Annapurna Duddupudi

Inspirational

4  

Annapurna Duddupudi

Inspirational

స్విచ్ బోర్డు.

స్విచ్ బోర్డు.

3 mins
23K


ఉదయాన్నే..తలుపు తీసిన వెంటనే సుజీని చూసీ స్థాణువైంది తల్లి నిర్మల. అదేంటే ఫోన్ అయినా లేదూ..ఇలా ఊడిపడ్డావ్.బాబేడీ..వంశీ ఏడీ.. అంటూ ప్రశ్నలేస్తూనే బ్యాగందుకునీ,వాటర్ తెచ్చి ఇచ్చింది. సుజీ ముఖం..ఏడ్చినట్లు పొంగి పోయిఉంది. ఆఫీస్ కెడుతూ బాబుని స్కూల్ లో దింపేస్తాడువంశీ.నేను లీవ్ పెట్టేసా.ఎందుకో నాకు బాగా లేదమ్మా...అతి కష్టమ్మీద..గొంతుపెగల్చుకుని చెప్పిందే గానీ ఉదృతంగా పొంగుకొస్తున్న దుఃఖంని...దాచలేకపోతుంది. నువ్వు ఇటొస్తున్నట్లు వంశీకి తెలుసా.. అంటూ నిర్మల అడగ్గానే చివ్వున తలెత్తింది. ఏంటమ్మా నీయక్షప్రశ్నలూ... చివరికి నీకు కూడా నేను...కారణాలు చెప్పేతీరాలా....సుజీగొంతు వణికింది. నిర్మల నిదానంగా వచ్చీ సోఫా చివరిగా కూచుంది.సుజీ చేతిని తన చేతిలోకి తీసుకోగానే. ఒక్కసారిగా తల్లి వొడిలో కి వాలిపోయి తల్లి చేతిని పదిలంగా...తన చేతితో పెనవేసి పట్టుకుని..గుండెలకు హత్తుకుంది. ఎంతో ధైర్యం...తెగువ..ఉన్నపిల్ల.బాధ్యతాయుతమైన ఉద్యోగిని...నిరంతరం.. వర్కింగ్ విమెన్స్ కోసం పోరాడుతున్నటువంటి వాయిస్ ఆఫ్ విమెన్స్ లో మెంబరు.ఇలా బేలగా..మారడం ఒకింత ఆశ్చర్యమే . ఏం జరిగింది రా నెమ్మదిగా అడిగింది. లేచికూచుని ముఖం తుడుచుకుంది. అదికాదమ్మ...వంశీకి ఏడున్నర కల్లా ఆఫీస్ పని అయిపోతుంది.నాకు...మీటింగ్స్‌వలన ఏదో ఒక రీజన్ తో..రోజూ ఎనిమిది తొమ్మిది అలా అయిపోతుంది. అసలైతే నాకు వంశీ కీ..ఏమీ ప్రోబ్లం లేదు..బాబుని తనుచూస్తే నేనింట్లో చూసుకుంటా. లేదూ తను వండేస్తే..నేను బాబుని చూస్తుంటాం. కానీ...రెండునెలలక్రితం మావదిన అదే ,వంశీ వాళ్ల అక్క గారింటికి వెళ్లాం. వాళ్లపాప స్వీటీ బర్త్ డే.వాళ్లవాళ్లంతా వచ్చారు. అందరూ... బాబు గురించి ఎంత బాధ పడిపోయారో..వాడు వయసుకు తగినట్లు ఎదగటంలేదనీ..డే కేర్ వలన యాక్టివ్ నెస్ పోయి డిమ్ గా మారిపోయాడనీ. మంకుతనం పెంకితనం ఎక్కువయిపోయి మాట వినడంలేదు..ఇప్పటినుంచే అనీ...ఇలా నలుగురూ అంటుంటే. వాడికి నిజంగానే తిక్కరేగీ...అక్కడందరినీ గిల్లీ గిచ్చి.. అబ్బబ్బా ఎంతట ఇంటికొచ్చి పడతామా అనిపించింది అమ్మా. మొన్న డే కేర్ సెలవులప్పుడు.. నాలుగు రోజులు బాబుని ఉంచగలరా అనడిగితే వాడు స్వీటితో బబ్లుతో కలవడూ..నేను వాడిని పట్టలేనురా అనీ ముఖం మీద చెప్పిందమ్మ వాళ్లక్క. మా పాట్లేవో మేం పడతాం కదా..తీరా అక్కడినుంచి వచ్చేసాక వంశీ.. ప్రతిదానికీ వాడికి...తినిపించడం దగ్గర మొదలూ.. ప్రతీదానికి...నన్నుతప్పుపడుతుంటాడు. ఇదోరకం బేబీషేమింగ్ అమ్మ. ఆడవాళ్లకు బాడీ షేమింగే కాదు...ఇప్పుడిది కూడా యాడ్ అయింది.ఎన్నిటికని పోరాడాలీ చెప్పూ... కాస్త ఆఫీస్ నుంచి లేటైతే...భయం వేస్తుంది. వాడు..అన్నం తినకుండా పడుకున్నాడనీ తల్లి ప్రేమ అందటం లేదు.. వాడికి అనీ. వంశీ లేటైతే...నేను బాబూ ఎంతబాగా ఆడుకుంటామో...పేయింటిగ్స్ వేస్తూ కధలు చెపుతూ ఉంటాం. అదే‌నేను లేటయితే ...బాబుని తనతో వాళ్ల ఫ్రెండ్స్ ఇంటికి పట్టుకుపోతాడు. మొన్న వీడియో కాల్ చేసేసరికి... బుగ్గలనిండా కన్నీళ్లు ఎండిపోయి పిచ్చోడి లా వాళ్ల సోఫాలో వాళ్లు పిల్లలతో అరుస్తూ బాబు...వంశీ తనఫ్రెండ్స్ తో కార్డ్స్ ఆడుతా... కనబడేసరికి వళ్లు మండిపోయింది. బాబుని చూసుకోవడం అంటే అదేనామ్మ. రాగానే నా మీదికి ఎంతట వదిలేద్దాం వీడిని అన్నట్లు పట్టుకునుంటాడు బాబుని..అరే కనీసం... ఫ్రెష్ అవ్వొద్దా...అలసట తీరద్దా..చెప్పమ్మా...ఇదివరకూ అలాలేడు. కానీ పనికట్టుకుని..వాళ్ల వాళ్లు.. మా‌నైబర్స్ కూడా పాపం ఇద్దరూ జాబ్ అవడం డే కేర్ కే పరిమితం అయిపోతున్నాడు అనీజాలి చూపెడతారు. నాకేనా బాబు బాధ్యత వంశీకికాదా. స్పష్టంగా తెలుస్తుంది.వంశీ బాబుని చూడటం కూడా ఏదో నా ఆఫీస్ వర్క్ ఏదో తాను ఉదారంగా చేసిపెడుతున్నట్లు...ఫేస్ పెడతాడు. అట్లా నూరిపోస్తారంతా... ఏంటమ్మా ఇదీ సొసైటీ మారదా. ఏం జాబ్ చేసేవారికి మాతృత్వపు మమకారం ఉండదా...ఆమాటకొస్తే...పిల్లలకీ బైచెప్పేసీ హాయిగా..ఇల్లు చూసుకునే.. హౌస్ వైఫ్‌కన్నా, జాబ్ కెళ్లే ఆడవాళ్లకి... తిరిగి ఇళ్లుచేరేదాకా మనసు పరిపరివిధాల..నలిగిపోతుంది అనీ ఎందరికి తెలుసూ.. ఓదార్పు గా...సుజీనిచూస్తూ తలాడిస్తూ వినసాగింది నిర్మల... ఎంతో కష్టమనిపిస్తే గానీ నోరుతెరవదు.లోపల ఉన్న ఆవేదన.. పూర్తిగా బైటపడేదాక..అడ్డుచెప్పలేదు అందుకే. నీకు తెలుసు నేనెంతకష్టపడిచదివానో...ఈజాబ్ ని ఎలా పొందానో ఐదేళ్లుగా...ఎన్నెన్ని ఎఛీవ్ చేసానో...అవన్నీ...ఒక పక్కకు పడేసీ పిల్లాడిని,ఇంటినీ సరిగా చూడలేనీ దానిగా ఈనిందలేంటీ.?..బాబుపై వంశీ పై ఈజాలేంటీ? నేనే కాదమ్మా.. ఇపుడు ఆడవాళ్లు... రెండువర్గాలుగా విడిపోయారు. హౌస్ వైఫ్ లూ,ఉద్యోగినులూ. వాళ్లలోవాళ్ల కే అంతర్యుద్దాలూ. జాబ్ చేసేవారికి గర్వమనీ.. హౌస్ వైఫ్ లపై చులకన అనీ.. హౌస్ వైఫ్ లకేమో.. జాబ్ చేసే ఇల్లాలు..ఇల్లు,పిల్లల్ని వదిలేసీ పరుగులు తీసే మనీ యంత్రాలనీ..వాళ్లకి మమకారాం గట్రా ఉండదనీ.. అందరం...ఆడవాళ్లమే..అమ్మలమే అనీ ఎందుకు మరిచిపోతారు. అమ్మా నాకు చాలా లక్ష్యాలున్నాయి..అవి ఎలా పొందాలో తగిన ప్రణాళికలు తెలివితేటలూ...ఇలా చాలానే ఉన్నాయి అవన్నీ ఎలా వదిలేసుకోనమ్మా అడుగుతున్న కూతురివైపు..ప్రేమగా చూసింది నిర్మల. సుజీ అలా అనీ ఎవరన్నారు. ఎవరి కధా,ఒకటి కాదుగానీ మనకధలో మనమే హీరోయిన్. ఇప్పుడు నీకెదురవుతున్న వాటిని ఎలా ఎదుర్కోవాలొ చెపుతాగానీ...నా ఒక్క ప్రశ్న కు ఆన్సర్ చేస్తావా... అడిగింది నిర్మల. సుజీ మెరిసే కళ్లతో తల్లివంక చూసింది. చిన్నపుడెప్పుడూ...తల్లి తననీ ఇలాగే అడిగేది..నా ప్రశ్న కు ఆన్సర్ చెపుతావా అంటూ ఎంత ఎదిగినా తల్లిచెంతన... దొరికే సమాధానం...మరెక్కడా దొరకదు ఎవరికైనా ఏంటో మరీ ఆ గమ్మత్తు. మన ఇంట్లో... కరెంట్ కి... స్విచ్ బోర్డు మన ఇంట్లో నే పెట్టుకుంటాం.వేరొకరిఇంట్లో బిగిస్తామా..చెప్పు.. అడిగింది. అమ్మా..నీకళ్లకి నేనింకా.. చిన్న పిల్లలా కనబడుతున్నానా... పిచ్చి ప్రశ్న కాపోతే అన్నీ షేర్ చేసుకున్నాననీ..అలుసా బుంగమూతి పెడుతూ అందీసుజీ. నిర్మల అంతే తేలికగా నవ్వేస్తూ...ముందు చెప్పు అంది. అలా పిచ్చోళ్లే చేస్తారు అంది సుజీ. నువ్వు అలాంటి పిచ్చిదానివేనన్నమాట అంది చటుక్కున నిర్మల. మాటరానట్టు... తల్లి వైపు చూసింది సుజీ. అంతేకదా...నీవేంటో నీకు తెలుసు నీభర్తా నీ పిల్లాడు నీ ఆఫీస్ నీ లక్ష్యాలూ.. నీతో కాకుండా కాసేపు కలిసి మాట్లాడే వాళ్ల మాటలు బట్టీ నడుస్తుంటే. నీ సంతోషవిచారాలు వేరే వాళ్ల ఆధీనంలో ఉంటే... మీ ఇంట్లో కరెంటు స్విచ్ బోర్డు.. ఎదురింట్లో నో...మీ చుట్టాలింట్లోనో..ఉన్నట్టే కదా... ఉండు..చేగోణీలూ..టీ పట్టుకొస్తా అంటూ లోనకెళ్లబోతున్న తల్లిని ఆపీ గట్టిగా కౌగలించుకుంది సుజీ..


Rate this content
Log in

Similar telugu story from Inspirational