STORYMIRROR

Ananya Ananya

Drama

4  

Ananya Ananya

Drama

కీర్తి 💓

కీర్తి 💓

6 mins
266

కొంతమంది మన జీవితం లోకి ఎలా వస్తారో కూడా తెలీదు తెలియకుండా వచ్చి మనలో ఎన్నో జ్ఞాపకాలు నింపుతారు. అలా నా లైఫ్ లోకి వచ్చింది కీర్తి. తనని నేను మొదటిసారి ఒక గుడిలో చూసాను . మా అమ్మ నాకు ఇష్టం లేకపోయినా పంచ కట్టి కుడి తీసుకెళ్ళింది. అది మేనేజ్ చేయలేక సరిచేసుకుంటూ లోపలికి వస్తుంటే ఎదురుగా మహాలక్ష్మి లాగా చీర కట్టుకుని దీపం వెలిగిస్తుంది .


ఆ దీపం కాంతి లో తన అందం ఇంకా రెట్టింపయ్యింది అనిపించింది. తనని అలానే చూస్తూ ఉండిపోయా. ఇంతలో ఎవరో గంట కొట్టిన శబ్దం విని అప్పుడు తేరుకున్నాను. చూస్తూనే ఉండాలనిపించే అందం ఉంది. ఇంతలో మా అమ్మ పూజ టైం అవుతుంది రా రా అని పిలవడంతో అక్కడికి వెళ్లాను.


పూజలో కూర్చున్న అనే మాటే కానీ మనసంతా తన మీదే ఈ లోపు ఫోన్ రావటంతో ఇదే మంచి చాన్స్ అనుకుని పక్కకు వచ్చి ఆ అమ్మాయి కోసం చూసాను. కానీ ఎక్కడా కనిపించలేదు. చాలా బాధగా అనిపించింది. ఇంతలో ఎవరో వెనక నుండి కీర్తి టైం అవుతుంది రావే అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసాను. వెనక్కి తిరిగి చూస్తే తను ఇందాక నేను చూసిన అమ్మాయి తన ఫ్రెండ్ తో వస్తున్నాను అని పరుగున అక్కడినుంచి బయటకు వెళ్లింది.


తనని ఎలా ఆపాలో అర్థం కాలేదు ముందుకు వెళ్దాం అనుకువడంతో వెనక నుండి మా చెల్లి వచ్చి అన్నయ్య అమ్మ పిలుస్తుంది రా రా అని అక్కడి నుంచి తీసుకొని పోయింది చేసేదేమీ లేక పూజ దగ్గరికి వెళ్లి కూర్చున్నాను.


ఆ మరుసటి రోజు తన కోసం చాలా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు పోనీ గుడికి వెళ్లిఉండచ్చు అని అక్కడికి వెళ్లి కూడా చూశాను... కానీ ఏమీ ఉపయోగం లేదు. ఆఫీసులో ఒక కొత్త ప్రాజెక్ట్ రావడం వల్ల,ఆ వర్క్ లో మునిగిపోయాను. అమ్మాయిని వెతికెంత టైం లేదు, కానీ తనని తలుచుకొని రోజంటూ కూడా లేదు.ఎం చేస్తాం నా కర్మ.


ఇలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజు నా కాబిన్ లో కూర్చుని సీరియస్ గా చేసుకుని ఉండగా ఇంతలో ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్మీ సార్ మే ఐ కమిన్ అని గొంతు వినిపించడంతో ఎవరో కూడా చూడకుండా కమిన్ అన్నాను. అమ్మాయి తన దగ్గర ఉన్న ఫైల్ టేబుల్ మీద పెట్టి సర్ ఈ ఫైల్ లో సైన్ చేయండి సార్ నేను న్యూ జాయినింగ్ అక్కడున్న సర్ మీ దగ్గర సైన్ తీసుకోమన్నారు అని చెప్పింది.


ఆ ఫైల్ తీసి సైన్ చేస్తూ పేరు చూసాను కీర్తి అని ఉంది ,వెంటే తల పైకి ఎత్తి చూసాను, ఇంక నా ఆనందానికి హద్దులు లేవు ,ఈ కీర్తి నేను కొన్ని రోజులు క్రితం గుడిలో చుసిన కీర్తి నే ,సైన్ చెయ్యకుండా తనని చూస్తూ ఉండిపోయా ,తను సార్ ,సైన్ చెయ్యండి అని అనడం తో తేరుకొని సైన్ చేసి ఇచ్చాను .


నాకైతే ఒక్కసారిగా ఎగిరి గంతు వెయ్యాలి అనిపించింది ,పట్టలేనంత ఆనందం ,ఇంకా తనని నా పి.ఏ గ అపాయింట్ చేసుకున్నాను.రోజుల గడుస్తున్నాయి తనకి చెప్పాలి అని చాలా రోజులు నుంచి అనుకుంటున్నా కాని భయం వేసి చెప్పలేక పోయా ...ఆయినా నా కీర్తి ఎక్కడికి పోతుందిలే అని ధైర్యం .


ఒక రోజు నా దగ్గరకు వచ్చి నా గుండె బద్దలు చేసింది .తన పెళ్లి కార్డు తీసుకొని వచ్చి మీరు తప్పకుండా రావలని చెప్పింది .ఇలా౦టిది అసలు జరుగుతుందని అసలు ఎక్ష్పెక్త్ చెయ్యని నేను అలా షాక్ తో చూస్తూ ఉండిపోయా.ఆ కార్డు తీసుకొని పక్కన పెట్టి ,ధర్యాన్ని అంతా కూడపెట్టుకొని కీర్తి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాను .


 తను ఎంతో నార్మల్ గా చెప్పండి సర్,తన మాటల్లోనే తెలిసి పోతుంది తనకి ఈ పెళ్లి ఇష్టమే అని .ఇప్పటికైనా చెప్పక పోతే నాకు దుర౦ అయిపోతుంది అని ఐ లవ్ యు కీర్తి అని చెప్పేసాను .తను ఏమంటదో అని చూసాను ,తను ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా బయటకి వెళ్లిపోయింది .ఛీ నేను ముందే చెప్పుండాల్సింది తనకి, ముందే చెప్పుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు అని నన్ను నేను తిట్టుకున్నాను .


ఎలాగైనా సరే కీర్తి ని ఒప్పించాలి అని బయటకి పరుగున వెళ్ళాను ,కీర్తి తన కేబిన్ లో కూర్చుని సీరియస్ గా వర్క్ చేసుకుంటూ కూర్చుంది .లోపలి వెళ్లి ,సారీ కీర్తి ,ఈ విషయమ౦ నీకు ఎప్పటి నుండో చెప్తం అనుకుంటున్నాను కానీ నాకు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు ,ఇప్పుడు చెప్పడం నాతప్పే ప్లీజ్ నేను నిన్ను వదిలి ఉండలేను అర్ధం చేసుకో అని చెప్పను కానీ అసలు తను తల పైకి ఎత్తి కూడా చూడలేదు .


ఇంక నేను నా కేబిన్ కి వెళ్ళిపోయాను ,చాలా ఏడుపొచ్చింది.ఎం చెయ్యాలో కూడా అర్ధం కావట్లేదు నాకు ,వర్క్ చేద్దాం అన్నా కూడా ధ్యాస అంత తన మీదే.నైట్ అయిపోయింది ఆఫీస్ లో వాళ్లంతా వెళ్లిపోయారు నేను కుడి వెలదా౦ అని బైటికి వచ్చాను కీర్తి ఇంకా వెళ్లకుండా వర్క్ చేస్తూనే ఉంది .


నేను తన కేబిన్ కి వెళ్లి ,ఏంటి కీర్తి ఇంకా వెళ్లలేదా ,లేట్ అయిపోతుంది ,వర్క్ ఉంటె రేపు చేసుకోవచ్చు లే పద నిన్ను డ్రాప్ చేస్తాను .పర్లేదు సర్ నేను వెళ్ళిపోతాను మీకెందుకు శ్రమ అని ఫైల్స్ అని సర్ది బయటకి వెళ్ళింది .నేను కూడా తన వెనకాలే వెళ్ళాను ,ప్లీజ్ కీర్తి పొదున జరిగిన౦దానికి ఇప్పుడు నా మీద కోపం తో రాత్రి పూత ఒంటరిగా వెళ్ళడానికి వీను లేదు అని చెయ్యి పట్టుకుని కార్ లో కుర్చోపెట్టాను .


తను కూడా ఎం మాట్లాడకుండా కూర్చుంది.డ్రైవింగ్ చేస్తూ ,కీర్తి నాగురించి కొంచెం ఆలోచి౦చు ప్లీజ్ ,నువ్వు కాదన్న నిన్న వదిలి పెట్టను.తను ఎం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది .ప్లీజ్ నువ్వు అలా సైలెంట్ గా ఉండకు నాకు ఏదోలా ఉంది.నేను ఏ మాట్లాడినా తను సైలెంట్ గా ఉండే సరికి ఎక్కడలేని బి.పి ఒచ్చింది.


కార్ ని ఓకే సైడ్ కి ఆపి కార్ డోర్ తెరిచి ఆమెను కారులోంచి బయటకు దింపి, నేను ఏం మాట్లాడినా ఎందుకు మౌనంగా ఉన్నావు ఏంటో చెప్పు, అప్పుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలుస్తుంది. కానీ మళ్ళీ ఆమె మౌనంగా ఉండడాం తో ఆమెను కౌగిలించుకొని, నేను నువ్వు లేకుండా ఉండలేను నువ్వు లేకుండా నా జీవితం శూన్యం,ఇప్పయికైనా మాట్లాడక పోతే చంపేస్తాను .


తను ఒక చిన్న చిరునవ్వు నవ్వింది .దాని అర్ధం ఏంటో నాకు అస్సలు అర్ధం అవ్వలేదు .ఎందుకు నవ్వుతున్నావ్ నేను చెప్పేది అంత నవ్వులాట గా ఉందాఅని కసురుకున్నాను.అప్పుడు తను అయినా ఈ విషయం చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అని అనింది .....నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావట్లేదు కీర్తి .


 మీరు నన్ను మొదటిసారి ఎప్పుడు చూశారో చెప్పండి అని అడిగింది.నేను నిన్ను గుడిలో చూశాను, అప్పుడు నువ్వే నా బెస్ట్ హాఫ్ అని నిర్ణయించుకున్నాను .


 అప్పుడు కీర్తి నేను ఫస్ట్ టైం ఎక్కడ చూసినో తెలుసా ఒక ఫంక్షన్ లో చూశాను అందరితో చాలా చక్కగా మాట్లాడావు . చూడటానికి చాలా బాగున్నావ్ భలే అల్లరి చేసావు. అప్పుడే చాలా నచేశావ్.అప్పుడే చెప్తం అనుకున్నాను బట్ చెప్పలేకపోయా . మళ్లీ నువ్వు నన్ను చూసావా గుడిలో...... అదే గుడి లో నేను చూశాను నువ్వు నన్ను అలానే చూస్తూ ఉండిపోయావ్,అప్పుడు అర్ధమై౦ది నేను నీకు నచ్చాను అని, చూసి చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉండటంవల్ల అక్కడి నుంచి వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నా కోసం వెతికావు అని తెలిసింది.


అందుకే డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చేసాను. నేను పని చేస్తున్న కంపెనీలో రిజైన్ చేసి మరీ ఈ కంపెనీ కి వచ్చాను. కానీ నువ్వు ఎన్ని రోజులైనా నాకు చెప్పట్లేదు నాకు చాలా కోపం వచ్చింది. అందుకే ఈ పెళ్ళి నాటకం ఆడాను ఇప్పటికైనా చెప్తారేమో అని. ఫైనల్ గా బయటపెట్టావు.


దొంగ మొహం దాన అప్పుడే చెప్పుంటే అయిపోయేది కదా అని నవ్వాడు. ఎనీవేస్ ఐ లవ్ యు పెళ్లి చేసుకుందామా.....


అడిగిన వెంటనే కీర్తి సిగ్గుతో తలదించుకుంది హర్ష చూసి నవ్వుకొని రేపు మీ ఇంటికి వచ్చి మాట్లాడుతాం. ఆ మాట అనిన వెంటనే కీర్తి చాలా డల్ అయిపోయింది. ఏంటి కీర్తి డల్ అయిపోయావు ఏమైంది అనగానే, నాకు ఎవరు లేరు హర్ష నేను అనాధ ని ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా చాలా బాధనిపించింది.


ఏం పర్లేదు నువ్వు ఏం బాధ పడకు ఇకనుంచి నేను నీకు ఉన్నాను కదా. సరేపదా మా అమ్మ నాన్నకి నిన్ను పరిచయం చేస్తాను అనంగానే హలో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది .ఇప్పుడు కాదు ఎప్పుడైనా చూద్దాం ప్రస్తుతం నన్ను హాస్టల్ లో డ్రాప్ చేసేయ్.


సరే అని తనని హాస్టల్ లో దించేసి ఇంటికి వెళ్ళిపోయాడు .


కొన్ని రోజుల తరువాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి ముహుర్తాలు పెట్టించారు.పెళ్ళికి ఎక్కువ సమయం లేకపోవడం తో బట్టలు ,నగలు షాపింగ్ ఫాస్ట్ చేసుకున్నారు .


చిన్నపాటి నుంచి ఒంటరిగా పెరిగిన కీర్తి ,ఇంత మంచి ఫామిలీ దొరికినందుకు చాలా సంతోషం గా అనిపించింది .ముహూర్తానికి కొన్ని రోజులే మిగిలి ఉంది .ఒక రోజు కీర్తి ని కలవడానికి తన హాస్టల్ కి వెళ్ళాను .కానీ తను అక్కడ లేకపోవడం తో తనకి ఫోన్ చేసాను లిఫ్ట్ చెయ్యకపోవడం అక్కడి నుంచి తో ఆఫీస్ కి వెళ్ళాను కానీ అక్కడ కూడా లేదు .


హర్ష కి తెలిసిన కీర్తి ఫ్రండ్స్ కి కూడా ఫోన్ చేసి కనుక్కున్నాడు కానీ అక్కడ కూడా లేదు.ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందేమో లే అనుకోని ఇంటికి తిరిగి వెళ్ళాడు.నెక్స్ట్ డే కీర్తి రూమ్మేట్ హర్ష కి ఫోన్ చేసి ,హర్ష గారు సాయంత్రం అనగా వెళ్లిన కీర్తి ఇప్పటికి కూడా రాలేదు ,ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు ,నాకు చాలా భయంగా ఉంది,అని చెప్పింది .


అది విన్నపటి నుంచి హర్ష కి భయం మొదలయింది .ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ కలవడం లేదు.కీస్ తీసుకుని తనకి తెలిసిన చోటూళ్ళని వెతికాడు .కానీ ఎక్కడ కనిపించలేదు .ఇంకా రెండు రోజుల్లో పెళ్లి ఎక్కడికి వెళ్ళింది.


కొన్ని సంవత్సారాలు తరువాత ....... 


హర్ష స్నానం చేసి, కీర్తి ....నా బట్టలు బయటకి తీసావా ,టిఫిన్ రెడీ అయ్యిందా ఆఫీస్ టైం అయింది అనడం తో హా హర్ష అయిపోయింది అని అంటుంది .రెడీ అయ్యి కిందకి వచ్చి టిఫిన్ చేసేసి ఆఫీస్ కి బయలు దేరాడు . తన ఫ్రెండ్ అవినాష్ వచ్చి హర్ష వాళ్ళ ఇంటికి వచ్చి ,లోపలి నడుస్తున్నాడు .హర్ష బయటకి నడుస్తూ ...కీర్తి నేను వెళ్తున్నా జాగ్రత్త అని చెప్పి బయటకి వచ్చాడు .


అవినాష్ ,హర్ష తో ఏంటి హర్ష కీర్తి తో మాట్లాడి వచ్చావా అని అడిగాడు ,అవును రా .ఇంకా కీర్తి ని మర్చిపోలేదా ....తను చనిపోయిందిరా.హర్ష ఎం మాట్లాడలేదు .


కీర్తి ఒక రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయింది కానీ ,హర్ష మాత్రం కీర్తి ని ఇంకా మర్చిపోలేదు .కీర్తి ని తలుచుకుంటూ అలా జీవితం గడుపుతున్నాడు,ఎంతమంది డాక్టర్స్ కి చూపించిన ఏమి చేయలేకపోయారు .


        ప్రేమ మనుషులని ఎంతదూరం అయినా తీసుకు వెళ్తుంది.    



Rate this content
Log in

More telugu story from Ananya Ananya

Similar telugu story from Drama