STORYMIRROR

హృదయ అంకిత

Drama Classics Others

4  

హృదయ అంకిత

Drama Classics Others

ప్రేమ క్షణాలు

ప్రేమ క్షణాలు

8 mins
363


పచ్చని వాతావరణం, చుట్టూ కొండలు, ఎదురుగా సన్నటి కాలి నడక దారి. అప్పుడే వచ్చిన కారులో నుంచి దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెలుతుంది దివ్య.

దివ్య : యమున ఎక్కడున్నావే. కార్ వెళ్లటానికి ముందుకు దారి లేదు. చుట్టూ ఎవరు కనిపించటం లేరు.ఇప్పుడేం చేయాలే..రాను రాను అంటే ఫోర్స్ చేసి మరి రమ్మన్నావు.నేను డైరక్ట్ కార్ ఆ టెంపుల్ వరకు బుక్ చేసుకున్న. ఇక్కడ చూస్తే దారి లేదు.

యమున : హా అలాగే ఉంటుంది మరి.అగవే ఇద్దరం ఒకేసారి వెళ్దాం అంటే విన్నావా..నేను వే అలా ఉంటుంది అని చెప్పేలోపే ఫోన్ కట్ చేశావు.ఎందుకే అంత తొందర నీకు. మెసేజ్ కూడా చేసా .ఒకసారి చూడు కావాలంటే..

దివ్య : హా సారినే చూడలేదు. నువ్వొచ్చాకే వద్దామనుకున్నా కానీ నూ చాలా లాంగ్ నుంచి వస్తావు.టెంపుల్ దగ్గర కలుద్దాములే అనుకున్నా..😯😯

యమున : హా అఘోరించావులే.. సరే ఇప్పుడు ఎవరైన ఉన్నారా...నీతో? 

దివ్య : హా ఉన్నాడు. క్యాబ్ డ్రైవర్.

యమున : సరే జాగ్రత్త. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. అసలే ఆ ఎరియాలో అమ్మాయి మిసింగ్ అని న్యూస్ లో కూడా ఇచ్చారు.

దివ్య : (భయపడుతూ ) అయ్యయ్యో భయపెట్టి చంపుతున్నావ్ కదే..ఇప్పుడు ఎలా. .? నువ్వు ఇంకా ఎంత సేపట్టో వస్తావే..

యమున : కంగారు పడుకు. ఇంకా త్రి అవర్స్ లో అక్కడ ఉంటాను.జాగ్రత్త

దివ్య : హూ..

యమున : హా ఒక పని చేయ్. ఈ టైమ్ లో అదే బెటర్.

దివ్య : హో ఏమ్ చేయాలే.

అని మాట్లాడుతూ ఉండగా క్యాబ్ డ్రైవర్ కార్ దిగి దివ్య ని పిలుస్తూ " హాల్లో మేడమ్ ఇంకా ఎంతసేపు. త్వరగా వచ్చి మీ లగేజ్ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను."అని అన్నాడు.

దివ్య అతని కొంచెము కోపంగా చూసి ఫోన్ చెవికి పెట్టుకొని " ఉండవయ్యా బాబు వస్తున్నాను."అంటూ మళ్లీ యమునతో మాట్లాడటం మొదలు పెట్టింది.

అప్పుడు ఆ డ్రైవర్ కోపంగా కార్ ఎక్కి " ఛీ ఎదో అర్జంట్ పని ఉన్నా కూడా మా సార్ చెప్పారని ఇలా వచ్చాను.అంటూ ఒక  సారి దివ్య వైపు చూసి తల పట్టుకొని  కాని ఈ అమ్మాయి అసలు కదిలేలా లేదు.అయినా అంతలా ఈ అమ్మాయిలు గంటలు గంటలు ఏమి మాట్లడుకుంటారో ..అబ్బా చిరాకు వస్తుంది అంటూ ఆ కార్ లో పిచ్చిగా అటు ఇటు చూస్తూ ఉన్నాడు.

దివ్య : చెప్పవే ఏం చేయాలి..?

యమున : (కొంచెము అనుమానంగా) ఆ డ్రైవర్ చూడటానికి ఎలా ఉన్నాడే...?

దివ్య ఫోన్ మాట్లాడుతూ కార్ లో అసహనంగా తననే చూస్తున్న డ్రైవర్ ని చూసి

దివ్య : పెద్ద తింగరోడిలా ఉన్నాడే

అని కొంచెము పెద్ద వాయిస్ తో అంది. ఆ కార్ నుంచి ఆమె కొంత దూరంలోనే ఉండి మాట్లాడటం వల్ల ఆ మాట ఆ డ్రైవర్ కి వినపడింది..అప్పుడు అతను కోపంగా కార్ హారన్ ప్రెస్ చేశాడు. అప్పుడు ఫోన్ మాట్లడుతున్న దివ్య అతన్ని చూస్తూ కొంచెము రిక్వెస్ట్ గా ప్లీజ్  5 మినిట్స్ అని సైగ చేసింది.వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ తల కిందకి దించుకున్నాడు.మళ్లీ కార్ దిగి చుట్టు పక్కల ఉన్న కొండలను , వాతావరణాన్ని తన కెమెరాలో ఫోటో తీసుకుంటున్నాడు.

యమున : ఆ అబ్బాయిని ఎలాగైనా ఒప్పించి నీకు తోడుగా ఆ టెంపుల్ వరకు రమ్మను .అంతే కాని అక్కడ మాత్రం ఉండకు .నేను నా ఫ్రెండ్స్తో కలిసి వస్తున్నాను.ఓకేనా..

దివ్య కంగారుగా ఆ డ్రైవర్ ని చూస్తూ " రాడేమోనే "

యమున : అదంతా కాదు ఫస్ట్ నూ వెళ్లి అడుగు అతన్ని. సరే మరి కాల్ చేయి ఏం ప్రాబ్లమ్ ఉన్నా .అక్కడికి మేము వచ్చే వరకు అక్కడే ఉండకండి.ఓకేనా ఆయిడ్ ఒకవేల అతను రాకపోతే ఎవరైన భక్తులు వెలితే వారితో పాటు వెళ్లు కే

దివ్య : ఓకేనే..

అని ఫోన్ కట్ చేసి డ్రైవర్ దగ్గరకు వెళ్ళింది. అతను ఆమె వస్తుంది అని గమనించి కార్ ఎక్కడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా దివ్య అతన్ని పిలిచింది.

దివ్య : ఎక్యుస్ మి.

కార్ ఎక్కకుండా డోర్ తెరిచి ఆ డ్రైవర్

డ్రైవర్ : కొంచెము కోపంగా హా మీరు మీ లగేజ్ తీసుకోండి త్వరగా

దివ్య : హా తీసుకుంటానండి. కానీ మని ఇవ్వను అని పొగరుగా చెప్పింది.

డ్రైవర్ : (కార్ డోర్ కోపంగా క్లోజ్ చేసి ) ఎందుకివ్వరండి.అని అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు

దివ్య :భయపడితే పనులు కావని మనసులో అనుకుంటూ "హా ఇవ్వనయ్య . ఏం చేస్తావ్ నువ్వేమైన నన్ను టెంపుల్ వరకు డ్రాప్ చేశావా ఏంటి..

డ్రైవర్ : హా వే లేదు కదండి.ఎలా డ్రాప్ చేస్తాను. మరీ ఎంటండి పది వేలండి .కనీసం ఎనిమిది వేలన్న ఇవ్వండి ఇక్కడి వరకు వచ్చినందుకు అంటూ కొంచెము రిక్వెస్ట్ గా అడిగాడు.

అప్పుడు దివ్య ఇస్తాను కానీ నూ నాతో పాటు ఆ టెంపుల్ కి రావాలి. అనగానే అతను ఏంటి వచ్చేది అసలు కారు రావటానికి కుదురుతుందా .. మీరే చూడండి ఎలా ఉందో దారంతా సైకిల్ తప్ప ఇంకేమీ వెళ్లదు అని అన్నాడు. అప్పుడు దివ్య హా కార్ లో కాదయ్య నడుచుకుంటూ వెళ్దాము.అనగానే అతను కోపంగా "దేవుడా అదంతా కుదరదు ముందు మీరు మని ఇవ్వండి అని అన్నాడు. అది విని దివ్య ఇదిగో మన డీల్ టెంపుల్ వరకు. వస్తే పది వేలు కాదు పదిహేను ఇస్తాను అని అనగానే డ్రైవర్ కొంచెము ఆలోచించి నో అవసరం లేదిక మేడమ్.ఇక్కడి వరకు ఇవ్వండి ఎంత ఇస్తారో అని అన్నాడు. అప్పుడు దివ్య చిల్లిగవ్వ కూడా ఇవ్వను త్వరగా రండి నాతో పాటు అక్కడే ఇస్తాను అని చెప్పి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది.అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థంకాక కోపంగా సరే అని చెప్పి కార్ లో కూర్చుని కార్ని సైడ్ కి పెట్టి వెనుక ఉన్న ఆమె లగేజ్ చూసి గట్టిగా ఆమెను పిలిచాడు.హలో మీ లగేజ్ అండీ అనగానే దివ్య తీసుకు రావయ్య అమ్మాయితో మోయిస్తావా అని అంటూ చుట్టూ పక్కల ఎవరైనా ఉన్నారేమో అని చూసింది కానీ ఎవరు కనిపించకపోవటంతో మళ్లీ వెనుకకు వచ్చి సరేనండి నా లగేజ్ ఇవ్వండి అని అడిగింది. అప్పుడు ఆ డ్రైవర్ లగేజ్ తీసి ఆమెకు ఇచ్చాడు. కార్ ని లాక్ చేసి ఇద్దరు కలసి నడవటం మొదలు పెట్టారు.

దివ్య : ఇంతకి మీ పేరు ఏంటండి..?

డ్రైవర్ : (కొంచెము కోపంగా ఆగి ఆమె ముఖాన్ని చూసి )తింగరోడు

అని చెప్పగానే దివ్య భయంతో అడుగులు తడబడి లగేజ్ తో పాటు కిందపడిపోయింది.అప్పుడు ఆ డ్రైవర్ అయ్యో ఏమైంది.అలా పడిపోయారు అంటూ ఆమె చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని ఆమెకు చేయి ఇచ్చాడు.అక్కడ అంతా రాళ్లతో దారి ఉండటం వల్ల దివ్యకి కొంత దెబ్బ తగిలింది. అతని చేయి పట్టుకుని లేచి నిలబడి అతన్ని అమాయకంగా చూస్తూ సారి అండి మీకు వినపడింది అనుకోలేదు అని దివ్య అతనికి సారి చెప్పింది. అతను ఇట్స్ ఓకే అని లగేజ్ పట్టుకొని నడవటం మొదలు పెట్టాడు. దివ్య మౌనంగా గిల్టీ గా ఫీల్ అవుతూ అతని వెనుక నడుచుకుంటూ వస్తుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ డ్రైవర్ " ఈ మార్గంలో ఒంటరిగా ఎందుకు వస్తున్నారు.ఈ దారి, ఈ చెట్లు చూస్తుంటే ఇది డేంజర్ ప్లేస్ లా అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు దివ్య భయపడుతూ వామ్మో వీడికి ఇది డేంజర్ అని తెలిస్తే వస్తాడో  రాడో.. అని లేదండి అదేం లేదు. అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారు.అప్పుడు డ్రైవర్ మీరేం

చేస్తారండి..మీ పేరేంటి..? అని అడగగానే దివ్య కంగారుగా వీడికెందుకు నా డిటైల్స్ కాలవాలనే మాట్లడుతున్నాడు వెదవా. అమ్మాయిలు కనిపిస్తే చాలు మాట్లాడాలని చూస్తారు అని మనసులో అనుకుంటూ చెప్పను అన్నట్టుగా అతన్ని చూసింది. ఆ చూపులోని అర్థాన్ని తెలుసుకున్న అతను ఆమె భయపడుతుందని గమనించి తనలో తాను నవ్వుతూ "ఈ పిల్ల చాలా అందంగా అమాయకంగా ఉంది" అనుకుంటూ నా పేరు సిద్ధార్థ్ అని చెప్పాడు. అప్పుడు దివ్య చిన్నగా నవ్వుతూ చాలా బాగుందండి మీ పేరు అని చెప్పింది. అతను నవ్వుతూ థ్యాంక్స్ అండీ అని జారిపోతున్న దివ్య లగేజ్ ని సర్దుకుంటూ నడుస్తున్నాడు.అప్పుడు దివ్య చుట్టూ చూస్తూ ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు కొండలు కనిపించటంతో మనసులో దేవుడా టెంపుల్ కి వచ్చేవరకు నన్ను కాపాడు స్వామి అని మొక్కుకుంటూ ఉండగా ఆమెను చూసిన సిద్ధార్థ్ నవ్వుతూ ముందుకు వెళుతూ ఉండగా అతని నవ్వు చూసిన దివ్య " మౌనంగా బాబోయ్ వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు.కొంపదీసి వీడు ఈ ఏరియా వాడైతే కాదు కదా. .దేవుడా..వీడిని అనవసరంగా రమ్మన్నాను. అక్కడే ఎవరైన వచ్చే వరకు ఉంటే అయిపోయేదిగా దివ్య నీకు ఎప్పుడు తొందరే. ఒకవేళ అమ్మాయిలను కిడ్నాప్ చేసేది వీడేనేమో. అనుకుంటూ అనేక సందేహాలు మనసులో మెదులుతుంటే అనుమానంగా సిద్ధార్థ్ ని చూస్తూ నడవసాగింది.కొంత దూరం వెళ్లిన తర్వాత సిద్ధార్థ్ ఫస్ట్ గా నడవటం మొదలు పెట్టాడు. అప్పుడు దివ్య అరుస్తూ ఆగండి.. ఎందుకంత తొందరగా వెలుతున్నారు అంటూ అతని వెనుక వెళ్తూ భయంతో యమునకి కాల్ చేస్తూ నడవసాగింది.కానీ ఆ ప్రాంతంలో సిగ్నల్ లేకపోవడంతో యమునకి ఫోన్ కలవలేదు.అప్పుడు దివ్య చుట్టూ చూసింది సిద్ధార్థ ఎక్కడ కనిపించకపోవటంతో కంగారుగా ఆ దారిలోనే ముందుకు పరిగెట్టుకుంటూ వచ్చింది. కొంత దూరం వచ్చిన తర్వాత అతను ఒక రాయిపై కూర్చుని వాటర్ తాగుతూ కనిపించాడు. అతను అక్కడి నుంచి దివ్యను రా తొందరగా వెళ్దాం అనగానే అతనిపై అనుమానాన్ని నిజంగా ఇతను మంచివాడు కాదని తనను తాను రక్షించుకోవాలని భావించి అక్కడి నుంచి వెనుకకు పరిగెత్తింది.ఆమె పరిగెట్టటం చూసి సిద్ధార్థ దివ్య వెనుకలే "ఆగు హే దివ్య ఆగు అంటూ పరిగెత్తాడు.దివ్య వామ్మో నా పేరేలా తెల్సు అతనికి అనుకుంటూ అలాగే పరిగెత్తకుంటూ వెళ్తుండగా ఒక్క సారిగా  సిద్ధార్థ పట్టుకున్నాడు ఎందుకు పారిపోతున్నావు అని అడిగేలోపే పక్కన ఉన్న రాయితో బలంగా తల మీద కొట్టింది. కొట్టిన వెంటనే సిద్ధార్థ తల నుంచి రక్తం కారుతూ వచ్చింది. సిద్ధార్థ కోపంగా దివ్య చెంపపై కొట్టాడు.ఏమైంది అని అడిగేలోపే అతన్ని తోసేసి వేగంగా పరిగెత్తకుంటూ వెళ్లి  ఎదురుగా వస్తున్న ఒక లేడిని గుద్దింది.ఆమెను పట్టుకొని దివ్య ఏడుస్తూ సిద్ధార్థ ని చూపించి వాడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడని చెప్పింది.అది వినగానే9 సిద్ధార్థ్ ఆశ్చర్యంగా దివ్య ని చూశాడు. అప్పుడు ఆ

ఆంటీ అతన్ని కోపంగా చూసి దివ్య తో భయపడకమ్మ మేము ఈ ప్రాంతంలో పనిచేసే ఆడ పోలీసులము ఇక్కడ అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారని తెలిసి ఇక్కడే ఉంటున్నాము.ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నాము.వీడే కిడ్నాపర్ అని తెలిస్తే అప్పుడే పట్టుకునేవాళ్లం అని ఆ ఆంటితోపాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. వారిని చూడగానే సిద్ధార్థ్ కి అనుమానం వచ్చి వేగంగా వారి దగ్గరకు వెళ్ళి మీరు పోలిసులు అయితే యునిఫమ్ ఏది అని అడిగాడు. అప్పుడు ఆ లేడి కంగారుగా ఆ మమ్మల్ని ఎవరు గుర్తు పట్టకూడదని ఇలా సివిల్ లో తిరుగుతున్నాము అని చెప్పింది. అప్పుడు సిద్ధార్థ్ మీ ఐ.డి. చూపించండి అని అనగానే అందులో ఒకరు ఆఫీసులో ఉందని చెప్పాడు. వెంటనే సిద్ధార్థ్ దివ్య ని " కోపంగా రా దివ్య వీళ్లని నమ్మకు. అని పిలిచాడు కానీ దివ్య రాకుండా వారి వెనుకకు వెళ్లి నిలబడింది.అప్పుడు సిద్ధార్థ్ కోపంగా దివ్య చేయి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళుతున్నాడు.అప్పుడు ఆ లేడి అక్కడి వ్యకులతో" ఓరేయ్ వాన్ని చంపేసి దాన్ని తీసుకుని రండి అని అనగానే దివ్య ఆశ్చర్యంగా ఆమెను చూసింది. వెంటనే సిద్ధార్థ్ చేయి గట్టిగా పట్టుకుంది.వారిని కొట్టడానికి వస్తున్న వారిని సిద్ధార్థ్ చాలా కొట్టాడు. వారిని దివ్య బ్యాగులో ఉన్న చున్నితో ముగ్గురిని ఒక చెట్టుకు కట్టి తన చేతిలో ఉన్న వాకి టాకీలో కారుతున్న రక్తాన్ని కర్చీఫ్ తో ఆపుతూ " హాలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీరు చెప్పిన విధంగానే ఈ రోజు ఆ కిడ్నాపర్స్ నేను తీసుకుని వస్తున్న అమ్మాయిని కిడ్నాప్ చేయబోయి

దొరికేశారు సార్ వీరిని మన క్యాంపు నుంచి 10 కి. మీటర్ల దూరంలో కట్టేశానని చెప్పాడు.అతను చెప్పేది వినగానే దివ్య ఆశ్చర్యంగా నువ్వు సారి మీరు పోలీస్ అఅ..అంటూ అడిగింది.దానికి బదులుగా సిద్ధార్థ్ నవ్వుతూ తన ప్యాకెట్లో ఉన్న ఐ.డి కార్డ్ తీసి నవ్వుతూ దివ్య కి చూపించాడు.అవును నన్ను కిడ్నాప్ చేస్తారని ముందే మీకు ఎలా తెలుసు అని అడిగింది.ఆ లేకుంటే నువ్విచ్చే ఆ తొక్కలో పదిహేను వేలకి నీతోపాటు ఎవరొస్తారనుకున్నావ్ అని సిద్ధార్థ్ అనగానే దివ్య తనలో తానే నవ్వుతూ అందుకే నా నేమ్ పిలిచారా. . నేనే పెద్ద ఇంటలిజెంట్ అనుకొని నా వెంట ఇతన్ని తీసుకుని వస్తున్న అనుకున్నా అని అనుకుంటుంగా సిద్ధార్థ్ దివ్య తో మా టీమ్ ఏం గమనించింది అంటే ప్రతి మూడు రోజులకి ఒకసారి ఈ ప్రాంతంలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు.ఇలా టెంపుల్ దగ్గరకు వచ్చేవారు సింగిల్ గా ఉంటే వారిని కిడ్నాప్ చేస్తున్నారు.అయితే మా ఇంవెస్టిగేషన్లో ఈ రోజు ఈ టెంపుల్ కి దర్శనానికి వచ్చేవారి టిక్కెట్స్ చూస్తే అందులో మీవి మీ ఫ్రెండ్స్ వి కనిపించాయి.మేము మీ అందరి ఫోన్లు ట్రాప్ చేయగా నువ్వు ఒంటరిగా వస్తున్నావని తెలిసింది. అందుకే ఈ ఏరియాలో కేవలం ఒకే కార్ ఉన్నట్లు మీకు చూపించాము అని చెప్తున్న సిద్ధార్థ్ ని చూస్తూ మరీ కార్ దగ్గర ఎందుకు అలా చేశారు అని అడిగింది. అప్పుడు సిద్ధార్థ్ హా నువ్వు వెళ్లిన తర్వాత నిన్ను ఫాలో అవుతూ వద్దామనుకున్నా ఆ లోపే నువ్వు భయమేస్తుంది టెంపుల్ వరకు రండి అని అడగలేక చేసిన ఆక్టింగ్ చూసి ఫిదా అయిపోయి ఎలాగు ఫాలో చేయాలిగా అనుకొని చుట్టూ అబ్జర్వ్ చేస్తూ వచ్చాను.

ఈ రోజు ఇది నా వర్క్ కాదు మా ఫ్రెండ్ ది.వాడికి పెళ్లి చూపులు ఉండేసరికి ఈ పని నాకప్పగించారు.అయిన నేను రాకుండా నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయవని తెలుసులే అప్పుడే అంటూ నవ్వుకంటూ ఎదురుగా వస్తున్న పోలీసుల దగ్గరకు వెళ్లాడు.వారికి ఆ కిడ్నాపర్స్ ని చూపించాడు. ఇదంతా చూస్తుంటే దివ్యకి ఆశ్చర్యంగా అనిపించింది. దూరం నుంచి" వెళ్దాం రా" అని సిద్ధార్థ్ పిలవగానే దివ్య సిద్ధార్థ్ ని చూస్తూ వెళ్లింది. అతనిపై తనకి చాలా అభిమానం, ప్రేమ ఏర్పడింది. వచ్చిన పోలీసులు కిడ్నాపర్స్ ని తీసుకొని వెళ్లారు.  ఇద్దరు నడుచుకుంటూ వెలుతుండగా సిద్ధార్థ్ దివ్య తో " అవును నువ్వు కిడ్నాపర్స్ రాకముందు నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోయావు అని అడగగా దివ్య అమాయకంగా " సారి సార్ నేను మీరు అలా కాసేపు కనిపించకుండా వెళ్లి మళ్లీ అట్టా రాయిపై

 నీళ్లు తాగుతూ పిలుస్తుంటే మీరే కిడ్నాపర్ అనుకొని మీ నుంచి తప్పించుకోవాలని పారిపోయాను.కొట్టినందుకు సారి అండీ అని  చెప్పగానే సిద్ధార్థ్ దివ్య ని చూసి వామ్మో వారు రాకుంటే చంపేసేదానివే కదా అనగానే కాస్త కంగారుగా తల దించుకుంది.అప్పుడు సిద్ధార్థ్ అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు నీలాగే ఉండాలిలే.నాకు డేర్ గా ఉండే అమ్మాయులంటేనే ఇష్టం అని అన్నాడు .దివ్యకు ఎందుకో అతనలా అంటుంటే చాలా ఆనందంగా అనిపించింది.కొంత దూరం వెళ్లిన తర్వాత గుడి గంటల శబ్దం వినబడింది.సిద్దార్థ్ అదిగో గుడి వచ్చేసింది అంటూ ముందుకు వెలుతున్నాడు.కానీ దివ్యకు మాత్రం అడుగు ముందుకు పడలేదు .గుడి వస్తే సిద్ధార్థ్ తనని విడిచి వెళతాడనే బాధ తనలో మొదలైంది. ఈ కాస్త సమయంలో అతను తనపై చూపిన రెస్పాన్సిబులిటి తనకు జీవితాంతం ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ ముందుకు నడిచింది.గుడి దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మధ్య మౌనమే మిగిలింది. దివ్య ఫ్రెండ్ యమున కాల్ చేసింది.

యమున : గుడి దగ్గరికి వెళ్ళినవానే మేము ఇప్పుడే కాలినడక దారి దగ్గర దిగాము కాసేపట్టో వచ్చేస్తాము.నూ సేఫ్ ఏగా అని అడుగగా

దివ్య : వచ్చానని డల్ చెప్పింది

యమున ఏమైందే డల్ గా మాట్లడుతున్నావ్ అని అడుగగా...ఏమి లేదు నడిచి వచ్చాను కదా అందుకే సరే నూ త్వరగా రా అని ఫోన్ కట్ చేసింది. సిద్ధార్థ, యమున కూడా వచ్చే వరకు గుడి తిరుగుతూ చూశారు. ఇద్దరు కలిసి గుడి ముందు మెట్లపై కూర్చున్నారు.ఇంతలో దివ్య బ్యాగులో తెచ్చుకున్న స్నాక్స్ తింటూ ఉన్నాడు.దివ్య అతన్ని చూస్తూ ఉంది.సిదార్థ్ తినటం ఆపి తన బ్యాగు తనకి ఇచ్చాడు. సారి హాఫ్ తినేశా నాకు ఆకలెక్కువా.. అందుకే తినేశా నువ్ మరి అలా చూస్తే నాకు దిష్టి తగులుతుందేమో.అంటూ ఇచ్చాడు. అలా అనగానే దివ్య తన బ్యాగ్ లాక్కుని వెళ్లి వేరే చోట చెట్టు కింద కూర్చుంది. సిద్ధార్థ్ నవ్వుతూ వచ్చి సారి చెప్పాడు. దివ్య అసలు ఏమి మాట్లాడలేదు. సిద్ధార్థ్ తన పర్స్ తీసి తన విజిటింగ్ కార్డ్ ఇస్తూ ఇందులో నా నెంబర్ ఉంది నీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్న కాల్ మి అని చెప్పాడు. కానీ దివ్య తీసుకోలేదు.సిద్దార్థ్ సైలెంట్ తన కార్డ్ తన ప్యాకెట్లో పెట్టుకున్నాడు. కాసేపటికి దివ్య ఫ్రెండ్స్ వచ్చారు.వారు వచ్చిన తర్వాత సిద్ధార్థ దివ్య తో వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.అతనలా వెళుతూ ఉంటే దివ్య కళ్లలో నీళ్లు నిండాయి



Rate this content
Log in

Similar telugu story from Drama