ప్రేమ విలువ
ప్రేమ విలువ
ఉన్నావా!?చచ్చావా!?పలుకు....పొద్దున్నే కుదిపి లేపుతున్న చెల్లెలు దివ్యని ,చిరాగ్గా చూస్తూ...అమ్మని పిలువు..నీ మొహం చూసి పొద్దున్నే ఎవడి బండికింద పడి చావాలి!?విసుక్కుoటున్నా సరే..అక్కడే చేతులు కట్టుకు నిలబడింది..
అయినా అమ్మని పిలిచి,తాను వెనక్కి నిలుచుంది..
నీ మొహం చూసే అలవాటు కదా!దీన్ని ఎందుకు పొద్దున్నే నా మీదకు పంపిస్తావ్!చిరాకుగా ఓ చూపు విసిరి,దివ్య అందిస్తున్న పేస్ట్ బ్రష్ లాక్కుని పెరట్లోకి వెళ్ళిపోయాడు ఉదయ్..
దాన్ని ఎందుకురా విసుక్కుంటావ్!?నువ్వు దేశాలు పట్టుకు తిరుగుతుంటే ,మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటోంది..నాన్నగారి మాటలకు అడ్డుపడుతూ అన్నాడు..
ఇక కష్టపడింది చాలు..వెళ్ళిపొమ్మనండి..ఈమె వచ్చింది మొదలు రోజూ గోల,గొడవ అమెరికాలో మా ఇంట్లో కూడా...గుడ్ మార్నింగ్ మొదలుపెట్టి,రాత్రి నిద్రపోయేవరకూ ఎప్పుడు నేను పోతానో...ఆస్తి ఆమెకు రావాల్సింది ఎక్కడరాదో అన్నట్టు ...గుర్తు పెట్టుకో అని సందేశాలు మీద సందేశాలు పంపుతుంది...విసుపు వస్తుంది నాన్నా!!
అది అభిమానం అయి ఉండొచ్చు ...నాన్న నవ్వుతుంటే
నాకు ముందు పుట్టిందా!?నేను వదిలిన అమ్మపాలు తాగిందా!?అనాథ అది..దానికి అభిమానం,అనుబంధం అంటే నమ్మేసేవా నాన్నా!పైగా ఇలాంటివాళ్ళు డబ్బుల కోసం మనలాంటివాళ్లను ఎన్నుకుని మరీ,మాయా అనుబంధాలు చూపిస్తారు..ఎన్ని సినిమాల్లో చూడలేదు..
అవే సినిమాల్లో సొంతవాళ్ళు రాబందులుగా మారడం చూపించేరు..మేము వాటిని పట్టించుకోలేదు,దీన్ని ఎలా అపనమ్మకంతో చూడమంటావ్ ఉదయ్..
సరే!నేను రెడీ అయ్యి పొలాలు సంగతి చూసి వస్తాను..మీరు టిఫిన్ తిన్నాక అక్కడికి రండి.కొంచెం మాట్లాడే పని ఉంది..
ఇల్లు,ఆస్తి లాంటి వివరాలు గురించి ఇక్కడే మాట్లాడు..పరయివాళ్ళు ఎవరూ లేరిక్కడ..నీకు కుదిరినప్పుడే...పేపర్ మసిచేస్తూ శ్రీమతి తెచ్చిన కాఫీ అందుకున్నారు..
మీ ఇష్టం..నాకు నేను,పిల్లలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఆఊళ్ళో ఉంది..నాకు మీరు ఇవ్వకున్న,ఇచ్చినా లాభం నష్టం రెండూ లేవు...స్నానం కూడా అయి పొలానికి బయలుదేరేడు..
దారంతా పలకరింపులు ఒకవైపు అయితే...బాబాయ్ మావయ్యల్ని దివ్య అనుపానుల్ని నిగ్గుతేల్చే దిశగా పరిశోధన మరోవైపుగా సాగుతూ పొలానికి చేరుకున్నాడు..
సగంపైగా ఇలాంటివాళ్ళు ఎదో ఆశించి ఇళ్లలోకి చేరుతారు..నెమ్మదిగా మనసులో ముద్రపడిపోతారు..విడిపించుకుందాం అనుకున్నా విడదీయరాని అనుకునేంత దృఢమైనపుడు...డబ్బుల్ని డిమాండ్ చేస్తూ పరువు తీస్తుంటారు..మన పేరు చెడగొడుతూ ఉంటారు..ఇలాంటివాళ్ళతో కొంచెం జాగ్రత్త..నిన్ను నిత్యం ఎలా ఉన్నావ్,ఏమి తిన్నావ్ అని అక్కర ఉన్నట్టు సోధిస్తూ కూడా ఉంటారు..
శోధన కాదు మావయ్యా!సాధించడం అంటారు దాన్ని..చాలా చిరాకు అనిపిస్తుంది..డబ్బే కావాలి అంటే డైరెక్ట్ ఆడిగేస్తే ఎంతోకొంత మొహాన కొడతాం కదా!ఇంత దేవురించడం దేనికి!??
అలా అనకు ఉదయ్!ఈ వయసులో వాళ్ళని తల్లిదండ్రుల్ల చూసుకుంటుంది..వాళ్ళు కూడా ఇష్టపడి ఆశ్రమం నుంచి తెచ్చుకున్నారు..ఎవరూ పలకరించకుంటే ఎలా పొద్దుపోవాలి వాళ్ళకి..సమయానికి మందులు అందిస్తూ,మంచిగా వండిపెడుతూ వాళ్ళ అమ్మానాన్నల్ని వీళ్ళల్లో చూసుకుంటుంది...నిన్ను ఎప్పుడైనా పైసా ఇమ్మని ఆడిగిందా!?ఇంకో పెద్దాయన విశ్లేషించాడు
నువ్వు ఉండు పెద్దనాన్నా!!ఇలాంటి వాళ్ళ ప్రణాళిక మనకు అర్థం కాదు..కీడు ఎంచి మేలెంచడంలో తప్పు లేదు..ఆ పిల్లకి అంతా డబ్బు అవసరం అయితే కోట్లే కావాలా...దాని బ్రతుక్కి మీ అమ్మ,నాన్న ఒంటిమీద బంగారం చాలు..అనాథ బ్రతుక్కి అంతకన్నా ఎక్కువ చూసే,దొరికే అవకాశం రెండూ లేవు..మావయ్య తన తరఫు వినిపించాడు..
రెండు వాదనలు బావున్నా,మావయ్య నిజం చెప్తున్నాడు..కాబట్టి నేను నావాళ్ళని కాపాడుకోవాలి..దానికి అమ్మతో .నాన్నతో కంటే దివ్యతో ముందుగా మాట్లాడాలి..అనుకుని ఇంటిదారి పట్టాడు..
పుట్టినరోజు అనుకుంటా..కాళ్ళకి మొక్కుతూ కాకా పడుతుంది..ఉదయ్ కాళ్ళకి నమస్కరించబోయింది..
వంద చేతిలో పెట్టాడు..తులసిమొక్క దగ్గరపెట్టేసింది దివ్య..
అబ్బో!వంద చాలదు అనుకుంటా అమ్మగారికి భుజాలెగరేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు..
తప్పుకదా ఉదయ్!దానికిపుడు డబ్బు అవసరం ఏముంది!?ఎందుకలా చిన్నచూపు చూస్తావు దివ్యని..
నాకు నచ్చలేదమ్మా!నేను ఎలా మొదలుపెట్టాలా ఈ విషయం అనుకుంటున్నాను..మీరే మాటవేశారు..ఇక ఇప్పుడు చెబుతున్నా.మీరు నాతోపాటు వచ్చేస్తున్నారు..ఆవిడని తనదారి తనని చూసుకోమనండి..ఏమైనా ఇవ్వదల్చుకుంటే చెప్పండి ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాను..
ఈ పేపర్ మీద సంతకం పెట్టు ...నాన్న అందించిన దానిలో విషయం చదువుతూ విస్తుపోయాడు.
ఆఊరిలో బ్రతుకు మావల్ల కాదు..ఈ మట్టిలోనే మేము కలిసిపోవాలి .నీకు వీలైతే ,ఇది నీతాత ఆస్తి కాబట్టి మాకింత ముష్టి పడేసి,నువ్వు వెళ్లి...మా చివరి చూపుకు రా..ఈలోపు మమ్మల్ని కంటికిరెప్పలా చూసుకోవడానికి ఈ అనాథ ఉంది..
నానా!మతి ఉండే మాట్లాడుతున్నారా!!ఈమెని నమ్మి ఈ ఆస్తి,మిమ్మల్ని వదిలి ఎలా పోగలను!?ఊరన్తా నన్ను వెలేయదూ...అంతా నీవల్లే అన్నట్టు కళ్లెర్రజేశాడు కాఫీ అందిస్తున్న దివ్యని చూస్తూ...
నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నయ్యా!అమ్మానాన్నని మీతో పంపే పూచీ నాది ఇంకోమాట వినకుండా వెళ్ళిపోయింది..
సాయంత్రానికి అందరి మొహాలు ఎర్రగా మారినా,ప్రయాణానికి సిద్ధం అయ్యారు ఉదయ్ తల్లిదండ్రులు...
దివ్య గదిలో,దిండుకిన్ద ఓ కవర్ పెట్టి వచ్చేశాడు ట్రైన్ ఎక్కేముందు..ఇల్లు అద్దెకు ఇచ్చేద్దాం..మళ్ళీ ఎండల వరకూ కౌలుకి ఇచ్చేసాను..అమ్మడమా లేక ఇంకెదన్నా ఆప్షన్ తరువాత చూద్దాం..ఇప్పటికి హ్యాపీ ఎండింగ్ మా అమ్మానాన్న నాతో ఉండబోతున్నారు ఉదయ్ సంతోషానికి హద్దే లేదు..
ట్రైన్ ప్లాట్ఫార్మ్ విడిచి వెళ్ళిపోయింది..బెదిరించడానికి తెచ్చుకున్న పొలం మందు సీసాతో ఒంటరిగా మిగిలిపోయింది దివ్య..
తీసుకున్నగోతిలో పడాలి తప్పదు..యోగక్షేమాలు మేమూ అడుగుతాం...మన పిలుపుకు,పరాయి పిలుపుకి తేడా తెలిసిందా!!అంటించుకోవాలని ఆత్రపడితే సరిపోతుందా!!మనసులో ఆ అనుబంధానికి ఓ రూపం ఉండాలి కదా!నీకు డబ్బు రూపంలో ఉంటే...
దివ్యకి మా రూపంలో ఉంది ఓ జంట మాట స్థిరంగా వినిపించింది ఉదయ్ మావయ్యకి..
చెల్లెమ్మా!మీరు.. ఇక్కడ...అబ్బాయితో పోలేదా!?
అమ్మాయితోనే పోదాం అని వచ్చేసేమ్..సీసా చూసి గుండెల్లో దడ పుట్టింది దివ్యకి..
ఏంటివి అమ్మా!?ఈసారి పిలుపు అమృతంన్ని మించి అనిపించింది వారికి..
నువ్వు మాకు లేకపోతే ఇది మా తోడు అనుకున్నాం..ఇపుడు నువ్వు అదే తొడుని ఎన్నుకున్నావు కదా!పద ముగ్గురం పోదాం...మూత విప్పబోతున్న సీసాని విసిరికొట్టింది దివ్య..
నువ్వు మాకు ఇక్కడ ముద్ర పడిపోయావు దివ్యా!మా మనసు ఇపుడు కొడుకు,పిల్లలు,అమెరికా అడగడం లేదు..ఓ గుప్పెడు ఆప్యాయత..దాని ఖరీదు ఎంతో చెప్పు తల్లి!దివ్యని దగ్గరికి తీసుకుని ఏడ్చేశాడు తండ్రి.
దివ్య ప్రాణం అంత నాన్నా!నేను ఉన్నంతవరకూ మీకు ఆ లోటు రానివ్వను...పదండి ఇంటికి వెళ్దాం..చేతిలో బాగ్ అందుకుంటుంటే ...అపరిచిత స్పర్శ దివ్య చేతిని ప్రేమగా ఆపింది..
ఇంకో పదిరోజులు ఉండి,ఇల్లు బాగుచేయించి వెల్దామని ఆగుతున్నాను..నీ మీద ప్రేమకారిపోయి కాదు..ఉదయ్ కంట నీరు ఆగడం లేదు..
ఏంట్రా మార్పు అల్లుడూ...మావయ్య ఆశ్చర్యపోతుంటే..
మరి ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావ్...ఉదయ్ పెదనాన్న దివ్య తల నిమురుతున్నారు ఆప్యాయంగా..
ఓ పిలుపు విలువ తెలుసుకోవడానికి మనసు కావాలి..అర్థం కావాలంటే ముందుగా మనిషి కావాలి..
ప్రతి ఆప్యాయత వెనుక విషం చిమ్మే అలోచనలు బహుశా అలా ఆలోచించేవారికే దొరుకుతాయేమో!?మనసుపెట్టి చూస్తే విషం అనుకున్నదాని రూపు కళ్ళకు కమ్మిన పొరలా వీడి,సత్యం కనిపిస్తుంది..ఆ పిలువు నిత్యం అమృతమై వినిపిస్తుంది..అక్కడ ఉన్నది అమృతమే!మన ఆలోచనలు మాత్రమే విషం...
