అడవిలో ఎన్నికలు
అడవిలో ఎన్నికలు


అడవికి రాజైన సింహం..మిగతా సింహాలన్నింటిని పిలిపించి
నాకు వయసు అయిపోతుంది..మీలో ఒకరు నా స్థానముని స్వీకరించి..అడవినంతా చక్కగా పరిపాలించవల్సి ఉంది.అయితే మీలో ఎవరు సింహాసనముని అధిస్ఠిస్తారో తెలియజేస్తే ..మంచి మహుర్తాన పట్టాభిషేకము చేసి మృగరాజు హోదాని ఇద్దాము అని వృధ్ధ సింహం తెలిపింది
వృధ్ధ సింహం నోటి నుండి ఆ మాట రాగానే
కాబోయే రాజుని నేనంటే నేను వయోబేధం లేకుండ పోట్లాడుకోవడం మొదలు పెట్టేయి..
ఇదంతా చూసిన వృధ్ధ సింహం పోట్లాడుకోకండి.మీలో ఎవరు రాజుగా అయితే బాగుంటుందో అడవిలో అన్ని జంతువుల అభిప్రాయాన్ని ఎన్నికలు అనే ప్రక్రియ ద్వారా తీసుకుని ఎక్కువ జంతువులు ఎవరిని కోరుకుంటే ఈ అడవికి వాళ్ళని రాజు గా ప్రకటిద్దాం అని తెలిపింది.ఈ మాటకి బరిలో వున్న సింహాలన్ని సమ్మతించాయి..
అయితే నా మాట ఒక్కసారి వినండి.ఎంత మంది సింహాలు పోటీలో నిలబడితే అన్ని గోతులు త్రవ్విస్తాను.వచ్చే జంతువులు ఏ సింహాన్ని గెలిపించాలంటే ఆ గోతులో పువ్వు వేస్తాయి.ఎక్కువ పువ్వులు ఎవరికీ వస్తాయో .వాళ్ళే రాజు.మీరు వెనుతిరిగి ఉంటారు.మీ ముందు అద్దాలు పెడతాను.అద్దములో మొహం చూసి వాళ్ళ నాయుకునికి గోతులో పువ్వు వేస్తారు.వచ్చే ఒక్కక్కరికి ఏనుగులు పువ్వులు అందిస్తాయి.
బరిలో దిగవల్సిన మీ అందరికి వారం రోజులు సమయం ఇస్తాను.ఎవరి మ్యానిఫెస్టో వాళ్ళు తయారు చేసుకుని , అడవిలో జంతువుల వద్దకు పోయి ప్రచారం చేసుకోండి.ఎనిమిదవ రోజు పోటి పెడతాను అని వృధ్ధ సింహం తెలిపింది.
: నోటిలో మాట జారిందో లేదో ..పరుగు పందెములా పరుగులు తీసి...ఉడత నుండి జిరాఫీ వరకూ ,పుట్టలో పాము నుండి కోతి తలలో పేను వరకూ ఎవరినీ వదలకుండా వాళ్ళు సంపాదించిన ఆస్తులన్నీ పంచి పెట్టి నేను వస్తే ఇది చేస్తాను,అది చేస్తానంటూ ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలులోను వాళ్ళని ఆకర్షించుకుని..నా గోతులో పువ్వు వేసి నన్ను గెలిపించండి నా గోతులో పువ్వు వేసి నన్ను గెలిపించండి అంటూ..ఎండ,వాన ని కూడ లెక్క చేయకుండ వారం రోజులు ఒకటే నినాదాలతో
మత్తు పానీయాలు,తిను బండారాలు..హామిల ప్రవాహాలతో ఒకరుకొకరు గట్టి పోటినిచ
్చుకున్నారు.
: ఇంకా రానే వచ్చింది ఎనిమిదవ రోజు...రాజని నిర్ణయించే రోజు..
తీసుకున్న తాయిలాలు అరగక కొంత మంది జంతులు,
నడవలేని ,అర్థం కాని వృధ్ధ జంతువులు,
మత్తులో తేలియాడి నింగి ,నేల తెలియని స్థాయిలో కొన్ని జంతువులు..మొత్తానికి ఓటింగ్ లో పాల్గోవడానికి అడవిలో జంతువులన్ని వచ్చాయి..
వరుసలలో నిలబడిన వాటికి ఏనుగులు తొండముతో పువ్వులు ఇస్తున్నాయి.
వరుసగా పోటిచేస్తున్న సింహాల వెనుక వైపు గోతులు త్రవ్వి ...ఏ సింహాన్ని గెలుపిద్దామనుకుంటే ఆ సింహం వెనుకున్న గోతులో పువ్వు వేయండి అని వచ్చిన జంతువులందరికి ఏనుగు చెపుతూ పువ్వు అందిస్తుంది.
అయితే పువ్వు తీసుకుని గొయ్యిల వద్దకు వచ్చిన జంతువులకి వెనుక వైపు నుండి అన్ని సింహాలు ఒకలాగే కనబడుతున్నాయి.ముందన్న అద్దం చూసి..తన నాయకుడు ఎవరో తెలుసుకుని గోతిలో వెయ్యడం
తెలియక..అవగాహన లేక..అర్థం కాక..
వృధ్ధులు..మత్తులో తేలాయాడిన వాళ్ళు ఏ గోతులో అయితే ఆ గోతులో పువ్వులు వేసి వెళ్ళి పోయారు.
మొహం చూసి వెనుక గోతిలో వేయడం తెల్సిన కొంత మంది వాళ్ళు అనుకున్న వాళ్ళకి వేసారు.
అయితే ప్రక్క నుండి ఇదంతా చూసిన వృధ్ధ సింహం..ఓటింగ్ అంతా అయిపోయాక అందరిని పిలిపించి...మీరందరూ నా గోతులో పువ్వు వేసి నన్ను గెలిపించండి. నా గోతులు పువ్వు వేసి నన్ను గెలిపించండి. అని చెప్పి మీ ఆస్థులు కరిగించుకుని వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళని ఆకర్షించారు గాని,మమ్మల్ని పోల్చుకుని ఎలా ఓటెయ్యాలో ఒక్కరికి చెప్పలేదు.నేను మీకు మొదట అంతా చెప్పేను.మీరు అసలు విషయం వదిలి ...
మిగతా విషయాలు,మీ కోసం ప్రచారం కోసం సమయమంతా వెచ్చించేరు.అందులో కొంత సమయమైన మీ గోతులో పువ్వు ఎలా వేయాలి అన్న అవగాహన వాళ్ళకి కలిగించి ఉంటే..బాగున్ను..ఇప్పుడు గెలుపు,ఓటములు దైవాదినం...
ఎవరు గెలుస్తారన్నది...ఆ గోతులులో అవగాహనా రాహిత్యంగా పడే పువ్వులే నిర్ణయించాలి.....🙏