STORYMIRROR

Sowmya Kankipati

Inspirational Children

4  

Sowmya Kankipati

Inspirational Children

'నా'న్న

'నా'న్న

1 min
396

'నా'న్న..


పేరులోనే ఉంది నా సొంతం అని.. నిజమే నాన్న కొడుకుకి మొదటి సూపర్ హీరో అయితే కూతురికి మొదటి ప్రేమే. కానీ నాకు ప్రేమ మాత్రమే కాదు సూపర్ హీరో కూడా. నాన్నంటే అందరి ఆడపిల్లలు లాగా నాకూ చాలా ఇష్టం. చిన్నప్పటినుండి నన్ను, మా అన్నయ్యలను ఎంతో బాగా పెంచి మమ్మల్ని ఇంత పెద్దవాళ్లను చేశాడు. చిన్నప్పుడు మా జీవితం పెద్ద గొప్పగా ఏమీ ఉండేది కాదు. మేము మధ్య తరగతి వాళ్ళం. అయినా కూడా మాకు కష్టం లేకుండా, రాకుండా మేము కోరుకున్నది ఇస్తూ, బాగా చదివించాడు మా నాన్న.  నా విషయంలో నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఎవరు నన్ను తక్కువగా చూసినా మా నాన్న మాత్రం నన్ను నమ్మి అన్ని కళలలో నేను ముందు ఉండాలని కొరుకునేవాడు. అందుకేనేమో నాకే తెలియని, నాలో దాగున్న కళలలోను రానించాను. ఇప్పటికీ నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. నన్నెవరూ నమ్మినా నమ్మకపోయినా మా నాన్న నన్ను నమ్ముతాడు. తాను రాజు కాకపోయినా నన్ను యువరాణిలా చూసుకుంటాడు. చాలు. నాకు ఇంకా ఏమి కావాలి ఇంతకుమించి. ఎప్పటికైనా మా నాన్న కోరుకున్నట్లు నేను మంచి స్థాయిలో ఉంటాను. ఇది నా ప్రమాణం.   ' నాన్న! నువ్వే నా బలం. నువ్వే నా విశ్వాసం. నువ్వే నా ప్రేమ. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమీ ఇచ్చినా తక్కువే. కానీ, ఒక్క మాట ఎప్పుడూ చెప్పాలని ఉంది. థాంక్యూ వెరీ మచ్ నాన్న'.


Rate this content
Log in

Similar telugu story from Inspirational