STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Romance

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Romance

సెల్ఫ్ ఐసోలేషన్

సెల్ఫ్ ఐసోలేషన్

5 mins
302

మార్చి నెల ఎండలు ,అపుడే మండిపోతున్నాయి...ఇలా అయితే మే నెలలో,ఏసీ గదిలోనే కాపురముండాలి...అనుకుంటూ,గబగబా హ్యాండ్బ్యాగ్,ఫోన్,మాస్క్ చెక్ చేసుకొని,అన్ని ఉన్నాయి అని రూఢీ చేసుకుని బయటకు వచ్చి తాళం వేసింది...తాళం చెవి బాగ్ లో వేయబోతుంటే గుర్తొచ్చి ,తలకొట్టుకుంది సునంద..

అయ్యో! గొడుగు మర్చిపోయానే అనుకుంటూ,మళ్ళీ తాళం తీసి ,గొడుగు చేత్తో పట్టుకుని...ఇంకోసారి ఇల్లంతా చూసింది..ఏమైనా మర్చిపోయానా!?అనుకుంటూ,రోబో చెకింగ్ చేసింది కళ్ళతో...ముప్పయి దాటుతున్నాయి కదూ! మతిమరుపు మొదలైనట్లుంది అని తనలో నవ్వుకుంటూ,లాక్ వేసి బయటకు వచ్చింది..

తొమ్మిది గంటలకే రోడ్ ఖాళీ అయిపోతోంది...ఎవరికీ సంపాదన మీద ఆశ లేదు...కరోనా ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచినా,నాలాంటివాళ్ళ జీతాలు కత్తిరించేస్తుంది ....ఎలా!! ఎలా?? నువ్ ఏమైనా మాయ చెయ్యగలవ్ అబ్బాయి ,కానీ, సమయానికి చెయ్యవు అని దేవుడికి దూషణ నైవేద్యం సమర్పించుకుంది...

ఇంతలో దూరంగా ఆటో కనపడింది...ఆపండి!చెయ్యి అడ్డు పెట్టింది....

అక్కడి దాకా ఆమె పక్కగా వచ్చి,ట్రిప్ ఉంది మేడమ్...రాలేను అన్నాడు .

సిటీలో ట్రిప్పా!మొహం ప్రశ్నర్ధకమైంది..

అపుడపుడూ రెండు బైకులు,సైకిళ్ళు,మధ్యలో సరుకులు వేసుకెళ్లే వ్యాన్లు వస్తున్నాయి ,ఆటో రావడంలేదు...

ఇవాళ నా పని అయిపోయింది...స్కూల్ లో ఇన్స్పెక్షన్ ఉంది..సిలబస్ ఎక్కువ ఉంది...కంప్లీట్ అవ్వాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి..అదేంటో!లెక్కలు,సైంసు సిలబస్ కుంటుకుంటూ వెళ్లినా ఏమనరు...నా ఇంగ్లీష్అవ్వకపోతే,పిల్లలు విదేశీ యాన అవకాశం నేనే మిస్ చేసేనన్నట్టు అడుగుతారు పేరెంట్స్...దానికి తగ్గట్టు మా hmకి పెళ్లి చేసుకోలేదు....ఆవిడ తిక్కన్తా మామీద చూపిస్తుంది...నా ఖర్మకి ముప్పయి వచ్చినాపెళ్లి అవ్వలేదు నాకు...నాకు మూడింది ఇవ్వాళ అనుకుంటూ,కొంచెం ముందుకు నడిచి బస్ షెల్టర్ లో,బెంచ్ మీద కూర్చుంది కానీ,హెచ్ ఎం చేయబోయే శివతాండవం గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది...

దూరంగా సుమో కనిపించింది...అమ్మయ్య !లిఫ్ట్ అడుగుదామా అనుకుని చెయ్యి చాపింది,లేటెస్ట్ సినిమాలన్నీ గుర్తు చేసుకుంది...ఎందుకులే!ఊరిలో లేనిపోని అప్రతిష్ట అని వెనక్కి వచ్చి కూర్చుంది...

దగ్గర కొచ్చేకొద్ది చూసి,పోలీసు జీపా??అమ్మో!లిఫ్టు అడిగి ఉంటే,దొంగతనం లేదా లంచం తీసుకుంటూ పట్టుబడిపోయిన సునంద అని ,మా ఊరిలో ఉచిత రాలీ చేసేస్తారు అనుకుంది....

దగ్గరికి వచ్చేకొద్ది జీప్ నెమ్మదిగా వచ్చి ఆగింది...ప్రాణం గొంతులోకి వచ్చినట్టు అయింది...చెమటలు పడుతుండగా ముందు నిలబడాలా ? వద్దా? అని మీమాంసలో ఉంది...

మేడమ్!ఎందుకు ఆపేరు ?అన్నాడు డ్రైవర్ కమ్ కానిస్టేబుల్ అద్దం దింపుతూ

లేదన్నా !ఉత్తినే ఆపేను ...నాలిక్కరుచుకుంది...అన్నా!అన్నందుకు వదిలేసినా,ఉత్తినే ఆపినందుకు మూసేస్తారు ...కనీసం వార్నింగ్ అయినా ఇస్తాడు...ఇవ్వాళ నా పరువుకి నేనే ఎసరు పెట్టుకున్నాను...

ఏంటమ్మా! చూస్తే చదువుకున్నట్టు ఉన్నారు,పోలీస్ జీప్ ను ఉత్తినే ఆపుతారా ?ఎవరైనా అంటూ స్టార్ట్ చెయ్యబోతుంటే

ఏమైనా అర్జంట్ అయితే,డ్రాప్ చెయ్యలేమో కనుక్కోవయ్యా శంకరం అంది,వెనక సీట్ లోంచి ఒక గొంతు...

కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాలి...ఇన్స్పెక్షన్ సర్ ఇవ్వాళ...లేట్ అయింది...కొంచెం డ్రాప్ చేస్తారని..నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్ నే,మీ వెహికల్ సర్వీస్ నేను కూడా ఉపయోగించుకోవచ్చు.....భయపడుతూనే,డిమాండ్ చేసింది బండి ఆగింది కదా!అనుకుంటూ,

ఒక్కసారి తమ వసూళ్ల జులుం ని తలచుకుంటూ,అమ్మాయి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుంది అని నవ్వేడు వెనక సీట్ లో ఉన్న ఎస్ ఐ.....

ఎక్కమ్మా!అన్నాడు కానిస్టేబుల్ డోర్ ఓపెన్ చేస్తూ...ఎక్కుతుంటే ఫోన్ రింగయింది....చూస్తే,మాథ్స్ టీచర్ సుష్మ...లిఫ్ట్ చేసి ,ఆ సుష్మ! ఇవ్వాళ బంద్ అంటావా? ఒక్క ఆటో దొరకలేదు...పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో వస్తున్నాను...,నేను దిగే టైం కి మన ప్రిన్సిపల్ చూసిందనుకో ...అమ్మో!పోలీస్ జీప్ లో వచ్చింది...చుట్టాలు ఎవరైనా ఈ సర్వీస్ లో ఉన్నారని భయపడుతుంది ...నువ్ ఎలా అయినా ఆవిడ గేట్ దగ్గర ఉండేట్టు చూడు...ఇవ్వాళ నేను లేట్ అన్నమాట మర్చిపోతుంది...మధ్యలో ఏమనుకోకండి బాబాయిగారు...అంది

అమ్మా! ముందు ఒక బాబాయ్,వెనకో బాబాయ్ వద్దమ్మా...వెనక మా పెద్ద సార్ ఉన్నారు...నువు గవర్నమెంట్ ని ఎలా అయినా వాడుకో....కానీ నా జీవితంతో ఆడుకోవద్దు...

స్కూల్ వచ్చిందన్నట్టుగా జీప్ నెమ్మది చేసేడు....గబగబా దిగి,ఆటోకి ఇచ్చినట్టే డబ్బులు ఇవ్వబోయింది....తల్లి!నీకో నమస్కారం...ఇది పోలీస్ జీపమ్మా...గుర్తు చేసేడు ...అయ్యో!సారి బా...సారి కానిస్టేబుల్ గారూ ....సర్! మీకు కూడా మనీ థాంక్స్ అంటూ ,ఆయన్ని చూసి అవాక్కయింది...

అతనుకూడా...కానీ డ్యూటీ మీద ఉండడంతో....శంకర్!తొందరగా పోనివ్వు...అన్నాడు

ఎక్కడ చూసానబ్బా?...ఆఫీస్ రూమ్ కెళ్ళి,రెజిస్టర్లో సంతకం పెడుతూ కూడా ఆలోచించింది..

ఇంతలో మాథ్స్ టీచర్ సుష్మా వచ్చింది....రా!తొందరగా...ఎయిత్ క్లాస్ ఫస్ట్ నీ సబ్జెక్టే చెక్ చేయబోతున్నారు...అంటూ తొందరపెట్టింది..

లేట్ గా వస్తారు...హెచ్చెమ్ ఎదురుగా వస్తున్నా పట్టించుకోరు....రెజిస్టర్లో సంతకాలు పెట్టరు..ఎం టీచర్లో ఏంటో?ఇవాళ్టి గండం ఎలా గట్టెక్కిస్తారో??

సుజాత తన రూంకి వచ్చి కూర్చుంది....కానీ తనముందున్న పేపర్లో ఉన్న వింత రాతని చూసి అదిరిపడి,ఆయమ్మా!!ఆయమ్మా!గట్టిగా పిలిచింది బెల్ కొడుతూ...

నా సబ్జెక్ట్ కోసం తయారుచేసుకున్న,టీచింగ్ నోట్స్ మీద ఫెయిల్డ్ అని రాసిన గాడిద ఎవరు?అంటూ కాళిక అవతారం ఎత్తింది...

ఆయమ్మా! వణుకుతూ వచ్చింది..

చివరిగా నా రూమ్ కి వచ్చిందిఎవరు? ఘర్జించింది

సు...సునందా టీచర్...సంతకం పెట్టడానికి వచ్చెరు మేడమ్ ..

పెళ్లి చేసుకుంటే పీడా పోతుంది...ఇమాజినేషన్ లో ఉంటారనుకుంటా??అయినా రిజిస్టర్ ఆఫీస్ రూమ్ లో ఉంటుంది కానీ,నా దగ్గర ఎందుకుంటుంది? ఇన్స్పెక్షన్ అవ్వనీ ,చెబుతాను ఆవిడ పని అంది...

విషయాన్ని ప్యూన్ సుబ్బారావు,ఉప్పందించేడు సునందకి..తాను వాళ్ళమ్మాయి క్లాస్ టీచర్ అవడంవల్ల...

మూడు గంటలకు ఇన్స్పెక్షన్ హడావుడి అయిందిఅని,అంతా హమ్మయ్యా!అనుకున్నా,సునందకి ఇంకా హెచ్చెమ్ చేతిలో,అగ్నిపరీక్ష బాకీ ఉందన్న విషయం గుర్తొచ్చి,ముక్కోటి దేవతల్ని తలుచుకుంది

కానీ, ఉపయోగం లేకపోయింది...నా టీచింగ్ నోట్స్ వాళ్ళు అడగలేదు కాబట్టి సరిపోయింది...ఏంటమ్మా!ఈ పిచ్చిగీతలు...నేను ఫెయిల్డ్ కాండెట్టా??ఎవరమ్మా నీకు.... ఇంక ఆగేలా లేదనుకున్న సునంద

మా...మాడ్.. మేడమ్...నన్ను క్షమించేయాలి మీరు అంటూ కాళ్ళు పట్టేసుకుంది...ఇంక ఎపుడూ ఇలా జరగదు...నే...నేను మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసిస్తాను....ఇంకేమి ఆనొద్దు....అంటున్న సునంద వైపు అయోమయంగా చూసింది..ఎదో అంటున్నలోపు

ఎక్స్క్యూస్ మీ మేడమ్! నేను సురేందర్...మీతో కొంచెం మాట్లాడాలి..అంటుండగా...ఇదే అదును అనుకుని వడివడిగా బయటకు వెళ్తుంటే చూసేడు ,పొద్దున్న లిఫ్ట్ ఇచ్చిన మామ్ కదూ!అనుకున్నాడు...

ఏమైంది మామ్! అనీథింగ్ రాంగ్ ??అడిగేడు

పెళ్లికాని పిల్లలు ఉన్నారే?బుర్ర తింటున్నారు సార్!మీరు టీసీ కావాలన్నారు కదా! ఒక్కనిమిషం...అంటూ గుమస్తాని పిలవబోయింది

మామ్!మీకు కూడా పెళ్లి కాలేనట్టుంది?అన్నాడు నవ్వు ఆపుకోలేక

పోలీస్ అనిపించుకున్నారు సార్!అయినా ఎందుకుఅలాఅంటున్నారు?

నేను వచ్చింది అడ్మిషన్ గురించి మాట్లాడటానికి...నాతోపాటు ఒక ఫామిలీ తెచ్చుకున్నాను హెల్పింగ్ కి...వాళ్ళమ్మాయిని సిక్స్త్ క్లాస్ లో జాయిన్ చెయ్యాలి ...

ఓ!క్షమించాలి...ఒకటి ఇన్స్పెక్టన్ గొడవ,రెండోది పోలీసులు వసై కామన్ గా భయం ...ఒక్కనిమిషం అని,సుబ్బారావు ని పిలిచి సిక్స్త్ కి అప్లికేషను రెడి చేయమంది...

సురేందర్ మళ్ళీ అడిగేడు...మీ స్కూల్ లో బానిసత్వం పోలేనట్టుంది?

సుజాత:::ఎందుకు అలా అడిగేరు ?

సురేందర్:::ఎం లేదు?కాళ్ళు పట్టించుకు మరీ సారి చెప్పించుకుంటున్నారు...కేజువల్ గా అడుగుతున్నాను..

సుజాత:::పేపర్ చూపిస్తూ.,నేను ఫెయిల్డ్ కాండేట్ అని రాసింది సార్...హెచ్చెమ్ ని తొందరగా క్లాస తీసుకోమనరు ఇన్స్పెక్షన్ లో కాబట్టి సరిపోయింది..నాకు రిమార్కు పడేది..

మామ్ అప్లికేషను అంటూ ప్యూన్ వచ్చి,టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు

ఆమెని ఒక్కసారి కలవొచ్చా..మీ అనుమతి ఉంటేనే???

పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటుంది...లవ్ ఫెయిల్యూర్ అని తెలుసు...పట్టుదలతో డీఎస్సీ కొట్టింది...గుడ్ గర్ల్...సారి విమెన్..తిక్కవేషాలు వేస్తుంది ఇలా?మళ్ళీ పేపర్ చూపించి అంది..పోలీస్ కలవడానికి వచ్చేరంటే...

సరే! నేను మళ్ళీ కలుస్తాను అని సంతకం పెట్టి,పాప రేపట్నుంచి స్కూల్ కి వస్తుంది...నమస్తే! అని వచ్చేసాడు

సండే! సెలవు కదాని తొమ్మిది అయినా లేవదు...కాలింగ్బెల్ మోగితే,ఇపుడెవరు? అనుకుని,ఇంట్లో ఎవరూ లేరు!అంది టీవీ ఆన్ చేస్తూ

పర్లేదు మేడమ్! మాట్లాడేసి వెళ్లిపోతాను అంటున్నారు ఎవరో??

వీడికి కూడా పెళ్లి అయి ఉండదు...అనుకుంటూ తలుపు తీసి,నువ్వా? అంటుంది

నేనే! బావున్నావా సునీ...

ఆ!ఆ రోజు నీ మరదలు చేసిన అల్లరికి చావక,బ్రతికే ఉన్నాను...అమ్మా,నాన్నకి నేను ఒక్కదాన్ని..కానీ ఇపుడు ఒక్కదాన్నే అయిపోయాను...నువ్ సృష్టించిన అలజడికి నాకు నేనే విధించికున్న శిక్ష...సెల్ఫ్ ఐసోలేషన్....

నేను ఏదీ కావాలని చెయ్యలేదు...నువ్ ఆ అమ్మాయి మాటలు విని,నమ్మేయడం తప్పు...నన్ను ఎన్ని ఆడిగేదానివి కాలేజీలో...నీకు ఐదేళ్ళలో కొనిచ్చిన ఫైవ్స్టార్స్ తో,నేను డైరెక్ట్ గా డిఎస్పీ పోస్ట్ కొట్టొచ్చు తెలుసా???

ఛీ! అప్పుడూ,ఇప్పుడూ అదే పిసినారితనం...మిగతావాళ్ళు అడక్కుండానే డైరీమిల్క్ తెచ్చేవారు ...దాంతో అయితే హోమ్ మినిస్టర్ అవ్వొచ్చు.....

పిసినారితనం ఎవరిది మేడమ్? ఎపుడైనా ఇంట్లో మీ నాన్న కొన్నారా నీకు?పోనీ నేను కొనిచ్చానని చెప్పావా?? అసలు నువ్వే కాలేజీలో అబ్బాయిల్ని చాకలెట్లు ఆడిగేనని ఎపుడైనా చెప్పావా??అసలు బయటోడిని పనోడ్ని చేసి,ఎవరైనా అవి,ఇవీ తెప్పించుకుంటారా???ఇన్ని జరిగితే ....

మా బావని పెళ్లిచేసుకోవాలంటే ,రూమ్ కి రమ్మన్నాడని అదేవరో చెప్తే,నువ్ నమ్మేసి చక్కగా సెటిల్ అయిపోయావు అనుకున్నాను...నీకు తిక్క కుదరలేదు ఇంకా..ఇపుడు కూడా నీ స్వార్దానికి నా గవర్నమెంట్ వెహికల్ నువ్ వాడేవు,కానీ నేను ఎపుడూ నీ నుంచి ఎం ఎక్సపెక్ట్ చెయ్యలేదు...నీకు ఎవరో చెప్పినంత నీచంగా అయితే అసలు లేదు...

హలొ!ఆపండి సార్!అబ్బాయిలందర్నీ అడగలేదు...నిన్నే అడిగేను...కొంచెం డీసెంట్ గా ఉన్నావని....పెద్దగా గొడవలు పడవని....మైండ్ యు

ఊరికే అరవకు!నిజాలు తెలుసుకో? కోపంగా అన్నాడు

అయి ఉండొచ్చంటావా!? తననే ప్రశ్నించుకుంది...ఈ రోజుల్లో ఆడపిల్ల దొరికితే,ఇక అంతే!కానీ కాలేజీ రోజుల విషయాన్ని,అపురూపంగా గుర్తు పెట్టుకుని మళ్ళీ అతనే అడుగుతున్నాడుగా ??ఈ సారి అమ్మానాన్నతో మాట్లాడి ఈ ఐసోలేషన్ కి స్వస్తి పలకాలి....హాయిగా గవర్నమెంట్ సర్వీస్ ఫ్రీ గా వాడుకోవచ్చు నవ్వుకుంది

ఎపుడూ ఎవడి ఆస్తినో వాడడమేనా??మనం సంపాదించుకు వాడుకుందాం!

సునంద (మనసులో)::::ముదిరిపోయాడు.! పైగా పోలీస్ అయ్యాడుగా,మైండ్ చదివేస్తున్నాడు...అనుకుంటోంది మనసులో,ఇంతలో తలుపు కొట్టారు ఎవరో?....అపుడెపుడో అన్నారు నేను వెళ్ళకుండానే,రూంకి వెళ్లేనని...ఇపుడు నువ్వు వచ్చి నన్ను బుక్ చేసేసేవ్!చెమటలు పడుతున్నాయి సునికి

డోర్ తీసి రండి మావయ్య,అత్తయ్యా...అని వెనక్కి తిరగబోతుంటే,మేముకూడా వచ్చామురా?? అన్నారు ఆ వెనుకే సురేందర్ అమ్మానాన్న నవ్వుతూ...వాళ్ళు లోపలికి వస్తూ రండి మేడమ్!అంటూ హెచ్చెమ్ సుజాతని పిలిచారు..

బావున్నావా సునీ?! సురేందర్ అమ్మ అడిగింది..

నన్ను క్షమించు తల్లీ!పరువు ప్రతిష్ట అని నిన్ను మాకు దూరంగా,ఒంటరిని చేసేం...సునంద తండ్రి బాధపడ్డాడు...

సుజాతగారు కల్పించుకుంటూ...ఇంత మంచి టైంలో పాత విషయాలు ఎందుకు??పదిగంటలకి ముహూర్తం భేషూగ్గ ఉంది సునంద! ఇంక నువ్వు ఒంటరితనం వదిలి పోలీసోడి పెళ్ళానివి అయిపో!! ఎంతమందికి దక్కుతుంది ఈ అవకాశం??

ఆడది,మగాడు ఒక వయసు దాటాక ,ఐసోలేటెడ్ గా బ్రతకడం కష్టం సునీ...శరీరానికి వచ్చే అనారోగ్యం హాస్పిటల్ ఐసోలేషన్ గోడల మధ్య పోగొట్టొచ్చు...సమాజంలో ఐసోలేటెడ్గా ఉంటే ,రకరకాల దుష్టశక్తులు రోగాల్లా విజృంభిస్తాయి....వాటికి మందు లేదు...నివారణ కూడా సాధ్యం కాదు....కలిసి ఉండడమే శుభం,సుఖం...అంది సుజాత మామ్...

ఇంకేం!గవర్నమెంట్ సొమ్ము తినే పనిలో ఉందాం..వీలైతే పిల్లల్ని కూడా ఇందులోకే లాగుదాం సురేందర్ జోక్ కి,అంతా నవ్వులతో శృతి కలిపేరు...శుభమ్



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract