STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

సాధన....

సాధన....

3 mins
356

ఆ ఉద్యోగం నాకయితేనే బావుంటుంది,కానీ ఎవరెవర్నో ఎన్నుకున్నాడు డైరెక్టర్ రాక్షసుడు.అవినీతి మయం అయిపోయింది అంతా!ఉదయం ఏడింటినుంచి నాలుగింటివరకూ కూర్చోబెట్టి,అప్లికేషన్లు జల్లెడ పట్టి క్యాంపస్ లోకి పంపించేరు.గొప్ప చెప్పుకోవద్దు అంటావు.

పిల్లలు ఎంత సరదాగా నేను చెప్పిన పాఠం విన్నారో!నా పీజీ అనుభవాన్ని,జ్ఞానాన్ని ఉపయోగించి ,అప్లికేషన్ ఎంత కొత్తగా పూర్తి చేశానో నాన్నా!?అచ్చు వసుంధర పేజీ లో సైకాలజిస్ట్ సుహాసిని మేడం చెప్పినట్టు.అయినా ఛీ!మంచికి రోజులు కాదు..మిగతా....విషయం పూర్తి కాకుండా సునంద భుజం మీద చెయ్యి వేసి ఆపేరు తండ్రి వరదరాజు.

ఎంతో భయం,బాధ,దుఃఖం,ఉక్రోషం చల్లగాలికి మాయమైన చిరు చెమటలా తేలికైంది సునీ మనసు.

నీ గురించి మంచి,చెడు ఎంతయినా చెప్పు,ఇంకొకరి గురించి అస్సలు ఎం మాట్లాడొద్దు.అది మనపని కాదు సునందా!?

అలాగా !అయితే నాగురించి అంచనా వేసి హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు(తెలిసీ అదిగుతున్నావ్ సునందా మనసు హెచ్చరించింది)...అరుస్తూ అంది

నువ్వే ఇచ్చేవు!సులువుగా చెప్పేసేరు రాజుగారు

నేనా!?అనండి.అంతా నన్నే అనండి(వద్దు సునీ! ఈ సందర్భం లో నీకు డైలాగు లేదు,మనసు వారించింది) నువ్వుండవే అన్నట్టు మొహంలో చిన్న చర్య చూపించి,మహా లోకువ నేనంటే మీకు ...రోషంగా అంది.

తల్లి పద్మ,వంటగదిలోంచి చల్లని మజ్జిగ తీసుకువస్తున్న,తానెళ్లి మరో గ్లాసులో తెచ్చుకుంది.(అమ్మ తెచ్చిన గ్లాసు తీసుకో సునీ మనసు పలుకుతోంది)అయినా పంతంగా వచ్చి వరండాలో నాన్న పడక కుర్చీలో కూర్చుంది.

ఇంత ముద్ద ఉంటే పడేయమ్మా!ఆకలేస్తోంది..(అమ్మ మీద కోపం తప్పు మనసు చెబుతోంది)అందుకే...

అపుకుందాం అనుకున్నా నవ్వు విరిసింది .

అడగడం పాపం,ఇక్కడున్నట్టు కంచంతో వచ్చింది పద్మ.

తినిపిస్తుండగా అడిగింది సునీ,ఇపుడు చెప్పు నాన్నా!నా తప్పు ఎందుకు అయింది.

నువ్వు నీకుగా ఇంటర్వ్యూ కి వెళ్లావు,దానికోసమ్ ముందు అప్లికేషన్ పెట్టావ్.అవునా!?

పో నాన్నా!ఎప్పుడూ నాదే తప్పు అంటావు.అలా అయితే ఇపుడు నేను ఓడిపోయినట్టా..

నా చిట్టితల్లి ఓడిపోయే ప్రసక్తే లేదు.కాకపోతే కొంచెం కంగారు అంతే!?

ఓ మాట చెప్పనా సునీ!?

చెప్పండి నాన్నా!?వినాలి తప్పదు కదా.

అలా అయితే వద్దులే!?

చెప్పండి నాన్నా ప్లీస్,నాకు ఎక్కడైనా పనికి వస్తుందేమో!

రావణుడి చెరలో ఉన్న సీతమ్మ రాముడు లేని జీవితం ఎందుకని బాగా నిరాశ చెందింది.ఎంతవరకూ అంటే ఇంక నాకు నేను వద్దు.గొప్పతనం ఉన్నపుడు ప్రకృతి వారి ప్రతి కదలికనూ లోకానికి తెలియచేస్తుంది.పదిమంది దాన్ని ఆగి చూడక్కర్లేద్దు.ఎవరు అవసరమో వాళ్ళు చాలు..అలా సీత మమసు రాముడికి తెలుసు,అందుకే పక్షుల కీలకిలల రూపంలో వాతావరణాన్ని ఆహ్లాదపరిచేడు.హనుమ అమ్మకి కనిపించేడు.రామయ్య నిన్ను రాజ్యానికి తీసుకుపోతాడని ,ఆయన మాటగా చెప్పేడు.సీత ఎంతలా కుదుటపడింది అంటే...రాముడు రాక కోసం వేచి చూసింది,రావణుడి పిచ్చి వ్యవహారాన్నీ తృణప్రాయంగా చూసింది.అంతటి శక్తి అణువుపరమాణువు రూపాల్లో సృష్టి మొత్తం నిండి ఉంటుంది.ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో,అదే ఇచ్చి తీరితుంది లేదా జరుగుతుంది..

అవును నాన్నా!గౌతమి అని ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయి పర్సు పోయింది.స్కూల్ బస్ మమ్మల్ని కాంప్లెక్స్ లో దించింది.అందులో మర్చిపోయెను అంటుంది.క్యాంపస్ కి ఫోన్ చేసి బస్ వివరాలు చెప్తే అందులోనే పర్సు దొరికింది.అంతా ఎక్కడో పడేసి,వాళ్ళని అంటావు అన్నారు.ఈమె మాత్రం అలా పట్టు పట్టి కూర్చుంది,బస్ లోనే పర్సు ఉందని.కానీ నా ఉద్యోగానికి దీనికి లింక్ ఎలా నాన్నా...పిల్లలు ఎంత ముద్దుగా సమాధానం చెప్తున్నారు నాన్నా!ఇంక నా మార్కు పాఠం వాళ్ళ బుర్రకి ఎక్కిస్తే వాళ్ళు ఎక్కడో ఉంటారు..మళ్ళీ నీరసపడింది.తొందరలో నిద్ర వచ్చింది.

ఉదయం ఏడవుతున్నా లేవలేదు నీ గారాలపట్టి.పెళ్లి చేస్తే లైన్లో పడుతుంది.మాటకి నవ్వేరు రాజుగారు

ఇంతలో ఫోన్ మోగింది.సునంద మేడం ఉన్నారా అంటూ ఆడిగేరు అవతల.

నేనే అంటూండగా,ఒకసారి స్కూల్ కి రాగలరా మేడమ్!?చిన్న మిస్టేక్ జరిగింది.ఇంటర్వ్యూ వద్దు ఇక,రేపట్నుంచి వీలయితే క్లాస్ తీసుకోవచ్చు ..అందుకే..

నిజమా గిచ్చుకుంది సునీ.

నాన్న తలనిమురుతున్నారు.అమ్మ దేవుడి ప్రసాదం నోటికి చూపించి,మొహం కడగలేదంటూ నోట్లో వేసుకుంది.

అసలు నిన్న ఉద్యోగం లేదని,ఇవ్వాళ రేపే వచ్చేయండి అంటే..వెళ్లాలా నాన్నా..

తప్పు సునీ!ఇలా అడగకూడదు.నిన్న నిన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో కనుక్కో!అవసరం అయితే నిర్ణయం మార్చుకో!బావుంది అంటే పిల్లల్ని నీ ఆశయానికి అనుగుణంగా మార్చుకో...

అవకాశం ఇస్తే నేను చెప్పే ప్రతిపాఠం విద్యార్థిని విజయాల వంతెనపై నడిపిస్తుంది అని మీ గురించి రాయండి అన్న కాలమ్ లో ఉన్న ముత్యాల్లాంటి అక్షరాల వెలుగును తరచి చూసిన,డైరెక్టర్ కం రిటైర్డ్ ప్రొఫెస్సర్ విష్ణుమూర్తిని అలరించింది సునందకి, సహా టీచర్ ద్వారా తెలిసింది.

తోలుకప్పుకున్న ఈ శరీరానికి ఎన్ని కళలని!?దేనికో పరవసిస్తుంది.దేన్నో మురిపిస్తుంది.ఎన్నో సాధిస్తుంది.ఏవేవో ఊసులు చేర్చి ,మనసు తీగల్ని శృతి చేస్తూనే ఉంటుంది..మంచి కావాలా అని తరచి మరీ అడుగుతుంది.ధైర్యంగా నిలబడితే పరీక్షలు పెట్టి పాస్ చేస్తుంది.పారిపోతున్నా పట్టుకుని ఆపి మరీ విజయపు రుచి చూపిస్తుంది.ఈ తీగల శృతికి సంతోషం దుఃఖం రెండూ ఒకటే..తీసుకునే మనలోనే మార్పు..


Rate this content
Log in

Similar telugu story from Abstract