STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Drama Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Drama Inspirational Others

నువ్వు లేక నేను లేను

నువ్వు లేక నేను లేను

4 mins
364

రేపు ఉదయం తొందరగా బయలుదేరాలి అమ్మా! తెల్లవారుఝాము నాలుగు,నాలుగున్నరకి లేపుతావా? మన ఊరి మొదటి బస్ కి బయలుదేరాలి...మీతో ఇంకా చాలా చెప్పాలి నాన్నా!కానీ నిద్ర వస్తుంది..ఏమనుకోవద్దు అని,గెడ్డం పట్టుకు బ్రతిమలాడి,నాన్న ఏమంటున్నారోకూడా వినకుండా బెడ్రూంకి వచ్చి ముసుగుదన్నేడు వినయ్..

పిచ్చి వెధవ! తొందరగా ఉద్యోగం లో జాయిన్ అయ్యాక, మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేయ్యాలి బడుద్దాయికి ,కళ్ళజోడు తీసి,తుడిచి మళ్ళిపెట్టుకుంటూ అన్నారు భార్యతో...

ఆ!నాచేత గయ్యాళి అవతారం ఎత్తించాలని,అయ్యగారికి ఎంత బులుపో??అంది నవ్వుతూ

ముసుగులోంచి నవ్వు తాలూకు అలకి,దుప్పటి సన్నగా కదిలింది..

మన మాటలు విని మురుసుకుంటున్నాడు వెధవాయ్!పొద్దున్న కొంచెం ముందు లేచి ,ఎవరైనా ఉన్నరేమో కనుక్కో?అయితే అదే చేసేయొచ్చు...మనమీద భారం వేస్తే ,ఆ ధనపతి కూతుర్ని కట్టబెట్టేయొచ్చు అన్నారు మళ్ళీ...

సాయిని అడుగుదామా?ఆత్రుత గా అడిగింది దేవకి

తల్లీ!మహాకాళి! మొదలుపెట్టేవా? సాయిజపం...నాకు పని ఉంది పొద్దున్నే లేవాలి...వాడితోపాటే నన్నూ లేపు..ఒకసారి ఆవుకి నీళ్ళుపెట్టెనో లేదో చూసి,దొడ్డి తలుపు వేసిరా! అంటూ నిద్రలోకి జారుకున్నారు రామయ్య...

కష్టపడితే సుఖం దక్కుతుంది అనడానికి నిలువెత్తు ఉదాహరణలు దేవకి,రామయ్యలు...దేవకి బాల్యం ఒక్కపూట తిండి,మూడంటే మూడు జతల బట్టలతో గడిచింది...అమ్మ కూడా పనికి వెళ్ళేది....ఊర్లో రెండు పెద్దిళ్ళల్లో పనికి కుదిరింది..పొద్దున్న సాయంత్రం వెళ్ళాలి..ఒక్కోసారి కుదరకపోతే అమ్మ బదులు దేవకి వెళ్లాల్సి వచ్చేది...

పనికి వెళ్లాలంటే మొదట్లో ఇష్టం ఉండేది కాదు తనకి...ఒక పొద్దునరోజు పనికి వెళ్ళిన, దేవకి కి ఒక వింత కనిపించింది... ఆమ్మగారు ఒక చిన్న కంచం లో ఉదయం వండిన టిఫిన్,చట్నీ,బుల్లి గ్లాసు తీసి....పెరటి వెనక చెట్టుకింద పెట్టి... రా సాయి! తొందరగా తిను అని పిలుస్తోంది....

ఎవరిని పిలుస్తున్నారు ?..అని అర్థం కాక ఇంట్లో ఉన్న అందరికీ చెప్పింది దేవకి ,మిమ్మల్ని పిలుస్తున్నారు అమ్మగారు అని...

దేవకికి ఈ సంగతి తెలీదా!? నవ్వుకున్నారు అంతా మళ్లీ అంతలోనే తేరుకొని మా అమ్మ రోజు అలానే ప్రసాదం వండి ,దేవుడికి పెడుతుంది ...రాకపోతే దేవుడు పని అయిపోతుంది.. ఇంకా ఇదేo ఉంది మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవుడికి నైవేద్యం పెడుతూనే ఉంటుంది...

పెట్టినప్పుడల్లా పిలుస్తూనే ఉంటుంది.. ఎవరు వస్తారు?? ఎప్పుడు తింటారో? మేము కూడా చూడలేదు... కానీ కంచం మాత్రం ఖాళీ అయిపోతుంది... ఇది చాలా సీక్రెట్ ఎవరికీ చెప్పకు అని మళ్లీ నవ్వుకున్నారు అంతా ....

దేవకికి అంతా అయోమయంగా అనిపించింది.... ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో విషయం చెప్పింది... ప్రసాదం పెడుతున్నారు... ప్రసాదం పెట్టినప్పుడల్లా, రా సాయి!? తినేసి పో తొందరగా..అంటున్నారు... ఎవరు వచ్చే తినట్లేదు కానీ ప్రసాదం మాత్రం మాయమైపోతుందటమ్మా!! అని చెప్పింది

పోవే!! అన్నం సరిగ్గా తినక, నీకు అలా అనిపిస్తుంది ...పెట్టిన ప్రసాదం ఎలా మాయమైపోతుంది ?? ఇలాంటివి చూడొద్దు,నమ్మొద్దు....మనకే పూట గడవదు..ఇలాంటివి చూసి నేర్చుకుంటే,కుండల్లో నీళ్లు పట్టుకుంటే సరిపోతాయి...బువ్వ ఉండదు ఇంక అంది చిరాకుపడుతూ..

రాత్రి దాని గురించే, ఆలోచిస్తూ పడుకుంది... నిజంగానే దేవుడు కనిపిస్తాడా? అనుకుంది ...

రేపు పొద్దున్నే లేచి అమ్మ గారి ఇంటికి పనికి నేనే వెళ్తాను .. అక్కడ బామ్మగారు ఉంటుంది కదా! ఆవిడని అడుగుతాను..

మర్నాడు అమ్మ చెప్పకుండానే పొద్దున్నే లేచి తయారయ్యి పనిలో కి వెళ్ళిపోయింది.. ఎప్పటిలాగానే ఉదయం చిన్న ప్లేట్లోఇడ్లీ పెట్టి పంచదార వేసి , చెట్టు కింద పెట్టి ..సాయి వచ్చి తినేసి పో! అన్నారు

తొందరగా ముగించుకున్న దేవకి, బామ్మ గారి దగ్గరికి వెళ్లి మీరు ఎప్పుడైనా సాయిని చూశారా అని అడిగింది... రామాయణభారతాలని అమాంతం మింగేసేను...ఎం అడిగినా ధర్మ సూక్ష్మం చెప్పగలను... అలాంటి దానికి, నాకే దేవుడు కనిపించలేదు మీ అమ్మగారికి దేవుడు ఎట్టా కనిపిస్తాడు నేను తప్ప ఈ దరిదాపుల్లో పుణ్యవంతులు ఎవరూ లేనే లేరని తెగేసి చెప్పింది....

ఇదే విషయాన్ని అమ్మగారిని కూడా అడిగింది... వస్తాడో ?రాడో? మనం తినే ముందు దేవుడికి ముద్ద తీసి పెట్టాలి** అని చెప్పింది...

ఏ కుక్కో,కాకో తింటుంది... ఏవైనా దేవుడి ప్రతిరూపాలే గా... మన పెద్ద వాళ్ళు ఇలాగే చేసే వాళ్ళు ...నాకు నచ్చింది చేస్తున్నాను దేవకీ !!అంది అమ్మగారు

మనం కూడా చేద్దాం.. పోయేదేముంది? పుణ్యం వస్తుంది.... ఈరోజు నుంచి, కొంచెం అన్నం తీసి పక్కన పెడతాను అనుకుంది...

సాయి అని పిలిచి పెట్టేది అప్పటినుండి రోజూ.. మొదట్లో కాకులు పిచ్చుకలు తినే అన్నాన్ని ,ఒక రోజు ఒక ముసలాయన వచ్చి తిన్నాడు...

ఆకలిగా ఉందా ఇంకా?? అడిగింది దేవకి

అవును తల్లి! అన్నాడు అతను

కానీ మా ఇంట్లో ఏమీ లేదు కదా!ఇదైనా మా అమ్మగారు నాకు తినమని ఇస్తే, నేను నీకు పెట్టేశాను అంది మళ్ళీ..

అవునా తల్లి! చాలా సంతోషం !!ఇలాగే అందరికీ పెట్టడం నేర్చుకో ...మళ్ళీ నీకు అంతకు అంత తిరిగి వస్తుంది.. మర్చిపోవద్దు అన్నాడు

ఆ నవ్వులో ఏదో మహత్యం కనిపించింది.. దేవకి పెరిగేకొద్దీ అన్నం తీసి పక్కన పెట్టి ఆచారాన్ని వదిలిపెట్టలేదు...

ఆ కొంచెం కూడా ఇచ్చేస్తే,మీ నాన్న ఆకలి తీరుతుంది అని ఎన్నోసార్లు తిట్టేది అమ్మ..

ఈ అన్నం తింటే మన ఒక్క కడుపు నిండుతుంది... ఈ కొంచెం అన్నానికి బోలెడన్ని పిట్టల కడుపులు నిండుతాయి కదమ్మా!అనేది దేవకి

తరువాత రోజు ,పనికి వెళ్లిన దేవకి,చెట్టుకింద కాకితోపాటూ,ఒక ముసలాయన కూర్చుని ఇడ్లీ తినడం గమనించింది...ఇంట్లో అందర్నీ పిలిచింది...వాళ్ళకి అక్కడ కాకి తప్పించి ఎం కనపడలేదు...

పిచ్చిపిల్ల...అమ్మ ని చూసి చూసి పాడయిపోయింది పాపం అన్నారు అంతా!

బామ్మగారు,నిజమంటే నీకు ఎవరైనా కనిపించేరా? అని అడిగింది కళ్ళు ఇంత చేసుకుని..

నువ్వు అదృష్టవంతురాలివే? దేవకి...దణ్ణం పెట్టినంత పని చేసింది..ఆ రోజు అమ్మగారు అలా పొగుడుతుంటే ,కళ్లనీళ్లు తిరిగినియ్యి..కానీ విచిత్రమైన అనుభూతి...

ఆనక ఇంటికి వెళ్ళేక నిన్ను పట్నంలో పనికి కుదిర్చేం...నెలకి పదివేలు అంటజీతం...నీకు అక్కడ గది ఇస్తారు...వాళ్ళింటనే పనికి వెళ్ళాలి నువు అంది...ఈడొచ్చిన అమ్మాయి అని,నాన్న అంటున్న,వినిపించుకోలేదు అమ్మ...

ఎక్కిన బస్ ని అడవిలాంటి దారిలో ఆపించి,దింపేసేడు మధ్యవర్తి...దేవకీకి భయం మొదలైంది..ఇంతలో కూలికి పోతున్న ఇద్దరు అబ్బాయిలు సైకిల్ మీద వెళ్తూ కనిపించేసరికి,ధైర్యం చేసి అరిచింది..వాళ్ళు ఆగి,గట్టిగా గదమాయించేసరికి .దేవకిని అక్కడే వదిలేసి పోయారు...

ఊరు పెరు చెబితే,దిగబెట్టడానికి వచ్చేరు...అందులో ఒకరిని చూపించి,వీడితో వెళ్లిపోయావు కదే!ఎందుకు తిరిగొచ్చావ్?..జరిగినదానికి సగం చచ్చినట్టున్నదేవకి,అమ్మ మాటలకి ఇంకా ఎందుకు?బ్రతికి ఉండడం అనిపించింది...

కానీ,ఎవరితో అని అమ్మ అందో,ఆచెయ్యి ఆపింది...మళ్ళీ ఇప్పటి వరకూ వదలలేదు...కూడా ఉన్న ధనపతి,అన్నయ్య గా మారి,పెళ్లి పనులన్నీ చూసుకున్నాడు...అమ్మ ఎందుకు అలా అంది?అంటే,ఇప్పటికీ నవ్వుతాడు... ఈయన! అనుకుంటూ ,అమ్మానాన్న గుర్తొచ్చి కళ్లనీళ్లు తుడుచుకుంటుంది..

రామయ్య కూలి పనికి పోయేవాడు పెళ్ళైన కొత్తలో...కౌలుకు తీసుకుందాం అంది..పొలం చుట్టూ కూరగాయలూ,ఆకుకూరలు,కొన్ని పండ్లు చెట్లు పెంచింది..సగం ఊరిలో పిల్లలకి,సగం పట్నంలో అమ్మేది...దేవకి అదృష్టం,ప్రతియేటా దిగుబడి పెరిగిందేతప్ప,ఇంకో మాటలేదు....

పెళ్లి తరువాత అమ్మని గుర్తుకు రానివ్వలేదు రామయ్య...కానీ అమ్మ ఎలా ఉండాలోతెలుసుకో అంటూ,ఒక కొడుకుని ఇచ్చేడు...దేవకి రామయ్యల ఐశ్వర్యంతో పాటూ,కొడుకు సక్రమంగా ఎదిగేడు...ఇపుడు సిటీ లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు....

సాయి,ఈ రోజు తొందరగా రా!కొడుకు పట్నం వెళ్తున్నాడు....నువ్వు తింటే,వాడికి పెట్టేస్తాను...అంటూ పిలిచింది కంచంలో ఇడ్లీ,చట్నీ పెట్టి..

తెల్లవారు ఝాము తినవు అవి...నీకోసం దేవుడే వస్తాడులే!మొహం కడుక్కోవడానికి బయటకు వచ్చిన రామయ్య నవ్వేడు..

లే నాన్నా! అయిదు అవుతుంది..అంటూ కొడుకుని నిద్ర లేపడానికి వచ్చింది దేవకి

అప్పటికే తయారయి కూర్చున్నాడు...తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి,ధనపతి మావయ్య,కూతురు పెళ్లికి ఒప్పుకుంటే రేపే పెళ్లి పెట్టెయ్యి అమ్మా!నాకేమి అభ్యంతరం లేదు..

రేపా!ఈ రోజుకు తమరు సిటీ లోకి వెళ్లడమే కుదరదు...అంత ప్రయాణం ఉంటుంది....రేపే వచ్చేసి పెళ్లి చేసుకుంటావ్)???ఎగతాళిగా ఉందా అమ్మంటే,ఎవరూ లేరనుకుంటున్నావ్ కదూ!

అయ్యో !అమ్మా!నీకు వెనకాల ఇదిగో!ఈ రామయ్య,వెనక అదిగో చూడు!నీ ఇడ్లీ తిని పారిపోతున్నాడే ఆ కిట్టయ్య(అంటే వెన్న దొంగలాగా,ఇడ్లి దొంగన్నమాట)ఉన్నారు...నేనేగా ఒంటరి వాడిని...అన్నాడు మూతి ముడుస్తూ

ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా,ఎం అర్థం కానట్టు ....

నేను నాన్నతోపాటే,పొలం పనులు చూసుకుంటాను...సిటీ కి వెళ్ళను నాన్నా!మీరు ఒప్పుకోవాలి అన్నాడు...

రామయ్య ఆనందానికి హద్దే లేదు...నిజంగానే ఉంటావా మాతో?? ఈ ముసలి గుండెకు ఆశ పెట్టొద్దురా! భయంగా అడిగేడు...

ఎం భయం వద్దు నాన్నా(నాన్న చేతిని,చేతుల్లోకి తీసుకు ) బలంగా చెప్పేడు వినయ్(నువ్ లేకపోతే నేను లేను నాన్నా ఈ రోజు..మనసులో అనుకున్నాడు)

సాయి నువ్ నాతో ఉండి ఉండకపోతే నా జీవితంలో ఇంతటి అద్భుతం జరిగేది కాదు ...మనసులో నే కృతజ్ఞతలు చెప్పుకుంది దేవిక..

అమ్మానాన్న తెలీకుండా గాలికి పెరిగేను...మీ అమ్మ రాకతో నా అదృష్టం ఏరులై పొంగింది..ఇక ఈ వయసులో నీతో ,కోడలు పిల్లలితో సరదాగా గడిపే అదృష్టం ,నువ్ లే(రా)కపోతే నాకు కలిగేది కాదు అంటూ భార్య చూస్తూ ఉన్నాడు రామయ్య...

మీ సంగతి ఎలా ఉన్నా,నువ్ లేకపోతే నేను దిబ్బ అయిపోతాను బావా!నా కూతురుతో ఇంక నా వల్లకాదు అన్నాడు చేతులెత్తేస్తూ ధనపతి....శుభమ్



Rate this content
Log in

Similar telugu story from Drama