STORYMIRROR

Sreelakshmamma Sreelakshmamma

Drama

4.5  

Sreelakshmamma Sreelakshmamma

Drama

ప్రణయ గీతిక

ప్రణయ గీతిక

5 mins
18




  ఉషోదయాన భానుడి లేలేత కిరణాలు పడుతూ ఉండగా పొగ మంచు మెల్లమెల్లగా తెరతీస్తూ ఉంటే చుట్టూ మొక్కలు, చెట్లు కనిపించగా బస్సులో  కిటికీ అద్దాలను కాస్త వెనక్కి జరిపి  ఆ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ "ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంతైనా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని ఊరికే అనలేదు ఆనాటి పెద్దలు "   అని మనసులో అనుకుంటూ ఉండగా దిగాల్సిన బస్ స్టాప్ రావడంతో బస్సు దిగి కూని రాగాలు తీస్తూ అలా నడుస్తూ వస్తూ ఉంటే చెట్ల మధ్యలో నుంచి ఏదో బ్యాగ్ కి రాయి తగిలినట్లు అనిపించడంతో రెండుఅడుగులు ముందుకేసిన ప్రభ వెనక్కి రెండడుగులు వేసి" ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసులే " అని చిరునవ్వు నవ్వుతూ  చెట్టు పక్కన దాక్కున్న నాలుగేళ్ల   అమ్మాయిని అలా తొంగి  చూసి వెనక్కి వచ్చి "అమ్మదొంగా! నువ్విక్కడున్నావా?"అనిచెవి పట్టుకోబోగా  కిలకిల నవ్వుతూ పరిగెత్తింది ధృతి.

ధృతి ! ఆగు! కింద పడతావు అంటూ వేగం తగ్గించాడు ప్రభ  . 

"మావయ్య ! నాకు రన్నింగ్ రేస్ లో ఈ మధ్యనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా!"  అని ముందుకు పరిగెత్తుతూ ఉంటే  అంతలో ద్రుతి అమ్మ జానకి వచ్చి పట్టుకుంది పాపని .

"ఏంటక్కా  నీ కూతురు ఈ వయసుకే  పరుగుల రాణి పి.టి.ఉష  రికార్డ్ ని బ్రేక్ చేస్తున్నట్టుంది "అని నవ్వాడు ప్రభ.

ఏoటే! మావయ్యని  ఆటపట్టిస్థావా"  అంది జానకి.

అమ్మా ! నీ తమ్ముడికి రన్నింగ్ అంటే భయమని నువ్వే చెప్పావుగా అందుకే ఆటపట్టిస్తున్నా  అని నవ్వుతుంది దృతి

"ఏంటి నన్ను ఆటపట్టిస్తావా" అంటూ బుగ్గగిల్లి పాపని ఎత్తుకున్నాడు ప్రభ.

ఈమధ్య ఆడుకోవడం ఒక పండగ అయిపోయిందిరా దానికి చెప్పింది. " జానకి.

"ఆడుకునే వయసులో ఆట ఆడాల్సిందే లేకపోతే ఆట మాట వరకే పరిమితం అయిపోతుంది  కదా నాన్న" అంటూండగా పాప ఏదో చెవిలో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే చెవి ఆన్చుతాడు ప్రభ.

 "మావయ్య అమ్మ ఆల్రెడీ ఆల్ఫాబెట్ మొదలు పెట్టేసింది తెలుసా "అని చెవిలో గొణుగుతూ చెప్తుంది ధృతి.

బావ,మరదలు మాటలకి తక్కువ లేదు గాని," ఏంట్రా చవిలో  ఏదో గొణుగుతోంది "అడిగింది జానకి.

."ఏం లేదులే అక్కా "అని ప్రభ ఇంకా ఏదో చెప్పబోతుంటే
"సరే,మీ బావ, మరదలు మాటలకి ఏం గాని ముందు కాళ్లు చేతులు కడుక్కొని భోజనానికి రండి తర్వాత మాట్లాడుకుందురు "అని జానకి చెప్పేసరికి కాళ్లు చేతులు కడుక్కొని కంచం ముందు కూర్చుంటారు ముగ్గురు.

 "ఏరా చదువు ముగిసినట్టేనా "అన్నం వడ్డిస్తూ అడుగుతుంది జానకి.

"దాదాపు ముగిసినట్టేనక్క ట్రైనింగ్ మాత్రమే మిగిలింది,"అన్నం తింటూ చెప్తాడు ప్రభ.

"అదేదో ట్రైనింగ్ పూర్తయిపోగానే అమ్మకి రిలీఫ్ ఇవ్వరా నీకోసం చాలా కష్టపడింది పాపం "అంటూ మరోసారి సాంబార్ వేస్తూ అడిగింది జానకి.

 "అవును,నేను కూడా అలాగే అనుకున్నానక్క " అని చెబుతుంటే  ధృతి "మావయ్య! ఇంకాస్త అన్నం పెట్టనా" అని అడిగేసరికి "నాకు కడుపు నిండిందమ్మ  అయినా నువ్వు అడుగుతున్నావుగా వడ్డించు తింటానులే "అనేసరికి పాప అన్నం వడ్డించగా  తింటాడు ప్రభ

. భోజనం ముగియడంతో బయటికి వచ్చి చూసేసరికి  పాప గడప మీద కూర్చుని ఉంది.ప్రభ అక్క డికెళ్ళి చూస్తే పిలిచినా మాట్లాడలేకపోయేసరికి "నాన్న!  నీకోసం నేనేం తెచ్చానో చూడు  "అని రన్నింగ్షూ స్ చూపించాడు ప్రభ.

"నాకు రన్నింగ్ షూస్ వద్దు ఏమీ వద్దు "అని పాప బుంగమూతి  పెట్టి చేతులు చాపడంతో పాపని ఎత్తుకుని "ధృతి!నా ట్రయినింగ్ అయిపోగానే నిన్ను ,అమ్మని కూడా తీసుకెళ్తాను సరేనా "అని చెప్పడంతో పాప నవ్వుతూ సరేనని తలూపడంతో     హై ఫై తీసుకొని రన్నింగ్ షూస్ ఇచ్చి బాయ్ చెప్పి బయలుదేరుతాడు ప్రభ.

 అక్కడి నుంచి బస్సుకు బయలుదేరి కాలేజీకి వెళ్లాలని కాలేజ్ రోడ్డులో దిగి వెళ్దామనుకుంటే   వర్షపు చినుకులు మొదలవడంతో కాస్త ఆగాల్సి వచ్చింది . అక్కడే నిలబడిన ప్రభ  ఆకాశంలో ఓ మెరుపు మెరువడంతో  అటు  చూస్తున్న ప్రభాకు రంగురంగుల గొడుగుతో  ఒక అమ్మాయి  ఐహిల్స్ చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటే ఆ వర్షపు నీటిలో టప్ టప్ మన శబ్దం రావడంతో అటువైపు చూశాడు ప్రభ.

 తన ముఖం కనిపించకుండా గొడుగును పట్టుకున్న అమ్మాయి తన చేతుల్ని చాచి అటు తిరిగి ఆ వర్షపు నీళ్లు చేతి మీద పడుతూ ఉంటే వేళ్ళని కదుపుతూ చేతిని అలా తన భుజం దగ్గర పెట్టుకొని చుట్టూ ఒక రౌండ్ తిరిగి కాస్త ముందుకు వస్తూ ఉంటే ప్రభా ఇంకాస్త ముందుకొచ్చి చూస్తున్నాడు. 

" ఆ అమ్మాయి అలా తిరుగుతుంటే ఒక వీడియో తీస్తే బాగుండు అన్నంతగా ఉంది ఆ భంగిమ "అని మనసులో అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి గొడుగు కొంచెం కొంచెం పైకెత్తుతూ తనవైపు వచ్చి నిలబడడంతో ప్రభ లో ఏదో అయస్కాంతం ఆకర్షించినట్లు  అనుభూతి కలుగుతున్నట్లు అనిపించింది .కానీ "ఎంతసేపు చూసినా గొడుగుని ముఖానికి అడ్డం పెట్టుకుంది గాని తీలేదే "అనుకుంటూ ఉండగా గొడుగుని ఆమె కొంచెం పైకి ఎత్తి" హలో రాజా! "అనేసరికి తిరిగి చూసి ఖంగుతిన్నాడు ప్రభ. .

' బిల్డప్ రాణి - అల్లరి వాణి 'నువ్వా అంటూ మరోవైపుకు తిరిగాడు ప్రభ .

  ఏంట్రా నన్ను చూసి అటువైపు తిరిగావు. 'హలో! ఆలా పక్కకు తిరిగితే ఎలా , నా కళ్ళు కాలేజీలోనే నీ ప్రతిబింబాన్ని   ప్రింట్ చేసుకున్నాయి .ఇక ఇప్పుడు కనిపిస్తే వదులుతాయా ఏంటి ' అని కొంచెం దగ్గరికి  నిలబడుతుంది '.
ఏ బిల్డప్రాణి ఆగాగు.  ఇది కాలేజ్ కాదు, రోడ్డు కాస్త దూరం జరుగు అన్నాడు ప్రభ.

 "కాలేజీలో నైనా ఇక్కడైనా నువ్వు    నువ్వే"  అన్న వాణి మాటలకి కోపం వచ్చి ఆమెవైపు చూశాడు ప్రభ. 

 "ఎందుకురా అలా చూస్తున్నావ్ కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు నీ వైపు చూసినా నువ్వు మాత్రం చూసింది లేదు కదా నీకోసం పుట్టిన  మహా తల్లి ఎవరో గాని అదృష్టవంతురాలు  " అని ఆ అమ్మాయి అనేసరికి నవ్వాడు ప్రభ.

  "ఇదిగో ఈ కల్ముషం లేని నవ్వుకే బెల్లం చుట్టూ ఈగల్లా అమ్మాయిలు నీ చుట్టూ  ముసిరేది. "  అంటూ  ఉండగానే బస్సు రావడంతో బై ప్రభ అని చెప్పి అమ్మాయి బస్సు ఎక్కుతుంది. 

ప్రభా అక్కడే కాసేపు వెయిట్ చేయడంతో గోవిందు టు వీలర్ లో రాగా ఇద్దరూ కలిసి కాలేజ్ వైపు బయలుదేరి     కాలేజ్ విషయాలు ఆలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే  బండి నడుపుతున్న గోవిందు కాలేజ్ మెయిన్ గేట్ దాటి చివరి  గేట్   దగ్గరికి వెళుతూ ఉంటాడు. 

ఏ గురు "ఆపరా! మనం కాలేజ్ మెయిన్   చివరి గేటు వద్దకి వచ్చేసాం "అని చెప్పాడు ప్రభ.

"అవును, ఇది కాలేజీ చివరి  గేట్ రా .సార్ కూడా వచ్చేసి ఉంటారు పద వెళ్దాం "అంటూ ఇద్దరూ కాలేజీ గేటు దాటి లోపలికి అడుగుపెడుతుండగా వస్తాడు సారoగ్.

"వచ్చాడబ్బా సోలో పర్సన్, కాలేజీ చదువు ముగిసే   వరకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయింది లేదు కడుపుకి అన్నం తింటాడో లేదో తెలియదు కానీ పంతం ,పట్టుదల, ఈగో, ద్వేషం ఉంటే వంటివి బాగానే జీర్ణం చేసుకున్నాడు "అని గోవిందు మనసులో అనుకుంటూ  తలెత్తి చూసేసరికి ప్రభ, సారo గ్ ని చూసి నవ్వగా  సారంగ్ కూడా నవ్వుతూ వచ్చి ప్రభ ని ఆలింగనం చేసుకోవడంతో    ఇది కలా ?నిజమా? అన్నట్టు తల విదిలించి చూసాడు గోవిందు.

ఏంట్రా ఆలోచిస్తున్నావ్ నువ్వు చూస్తున్నది కల కాదు నిజమే నీవల్ల మేమిద్దరం స్నేహితులయ్యామ్అని  అని సారంగ్  నవ్వుతూ చెప్పాడు.

అది విని అవునా!  మీరు నా వల్ల స్నేహితులయ్యారా అంటూ విస్తూ పోయి చూస్తాడు గోవిందు.

.ఇది నిజం గోవిందు   చెప్పాడు భరోసాతో ప్రభ.

 మీరు నావల్ల స్నేహితులయ్యారా అదెలా అని మరోసారి సందేహంగా ప్రశ్నించాడు గోవిందు.

 "నేను చెప్తా విను "అంటూ సారంగ్  జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టాడు.

***

ఆరోజు  స్పోర్ట్స్ డే కోసం ఫుట్బాల్ మ్యాచ్ హోరా హోరీగా సాగుతుండగా మీ టీంలోని రామ్ కి మా టీంలోని శ్యామ్ కాలు అడ్డం పెట్టడంతో వాడు కింద పడేసరికి రెండు టీంల మధ్య మాటల యుద్ధం మొదలై  కొట్టుకోవడం వరకు వెళ్ళింది.అటు ఇటు వేస్తున్న బంతి నీ  (గోవిందు) చేతికి రావడంతో ప్రిన్సిపల్ రావడం గమనించని నీవు  బంతిని విసిరేసరికి సర్ కింద పడిపోయారు వెంటనే నేను ప్రభ హాస్పిటల్ కి తీసుకెళ్లాం అప్పుడే ఒకరితో ఒకరు మాట్లాడాల్సి వచ్చింది ఇద్దరు భయపడుతున్నాం, బాధపడుతున్నాం.ఆ సమయంలో ఇద్దరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని సర్ ని  బాగా చూసుకున్నాం అంతే కాదు "పోటీ అనేది ఆట వరకే ఉండాలి కానీ అది ఇతరులను ఇబ్బంది పెట్టేవరకు రాకూడదు అని అర్థం చేసుకున్నాం "అని చెబుతూ ప్రభ భుజం మీద చేయి వేశాడు సారంగ్.

"అయితే ఆ  తర్వాత ప్రిన్సిపాల్ సర్ వెంట  నేనెందుకు రాలేదు " అంటూ మరొక ప్రశ్న అడిగాడు గోవిందు.

సర్ తలకి దెబ్బ తగలగానే ముందు నువ్వే తల తిరిగి కిందపడిపోయావ్ అన్నాడు నవ్వుతూ ప్రభ.

అవునా!  అంటూ తలగోక్కున్నాడు గోవిందు.

"అంతే కాదు నువ్వు ఇంకో   మంచి పని చేశావు
తెలుసా" అంటూ సారంగవైపు చూశాడు ప్రభ.

" అవునా! అదేదో త్వరగా చెప్పరా ప్లీజ్  "అని ఆత్రంగా అడిగాడు గోవిందు.

మెడ పట్టిన ప్రిన్సిపల్  స్టూడెంట్స్ , స్టాఫ్ మీద కోపంతో వాళ్లను అరిచి అటు ఇటు తిరుగుతూ కాసేపు రిలీఫ్ అవుదామని ఫుట్బాల్ ఆడే వైపు రావడంతో నువ్వు విసిరిన బంతి మెడకి తగిలి, పట్టిన మెడ కాస్త సరిపోయింది అందుకే సర్ నిన్ను ఏమీ అనలేకపోయారు  చెప్పాడు ప్రభ.

 "అందుకేనా ఆ మరుసటి రోజు సార్ నన్ను చూసి నవ్వారు "అన్నాడు ప్రభ వైపు చూస్తూ గోవిందు .

ఎలాగో  మీరిద్దరూ మిత్రులయి పోయారు కదా అంతే చాలు.  సరె  ఈపాటికి ప్రిన్సిపల్ సారు వచ్చి ఉంటారు పదండి  వెళ్దాం  అంటూ ప్రిన్సిపాల్ రూమ్ వైపు బయలుదేరారు ముగ్గురు. 




ప్రియమైన పాఠకులకు,
  నా కలం నుంచి జారిన  మధురమైన ముత్యo  లాంటి  అక్షరాలతో   ప్రేమను, భావాల్లో  విలువైన స్నేహo  మరియు అనుబంధాన్ని   నింపిన ఈ కథ చదువుతూ,  కథ మరియు కథలోని పాత్రల అనుబంధం  ఎలా అనిపించాయో మీ హృదయ స్పందనలోని  మాటలను సమీక్షలో తెలుపుతారని ఆశిస్తున్నాను.
మీ మాటలు మాకు ఎంతో విలువైనవి ,మమ్మల్ని ప్రోత్సహించేందుకు తోడ్పడుతాయని భావిస్తున్నాను.






















 






           

     



Rate this content
Log in

More telugu story from Sreelakshmamma Sreelakshmamma

Similar telugu story from Drama