sridevi kusumanchi

Inspirational

4.5  

sridevi kusumanchi

Inspirational

శరీరానికే వైకల్యం

శరీరానికే వైకల్యం

3 mins
522


ప్రసాదు చేయెత్తక పోయిన ఆ వైపు ప్రతి నిత్యం వెళ్ళే బస్సు

ప్రసాదు స్టాండులో ఆ సమయములో నిలబడితే చాలు.బస్సు తన కోసమే వచ్చింది అన్నట్టూ దగ్గరికి వచ్చి మరీ ఆగుతుంది.

ప్రసాదు పట్నములో డిగ్రీ రెండవ సంవత్సరము చదువుతున్నాడు.తను రోజూ కాలేజీకి బస్సులో వెళతాడు.

ఆ రోజు బస్సు కోసం ప్రసాదు బస్ స్టాండ్ లో నిలబడ్డాడు.ఎప్పటిలాగే బస్సు ప్రసాదు వద్దకు వచ్చి ఆగింది.

ప్రసాదు ఎక్కిన బస్సు ప్రతీనిత్యమూ వచ్చేదే...కండక్టరు పాత వాడే,డ్రైవరూ ఎప్పటి వాడే...ప్రతీ రోజు ప్రసాదుకై ఎదురు చూసే ప్యాసింజర్లు వాళ్ళే.. కాని ప్రసాదుకి మాత్రము ఎప్పుడూ ఎక్కే బస్సులా అనిపించలేదు.

ఎందుకంటే ప్రసాదు బస్సు ఎక్కగానే కండక్టరు,డ్రైవరుతో పాటు ...లోకల్ బస్సు కనుక పరిచయమున్న వాళ్ళందరూ కేకలు ,అరుపులు,ప్రసాదు మాటలకై..పాడే పాటలకై ...

కాని ప్రసాదు ఎక్కగానే ఎవరిలోని ఆ ఉత్సాహం కనబడలేదు...ఆ రోడు పిడుగు పడి

,చిరునవ్వును భయం బీరువాలో దాచినట్టు బుగ్గలు ముడుచుకుని,నిస్తేజమైన,ధీనమైన కళ్ళతో ప్రసాదు చూస్తున్నారే తప్ప...ఎవరూ పెదవి విప్పటం లేదు..రెండు అధరాలకి జిప్ ఏదో వేసినట్టు... కండక్టరు,డ్రైవరూ కూడ ఇంచెత్తు మాట్లాడటం లేదు.ఎంతో ఉల్లాసంగా ఎక్కే ప్రసాదు ..ఒక్క సారిగా గాలి తీసిన బెలున్ లా మారి..చురుకుదనాన్నంతా వివేచనతో బంధీ చేసేడు...జూనీయర్ బాలసుబ్రహ్మణ్యములా రాగాలుతోనే బస్సు ఎక్కే ప్రసాదు గొంతు మూగబోయింది.

తనకి అభిమానలంతా ఉంచే రిజర్వ్ సీటు కూడా ఆ రోజు లేదు.వెనుక వేరే సీటు ఉంటే అక్కడకి వెళ్ళి కూర్చున్నాడు.

కాని ఆ సీటు ప్రక్కన ఎప్పుడూ ఎక్కనిఆ ప్రాంతపు రాజకీయ నాయకులుకూర్చున్నారు.ఎంతో గాంభీర్యంగా వాళ్ళే గొప్పన్నట్టు..

ఇంతలో తరువాత ఊరు స్టేజి వచ్చింది.పట్టణం వైపు వెళ్ళే బస్సులు ఆ మార్గం గుండా పరిమితంగా ఉండటం వలన

బస్సు ఆగితే చాలు తండోప..తండోలుగా జనం ఎక్కుతారు

బస్సు ఆగగానే చాలా మంది ప్రయాణికులు ఎక్కేరు.అందులో 9 నెలల గర్బిణీ కూడా ఉంది.

ఎవరి బాధలో వాళ్ళున్నారు,ఎవరూ ఆమెను పట్టించుకోలేదు..ఆమె అప్పటికే ఆయాస పడుతూ,ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.

వెంటనే ప్రసాదు లేచి,తనని పట్టుకుని రా అక్క జాగ్రత్తగా ఇక్కడ కూర్చోండి అంటూ తన సీటు నిస్తూ..లేదంటే లోపల మేనల్లుడు కేక పెడతాడు..అనగానే ఆమె ఒక్కసారిగా నవ్వింది..ఆమె ఆయిసమంతా ప్రసాదు మాటలకి పటాపంచలైపోయింది.

వెంటనే ప్రసాదు లేచి,తనని పట్టుకుని రా అక్క జాగ్రత్తగా ఇక్కడ కూర్చోండి అంటూ తన సీటు నిస్తూ..లేదంటే లోపల మేనల్లుడు కేక పెడతాడు..అనగానే ఆమె ఒక్కసారిగా నవ్వింది..ఆమె ఆయిసమంతా తన మాటలతో పటాపంచలు చేసాడు.

కాని కూర్చున్న ఆమె ప్రసాదుని చూసి,అదేంటి తమ్ముడు నీకు కాలు పోలియా ,,నువ్వు నిలబడలేవు ఎక్కువ సేపు,నేను ఎలాగో నిలబడుతాను, ఫర్వాలేదు నువ్వు కూర్చో తమ్ముడు అని ఆమె సీటు లో నుంచి నిలబడిబోతే,లేదక్కా

నువ్వు కూర్చో ..నా శరీరానికే వైకల్యం గాని మనసుకు కాదు..నేను నా మనోధైర్యంతో నేను ఎంత సేపైన నిలబడగలనంటూ,అల్లుడు జాగ్రత్తా అక్కోయ్ అంటూ నవ్విస్తూ కూర్చోబెట్టేడు.

ఇదంతా చూస్తున్నా పదేళ్ళ అమ్మాయి చప్పట్లు కొట్టడం మొదలు పెట్టింది.బస్సు మొత్తం ఒకేసారి ఆక్సిజన్ పీల్చినట్టు చప్పట్లు కొట్టడం మొదలు పెట్టేరు.అక్కడ ఉన్న

పెద్దాయన వచ్చి నువ్వు ఎలాగైన హీరో వయ్యా..నా ఆయుష్షు పోసుకుని నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించవయ్యా అంటూ దీవించాడు,

బస్సులో గంభీరంగా కూర్చున్న రాజకీయ నాయకుడు లేచి నిలబడగానే,బస్సు ఆపేరు.అందరూ నన్ను పెద్ద మనసుతో మన్నించండి.

నా కోసమని ఆ వృధ్ధుడిని,అతని మనవరాళ్ళని నా మనుషులు బలవంతంగా,మానవత్వం లేకుండ వాళ్ళని సీటులోనుండి లేపేసారు.

ప్రజలు సంక్షేమం చూసే నాయుకుడి స్థానములో ఉండి మూర్ఖంగా ..చూసి కూడా ఊరుకున్నాను అహంతో..

అసలైన నాయకుడంటే ఎదుటి వారి సంతోషములో తన సంతోషము వెతుక్కునే వాడు..ప్రసాదు లాగ..

వెంటనే ప్రసాదు నేనేమి చేసాను సార్ .మొన్న సరిహద్దులో పరాయి దేశస్థులు రక్కమోడినట్టు కొట్టిన..తొణకని నిండు కుండలా ఉంటూ దేశాన్ని రక్షించాడే అభినందన అతను సార్ అసలైన హీరో..

తనకి కుటుంబం,అమ్మ,నాన్న, భార్య, పిల్లలు అందరూ ఉంటారు కదా సార్ .వాళ్ళ ప్రేమను త్యాగం చేసి ,మన కోసం తన ప్రాణాలని,తన కుటుంబ సంతోషాలను ఫణంగా పెట్టి

శత్రువులతో వీరోచితంగా పోరాడి,మొక్కవోని ధైర్యంతో నిలబడే అతని దగ్గర మనమెంత సార్ ..అయిన

నేను మీకు చెప్పేటంత వాడని కాను సార్ ..వయసులోని,అనుభవములోని మీరు పెద్దవారు..అయిన ఒకటి సార్ ,.మనము ఏదో చేయనక్కర్లేదు అవసరానికి చేయూత నిస్తే చాలు సార్ ..దేవుడెక్కడా ఉండడు మనలోనే ఉంటాడు. అనగానే

నిజమే ప్రసాదు చిన్నవాడివైన నీ మాటలు,ప్రవర్తనతో నా కళ్ళు తెరిపించావు.

సమాజ సేవ చేయాలంటే రాజకీయనాయుకుడై అవక్కర్లేదు.పలువురి సాయం చేసే మనసుండి..నీలాగ సంపూర్ణ మూర్తిమత్వం గల మనిషైతే చాలు అంటూ..

తను MLAగా పోటీకి వేసే నామానేషన్ ను ఉపసంహరించుకుని,ప్రజల మనిషిగా,ఓ పెద్ద మనిషిగా ఉంటూ,ఊరి పెద్ద దిక్కుగా సమస్యలు పరిష్కరిస్తూ,ఉన్నదానిలోనే ఆదుకుంటూ మంచి మనిషై పోయాడు.తరువాత ఎలక్షన్ లలో ప్రతి పక్షం అన్న మాట లేకుండా ఆ నియోజకవర్గం MLAగా అతను ఎన్నుకోబడ్డాడు. ప్రసాదు బాగా చదువుని సివిల్స్ లో మంచి ర్యాంకు సంపాదించి ,కలక్టర్ అయ్యి..తన సేవలు ప్రజలకు అందించేడు.


Rate this content
Log in

Similar telugu story from Inspirational