వేట గూడెం
వేట గూడెం
ఓపెన్ చేస్తే ఒక అందమైన అడవి ఎత్తైన కొండలతో దట్టమైన పచ్చని చెట్లతో నిండు పొదలతో నిండి వుంది. ఆ కొండల కింద దిగువన ఒక నది ఉంది. ఆ నది నీరు కూడా ఆ అడవి లాగే ఎంతో స్వచ్ఛంగా జీవరాశులకు ఆధారం గాఉంది. ఆ అడవిలో వేట మృగాలు తక్కువగా సంఖ్యలో సాధు జీవులు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. అలాగే ఆ అడవికి తూర్పు వైపున ఒక గూడెం ఆ గూడెంలోని కొంతమంది ప్రజలు నివసిస్తుండేవారు. అలాగే తూర్పు ముఖాన కుడివైపున ఒక జన దారా అనే కొండ పక్కన స్వచ్ఛమైన అడవి మూలికలు ఆకులు ప్రతి వ్యాధి వైద్యానికి సంబంధించిన చెట్లు అక్కడ దొరుకుతాయి. అలాగే మంచి ఉన్నట్టు చెడు కూడా అడవిలో దక్షిణం వైపు గంజాయి మొక్కలు ఇప్ప పూత మత్తు పదార్థాలు విషపు చెట్లు అక్కడ ఉంటాయి. పడమర వైపుకు అడవి దాటితే పల్లెలు అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఊర్లు మొదలవుతాయి! వీటన్నిటికీ సంబంధం లేకుండా తూర్పున గూడెం వాళ్ళు ఏ రోజు ఏ మనిషికి వాళ్ళు కనపడకుండా జీవించే గూడెం ప్రజలు ఆ గూడానికి మందయ్య పేరు గల గూడెం పెద్ద ఉండేవాడు. ఆ గూడెంలో నీ ప్రజలు ఆయన చెప్పిన విధంగా నడుచుకునేవారు. అతను కొన్ని నియమాలు ఆ గూడెం లోని ప్రజలకు పెట్టాడు. తమ పూర్వీకుల కాలం నుంచి కోని పద్ధతులు అవి ఏంటంటే ఏ జీవరాశి వల్ల అయితే అడవికి ఇబ్బంది కలుగుతుందో ఆ జంతువును వేటాడటం ప్రధాన ధర్మంగా ఏ జంతువు ముసలిదై అది జీవించలేని స్థితిలో ఉన్నప్పుడు. దానిని వేటాడడం వాళ్లు ప్రధానంగా జంతువులపై వారుపెట్టుకున్న ఒక నియమం. వేటాడిన రోజు జంతు మాంసంతో కడుపునింపుకుని మిగతా రోజులు అడవిలో దొరికే సహజమైన వనరులను (దుంపలు, పళ్ళు, కూరగాయలు)అనుభవిస్తూ జీవితం గడిపేవారు. వైద్యం కోసం జన ధార అడవిలోని తమ పూర్వీకులు చెప్పిన విధంగా మొక్కలని మూలికలను వైద్యంగా ఉపయోగించుకునేవారు. కానీ కొన్ని వైద్యం మూలికల కోసం కొన్ని సార్లు కొన్ని సాహసాలు చేయవలసి వస్తుండేది. ఎందుకంటే జన దారా ఉన్న ప్రదేశంలో కొన్ని మొక్కలు మనిషి వెళ్లలేని చోటుకు పెరగడం మనిషి చేతికందని ప్రదేశంలో మొలకెత్తడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికోసం వెళ్ళినప్పుడు కొన్ని సాహసాలు తప్పనిసరిగా చేయవలసి వస్తుండేది. ఆ గూడెం మందయ్య అడవిని ఎప్పుడు కాపాడుతూ సంరక్షిస్తూ ఉండేవాడు.(మందయ్యకు నీతి నియమాలు చాలా ముఖ్యం!అన్నిటికంటే తమ గూడెం ప్రజలు తప్పుడు పనులు చేయకుండా వారిని ఎప్పుడు చూసుకుంటూ ఉండే వాడు. తమ పూర్వీకులు చెప్పిన విధంగా తన గూడెం ప్రజలను అదే బాటలో నడిపేవాడు.) పడమర వైపుకు అడవికి అనుకొని కొద్ది దూరంలో ఒక ఊరు ఉంటుంది. అ ఊరికి దూరంగా ఒక పెద్ద నగరం ఉండేది ఆ నగరానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి మన రాజ్యంలోని ప్రజలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు వారిని కాపాడుతూ రాజ్యంలోని ఏ అన్యాయాలు జరగకుండా రాజ్య ప్రజలను కాపాడుతూ గొప్ప రాజుగా పేర్కొన్నారు అలాంటి! ఆ రాజుకి ఒకరోజు నిద్రలో పాలెం అనే గ్రామం పక్కన ఒక దేవత ఉన్నట్టు దేవతకు ప్రాణప్రతిష్ట చేయమని తనకు నిద్రలో ఎవరో చెప్పినట్లు అనిపించింది. అలాగే తనను అడవిలోనికి వేటకు వెళ్ళమని తనకు ఎవరో కలలో చెప్పారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి వేటకు వెళ్లాలని తన సైన్యం లోని కొంతమందిని పిలిచి తను పాలెం అనే గ్రామం పక్కన ఉన్న అడవికి వేటకు వెళ్లాలని తన ఆజ్ఞాపించా డు. వెంటనే ఆ రాజా సైనికులు వేటకు సిద్ధం చేసి ప్రయాణించారు. అడవి దగ్గరకు వచ్చేసరికి పడమర వైపు ఉన్న పాలెం ఊరు పొలిమేర లో ఆగాడు. పక్కకు తిరిగి చూడగా అ గ్రామ దేవత గుడి ఉంది. తనకి కలలో వచ్చిన గుడి అదేనని గ్రహించి ఆ గుడి దగ్గరకు వెళ్ళాడు. గుడిలో ఉన్న దేవతను చూసి ఎప్పుడు లేని సంతోషం తనలో చిగురించింది. కలలోని దైవం చెప్పినట్టు గా ఆ దేవతకి ప్రాణప్రతిష్ట చేయడానికి నిర్ణయించుకున్నాడు. కొంతమందిని రుషి లను పిలిచి ఆ దేవతకి ప్రాణప్రతిష్ట చేయించి ఒక నాణేలతో కూడిన బంగారు హారాన్ని ఆ దేవతకు సమర్పించాడు. అలాగే ఆ ఋషి లతో ఆ ఊరి బాగోగుల గురించి అడిగాడు. ఆఋషి లు చాలాసేపు ఆలోచించి రాజు గారికి ఇలా చెప్పారు. ఏది ఏమైనా ఈ గుడిలోని అమ్మవారి హారం ఉన్నంతవరకే ఈ ఊరి బతుకు తెరువు లేదంటే మీ ఊరికి మంచిది కాదని చెప్తారు. అది విన్నా రాజు ఆ ఊరిలోని ఒక గ్రామ పెద్దలు పిలిచి గుడి బాగోగులు ఎల్లప్పుడూ తన దగ్గరుండి చూసుకోవాలని తనకి ఆజ్ఞాపించాడు. ఆ మాటలకు ఆ గ్రామ పెద్ద కూడా సరేనని బదులిచ్చాడు. ఇదంతా జరిగిన తర్వాత ఒక సందేహం కలిగింది అది ఏంటంటే తనను గుడికి రమ్మని ప్రాణ ప్రతిష్ట చేయమని ఎవరో కలలో చెప్పారు. కానీ అడవిలోనే వేటకు ఎందుకు వెళ్ళమని చెప్పారు తనకి అర్థం కాలేదు. అందులో ఏం మర్మం ఉందో తెలుసుకోవాలని ఆయన వేటకు బయలుదేరాడు. అలా అడవిలోకి చాలా దూరం వేటకు వెళ్లారు ఒక చోటికి వెళ్ళాక ఆ రాజుకి ఒక జంతువును వేటాడుతున్న సమయంలో ఏదో తెలియని విష సర్పం తనని కరిచింది. ఆ రాజు కళ్ళు తిరిగి పడిపోయాడు దాంతో ఆ రాజు సైనికులకు ఏం చేయాలో తోచక బాధపడుతుండగా అటుగా వెళుతున్న తూర్పు గూడెం మందయ్యకు కనిపించారు. మందయా అక్కడ ఏదో జరిగిందని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్న సైనికులను ఏమైందని అడగగా ఆ సైనికులు మా రాజు గారికి ఏదో విష సర్పం కరిచింది. దానికి వైద్యం ఎలా చేయాలో మాకు తెలీదు అని అన్నారు. వెంటనే మందయ్య ఆ రాజుని తమ గూడానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆ రాజుకి వైద్యం చేయడం ప్రారంభించాడు. కానీ ఆ గూడెంలోని కొంతమంది ఎప్పుడూ చూడని మనుషులను విచిత్రంగా చూస్తూ నిండుగా బట్టలు కప్పుకున్న చేతిలోని ఇనుప ఆయుధాలను చూసి చాలా ఆశ్చర్యానికి లోనై వారిని ఇలా అడిగారు. ఇవన్నీ మీకు ఎక్కడిది ఎలా వచ్చాయి. ఎలా తయారు చేసుకున్నారు అని అడిగారు. ఆ మాటలకు సైనికులు కూడా ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నారు. బహుశా వీళ్లు అడవి నుండి ఎప్పుడు బయటకి రాలేదనుకుంటాను అందువల్ల మనల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇలా మాట్లాడుతున్నారు. అని గ్రహించి వారికి వాళ్ల రాజ్యంలోని ప్రజలు ఎలా నివసిస్తున్నారు. ఎలా బ్రతుకుతున్నారు ఏది విలువైంది అని చెప్తారు. మరి కొంతమంది రాజుగారు మెడలోని హారాలను చూసి ఇవన్నీ ఏంటిది ఎందుకు రాజు మెడలో వేసుకున్నాడు. ఇతని మాట మీరు అందరూ ఎందుకు ఈయన మాట వింటున్నారు.మీ గూడెం పెద్దనా అని అడుగుతారు. దానికి ఆ సైనికులు నవ్వి ఆయన మా రాజు మెడలో ఉన్నవి చాలా విలువైనవి ఎంత విలువైనది అంటే వాటితో ఏదైనా కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడ వేటాడి బ్రతుకుతారు గాని మా ఊర్లలో జనాలు వ్యవసాయం చేస్తూ ధాన్యాన్ని పండిస్తూ జీవిస్తారు. అని చెప్తారు. అలా మాట్లాడుతూ ఉండగా రాజుగారికి విషయం విరుగుడై మేలుకువ వస్తుంది. రాజు లేచి చూసేసరికి తన ముందు మందయ్య కనబడతాడు. మందయ్యను చూసి రాజు తనకేం జరిగిందని అడుగుతాడు. అప్పుడు మందయ్యా మీకు ఒక విష ప్రాము కరిచింది అడవిలో మీరు పడి ఉంటే మిమ్మల్ని తీసుకువచ్చి వైద్యం చేశానని చెబుతాడు. వెంటనే రాజు లేచి మందయ్యకు కృతజ్ఞత చెప్తాడు. తర్వాత గూడెం బయటికి వచ్చి గూడాని చూడగానే చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న స్వచ్ఛమైన అడవి గాలితో కూడుకున్న వాతావరణం చూసి చాలా సంబరపడిపోతాడు. మందాయని పిలిచి ఆ రాజు ఇలా అంటాడు. ఈ గూడెం వదిలి తమ రాజ్యానికి రమ్మని తనని ఒక వైద్యుడిగా తను ఎంతో మర్యాదతో తన దగ్గర చూసుకుంటానని అలాగే తమ జనాలకు ముందు తరంలో వచ్చే వ్యాధులకు తన వైద్యం చాలా అవసరం అని తన వెంట రమ్మని తనని కోరుతాడు. అందుకు బదులుగా మందయ్యా రాజుగారు నేను అడవిని వదిలి వస్తే ఈ అడవిలో దొరికే వైద్య మూలికలు మీ రాజ్యంలో దొరకవు మళ్లీ తిరిగి నేను అడవికి రావాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ అడవికి నాకు చెప్పలేని అనుబంధం ఉంది. మా పూర్వీకులు మేము ఎప్పటి నుండో ఈ అడవిలోనే ఉంటున్నాము. మీరు చెప్పినట్టుగా అడవిని వదిలి వస్తే మాకు మీ నియమాలు తెలియక చాలా ఇబ్బందులు పడతారు మా గూడెం ప్రజలు అందువల్ల నేను నీ వెంట రాను అని చెబుతాడు. అయినా కూడా చాలాసేపు ఆ రాజు ఆ మందయ్యను బతిమాలుతాడు. ఎంతసేపటికి మందయ ఒప్పుకోకపోవడంతో రాజు ఒక షరతు విధిస్తాడు. అదేంటంటే ఆ అడవికి పడమర దిక్కున అడవికి వదిలి కొంచెం దూరంగా ఒక గ్రామం ఉంది. 15 రోజులకు ఒకసారి ఆ ఊరిలోనికి వెళ్లి వైద్యానికి సంబంధించిన మౌలికలు అక్కడ ఉన్న గ్రామ పెద్దకు ఇవ్వాలని ఆదేశిస్తాడు. ఎందుకంటే తమ రాజ్యంలోని ఎప్పుడైనా తెలియని వ్యాధి వస్తే అవసరపడుతుందని తన రాజ్యంలోని ప్రజలు ఇంత దట్టమైన అడవిలోనికి రాలేకపోవచ్చు అని చెప్తాడు. అందుకు మందయ్య కూడా ఒప్పుకుంటాడు. కానీ రాజు గారి మనసులో తెలియని వెలితి గా ఉంది. సకలన సంపన్నుడైన రాజు వారిని బ్రతికించినవాడికి ఆదేశం ఇచ్చానని బాధతో తనకు ఏదో ఒక సహాయం చేయడం కోసం కొన్ని బంగారు నాణేలు దోసిడితో మందయ్య చేతిలో పోయబోతాడు. అందుకు మందయ్య పెద్దగా నవ్వి రాజుగారు పల్లె ప్రాంతాల్లో ఉండే మీకు వీటితో అవసరం అడవినే నమ్ముకుని అడవిలోనే సంపదను అనుభవిస్తున్నాం మాకు వీటితో అవసరం లేదు. అందువల్ల ఇవి మాకు ఏ విధంగానూ ఉపయోగపడవు వృధాగా మాకు వద్దు అని చెబుతాడు. మందయ్య మాటలు విన్న రాజు చాలాసేపు ఆలోచించి మందయ్య మొండి వాడు అనుగ్రహించి తను ఆ ఒక్కరోజు రాత్రి గూడెంలోనే ఉంటానని చెప్తాడు. ఆ మాటలకు మందయ్య కూడా ఎంతో సంతోషించి రాజు గారికి తగినట్టుగా ఒక మంచి విందును తయారు చేపిస్తాడు. అన్ని గమనించిన ఆ రాజు విందు ముగిసిన తర్వాత గూడెంలోని ప్రజలు నిద్రపోతున్న సమయంలో ఆ రాజు లేచి ఆ మందయ్య చేతి సంచిలో ఆ బంగారు నాణేలు పోస్తాడు. అది ఎవరు చూడరు. మరుసటి రోజు ఉదయం లేచి మందయ్యకు గూడెం ప్రజలకు చెప్పి తన రాజ్యానికి బయలుదేరి వెళతాడు. అ రాజు వెళ్లిన తర్వాత ముందయ్య చేసేదేమీ లేక వాటినిభద్రంగా దాచి పెడతాడు.అడవిని దాటి తన రాజ్యానికి వెళుతున్న మార్గంలో ఉండే పాలెం గ్రామంలోకి వెళ్లి గ్రామ పెద్దకి ఇలా చెబుతాడు. ప్రతి 15 రోజులకు ఒకసారి తన రాజ్యం నుంచి కొంతమంది సైనికులు అక్కడికి వస్తారు. ఎందుకంటే తమ రాజ్యంలోని ఏదైనా తెలియని వ్యాధి వస్తే లేదా వైద్యానికి సంబంధించిన మూలికలు ఏదైనా అత్యవసర సమయంలో వస్తే మీ గ్రామానికి వస్తారు. అందువల్ల అడవి నుంచి మందయ్యనే ఒక గూడెం వ్యక్తి తన దగ్గరకు వచ్చి వైద్యానికి మూలికలు మందులు ఇచ్చి వెళ్తాడని తనను తిరిగి గౌరవంగా సాగనంపాలని ఆ ఊరిలోని ప్రజలకు తెలియకుండా ఆ గ్రామ పెద్దతో ఆ రాజు మాట తీసుకుంటాడు. దానికి బదులుగా ఆ గ్రామ పెద్ద కూడా ఆ రాజుకి మాట ఇస్తాడు. తర్వాత ఆ రాజు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు; కానీ గూడెం లోని ప్రజలకు కొన్ని వింత వింత ఆలోచనలు పుడతాయి. దానివలన గూడెం మూడు భాగాలుగా మారుతుంది. (మొదటి రకం: గ్రామాల్లోకి వెళ్లి అభివృద్ధి గా బ్రతకాలని నిండు బట్టలు కట్టుకొని తిరగాలని కొంతమందికి అనిపిస్తుంది. కానీ పెద్దయ్య ఒప్పుకోడని భయంతో సమయం దొరికినప్పుడు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటారు.)( రెండవ రకం: పెద్దయ్య మీద గౌరవంతో చెప్పినట్టుగా నడుచుకొని అ అడవి తమకి రక్షణ అని గూడెంలో ఉంటేనే వాళ్లు సురక్షితంగా ఉంటారని భావించారు.)(మూడవ రకం: రాజుగారి సైనికులు చెప్పినట్లుగా అలాంటి బంగారు నగలు ఉన్న ప్రజలతో ఉండి వాటిని దోచుకొని తమ జీవితాలను సంతోషంగా గడపవచ్చని ఆ అడవిలో ఉంటే వేటాడితేనే తమకు ఆహారం లభిస్తుందని అదే గ్రామాల్లో అయితే వీలైనంత దోచుకుని సుఖంగా తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చని భావిస్తారు.) ఇలా ఆ గూడెంలో కొంతమంది మనుషులలో పురుడు పోసుకుంటుంది. కానీ ఎవరైనా ధైర్యం చేసి మందయ్యతో మాట్లాడే సాహసం చేయలేరు. ఎందుకంటే మందయ్య ఎంతో ధైర్యశాలి మొండివాడు చాలా బలమైనవాడు తెలివైనవాడు కావడం వల్ల ఆయనకు భయపడి ఎవరు తమ మనసులో ఉన్న విషయాలని చెప్పేవారు కాదు. అలా సాగుతుండగా ఒకరోజు మూడవ రకానికి సంబంధించిన కొంతమంది మనుషులు మత్తు (గంజాయి)పదార్థాలను తీసుకొని చాలా మత్తుగా వస్తుండగా అందులోని ఒకడు దూరం నుంచి ఒక ఎలుగుబంటి పిల్లను చూసి అది జింక అనుకొని దానిని మత్తులో వేటాడి చంపుతాడు. అది చూసిన మిగతా వాళ్ళు అది జింక కాదు ఎలుగుబంటి పిల్ల అని చెప్తారు. వారికి కొంత దూరం నుంచి తల్లి ఎలుగుబంటి వారిని చూస్తుంది. అది చూసిన వాళ్ళు అక్కడినుండి గూడానికి పరిగెత్తారు. గూడెం దగ్గరకు వెళ్లిన తర్వాత మందయ్యకు ఈ విషయాన్ని చెప్పకూడదని అందరూ మాట్లాడుకుంటారు. ఏమీ తెలియనట్టు గా గూడెంలో కలిసిపోతారు. ఆ తల్లి ఎలుగుబంటికి కోపం వచ్చి అదే రోజు రాత్రి పూట గూడెం పైన విరుచుకుపడుతుంది. గూడెంలో ను ఇద్దరిని చంపుతుంది. మందయ్య దాన్ని చంపకుండా చాలా దూరం తరుముతాడు. అలా తరుముతున్న సమయంలో చనిపోయి ఉన్న పిల్ల ఎలుగుబంటి కనబడుతుంది. దానిమీద ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు కనిపిస్తాయి. ఆ దాడి చేసింది ఎవరు అనే విషయాన్ని గ్రహించిన మందయ్య గూడానికి వెళతాడు. అందరిని పిలిచే ఎవరు పిల్ల ఎలుగుబంటిని చంపింది. అని అందరిని అడుగుతాడు. ఎవరు సమాధానం ఇవ్వకపోవడంతో అడవిలో ఉన్న నియమాన్ని అతిక్రమించినందుకు అడవి మనల్ని వదిలిపెట్టదని ఎవరు చేశారో చెప్పమని అడుగుతాడు. ఎవరు ఏమి చెప్పక పోయేసరికి తనకి చాలా కోపం వచ్చి ఆయుధాల గుర్తుల ఆధారంగా మూడవ రకంలోని వ్యక్తిని పట్టుకొని చితకబాడుతాడు. దానితో మూడవ రకం లోని కొంతమంది మందయ్య మీదికి తిరగబడి దాడి చేయడానికి సిద్ధపడతారు. మందయ్య వారి దాడినీ తిప్పి కొడతాడు. గొడవ మొత్తం సర్దుకుంటుంది. జరిగిన గొడవ వల్ల గూడెంలోని ప్రజలు మూడు భాగాలుగా విభజించబడి రెండు భాగాలు మాత్రం వారికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు గూడెం నుండి దూరంగా వెళ్లిపోతారు. మూడవ రకం వాళ్లు అనుకున్న విధంగా దూరపు ప్రాంతానికి వెళ్లి అక్కడ దొంగతనాలు చేస్తూ దొరక్కుండా వారి జీవితాన్ని గడుపుతారు. రెండవ రకం గూడం వాళ్లు వేరే దూర ప్రాంతానికి వెళ్లి సాధారణంగా ప్రజలతో కలిసి జీవించడం ప్రారంభిస్తారు. కానీ గూడెం పెద్ద అయినా మందయ్య తన వలన తన మనుషులు తనకి దూరంగా వెళ్లిపోయారని చాలా చింతిస్తూ ఉండేవాడు. కానీ వారికి తల్లి ఎలుగుబంటితో ఎప్పుడైనా ప్రమాదమేనని గూడెంనీ పడమర దిక్కున అడవి వైపుకు మార్చేశాడు. ఎందుకంటే రాజు గారి కి ఇచ్చిన మాట కోసం పడమర దిక్కున ఉన్న గ్రామానికి వైద్య మూలికలు అందజేయడం కోసం కొంచెం అనుకూలంగా ఉంటుందని గ్రహించి గూడాన్ని మార్చేశాడు. రాజు గారికి ఇచ్చిన మాట ప్రకారం గా నే ఆ ఊరికి తను ఒక్కడే వెళ్లి గ్రామ పెద్దను కలిసి వైద్య మూలికలను అందిస్తుండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన గూడెం బాధ్యతలను తన కొడుకు అయినా పెద్దయ్యకు బాధ్యతలు ఇచ్చి కఠినంగా గ్రామంలోకి తను ఒక్కడే ఎవరికి తెలియకుండా వెళ్లి మూలికలను గ్రామ పెద్దకు అందజేయాలని అలాగే తమ గూడ ప్రజలను ఎప్పటికీ గ్రామం వైపుకు వెళ్ళనివ్వవద్దని తను పెద్దయ్యతో బాధ్యతలు అప్పగిస్తూ చివరికి తను కాలం చేస్తాడు.! -----------------+
అలా మందాయా చనిపోయాక పెద్దయ్య గూడెం బాధ్యతలు స్వీకరిస్తాడు. కానీ మందాయ లాగే నియమ నిబంధనలు పాటిస్తూ చిన్న పిల్లలతో పిల్లాడి లాగా పెద్ద వారితో పెద్ద వారి లా ఎ వయసు వారితో మెలగటం తన తండ్రి ఇచ్చినా భాద్యతలను కఠినంగా పాటించడం.గుడానికి ఎ అపద రాకుండా చూసుకోవడం. ముఖ్యంగా గూడెం లో మత్తు (గంజా) తీసుకోనివ్కకుండా చూసుకోవడం దక్షిణం వైపుకు పడమర వైపు వెళ్లొద్దని నియమం పెట్టాడు. (నిబంధనలు :10 రోజులకు ఒక్క సారి గూడెం పనులు చేసుకోవాలి.12 రోజులకు ఒకసారి వైద్య మూలికల కోసం గూడెం యువకులను తీసుకొని వెళ్లడం.15 రోజులకు ఒక్క సారి )తను గూడెం యువకులను తీసుకొని వెళతాడు.5రోజులకు ఒక్క సారి తమకు ఉన్న ఇబ్బందుల గురించి గూడెంపెద్దయ్య తోఅందరూ కలిసి చర్చించుకునేవారు. మిగతా రోజులు అడవిలో దొరికే దుంపలు, పండ్లు, కూరగాయల కోసం తిరిగే వారు గూడెం నీది నాదీ అనే మాటలు ఉండవు.అందరు కలిసి మెలిసి ఒకరి కష్టని మరొక పంచుకుంటూ సంతోషంగా జీవించే వారు.
