Dushyanth K

Drama

3  

Dushyanth K

Drama

ఎవరు మహారాణి

ఎవరు మహారాణి

1 min
223


కథ 1: చిన్నప్పటి నుండి అనేక ఆంక్షల మధ్య పెరిగిన అమ్మయి కి పెళ్ళి అయ్యి భర్త దగ్గరకి వచ్చింది. భర్త తనని అర్దం చేస్కొని, తనకి స్వాతంత్య్రాన్ని ఇచ్చి, తనకి ఎలా నచ్చితె అలా ఉండచ్చు అని చెప్పి, పని వారిని ఎర్పాటు చేసి, తను ఆ ఇంటికి మహారాణి అని చెప్తాడు. అప్పటివరకు తనకి ఉన్న చిన్న చిన్న కోరికలు,ఇష్టాలు కట్టలు తెంచుకుని, భర్త దగ్గర అల్లరి చేసె చిన్న పిల్లలా మారిపోయి తనకి దూరం ఐన ఆనందాన్ని వెత్తుకుంటు, కావాల్సినవి కొనిపించుకుంటు, అల్లరి చేస్తు, చిన్న పిల్లలా అరుస్తు, మారం చెస్తు, భర్త దగ్గర లెనప్పుడు ఎడుస్తు, కేవలం అతని కొసం ఆలోచిస్తు, అతను వచ్చాక వదలకుండా తన తోనే ఉంటూ, ప్రతీ దానికి భర్త మీధ ఆధారపడుతు జీవించసాగింది.


కథ 2: ఛిన్నపటి నుండి అనేక ఆంక్షల మధ్య పెరిగిన అమ్మయి కి పెళ్ళి అయ్యి భర్త దగ్గరకి వచ్చింది. భర్త తనని అర్దం చేస్కొని, ఇంటి బాధ్యతలు, పనులు తనకి ఇచ్చి, ఇప్పుడు ఆ ఇంటికి తానే మహారాణి అని చెప్పి ఎవరూ తనని శాసింఛలేని స్థానాన్ని కల్పిస్తాడు. ఆ భార్య తనకి ధక్కిన గౌరవం కి ఆనందపడి ఇంటి బాధ్యత తీస్కొని, భర్త కి అన్ని విషయాలలో సహాయం చేస్తు, భర్త చేసె అనవసర ఖర్చులకి రాబొయె ఖర్చులని గుర్తు చేస్తు, తెలివిగా ఇంటిని, సంపాదనని, ఆస్థులని కాపడుతూ జీవించసాగింది.


మొధటి కధ లొ భర్త భార్యకు స్వాతంత్య్రాని, రెందొ కధ లొ భర్త భార్యకు బాధ్యతను ఇచ్చారు. వచ్చిన స్వాతంత్య్రం తొ ఎం చెయ్యాలొ తెలియని భార్య సంసారానికి ఎటువంటి బాధ్యత తీసుకొలేదు కాని రెండొ కధ లొ తనకి ఇచ్చిన బాధ్యత తొ సంశారాన్ని చక్కదిద్ది స్వాతంత్య్ర నిర్నయాలు తీసుకునె స్థాయికి యెదిగింది భార్య.


నీతి: బాధ్యత లేని స్వాతంత్య్రం మహారాణిని మళ్ళీ బానిసని చేస్తే, బాధ్యత తొ కూడిన పని ఆమెను స్వతంత్రురాలిని చేసి అసలైన మహారాణిని చేసింది.


- నిధు


Rate this content
Log in

Similar telugu story from Drama