STORYMIRROR

Anudeep

Drama Horror Thriller

4  

Anudeep

Drama Horror Thriller

Raamu

Raamu

2 mins
2

రాము… రోజు లాగే…

ఊరు చివర ఉన్న తన పొలం లో పనులు చేసుకోవడానికి వెళ్తాడు…

ఒక్కడే…
ఎవరి సహాయం లేకుండా…
తానే అంతా చేస్తుంటాడు…

ఉన్నతంగా చదువుకున్నా కూడా…
తన ఊరు…
తన పొలం మీద మమకారం తో…

ఎవరి సహాయం లేకుండా…
తానే ఇష్టంతో…
కష్టపడుతుంటాడు…

ఆ ప్రకృతి…
పచ్చని పిరు…

తన తోబుట్టువుల లాగా…
అనుకుంటుంటాడు…
రాము…

అలా పనులు పూర్తయ్యాక…
చెట్టు కింద సేద తీరుతూ… నిద్రలోకి జారుకుంటాడు…
ఇంతలో…
ఆకాశం ఒక్కసారిగా మారిపోతుంది…
పెద్ద వర్షం…
ఉరుములు… మెరుపులు…
ఆ వర్షంలో తడుస్తూ…
రాము ఇంటికి చేరుకుంటాడు…
ఇంటికి రాగానే…
రాము అమ్మ…
తడిచిన రాముకి ఒక తువాలు ఇచ్చి…
“ముందు స్నానం చేసి… భోజనానికి రా” అని చెబుతూ వెళ్తుంది…
స్నానం చేసి…
రాము భోజనానికి కూర్చుంటాడు…
పక్కనే… రాము నాన్న కూడా కూర్చుంటాడు…
రాము అమ్మ… అన్నం వడ్డిస్తూ…
“ఇంత చదువు చదివి… పొలం లో కష్టం చేస్తుంటే… చూడలేకున్నాం రా…” అని బాధగా అంటుంది…
అంతలో… రాము నాన్న…
“తినేటప్పుడు వాడిని విసిగించకు…”
“మనము ఏం చేసినా… ఇష్టం తో చేస్తే…
అందులో మనకి సంతోషం ఉంటుంది…”
“ఇప్పుడు వాడు అదే చేస్తున్నాడు…
వాడికి అదే ఆనందంగా ఉంది…”
“వాడి ఆనందమే కదా మనకి కావాల్సింది…”
“ఇంకెప్పుడూ దీని గురించి మాట్లాడకు…” అని చెబుతాడు…
“సరే…” అంటుంది రాము అమ్మ…
అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా…
ఒక్కసారిగా…
పెద్ద పిడుగు…
వాళ్ల ఇంటి మీద పడుతుంది…
ఒక్క క్షణంలోనే…
ఇంటి తో పాటు…
అందరూ… బూడిదైపోతారు…

చూస్తుండగానే…
సాయంత్రం అయిపోతుంది…
రాము…
ఉలిక్కిపడి…
నిద్ర నుంచి ఒక్కసారిగా లేస్తాడు…

“కల…”

అవును… ఇదంతా ఒక కల…
జరగనిది కాదు…
జరిగిందే…
అవును…
పిడుగు పడటం వల్ల…
అందరూ చనిపోతారు…
బాధతో…
రాము నెమ్మదిగా లేచి నడుస్తుంటాడు…
ఇంతలో…
తనకు తెలిసిన ఒక వ్యక్తి…
చాలా తొందరగా అటు వైపు వెళ్తుండటం గమనిస్తాడు…
రాము… అతన్ని పిలుస్తాడు…
అతను పలకడు…
మళ్లీ గట్టిగా పిలుస్తూ…
రాము తన సైకిల్ మీద అతని వైపు వెళ్తాడు…
ఇంతలో…
ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి…
రాము వైపు చూస్తాడు…
ఒక్క క్షణంలోనే…
భయంతో గట్టిగా అరుస్తూ…
తన చేతిలో ఉన్న వస్తువులన్నీ అక్కడే వదిలేసి…
పారిపోతాడు…
ఇంతకి…
అతను ఎందుకు పారిపోయాడు…?
అతను చూసింది…?
......

రాముని కాదు…

ఒక్క సైకిల్…
స్వయంగా వస్తున్నట్టే కనిపించింది అతనికి…
అవును…
ఆ రోజు…
పిడుగు పడినప్పుడు…
తల్లిదండ్రులతో పాటు…
రాము కూడా చనిపోయాడు…
అప్పటి నుంచి…
అతను గాలి రూపంలో…
తన పొలంలో పనులు చేస్తున్నట్టుగా…
అక్కడే తిరుగుతుంటాడు…

ఇంకా ఉంది......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu story from Anudeep

Raamu

Raamu

2 mins చదవండి

Similar telugu story from Drama