Nithya Nalla

Drama Romance Classics

4  

Nithya Nalla

Drama Romance Classics

నీమదిసవ్వడిలోఊగిసలాడేనునాప్రాణ

నీమదిసవ్వడిలోఊగిసలాడేనునాప్రాణ

7 mins
396



💕నీ మది సవ్వడిలో ఊగిసలాడేను నా ప్రాణం 💕



చుట్టూ చీకటిగా ఉంది

నన్నెవరో వెంబడిస్తున్నారు

నేను ఫాస్ట్ గా ముందుకు నడుస్తున్నాను

అప్పుడు టైమ్ దాదాపు రాత్రి 11 కావస్తుంది

ప్రాజెక్ట్ సబ్మిషన్ కి రేపే లాస్ట్ డేట్ కావడంతో అంతా చెక్ చేసే వెళ్ళమని బాస్ ఆర్డర్

పని ముగిసేసరికి ఈ టైమ్ అయింది

ఆఫీస్ నుంచి మా ఇంటికి స్కూటీ పై వెళ్ళడానికి దాదాపు గంటన్నర పైనే పడుతుంది

నా ఖర్మ కాలి ఈ బండి ఏదో ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది

నేను స్కూటీని నడుపుకుంటూ వెళుతున్నాను

ఎవరో నలుగురు నా వెంట పడుతున్నారు

నాకేమో టెన్షన్ పెరిగిపోతుంది

అలా ముందుకు వెళుతూ ఉండగా దీపపు కాంతిలా వెలుగుతున్న ఒక స్ట్రీట్ లైట్ వెలుతురుకి మెరుస్తూ కనిపించింది ఒక ఇల్లు

ఆ వెలుతురులోకి వెళ్ళాలని వేగంగా నడుస్తూ ఉండగా ఎవరికో ఢీ కొట్టేసాను

అంతే అదుపుతప్పి చేతిలో ఉన్న బండిని వదిలేసాను

ఆ వ్యక్తి నన్ను తన గుండెలకు హత్తుకుని నా తలపై చేతితో నిమురుతూ తన స్పర్శ ద్వారా నాకు ధైర్యానిస్తున్నాడు

అతని గుండె చప్పుడు వింటూ కొద్దిసేపటికి నా గుండెల్లో గుబుక్కుమంది

అంతే వెంటనే అతన్ని వదిలి దూరం జరిగాను

ఎవరో తెలియని ఒక అజ్ఞాత వ్యక్తి కౌగిలిలో ఇంత హాయి, ఇంతకు ముందే అతని సాన్నిహిత్యం ఎరిగినట్లు మదిలో అలజడి, నేను తన దాన్నే అనే భావన నాకు కలగడమేంటని ఆలోచిస్తూ ఉండిపోయాను

అతను తలపై క్యాప్ పెట్టుకుని ఉన్నాడు

నాకు అతని ఫేస్ కనిపించట్లేదు

అక్కుడున్న వెలుతురికి మనిషున్నాడని కనిపించడమే ఎక్కువనుకుంటా...

కింద పడ్డ నా స్కూటీని పైకి లేపి పక్కన ఉంచాడు

నా చేయి పట్టుకుని ఎదురుగా ఉన్న ఇంట్లోకి తీసుకెళుతున్నాడు

అయోమయంగా అతని చేతిలో చేయి కలిపి అతని వెంట నడుస్తున్నాను

ఒక పరాయి మగవాడు నన్ను ముట్టుకుంటుంటే అసలు

కోపమే రావట్లేదెందుకని...

అలా ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి నన్ను కూర్చోపెట్టాడు

నాకేం అర్ధం కావట్లేదు

వాళ్ళతో ఏదో మాట్లాడి నన్ను అప్పగించి నా కంటి ముందు నుంచే మాయమయిపోయాడతను

ఛా... తన ఫేస్ చూడడం మిస్ అయ్యాను

మా అన్నయ్యకి ఫోన్ చేసి అడ్రెస్ చెప్పి ఇక్కడకు రమ్మన్నాను

తను బయలుదేరాడు

ఆ మనుషులంతా తమ కూతురిలా అపురూపంగా చూస్తున్నారు నన్ను

కూర్చోబెట్టి నాకు మంచినీళ్ళు ఇచ్చి ఆ సమయంలో భోజనానికి సిద్దం చేసి మా అమ్మ వలె నా చేత బలవంతంగా ఎక్కువ మోతాదులో తినిపించేస్తూ నా ఆకలిని తీర్చారు

ఇంతలో మా అన్నయ్య వచ్చాడు...

వారందరికీ కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చాము

నేను అన్నయ్య బైక్ దగ్గరకి వెళ్లి నిలబడ్డాను

అదుగో మళ్ళీ కనిపించాడు ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తి

ఈసారి మా అన్నయ్యతో మాట్లాడుతున్నాడు

మా అన్నయ్య కూడా నవ్వుతూ మాట్లాడుతున్నాడు

అతను నాకు ఎదురుగా నిలబడి ఉన్నా అతని వెనుక భాగం మాత్రమే కనిపించేలా నిలబడి మాట్లాడుతున్నాడు

ఈసారి కూడా అతన్ని చూడలేకపోయాను

తరువాత మా ఇంటికి వెళ్ళిపోయాము

ఆ రాత్రి జరిగిన అతని పరిచయం, ఆ ఇంటి మనుషులు నాపై చూపించిన ఆప్యాయతను మర్చిపోవద్దని నా బుర్ర

పదే పదే వారి గురించే ఆలోచించేలా చేస్తూ నాకు, నిద్రకు గొడవపెట్టి వెళ్ళిపోయింది

ఎప్పటికో తెల్లవారుజామున పడుకున్న నేను నలతగా నిద్రలేచాను

టైం 7:30 a. m ని చూసి ఆఫీసుకి ఆలస్యమైపోతుందని కంగారుగా వాష్ రూమ్ కి పరిగెత్తాను

రెడీ అయి బయటకు వచ్చి మెట్లమీద నుంచి దిగబోయిన నాకు అక్కడి వాతావరణం ఎందుకో కాస్త భయం గొలిపింది

మా అమ్మ నన్ను చూసి... లేచావా ఈరోజు ఆఫీసుకు లీవ్ పెట్టెయ్ బంగారు...

ఎందుకమ్మా...

నీకు ఒక మంచి సంబంధం వచ్చింది రా... పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళిచూపులకు వస్తున్నారు అంటూ నా తలమీద చేతితో నిమురుతూ అంది

నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టే ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది

ఇదిగో ఈ చీర కట్టుకుని తయారయి ఉండూ... మిగతా అలంకరణ నేను వచ్చి పూర్తిచేస్తాను అనగానే నా గుండెల మీద రాయి పడ్డట్టు అదిరిపడ్డాను

అమ్మా... నాన్న ఎక్కడ

మీ నాన్న నాకంటే సంతోషంగా ఉన్నాడమ్మా...

బజారుకి వెళ్ళి స్వీట్స్ వగైరా తీసుకుని రావడానికి వెళ్ళారు

నల్లమొహంతో తయారవడానికి వెళ్ళాను నేను

నాన్నకు కూడా ఈ సంబంధం నచ్చింది అంటే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు...

కానీ నా మనకెందుకు ఒప్పుకోవట్లేదు

పదే పదే అతని ఆరాధన పొందమని నన్ను పురమాయిస్తుందేంటి...

అతని కౌగిలి చెరసాలలో ఒదిగిపొమ్మని నన్ను బలవంతంగా ఉసిగొలుపుతుందేంటీ... అంటూ గుండెలపై చేయి వేసుకున్నాను

ఒక్కటి మాత్రం అర్ధమయ్యింది నాకు... నా మనసు అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది

అందుకే ఈ సంబంధానికి కానీ పెళ్ళిచూపులకు గానీ అంగీకరించలేకపోతుంది

ఈ అనుభూతిని ఏమంటారు... అదేదో క్రష్ అంటారుగా అదా... లేక ప్రేమ... అనే సందిగ్ధంలోనే తయారయ్యాను

అమ్మ మరింత అందంగా అలంకరించి పనులు చూసుకోవాలని వెళ్ళిపోయింది

అద్దంలో నన్ను నేను చూసుకుంటూ పెళ్ళిచూపుల గురించి టెన్షన్ పడుతుంటే ఈ సమయంలో ఈ ఆందోళన తగ్గాలంటే అతని వెచ్చని కౌగిలిలో ఇమడాల్సిందేనని సలహా ఇస్తుంది నా ప్రతిభింభం

దాని నోరు మూయించే పనిలో నిమగ్నమైన నేను అమ్మ పిలుపుతో తేరుకున్నాను

పెళ్ళివారు వచ్చేసారు

నన్ను తీసుకువెళ్ళడానికి మా అన్నయ్య నా గదిలోకి వచ్చాడు

చిన్నప్పటి నుంచి నేను, అన్నయ్య చాలా క్లోస్.. సో అమ్మా, నాన్న కన్నా అన్నయ్యతోనే చనువెక్కువ

నేను అన్నయ్య చెయ్యి భయంతో గట్టిగా పట్టుకుని మెట్లు దిగుతున్నాను

కంగారు పడొద్దని కళ్ళతోనే ధైర్యం చెబుతున్నాడు అన్నయ్య

నాకు తెలీకుండానే నేను వాళ్ళకు నచ్చకూడదని మనసులోనే దేవుడికి మొక్కుకుంటున్నాను

వచ్చిన వారికి కాఫీ ఇప్పించి వారి ముందు కూర్చోపెట్టారు నన్ను

వాల్లంతా నన్ను చూస్తున్నారనుకుంటా వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు

కనీసం తల కూడా ఎత్తి చూడట్లేదు నేను

అమ్మాయి అబ్బాయిని చూడడానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉందీ...

అమ్మాయిని, అబ్బాయిని కాస్త ప్రశాంతంగా అలా చల్లగాలికి పంపితే వారి గురించి వారు తెలుసుకుంటారు అంటూ ఎవరో అన్నారు

ఆ మాటకు మరింత గాబరా పడిపోయాను నేను

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అబ్బాయి లేచి నిలబడ్డాడేమో నన్ను కూడా పైకి లేపి టెర్రస్ పైకి తీసుకెళ్ళమని చెప్పింది అమ్మ...

నేను ముందు నడుస్తున్నాను అతనేమో నా వెంట

పైకి వెళ్ళి తలదించుకుని నిలబడి ఉన్నాను

అతను నా ఎదురుగా ఉన్న కారణంగా కలవరంగా చీరకొంగుని చేతులతో నలిపేస్తున్నాను

చాలా సేపటినుంచి గమనిస్తూనే ఉన్న అతను నేనిక తలెత్తి మాట్లాడనని అనుకున్నాడో ఏమో అమాంతం నన్ను తన కౌగిట్లో బంధించి నాకు సాంత్వన కలిగిస్తున్నాడు

అలవాటయిన స్పర్శలా అతని లాలన నన్ను మైమరపించింది

నిశ్శబ్దంగా అతని గుండె చప్పుడు వింటూ ఉన్న నేను ఆశ్చర్యంగా తల పైకెత్తి అతని వైపు చూసాను

తలమీద క్యాప్ తో నావైపు నవ్వుతూ చూస్తున్నాడు అతను

నా ప్రమేయం లేకుండానే నోటివెంట అప్రయత్నంగా

నువ్వు... అని అడిగాను

అతను నావైపే చూస్తూ...

నా గుండె చప్పుడు వింటే గానీ నన్ను గుర్తుపట్టలేదా తింగరి అంటూ నవ్వుతున్నాడు

అంటే... నువ్వు మానిక్ ఆ...

హా...

అప్పుడు మాయమయ్యి ఇప్పుడు ప్రత్యక్షమయ్యావా... అంటూ అలిగాను

మానిక్ నన్ను బుజ్జగిస్తున్నాడు... చాలా సంవత్సరాల తరువాత తనను చూడగానే మళ్ళీ అల్లరి పిల్లగా మారిపోయాను

మీకు నా గతం తెలీదు కదూ... రండి చదువుదురూ

మానిక్.... నా బోరింగ్ లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టడానికి వచ్చిన డోరేమాన్ లాంటివాడు

నాలోని అల్లరిని నాకు కొత్తగా పరిచయం చేసిన ఘనుడు

అవి 8థ్ క్లాస్ చదివేరోజులు... బాగా విసుగుపుట్టించే మాథ్స్ క్లాస్ వింటున్న వేళ వినిపించిందొక గొంతు

అప్పటికే సగం కళ్ళు మూతపడుతుండగా అటువైపు చూసాను

మే ఐ కమ్ ఇన్ మ్యామ్... అంటూ ఉత్సాహంగా అన్నాడు ఆ అబ్బాయి

ముఖంలో చలాకితనం, అందరినీ ఆకర్షించగలిగే ప్రశాంతమైన మోముని చూస్తూ ఉండిపోయా...

తను లోపలికి వస్తూ ఉన్నాడు

అది గవర్నమెంట్ స్కూల్ కనుక అడిగేవాడే లేడని మాకు కనీసం బెంచెస్ కూడా అలాట్ చేయలేదు

సో అందరం కిందే కూర్చోవాలి

అలా నా పక్కన చోటు ఖాళీగా ఉందని టీచర్ కూర్చోమనడంతో తను నా పక్కన కూర్చున్నాడు

హాయ్.. అయామ్ మానిక్

హాయ్.. హంసిక అంటూ చెయ్యిచ్చాను

తను హాఫ్ సిలబస్ అయ్యాక జాయిన్ అయ్యాడు కాబట్టి తనకు ప్రీవియస్ నోట్స్ ఇచ్చి ఏమన్నా డవుట్స్ ఉంటే ఎక్స్ ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని

అలా మంచి స్నేహితులయ్యాం

రోజులు గడుస్తూ వచ్చాయి

ఒకరోజు క్లాస్ రూమ్ కి వెళుతుండగా సీనియర్స్ నన్ను ఏడిపించసాగారు

మానిక్ కూడా క్లాస్ కి వస్తూ నన్ను అక్కడ చూసి నా దగ్గరకు వచ్చాడు

అప్పటికే నా కళ్ళు వర్షిస్తున్నాయి

నన్ను తన బాహువులలో బంధీచేసి ఓదారుస్తున్నాడు

ఆ సమయములో తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది

ఆ వయసులో ఆ ఫీలింగ్ పేరేంటో తెలీలేదు

కానీ నచ్చింది

పచ్చని పొలాల్లో వీచే చల్లటి పైరు గాలిలో ఉండే స్వచ్చత అతని కౌగిలిలో నాకు దొరికింది

తన ఓదార్పు కాస్త ఊరటనిచ్చేసరికి ఏడుపు ఆపగలిగాను

నన్ను అలా చూసి కోపంగా వాళ్ళతో గొడవకు దిగాడు

నేనెంత ఆపినా తనాగలేదు

ఆ గొడవ చాప కింద నీరులా విస్తరించి మా హెడ్ మాస్టర్ వరకూ వెళ్ళింది

ఇంకేముంది సార్ మానిక్ తండ్రిని పిలిపించాడు

వాళ్లు వచ్చాక మానిక్ దే తప్పన్నట్టు క్రియేట్ చేసారు ఆ సీనియర్స్ అంతా

ఆ సీనియర్స్ లో వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడన్న పక్షపాతంతో ఇది బయటకు వస్తే తన కొడుకు ప్రవర్తన ముందుగానే తెలిసిన టీచర్స్ కూడా తననే సస్పెండ్ చేయమంటారని ఆ గొడవను కళ్ళారా చూసిన కొంతమంది విద్యార్ధులు చెప్తున్నా వినిపించుకోకుండా హెడ్ మాస్టర్ మానిక్ సర్టిఫికేట్ ని తన తండ్రి చేతికిచ్చేసి స్కూల్ వదిలి వెళ్ళిపొమ్మన్నాడు

ఎక్కడకు వెళ్ళినా ఊర్లో గొడవలు నెత్తిమీదకు తెచ్చుకుంటూ ఇలా స్కూల్స్ మారుతుంటాడని కోపంగా ఆయన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు

మానిక్ ని నాకు దూరం చేసేసారు

ఇక ప్రస్తుతానికి వద్దామా...

అలా నాకు దూరమైన నా మానిక్ ఇలా నా ముందుకొచ్చి దగ్గరయ్యాడు

అల్లరి చేస్తున్న నన్నే చూస్తూ నువ్వేం మారలేదు హంసీ అన్నాడు

పాపం.. తనకేం తెలుసు తను వెళ్ళిన తరువాత నేను మళ్ళీ అదే బోరింగ్ హంసీ లైఫ్ లోకి వెళ్ళిపోయానని

ఇదివరకు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుతూ

అవునే... ఎంత పెళ్ళిచూపులు ఇష్టం లేకపోతే మాత్రం కనీసం వచ్చిన పెళ్ళికొడుకుని కూడా చూడవా రాక్షసీ అంటూ గట్టిగా నవ్వుతున్నాడు

ఏంటో.. మానిక్ రాత్రి నిన్ను కలిసినప్పటినుంచీ నా మనసెందుకో ఈ పెళ్ళికి అంగీకరించలేకపోయింది

అవునా... అంటూ నా గడ్డం పట్టుకుని

ఇంతకీ పెళ్ళికొడుకు నచ్చాడా...

ఉమ్... అంటూ సిగ్గుపడ్డాను

తను నన్ను దగ్గరకు తీసుకుని నుదుటమీద ముద్దు పెట్టుకున్నాడు

మేమిద్దరం నవ్వుతూ వస్తూ ఉండేసరికి మా పెద్దవాళ్ళకు విషయం అర్ధం అయిపోయిందనుకుంటా వాళ్ళు కూడా సంతోషంగా తాంబూలాలు పుచ్చుకున్నారు

నేను మానిక్ కుటుంబాన్నంతా పలకరించాను

వాళ్ళు సంతోషంగా నన్ను ఆశీర్వదించారు

పక్కనే అన్నయ్య నవ్వుతూ చూస్తున్నాడు నా వైపు

నేను అన్నయ్య దగ్గరకు వెళ్ళి

ఏంటన్నయ్యా.. నీకు ఇదంతా ముందే తెలుసా...

తెలుసురా బంగారం... నిన్నే మానిక్ చెప్పాడు

మరి నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు

ముందే చెప్తే కిక్ ఉండదు కదా హంసీ... అంటూ నవ్వుతూ నాన్న పిలిచేసరికి వెళ్ళిపోయాడు

మమ్మల్నిద్దరినీ అలా వదిలేసి ఎవరి సందడిలో వాల్లుండిపోయారింకా

మేమిద్దరం లాన్ లోకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటున్నాం

అవునూ... వీళ్లంతా నీ ఫ్యామిలీనేనా...

అవును బంగారం...

అప్పుడైతే నువ్వెందుకు రాత్రి వీళ్ళ దగ్గర నన్ను వదిలి ఇక కనిపించకుండా వెళ్లిపోయావ్

నన్ను చూస్తే గుర్తుపడతావేమోనని అలా కనిపించకుండా ఫేస్ కవర్ చేసుకుని నీతో దాగుడుమూతలాడా...

అబ్బో... నిన్ను పగలు చూస్తేనే గుర్తుపట్టలేకపోయా...

అది కూడా నైట్ చూసి ఉంటే ఇంకేం గుర్తుపడతాను బాబూ

ఒకవేళ గుర్తుపట్తేస్తే ఈ సర్ప్రైస్ మిస్ అయ్యేదానివి కదా

అంటూ చిన్నగా నవ్వుతున్నాడు మానిక్

బాబోయ్.. ఆ నవ్వును చూస్తే బహుశా

అబ్బాయిలు కూడా కుళ్ళుకుంటారేమో

అంత బాగుంది...

చాలా మారిపోయావ్ మానిక్...

చాలా పొడుగు కూడా అయ్యావ్

లేకుంటే 8థ్ లో ఉన్నంత హైట్ వరకే ఆగిపొమ్మంటావా ఏంటీ నీ లాగా... అంటూ నన్ను ఏడిపిస్తున్నాడు

మానిక్.. నేనేం అంత పొట్టి కాదు... నీ భుజాలవరకూ వచ్చాగా...

ఒసేయ్ పిచ్చీ... భుజాల వరకే వచ్చావ్

నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఎన్ని తంటాలు పడాలో నేను అంటూ నా బుగ్గ పట్టుకుని లాగుతున్నాడు

నేను కోపంగా చూసాను

పాపం.. తను మళ్ళీ నన్ను బుజ్జగించే పనిలో పడ్డాడు

నీకో విషయం చెప్పనా... నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావ్

థాంక్యూ..

హా.. నాకు ఇంకో డవుట్

ఏంటీ...

ఇన్నాళ్లు ఎక్కడున్నావ్.. సడెన్ గా నా గురించి ఎలా తెలుసుకున్నావ్

ఇంకెక్కడా ఈ హైదరాబాద్ లోనే ఉన్నాను

ఆరోజు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా డాడ్ నన్ను తీసుకొచ్చి హాస్టల్ లో వేశారు

అలా చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది

అప్పటినుంచే నీ గురించి తెలుసుకోవాలని చాలా చోట్లు వెతికాను

కానీ నీ అడ్రెస్ ఎక్కడా దొరకలేదు

నా కోసం ఎందుకు వెతికావు

ఎందుకో నీకు తెలీదా...

ఎందుకు.. అంటూ అయోమయంగా అడిగాను నేను

ఆరోజు నన్ను నాన్న తీసుకెళుతున్నప్పుడు కన్నీళ్ళతో నన్ను చూసావు కదా అందుకు

ఆ చూపుకి అర్ధమేంటో తెలుసుకుందామని ఇన్నాళ్లు వెతికాను

మరి తెలుసుకున్నావా....

స్పష్టంగా అర్ధమయింది

ఆ మాటకు సిగ్గుపడుతున్న నన్ను చూస్తూ దగ్గరకు జరిగి బుగ్గపై ముద్దుపెట్టబోయాడు

అతని సమీపానికి నా గుండె ఝల్లుమంది

చేతితో మృదువుగా తనను పక్కకు నెట్టాను

మానిక్ మూతిముడుచుకుని దూరం జరిగి కూర్చున్నాడు

అందరూ ఉన్నారు మానిక్... ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు

ముచ్చట పడి కాబోయే భార్యను ముద్దు పెట్టుకున్నాడు అనుకుంటారు

పెళ్ళయ్యాక పెట్టుకోవచ్చని కూడా అనుకోవచ్చేమో... కదా

దెయ్యమా....

నేను నవ్వి మళ్ళీ డవుట్ వచ్చి అతని చేతిపై వేలితో గోకుతూ ఉన్నా...

హ్మ్.. చెప్పు

ఇంకో డవుట్ వచ్చింది

రాకపోతే ఆశ్చర్యపడాలి గానీ... నువ్వు అడుగు

రాత్రి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ అంతా నేను ముందే పరిచయం ఉన్నట్లుగా ట్రీట్ చేసారేంటి నన్ను

ఆ విషయం అర్ధంకాక రాత్రంతా ఆలోచిస్తూ నిద్రకూడా పోలేదు తెలుసా..

ఓ.. అదా

నిన్ను వదిలి వచ్చినప్పటినుంచి సందర్భం వచ్చినప్పుడల్లా నీ గురించి ఇంట్లో చెబుతుండేవాడిని

అలా నువ్వు కొంచెం తెలుసు

నాకు చదువయ్యి ఉద్యోగం రాగానే పెళ్ళి ప్రస్తావన తీసుకువచ్చారు

అప్పుడే చెప్పేసా చేసుకుంటే నిన్నే చేసుకుంటానని లేకుంటే అసలు పెళ్ళే చేసుకోనని...

సో అప్పటినుంచి సెర్చింగ్ అన్నమాట నిన్ను

అలా నువ్వు ఇంకొంచెం తెలిసావ్... వాళ్ళకు

ఓ... మరి నన్నెక్కడ చూసావ్

మీ ఆఫీస్ ముందు చూసా.. మీ ఆఫీస్ దాటి మా ఆఫీస్కు వెళ్ళాలి

అలా ఒకరోజు నిన్ను ఫాలో చేసా... మీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా ఇల్లు ఉన్నందునా రోజూ కాపలాగా నీకు తెలీకుండా నీవెంట వచ్చి నువ్వు సేఫ్ గా ఇంటికి చేరుకున్నాక తిరిగొచ్చేసేవాడిని

యక్చువల్ గా నిన్న కూడా నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా...

లేట్ అయ్యేసరికి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అనుకుని కూడా ఎందుకో అక్కడే కూర్చుండిపోయా...

అప్పుడు కనిపించావ్ నువ్వు టెన్షన్ గా...

ఇంక అంతా నీకు తెలిసిందేగా...

నిజం చెప్పనా మానిక్...

ఏంటీ అన్నట్టు.. కళ్ళెగరేసాడు

నువ్వు చాలా ముదురువి బాబూ

నాకు ముందే తెలుసుగా... అని కన్నుకొట్టాడు

ఎంత ముదురువి కాకపోతే నైట్ మీ నాన్నను చూస్తే గుర్తుపడతానని ఆయన కూడా నాకు కనిపించకుండా మ్యానేజ్ చేస్తావ్...

హ.. హ... హ..

పక్కా ప్లాను ఉండాలమ్మా ఏది చేసినా అంటూ నవ్వుతున్నాడు

నేను కూడా అతని నవ్వులో నవ్వు కలిపాను

అవునూ ముందే నన్ను కలిసి ఇదంతా చెప్పి ఉండొచ్చు కదా... అలా దొంగచాటుగా నన్ను ఫాలో అవ్వకపోతే

చెప్పుండొచ్చు... కానీ నీ అంతట నువ్వే నన్ను కలిశాక నీ రియాక్షన్ చూసి అప్పుడు నీ ముందుకు రావాలనుకున్నా...

అలాగే వచ్చా...

ఉమ్.. ఇన్నాళ్ళయినా నన్నింకా మర్చిపోకుండా నాకోసమే వచ్చావంటే నువ్వు నిజంగా గ్రేట్ బాబూ...

థాంక్యూ మేడామ్... అంటూ నన్ను చుట్టేసాడు మానిక్

ఇంకో నెల రోజుల్లో ఒక మంచి ముహుర్తాన మా పెళ్ళి కుదిర్చారు పెద్దలు

సో.. నేను హ్యాప్పీ.. నా మానిక్ హ్యాప్పీ... మొత్తంగా మా కుటుంబాలు కూడా హ్యాప్పీ

నేను మానిక్ చేతిని పట్టుకుని భుజంపై తలవాల్చి తనతో పంచుకోబోయే జీవితం ఎంత మధురంగా ఉండబోతుందోనని ఊహిస్తుంటే నా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి

                    

                 💞...... శుభం ..... 💞



Rate this content
Log in

Similar telugu story from Drama