అవసరమా?? పూజ చెయ్యకుండా నడిపితే ఏమవుతుంది??, " విరుచుకుపడింది ప్రియ, పూజలు పునస్కారాలు అటువంటి వాటికి దూరం ఆమె. అందుకే తల్లిపై చిర్రుబుర్రులాడింది.


 తండ్రి కూడా ప్రియనే సమర్థిస్తాడు. అతనికి అటువంటి ఆచారవ్యవహారాలు నచ్చవు. సైన్స్ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో అటువంటి మూఢనమ్మకాలు ఆచారాలు పాటించకూడదు అనే స్వభావం తండ్రి కూతుర్లది. భర్త ని కూతుర్ని అంత నాస్తికులుగా ఉండకూడదని తిట్టిపోస్తూనే ఉంటుంది సావిత్రి. అయినా వినరు ఆమె మాట.


 కూతురు ఏదంటే అది జరుపుతాడు జనార్ధన్, కూతురు మాటకి తాన తందాన అని వంత పాడుతూ, ఆమె చెప్పిన పనల్లా చేస్తాడు, కోరిన కోరికలు ఏవైనా తీరుస్తాడు." కొండ మీద కోతి నైనా తీసుకువస్తాడు, "ఆ ఇంట్లోఆమె ఆడింది ఆట పాడింది పాట. తండ్రిని చూసుకుని మురిసిపోతూ, పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా, ఇప్పుడే చేసుకోను అని తను," నా కూతురుకి అప్పుడే పెళ్లి ఏంటి?? ఇంకా చిన్న పిల్లే కదా?? " అంటాడు జనార్ధన్. బీటెక్ పూర్తి అయ్యాక కూడా " కొన్నాళ్ల పాటు జాబ్ చేసే పెళ్లి చేసుకుంటా నేను," అనే కండిషన్ పెట్టింది ప్రియ. తండ్రి కూడా వంత పాడాడు ఆమె కండిషన్ కి. సావిత్రి ఏం చేస్తుంది పాపం, వాళ్లతో వాదించి గెలవలేదు.


జాబ్ చేస్తూనే ప్రకాష్ ని ప్రేమించి, ధైర్యంగా ఆ విషయం తన తండ్రి తో చెప్పింది. తల్లి " ఆడపిల్ల కి అంత స్వేచ్ఛ, స్వతంత్రం పనికిరాదు, తల్లిదండ్రులు గా మేము నీ మంచిచెడ్డలు చూడడానికే ఉన్నాము. నువ్వు దేనికి తొందరపడకు, మేము అతని గురించి ఎంక్వయిరీ చేశాక, అన్ని విషయాలు నచ్చితేనే నీకు తగిన జోడీగా నిర్ణయిస్తాం. అంతవరకు నీ హద్దులో నువ్వుండు, అతనితో అతిగా ఉండకు, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, " గట్టిగానే మందలించింది తల్లి.


జనార్ధన్ కూడా, " పెళ్లి విషయంలో మాత్రం నేను అమ్మ తోనే సపోర్ట్ గా ఉంటా , ప్రకాష్ మంచి చెడు తెలిసాకే పెళ్లి మాటలు జరుపుతా, " హామీ ఇచ్చాడు, ప్రకాష్ తల్లిదండ్రుల వివరాలు అడిగాడు ప్రియ ని. మంచి రోజు కలుస్తా అని చెప్పాడు.


 " కూతురికి ఇచ్చిన మాట ప్రకారం ప్రకాష్ తల్లిదండ్రులను కలిసి , మాట్లాడిఅన్ని విషయాలు రాబట్టి, నలుగురితో మంచి చెడు ఎంక్వయిరీ చేసి కూతురికి తగిన జోడి అని నిర్ధారించిన తర్వాత మంచి ముహూర్తం లో ప్రకాష్ తో ప్రియ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు జనార్ధన్.


" ఒక్క నాన్నచాలు వందమందికి సమానం. నాన్న చల్లని నీడలో ప్రశాంతంగా జీవించింది, నాన్న మెచ్చిన ప్రకాష్ కూడా ప్రియని ఎంతో ఇష్టంగా చూసుకున్నాడు." జీవించినంత కాలం చీకూచింతా లేకుండా హాయిగా జీవించారు వాళ్లు.


🌹 సమాప్తం 🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational