" అన్నా "
" అన్నా "
చిన్నప్పటి నుండి చూస్తునా నేను నా అన్నయ లాగా ఎందుకు అవ్వలేకపోయాను అన్న ప్రశ్న ? నన్ను తరుముతుంధీ !
అన్నా అంటే
అమ్మలో సగం నాన్నలో సాగమే కాదు,
ఇంటి భాద్యతలు మోయడంలో సగం , ప్రేమను చూపించడంలో సగం ..
ప్రేమలో సగం అందుకంటె తనకి భార్య వుంది గా ;
పాపం అన్నయ ఎప్పుడు ఆనందాలు చూడలేదు ,
పట్టుమని పది మంది స్నేహితులు ఇనా లేరు ...
వాడికి మేమే స్నేహితులం ...
అన్నయధి చాల చిన్న ప్రపంచం ...
అందులో మేము తప్పా ఎవరు లేరు...
పాపం నా తోడ పుట్టిన వాడు ,
కాదు కాదు
మా తోడు కోసం పుట్టిన వాడు
ఏమి తెలియని అమాయకుడు కాని
అమ్మ ని నాన్న ని ప్రేమించడంలో ముందు ఉంటాడు !
ఎందుకంటె నా కన్నా ముందు పుట్టాడు కదా !
పాపం అన్నయ నేను నవ్వితే వాడు ఆనంద పడే వాడు ...
నాకు కొత్త బట్టలు కొని వాడు సంతోషపడ్డాడు
నాన్నా , అమ్మ వయ్యాసు పెరగడం తో పాటు అన్నయ భాద్యతలు కూడా పెరిగాయేమో ?
భాద్యతలు పెరగడం తాను చిన్న చిన్న ఆనందాలు ధూరం అవ్వడం ఒకేసారి జరుగుతునాయ్ అని గమనించలేని అమాయకుడు ..అన్నయ్య
అప్పులు తీర్చడం కోసం ,
మమ్మల్ని పోశించడం కోసం,
అన్నయ చాలా ఎక్కువ గానే కష్టపడ్డాడు పాపం ,
ముందు పుట్టాడు కదా ముందుగానే కష్టాలు వచ్చాయ్ అన్నయ్యకు
డ్యూటీ కోసం యెప్పుడో ఉదయానే వెళ్ళు అందరు పడుకునాక యెక్కడో బస్సు దిగి నడుచుకుంటూ వచ్చేవాడు
యెందుకంటే మమల్ని జీవితం లో వునతంగా నడిపించాలి అన ఆలోచన , పాపం అన్నయా
పాపం వాడి యవ్వన ఆనందాలు కరిగిపోతునా పట్టించుకోడు ,
తన కోసం కూడా ఆలోచించుకోవటం తెలియని వెర్రోడు పాపం ...
