Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunkara Hrao

Inspirational

5.0  

Sunkara Hrao

Inspirational

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే

3 mins
508



******************* 

చేతికున్న వాచ్ లో మాటిమాటికి టైమ్ చూసుకుంటూ హడావిడి పడిపోతున్న తన ముద్దుల కూతురు సుమతిని కళ్ళనిండుగా చూసుకుంటూ పట్టలేని ఆనందంతో వుబ్బి తబ్బిబ్బైపోయింది వసుమతి. ఎప్పుడు ఆఫీస్ డ్రెస్సుల్లో , చుడీదారుల్లోదర్శనమిచ్చే కూతురు సుమతి మల్లెపూవు వంటి తెల్లని ఖాదీ చీరలో,జాకెట్టుతో దర్శనమిచ్చేసరికి కళ్ళల్లో నిండిన ఆనంద భాష్పాలతో తృప్తిగా కళ్ళు మూసుకుంది . తండ్రినికోల్పోయిన సుమతిని క్రమశిక్షణలో పెంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించింది వసుమతి. బాధ్యతలను గుర్తించిన సుమతి ఒక పెద్దకంపెనీలో మేనేజర్ వుద్యోగం సంపాదించిoచింది కానీ , సేవాదృక్పధం వున్న కంపెనీలో వుద్యోగo సంపాదించాలని తాపత్రయ పడిపోతు అనేక ఇంటర్యులకు వెళ్ళి వస్తుంటుంది. కానీ సరైన సమయానికి వెళ్లలేక చాలావాటిని తన్నేసుకుంది. 

కానీ యిప్పుడు వచ్చిన ఇంటర్యూ  పర్యవసానమే ఈ హడావుడి.

“ అమ్మా!సుమా ఇంకా టైముందిరా . కొంచం టిఫిన్ చేసి బయలుదేరవచ్చు. “    అంటూ హడావుడి చేస్తున్న తల్లిని అపురూపంగా చూస్తూ ,తల్లిమనసు నొప్పించలేక యేదో చేశాను అన్నట్లు ముగించి బయలుదేరిపోయింది ఇంటర్వూ కు ఫోనులో వాళ్ళు చెప్పిన కొండ గుర్తుల్ని మననం చేసుకుంటూ. మదర్ థెరిస్సా సేవాసదనం మార్గ సూచికముందు ఆగిపోయి మరోసారి తన చేతి గడియారాన్ని చూసుకుంది. మరో అరగంట టైము వుందని భావిస్తూ సేవాసదనం రోడ్డు మీదకు తనస్కూటీని మళ్లించింది.

మరో ఐదు కిలోమీటర్లే .. అదృష్ట వశాత్తు తనుగాని ఈ సేవాసదానం లో మేనేజరుగా సెలెల్ట్ అయితే తన జీవితాశయము నెరవేరినట్లే అనుకుంటూ వూహాల్లో తేలిపోతు స్కూటీ వేగం పెంచింది సేవాసదనం చేస్తున్న కార్యక్రమాలగురించి మనసులో తలుచుకుంటూ.  రోడ్డు నిర్మానుష్యoగావుంది.

స్కూటీ వేగం పెంచింది. వేగంగా దూసుకుపోతున్న సుమతి హఠాత్తుగా తన స్కూటీని ఆపేసింది. రోడ్డు ప్రక్కగా ఒక చేతిలో సoచి, మరో చేతిలో వాకింగ్ స్టీక్కుతో వున్న వ్యక్తి కుప్పకూలి పోతుంటే చూసి తన స్కూటీని వదిలేసి పరుగెట్టుకెళ్లి పడిపోతున్న వ్యక్తిని చేతులమధ్య పొదివి పట్టుకుని భద్రoగా తీసుకెళ్లి ప్రక్కనున్న తూము చప్టామీద కూర్చో బెట్టింది.                                   

“సారీ అమ్మా!సారీ!యేదో కళ్ళు తిరిగి తల్లి!” అంటున్న ఆపెద్దాయనను సముదాయిస్తూ తన భుజానికి వున్న వాటర్ బ్యాగ్ ఓపెను చేసి చల్లటి నీరు త్రాగించింది. అటుయిటు చూస్తే సదనం నుండి అప్పుడప్పుడు వస్తున్న ఆటోలో తప్ప ఖాళీ ఆటోలు కనిపించడం లేదు. తప్పని సరి పరిస్థితిలో యెదురుగా వస్తున్న ఆటోని ఆపి బ్రతిమాలి ,పెద్దాయన పరిస్తితి చెప్పి ఒప్పించి ఆటోవాలా సాయంతో ఆటోలోకి చేర్చి ,తన స్కూటీని లేపి స్టేOడు వేసి లాక్ చేసి,ఆటోను దగ్గరలో వున్న హాస్పిటల్ ముందు ఆపించి రెసెప్షన్లో తన ఆఫీసు ఐడెంటిటీ కార్డు చూపించి అడ్మిట్ చేయించింది.రెసెప్షన్ వ్యక్తి క్యాష్ డిపాజిట్ అని అడిగితే ముందు వెనుకా ఆలోచించకుండా తన మెడలో వున్న చైన్ ,చేతికున్న బంగారు గాజు తీసి యిచ్చి తిరిగి వచ్చి క్యాష్ కట్టి తీసుకుంటానని కన్వీన్స్ చేసి టైము చూసుకుంది. అప్పటికే ఇంటర్వు టైమ్ షెడ్యూల్ దాటి గంట అయిపోయిందని గుర్తించి రిసెప్షన్ ముందు కూర్చుని ఇంటర్వ్యూ గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడo అనవసరమని భావించి పెద్దాయన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.

ఆటోలో యెక్కుతూ పెద్దాయన అన్న మాటల్ని గుర్తు చేసుకుంది.

“అమ్మా!నువ్వెక్కడికో పనిమీద బయలుదేరినట్లున్నావు. నావలన నీపని ఆగిపోతుందేమో. నేను తూముమీద పడుకుంటాను . నువ్వేళ్లిపో తల్లి!”

అటువంటి పరిస్ఠీతిలో కూడా తనగురించి కాకుండా యెదుటి వారిగురించి ఆలోచించిన పెద్దాయన మనస్తత్వానికి అబ్బురపడిపోతు ఆయన ఆరోగ్యం కోసం ఆరాట పడిపోయింది సుమతి. అప్పటికే రెండు సార్లు రిసెప్షన్లో యెంక్వైరీ చేసింది.

డాక్టరు గారు వస్తారు అని చెప్పింది రిసెప్షనిస్ట్.

మరో గంట గడిచి పోయింది.

“కoగ్రాట్స్ తల్లి!హిజ్ ఔటాఫ్ డేంజర్. వారి అబ్బాయికి ఫోను చేశాము. అతను మరో అరగంటలో వచ్చి బిల్ పే చేస్తానని చెప్పారు.

పెద్దాయన్ని అడిగాను. ఆమ్మాయి యేమవుతుందని. జరిగినదంతా చెప్పారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తికి చేతనయినంత సాయం అందించిన నువ్వు మామూలు అమ్మాయివి కావు తల్లి!స్వంత తలిదండ్రుల్నే కసాయిల్లా వృద్ధాశ్రమాలకు బలిచేస్తున్న పుత్రులున్న కాలం యిది. అటువంటిది వెనుకాముందు ఆలోచించకుండా నీ బoగారు గాజు,ఛైను డిపాజిట్ చేసి పెద్దాయన్ని రక్షించావు అంటే సామాన్య విషయం కాదు. ఆటైములో నువ్వు స్పందించి సాయం చేయకపోతే ఆయన పరిస్తితి యెలావుండేదో వూహకు అందని విషయం.”

చిరునవ్వుతో వచ్చిన డాక్టర్ అభినందిస్తుంటే

“డాక్టర్ గారు!నేను చేసిన సాయం మీరు అనుకున్నంత గొప్పదికాదు. ఆపదలు రేపు మీకు రావచ్చు , నాకు రావచ్చు. మనిషికి మనిషి సాయం చేసుకో పోతే మానవత్వమే మంటగలిసిపోతుంది. నేను ఇంటర్యూ కి వెళ్తున్నాను. ఇంటర్వు యిదికాకపోతే మరొకటి. కానీ మనిషి ప్రాణం అలాకాదని మీకు చెప్పడం నా మూర్ఖత్వమే అవుతుంది. వారిని చూస్తూనే వారి అవస్థకు భయపడిపోయాను. నా ఇంటర్యూ సంగతి మర్చిపోయాను. వారిని రక్షించిన మీకు ధన్యవాదములు తెలుపు కుంటున్నాను. రేపు వచ్చి డబ్బుకట్టి నా వస్తువులు తీసుకుంటాను. నమస్తే .”

“అమ్మా !తొందరపడకు. నువ్వు డబ్బులు కట్టనవసరము లేదు . వారి అబ్బాయి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. నువ్వు నీవస్తువులు తీసుకో తల్లి.”

                 ******

మూడీగా ఇంటికొచ్చిన కూతురి వాలకాన్ని చూస్తూనే

ఇది రోడ్డుమీద యేదెబ్బతిన్న కుక్కపిల్లకో,అడుక్కుంటున్న యేఅవ్వకో సాయం చేయబోయి ఈ ఇంటర్వు కూడా తన్నేసుకుని వుంటుంది. ఇది మామూలేగా ?సమాధాన పడిపోయింది వసుమతి.

ఉదయాన్నే నిద్రలేస్తూనే తన సెల్ చూసుకుంటూ

“అమ్మా!నేను సెలెక్ట్ అయ్యాను. కానీ యెలా?”

అరిచేస్తున్న కూతుర్ని అయోమయoగా చూస్తూ

“అమ్మా!సరిగా చూసుకో. పొరపాటున మరొకరికి పంపిన మెసేజి నీకు వచ్చిందేమో?”

వసుమతి సర్ది చెప్పింది.

“అమ్మా !నిన్న నేను ఇంటర్యూ కి కూడా అటెండ్ కాలేదు. కానీ మెసేజిలో నాపేరు కూడా మెన్షన్ చేశారు. అదికూడా మేనేజర్ పోస్టుకు కాదు జెనరల్ మేనేజర్ పోస్టుకు సెలెక్ట్ చేశారు. అమ్మా!నువ్వన్నట్లు తప్పకుండా యేదో పొరపాటు జరిగే వుంటుంది. ఆశ్రమానికి వెళ్ళి అదేదో క్లారిఫై చేసుకు వస్తాను.”

తయారై తుర్రుమంది సుమతి.

                    *******

సేవాసదన్ వారు మెసేజిని కన్ఫమ్ చేశారు.

హౌ?అని తలబద్దలుకొట్టుకున్న సుమతిని అదోలా చూస్తూ దయచేసి మీ జాయినింగ్ రిపోర్టు సబ్మిట్ చేయండి అంటూ ఒక ప్రెంటెడ్ ఫామ్ అందించాడు ఆఫీస్ మేనేజర్.అన్యమస్కంగానే సంతకం చేసేసింది సుమతి. 

తను హాస్పిటల్లో జాయినుచేసిన పెద్దాయన సేవాసదన్ ఫౌoడరని, తన ఇంటర్యూ దారిలోనే అయిపోయిందని సుమతికి తెలిసే అవకాశము లేదు.. యికముందు రాదేమో కూడా.

             ******సమాప్తం *****aaaa


Rate this content
Log in

Similar telugu story from Inspirational