STORYMIRROR

Rahul Exists

Drama

4.7  

Rahul Exists

Drama

అతనితో ఆమె..(ఇప్పటికీ..ఎప్పటికీ)

అతనితో ఆమె..(ఇప్పటికీ..ఎప్పటికీ)

4 mins
23.4K


అతనితో ఆమె..(ఇప్పటికీ..ఎప్పటికీ) - ఫుల్ స్టోరీ...

.

అమ్మాయ్ పేరు #శ్రావణి. అక్కా , తమ్ముడు ఎవరూ లేరు.. తన చిన్నప్పుడే వాళ్ళ నాన్న అమ్మాయ్ ని వాళ్ళ అమ్మ ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయ్ వల్ల నాన్న బాగా తాగేవాడు. వాళ్ళ అమ్మ తో డైవర్స్ తీసుకుని వీళ్ళ ని వదిలేసి వెళ్ళిపోయారు..

.

చిన్నప్పటి నుండి శ్రావణి ని తెలిసిన వాళ్ళు పెంచారు..

.

చిన్నప్పటి నుండే శ్రావణి కి ఒంటరి గా పెరగడం అలవాటు ఐపోయింది.. ఎవరితో మాట్లాడేది కాదు.. అబ్బాయిలు అంటే అసలు ఇష్టపడేది కాదు.. తన చదువంతా ఇలా ఒంటరి గా నే గడిచిపోయింది..

.

చదువు ఐపోయాక తనకి జాబ్ వచ్చింది.. ఒక ప్రైవేట్ కంపనీ లో జాబ్.. అక్కడ కూడా తన పని తాను చేసుకుని వచ్చేసేది.. అలా 1 యియర్ ఐపోయింది..

.

ఇలా ఈ అమ్మాయ్ ఇలా ఉండడం గమనించిన ఒక అబ్బాయ్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు.. ఆ అబ్బాయ్ నేమ్ "నవీన్".. శ్రావణి ఆఫీస్ కొలిగ్.

.

#నవీన్ - హాయ్.. నా పేరు నవీన్..

.

#శ్రావణి - హాయ్. నా పేరు శ్రావణి..

.

నవీన్ - నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను.. మీరు ఎందుకు ఇలా వుంటున్నారు..? మీ కళ్ళలో కోపం..? మీరు నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు..అందరి అమ్మయిల్లాగా స్టైల్ గా వుండరు.. అసలు ఇలా ఎందుకు వుంటున్నారు..?

.

#శ్రావణి - చిన్నగా నవ్వుతూ.(ఎం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది)

ఆ తరువాత రోజు నుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాళ్ళు.. శ్రావణి అన్ని నవీన్ కి చెప్పుకునేది..

.

ఒక సారి వాళ్ళ ఆఫీస్ 25 years ఫంక్షన్ కి నవీన్ బైక్ మీద ఇద్దరు కలిసి వెళ్లారు.. శ్రావణి పింక్ డ్రెస్ లో ఉంది.. నవీన్ సూట్ లో ఉన్నాడు... ఫంక్షన్ అయ్యాక వాళ్ళు మూవీ కి వెళ్లారు.. అదే ఆ అమ్మాయ్ లైఫ్ ని టర్న్ చేసిన రోజు..

.

ఆ రోజు బైక్ మీద దూరం గా వెనుక కూర్చున్న అమ్మాయి, సరిగ్గా 3 నెలల తరువాత అదే బైక్ మీద నవీన్ ని హగ్ చేసుకుని కూర్చునే స్టేజ్ కి వచ్చేసింది..

.

అప్పటి నుండి ఆ అమ్మాయ్ స్టైల్ మారింది.. మాట తీరు మారింది..

.

ఇలా హ్యాపీ గా లైఫ్ రన్ అవుతూ ఉంది..

.

ఒక రోజు శ్రావణి కి నవీన్ దగ్గర నుండి కాల్ వచ్చింది.. ఆక్సిడెంట్ అయ్యింది అని నవీన్ చెప్పిన మాటలు వినగానే శ్రావణి షాక్ ఐపోయింది.. వెంటనే నవీన్ రూమ్ కి వెళ్ళింది..

.

నవీన్ ని చూడగానే అతన్ని పట్టుకుని ఏడ్చేసింది.. ఆ రోజంతా తనతోనే ఉంది.. అతన్ని మంచిగా చూసుకుంది..

ఆ రోజు వాళ్ళు చాలా దగ్గర ఐపోయారు..

.

తర్వాత్ నవీన్ కి 104 ఫీవర్ వచ్చేసింది.. తాను ఆఫీస్ కి లీవ్ పెట్టేసి తానే అతన్ని హాస్పిటల్ కి తీస్కుని వెళ్ళింది.. ఆ రోజంతా తన దగ్గరే ఉంది ఒక అమ్మ లా , ఒక బార్య లా చూసుకుంది..

.

అతనంటే ఆ అమ్మాయ్ కి చాలా ఇష్టం.. ఎంత ఇష్టం అంటే తన కోసం ఏధయిన చేసేంత ఇష్టం.

.

వాళ్ళిద్దరి క్యాస్ట్స్ వేరు..

.

ఇద్దరు , బయటికి వెళ్ళడం , హ్యాపీ గా ఉండేవాళ్ళు.. లైఫ్ చాలా బాగా అనిపించేది..

.

(దేవుడు ఈ లైఫ్ కి ఇది చాలు అని అనుకునే లోపు నీ లైఫ్ ఇంకా ఉంది అని మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు) అదే ఇక్కడ జరిగింది..

.

ఒక రోజు నీతో మాట్లాడాలి ఒకసారి రా అని నవీన్ శ్రావణి కి కాల్ చేశాడు..

.

#నవీన్ - నాకు ఇంట్లో పెళ్లి సంబందం చూశారు.. ఎవరి ఒక అమ్మాయ్ ని చూశారు.. మా ఇంట్లో వాళ్ళకి తను నచ్చింది..

.

#శ్రావణి - నువ్వు ఆ అమ్మాయ్ ని చూడలేదా..?

.

#నవీన్ - చూడలేదు..

.

#శ్రావణి - అదేంటి..?

.

#నవీన్ - చూడడం అవసరం లేదు..

.

(కానీ అంతక ముందు 3 డేస్ శ్రావణి కి కాంట్యాక్ట్ లో లేదు.. ఆ అమ్మాయ్ ని చూసే వచ్చాడు.. కావాలని అబద్దం చెప్పాడు)

.

#శ్రావణి - మీ ఇంట్లో నా గురించి చెప్పవా..?

.

#నవీన్ - చెప్పలేదు.. మా ఇంట్లో వొప్పుకోరు..

.

(మా ఇంట్లో చెప్తే గొడవలు అవుతాయి అన్నాడు కానీ చెప్పి వొప్పించడానికి ట్రై చెయ్యలేదు..)

.

#శ్రావణి - ఆ అమ్మాయ్ ని చేసుకుంటే నువ్వు హ్యాపీ గా ఉంటావా..?

.

#నవీన్ - తెలియదు.. కానీ మా అమ్మా వాళ్ళు హ్యాపీ గా ఉంటే నేను హ్యాపీ గా ఉంటాను.. నువ్వు నాకో మాట ఇవ్వాలి..

.

#శ్రావణి - ఏంటి..?

.

#నవీన్ - ఇలా అయ్యిందని నువ్వు ఏ సూసైడ్ చేసుకోకూడదు..

.

#శ్రావణి - (బాద తో )నవ్వుతూ.. నువ్వు హ్యాపీ గా ఉంటా అంటున్నావ్ గా నాకు అది చాలు..

.

తర్వాత ఏదో పూ

జలు అన్నాడు.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది అన్నాడు..

.

ఒక రోజు వాళ్లింట్లో ఆ అమ్మాయ్ నంబర్ ఇచ్చి మాట్లాడమన్నాడు.. శ్రావణి ముందే తనతో మాట్లాడేవాడు.. శర్వాణి చాలా బాద పడేది.. కానీ బయటికి చెప్పేది కాదు..

.

ఆ అబ్బాయ్ ఎంగేజ్మెంట్ కి డ్రెస్ కూడా శ్రావణి నే సెలెక్ట్ చేసింది.. ఏదో మనీ అవసరమయితే స్పాట్ లో 50k ఇచ్చింది..

.

మ్యారేజ్ కి కార్డ్ కూడా ఇవ్వలేదు.. Bangalore వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాడు..

.

మ్యారేజ్ ఐపోయాక 15 డేస్ కి శ్రావణి అకౌంట్ లో 50k వేశాడు.. శ్రావణి కాల్ చేస్తే పిక్ చెయ్యలేదు..

.

జాబ్ కోసమని శ్రావణి వేరే ప్లేస్ కి వచ్చేసింది.. 1 యియర్ ఎం మాట్లాడుకోలేదు..

.

నేను హ్యాపీ లేను శ్రావణి అని అంటున్నాడు ఇప్పటికీ.. గొడవ పడి అతనితో మాట్లాడడం మానేసింది..

ఆ అమ్మాయ్ అయిన సంతోషం గా ఉండాలి అని అతనితో మాట్లాడడం మానేసింది..

.

ఇది మీకు పెద్ద లవ్ స్టోరీ లా అనిపించక పోవచ్చు.. ఆ అమ్మాయ్ గురించి ఆలోచించండి.. నేను ఆ #అమ్మాయ్ తో మాట్లాడాను..

.

మా ఇద్దరి మద్య conversation..

#రాహుల్ - మరి మీరు ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారా..?

.

#శ్రావణి - లేదు.. తన జ్ఞాపకాలతో ఉంటున్నాను.. ఆ 2 యియర్స్ నాకు చాలు ఈ లైఫ్ కి..

.

#రాహుల్ - మరి మీ ఇంట్లో ఎం అనడం లేదు..

.

#శ్రావణి - తాను వదిలేసి వెళ్ళిపోయ నాకు మంచి పెళ్లి సంబందాలు వచ్చాయి..

.

#రాహుల్ - మరి చేసుకోవచ్చుగా..?

.

#శ్రావణి - నేను నవీన్ కి మాటిచ్చాను.. నేను నిన్ను తప్ప ఇంకెవారిని పెళ్లి చేసుకొను అని.. నేను ఆ మాట కి చాలా వ్యాల్యూ ఇస్తాను..

.

#రాహుల్ - మరి ఆ అబ్బాయ్..?

.

#శ్రావణి - తాను కూడా నాకు మాట ఇచ్చాడు.. కానీ నిలబడలేదు.. నా మనసు , నా బాడీ , నా ప్రేమ అన్ని నవీన్ కె. నవీన్ ప్లేస్ లో నేను వేరే వాళ్ళని వూహించుకోలేను..

.

#రాహుల్ - మరి తాను మీకు గుర్తు రావడం లేదా..?

.

#శ్రావణి - అసలు మర్చిపోతె గా..? గుర్తుకురావడానికి..? ఇలా చాలా కష్టం గా వుంది.. అందుకే ఎవరయినా అనాద పిల్లలని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను..

.

(తాను ఇలా అనగానే నాకు ఐతే ఏడుపు వచ్చేసింది).

.

ఆ అబ్బాయ్ చాలా హ్యాపీ గా ఉన్నాడు.. కానీ ఆ అమ్మాయ్ తన కోసమే ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది..

.

ఆ అమ్మాయ్ కి మనీ లేదు.. కానీ ఆ అబ్బాయ్ దగ్గర నుండి ఒక్క గిఫ్ట్ కూడా తీసుకోలేదు.. షాపింగ్ కి తిప్పించుకోలేదు..

.

ప్యూర్ లవ్ కోసం చూసింది.. అలా అనుకోవడమే తాను చేసిన తప్పేమో..

.

ఒక బార్య ఎలా ఉంటుందో అలా అతని దగ్గర ఉంది.. తినిపించింది.. స్నానం చేపించింది.. పసి పాప లా చూసుకుంది..

.

తాను స్లో గా దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు..

.

ఇప్పుడు ఆ అబ్బాయ్ కి ఒక బాబు..

.

నువ్వు నా కోసం బ్రతకాలి అని ఆ అమ్మాయ్ దగ్గర ప్రోమిస్ చేయించుకున్నాడు..

.

ఆ మాట కోసం ఆ ప్రోమిస్ కోసం జీవొచ్చవం లా బ్రతికేస్తుంది..


Note-

లవ్ అనేది ఇద్దరికి ఉండాలి.. ప్రేమించే వాళ్ళకి ధైర్యం ఉండాలి.. ఇంట్లో వాళ్ళని వొప్పించే దమ్ము ఉండాలి.. అలా లేక పోతే లవ్ చెయ్యొద్దు..

చివరి గా ఒక మాట..

.

"ఒక అమ్మాయ్ ప్రేమించినట్టు మనం ప్రేమించలేం అబ్బా.. ఇది నిజం.. అమ్మాయ్ ప్రేమ అమ్మ ప్రేమ లాంటిదే.. "

.

బ్లేమ్ కామెంట్ పోస్ట్ చెయ్యొద్దు.. ఆ అమ్మాయ్ ప్లేస్ లో మీ అక్కా ,సిస్టర్ ని ఉంచి కామెంట్ చెయ్యండి..

.

నాకోసం ఇదంతా చదివినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు.


Rate this content
Log in

Similar telugu story from Drama