sridevi kusumanchi

Children Stories

5.0  

sridevi kusumanchi

Children Stories

విర్రవీగుతనం

విర్రవీగుతనం

1 min
492


ఆ రోజు ఎప్పుడూలాగే సూర్యోదయంతో ఓ సరస్సు ఒడ్డున కుందేళ్ళు,లేళ్ళు గడ్డిని తింటూ సందడి చేస్తున్నాయి...

ఒక్కసారిగా వింత అరుపులతో  ఓ ఎలుగుబంటి వచ్చి గందర గోళం చేసి ,అడవినంతా చిందరవందర చేసి...మిమ్మల్నందరిని నేను తినేస్తా..అంటూ విరుచుకు పడి..నాతో మీరెవరూ పోరాడు లేరు..నేను చాలా బలవంతుడిని..నాకు నేనే సాటి అంటూ ...ప్రగల్భాలు పలకడం మొదలు పెట్టింది..అక్కడ ఉన్న లేళ్ళు,కుందేలు ఎలుగుబంటి మాటలకు బయపడి గజగజ వణికి పోతున్నాయి..అలా వణికిపోతుండటం ఆ గుంపులో కుందేలు చూసి!ఇది మన ప్రాంతము,ఎక్కడి నుండో వచ్చే ఎలుగుబంటికి మనం బయపడితే ఇది రోజుకొకల్ని నంచుకుని తినేస్తాది...దీనికి భయమంటే ఏమిటో చూపించాలి..మళ్ళి మన ఊసు ఎత్తకుండా చేయాలి..మన ప్రాంతానికి రావాలంటే భయపడాలి అయితే ఏమి చేయాలి..అని ఆలోచిస్తూ ..ఎలుగుబంటి వద్దకు ధైర్యంగా వెళ్ళింది..మిగతా జంతువులన్నీ భయపడుతున్నాయి..ఇదేంటి ఇంత ధైర్యంగా ఎలుగుబంటి వద్దకు వెళుతుంది అని..ఎలుగుబంటి ఏంటి నువ్వు నా దగ్గరకు వస్తున్నావు ..నిన్ను నేను తినేస్తాను..కుందేలు నువ్వు నన్ను తిన వచ్చు గాని..నువ్వు మా కన్నా..తెలివైనదానివి,బలమైన దానివి అన్నావు కదా..నేను చెప్పే ఒక్క పని నువ్వు చెయ్యు..చూద్దాము..నువ్వు చేయగల్గితే...మేము రోజుకి ఒకరము నీకు ఆహారంగా మారుతాము అన్న కుందేలు మాటలకి..అహం నషాళానికి ఉన్న ఎలుగుబంటి ఇది మన ప్రాంతము కాదు..కొత్త ప్రాంతమన్నా ఆలోచన లేకుండా సరే అని ఒప్పుకుని ఏమి చేయాలని అడిగింది..నువ్వు ఈ చెట్టు కొమ్మకి ఉన్న ఊడలు పట్టుకుని అలా ఊగాలి అంతే.. ఓసోస్ అంతేగా..క్షణములో ఊగుతా అంటూ ..ఆ కొమ్మకి ఉన్న ఊడలు పట్టుకుని ఊగింది...ఎలుగుబంటికి బాగా నచ్చింది ఊడలు పట్టుకుని ఊగడం ...అరుస్తూ ఇంకొంచం గట్టిగా ఊగింది..అప్పటికే బలహీనంగా ఉన్న కొమ్మ భళ్ళున విరిగింది..అప్పటికే దాని క్రింద వేటగాడు పెద్ద జంతువుల కోసం తీసిన పెద్ద గొయ్యిలో దబ్బున పడి కాళు విరిగి..అయ్యో..కిర్రో..మోర్రో అంటూ ఏడవటం మొదలుపెట్టి,.అనువుగాని చోట ఎంత బలవంతులమైన విర్రవీగి అధికులమనరాదంటూ బాధపడింది ఎలుగుబంటి.....కుందేలు ముందు రోజే వేటగాళ్ళు ఆ గొయ్యి త్రవ్వటం చూసి,ఈ విధంగా చేయించి ,తన వాళ్ళని రక్షించుకుంది.


Rate this content
Log in