STORYMIRROR

Paul Gubbala

Drama Tragedy Others

3  

Paul Gubbala

Drama Tragedy Others

నాన్న ప్రశ్నలు ???

నాన్న ప్రశ్నలు ???

1 min
168

ఎప్పుడూ కోపం చాటున ప్రేమ చూపించే ఆయన కళ్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది , ఇంటి భాద్యత చూడడానికి వయసు అయిపోయింది రా , నువ్వైనా చూడచు గా ? అనీ..


 ఎన్నో భాద్యతలు మోసిన నాన్న బుజాలు గట్టిగ ప్రశ్న వేస్తునట్టు వుంది , నా బరువు ఎవరైన మోస్తారా ? అన్నటు ...


 చక చక పనులు చేసే ఆయన చేతులు కైదండం పెడుతూ విలపిస్తునట్లు వుంది , నాకు శక్తి లేదు రా ? అని...


 ఎప్పుడూ హడావిడి గా తిరిగే ఆయన కాళ్ళు కూడా అడుగుతూనట్టు వుంది ఇంకెంత కాలం విశ్రాంతి లేకుండా బ్రతుకు బండి తొక్కాలి ? నువ్వైనా నాకు విశ్రాంతి ఇవ్వచ్చు కదరా అని ...


 ఇన్ని ప్రశ్నలు వున్నా సరే పైకి మాత్రం ..

 యేరా , ఉద్యోగం ఏమైనా వచ్చిందా అంటూ , లోపల బాధను , బయటపెట్టకుండా సరేలే ప్రయత్నించండి అంటూ ఆయన వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని ఒక నిరుద్యోగ కొడుకు ...


Rate this content
Log in

Similar telugu story from Drama