మర్రిగూడ హాస్టల్
మర్రిగూడ హాస్టల్
అది మర్రిగూడ, దేవరకొండ దగ్గర ఒక మారుమూల పల్లెటూరు. ఊరికి దూరంగా రైల్వేస్టేషన్, సమయం అర్ధరాత్రి పన్నెండు కావొస్తుంది. అందులో నుండి లగ్గేజి తీసుకొని నేను రైలు దిగి స్టేషన్ బైటికి వచ్చాడు అది జూన్ నెల కావడంతో తుంపర్ల వానపడ్తూ ఉంది. జనాలు కూడా అంతగా లేరు అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉండగా ఓ ఆటో కనిపించింది దాని దగ్గరకి వెళ్లి, అన్న పాల్టెక్నిక్ కాలేజీకి పోవాలి వస్తావా అని అడిగాడు అపుడు ఆ ఆటో డ్రైవర్ అక్కడికి పోవడానికి నూటముప్పయి అవుతుంది అని చెప్తాడు, అసలే అది రాత్రి కావడంతో ఇంకా ఎం మాట్లాడకుండా సరే అన్నాను. దాదాపు స్టేషన్ నుండి మూడు మైళ్ళ దూరంలో ఉన్న పాల్టెక్నిక్ కాలేజీకి ఆటో స్టార్ట్ అయింది. నా పేరు రామ్, టి.కె.అర్ పాల్టెక్నిక్ కాలేజీలో సీట్ రావడంతో ఇక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకోవాలని వచ్చాను. అల వెళ్తున్నపుడు దారికి రెండు వైపులా ఉన్న అడవిని చూస్తూ ఉండగా కాలేజీ వచింది. ఆటోకి పైసలిచ్చి హాస్టల్ గురించి వెతుకుతుంటే బాబురావు వసతి గృహం అని కనిపించింది. నేను ఆ వసతి గృహానికి వెళ్లి అక్కడి వార్డెన్కి ఫి ఇచ్చాక సర్ ఏ ఫ్లోర్లో నా రూమ్ అని అడిగాను, అప్పుడు వార్డెన్ కీస్ ఇస్తూ రెండో ఫ్లోర్లో అక్కడ విండో కనిపిస్తుంది కదా అక్కడ రూమ్ నెంబర్ పదహారు అదే అంటడు వార్డెన్. అపుడు నేను చూస్తే అక్కడ అంతకు ముందే ఎవరో నిల్చొని తననే చూస్తూ ఉంటాడు. నాకు ఎం అర్థం కాదు అక్కడ ఎవరో ఉన్నారు కదా ఐన వార్డెన్ తనకి కీస్ ఎందుకు ఇస్తున్నాడు అనుకుంటు కీస్ తిస్కొని పైకి వెళ్తాను. అక్కడ అంత చీకటిగా ఉంటుంది ఇంకా ఎవరు అడ్మిషన్ తిసుకోలేదనుకుంటా అందుకే అక్కడ ఉన్న తలుపులు అన్ని మూసేసి వున్నాయ్. నేను పదహారు నెంబర్ రూమ్ దగ్గరకి వెళ్ళగానే వాళ్ళు జలదరించే సన్నివేశం కనిపించింది ఆ రూమ్ తాళం వేసి ఉంది. అదెలా సాద్యమ్ ఇందాక తాను చూసినపుడు ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు కదా మరి ఇపుడు తాళం వేసి ఉందేంటి బహుశా నేనే తప్పుగ చూసి ఉంటా వేరే రూంలో అతనిని ఈ రూమ్ లో ఉన్నడనుకొని పొరపాటు పడి ఉంటా అనుకుంటూ తాళం తీసుకొని లోపలి వెళ్ళిపోయాను. లోపలి కి వెళ్లగా గది అంత ముక్కు పగిలిపోయాలా వాసనా వస్తుంది, చూడటానికి రూమ్ బనే ఉంది కానీ ఈ వాసనా ఏంటి అని చూస్తే ఓ మూలన ఎలుక చనిపోయి ఉంది దాని తీసి పక్కనే ఉన్న కిటికీ గుండా బైటకి విసిరేసా, ఆలా అనుకోకుండా బైటికి చూసినపుడు అటు వైపు మొత్తం అడివి కిటికీ లో నుండి చల్లటి గాలి వస్తుంది కొద్ది సేపు ఆలా ఆ గాలిని ఆస్వాదించిన తరువాత అలసటగా ఉండటంతో స్నానం చేద్దామని బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేస్తున్నపుడు అక్కడ నేను కాకుండా ఇంకా ఎవరో ఉన్నటు అనిపిస్తుంది. నా వెనుక ఎవరో నిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంటున్నా శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే మొహానికి ఉన్న సబ్బు కడ్డుకొని చూస్తే ఏదో ఆకారం ఆకడ నిలబడి నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో భయానికి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ ఇదంతా నా బ్రమేమో అని మరొకసారి తల విదిల్చి చూస్తే అక్కడ ఏమి లేదు. దాంతో కొద్దిగా భయం తగ్గి స్నానం ముగించుకుని త్వరగా బైటికి రాగానే పెద్దగా శబ్దం చేస్తూ బాత్రూం డోర్ దానికదే మూసుకుపోయింది ఎవరో లోపలి నుండి గడియ పెడ్తున్నట్టు అనిపించింది లోపలి నుండి నల్ల తిప్పి స్నానం చేస్తున్న శబ్దాలు వస్తున్నాయి. అసలు నేను బైటికి వచ్చాక ఇంకా ఎవరు లోపలి వెళ్ళలేదు కదా. అసలే చీకటి అందులోను ఇలాంటివి జరగడంతో ఒళ్ళంతా చెమటలు పెటేసాయ్. ఇంతకీ బాత్రూం లో ఎవరున్నారో చూదామని మెల్లిగా అటు వైపు వెళ్లి ఎవరు అని అడిగాను కానీ ఎటువంటి సమాధానం రాలేదు, ఒక ఐదు నిముషాల తరువాత సడన్గ ఎవరో లోపల నుండి బోల్ట్ తీసినట్టు డోర్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఎవరిదో చేయి నా చేయి ని గట్టిగ పట్టుకుంటుంది. ఆ స్పర్శ చాల చల్లగా ఉంది. ఆలా ఒక చేయి నన్ను పట్టుకోగానే నేను భయం తో గట్టిగ అరిచాను. మెల్లిగా దైర్యం తెచ్చుకొని వెనక్కి తెరిగి చూస్తే అక్కడ నా కన్నా రెండు సంవత్సరాలు పెద్దవాడైనా సీనియర్ కనిపించడు. అతను సారీ తమ్ముడు అర్జెంట్ ర కింద బాత్రూం లో నీళ్లు రావట్లేదు ఐదు నిమిషాల్లాలో ఓచేస్తాను ప్లీజ్ ర అంటూ లోపలి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అంటే ఇందాక బాత్రూం లో ఎవరు లేరన్నమాట. అసలు నాకు ఏమైంది అన్ని ఇలా అనిపిస్తున్నాయి అని ఆలోచిస్తూ బైటికి వోచాను. ఎదో టెన్త్ పాస్ అవగానే హారర్ మూవీస్ ఎక్కువ చూసినట్టున్న అందుకే ఇలాంటి భ్రమలు వస్తున్నాయ్. ఆలా ఆలోచిస్తూ నా రూమ్ కి వెళ్తుండగా ఎవరో నా రూమ్ పక్కనే ఉన్న మెట్ల గుండా కిందకి వెళవెళ్తున్నట్టు అడుల శబ్దం వినిపించింది, నా అడుగు అక్కడే ఆగిపోయింది. మల్లి నాకు నేనే ఇదంతా నా భ్రమనే అయ్యి ఉంటుంది అనుకోని లోపలికి వెళ్లి తలుపు వేస్తూ ఉండగా డోర్ ముందు ఎవరో ఉన్నటు ఆకారం కనిపించింది. వెంటనే డోర్ గట్టిగా వేసి గట్టిగ ఊపిరి తీసుకున్నాను. అప్పటికి టైం పది అవుతుంది, ఆకలిగా ఉండటం తో ఏమైనా తిందామని అనుకున్న ఈ టైంలో మెస్ లో ఏమైనా దొరుకుతాయో లేదో అనుకుంటూ త్వరగా షర్ట్ వేసుకొని భయపడుతూనే డోర్తీసుకొని కిందకి వెళ్ళాను. హాస్టల్ మొత్తం పాడుబడిన పాత బిల్డింగ్ ల ఉంది. పక్కన రూమ్ లో నిదురపోతున్న వార్డెన్ దగ్గరకి వెళ్లి మెస్ ఎక్కడ ఉంది అని అడిగాను , దానికి అతను టైం పది అవుతుంది కదా బాబు భోజనం ఉంటుందో లేదో వెళ్లి అయితే చూడు అని అడ్రస్ చెప్పాడు. అపుడు నేను ఆ వార్డెన్ తో మాట కలుపుతూ బాబాయ్ నా రూమ్ లో నేను ఒకడినే న లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానంగా అడిగాను, దానికి ఆ పెద్దయన ఇప్పటికి అయితే ఎవరు లేరు బాబు కానీ ఒక అబ్బాయ్ ఫీజు కట్టి వెళ్ళాడు రేపు కానీ ఎల్లుండి కానీ రావొచ్చు అని చెప్పాడు. ఇంకా ఏమి ఆలోచించకుండా తిండానికాని మెస్లోకి వెళ్ళాను అక్కడ ఒక మూలాన ఒక సీనియర్ కూర్చొని తింటున్నాడు. నేను వెళ్లి కౌంటర్ లో భోజనం ఉండ అని అడిగితే ఉంది అని ప్లేట్ మీల్స్ ఇచ్చారు దాని తీసుకొని ఒక టేబుల్ డాగర కూర్చోబోతుండగా ఆ సీనియర్ తమ్ముడు ఇక్కడకూర్చుందువుగానిరా అని పిలిచడు, నేను వెళ్లి అక్కడ కూర్చొని తనతో కబుర్లు చెప్తూ తింటున్న. తాను నన్ను రూమ్ నెంబర్ అడిగాడు దానికి నేను రూమ్ నెంబర్ ప పదహారు అని చెప్పా. దానికి ఆ సీనియర్ ఇంకేం మాట్లాడకుండా జాగర్తర తమ్ముడు అని చేపి వెళ్లిపోవడానికి లేచాడు నేను బయపడ్తూ ఎందుకన్న అని అడిగితే ఎం లేదుర, అవును నీకు రాత్రి పనేండు తరువాత ఏమైనా చప్పుళ్లు వినిపించిన అసలు పటించుకోకు అని చెపి వెళిపోయాడు. వెళ్తూవెళ్తూ ని దరిద్రం ఏమో కానీ ఇప్పటి వరకు సెకండ్ ఫ్లోర్ లోకి ఎవరు రాలె అని అన్నాడు. ఎలాగో అలాగా తినేసి ఇంకా పడుకుందామని నా రూమ్ కి వెళ్లి డోర్ తిస్తుంటే అక్కడ వరండా లో ఎటు వైపు తిరిగి చేతులు చాచి చల్ల గాలిని ఆస్వాదిస్తూ నిల్చున్నాడు. తనని చూసి నేను దయ్యం అని భయపడ్డ, బయపడ్తూనే తన దగ్గరకి వెళ్లి పలకరించాను కానీ ఎటువంటి సమాధానం రాలేదు ఇంకా ఇలా కాదు అని దగ్గరకి వెళ్లి తన బుజం పై చెయ్ వేసా తాను వెనక్కి తిరిగి బిగ్గరగా అరిచాడు నాకు గుండె ఆగినంత పని అయింది. ఒక ఐదు నిమిషాలకి ఇద్దరు కుదురుకున్నాక మాటలు కలిపాము. తాను కూడా జూనియర్ ఏ అని చెప్పాడు. తాను ఇక్కడ ఎదో తిరుగుతుందని ఎవరోచెప్పారని భయం వేయకుండా చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటున్న అని చెప్పాడు. ఆలా మాట్లాడుకుంటూ నా రూమ్ వరకు వచ్చేసాం హఠాతుగ్గా నాకు సెకండ్ ఫ్లోర్ లో ఎవరుదిగలేదు అని మా సీనియర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నాకు భయంవిపరీతంగాపెరిగిపోయింది ఎంతగా అంటే పరిస్థితి ఇంకొంచెంసేపు ఇలాగె ఉంటె గుండె ఆగి పోతుందేమో అన్నట్టు ఉంది . మెల్లిగా వెన్నకి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు నాకు అసలు ఏమి అర్థం కాలేదు. ముందులోపలివెళ్ళాలిఅనుకోని డోర్ తీసి లోపలికి వెళ్లి మల్లి డోర్ మూసేసా. అపుడు బైటి నుండి డోర్ తియామని బాదుతున్నాడు ఇందాక కలిసిన అతను, నాకు భయం తో కళ్ళు చేతులు ఆడటం లేదు కొద్దీ సేపటికి డోర్ తియామని బాదుతున్నా శబ్దం ఆగిపోయింది. ఏది ఏమైనా ఇంకా డోర్ తెరవకూడదని నిర్ణయించుకొని పడుకున్న. ఆలా పడుకున్న నేను అనుకోకుండా పైన ఉన్న ఫ్యాన్ ని చూడగానే గుండె ఆగిపోయింది పైన ఫ్యాన్ కి ఒక మనిషి ఉరి వేసుకొని ఉన్నాడు. నేను ఆ శవాన్ని ఆలా చూస్తున్నపుడు ఆ శవం నా మీద పడిపోయింది. ఉలిక్కిపడి లేచి చూస్తే అక్కడ నా మీద ఎం లేదు అలాగా ఫ్యాన్ కూడా సాధారణంగానే ఉంది. ఆలా ఆలోచిస్తుండగానే కరెంటు పోయింది, చిక్కటి చీకటి ఏమి కనిపించట్లేదు అంత నిశ్శబ్దం చిన్న సూది కింద పడిన వినిపించేంత నిశ్శబ్దం. అంతటి నిశ్శబ్దంలో నా పక్క నుండి ఎవరో నన్నుపేరు పెట్టి పిలుస్తున్నట్టు వినిపించింది. ఏంటి అంత ఆ సీనియర్ చేపినట్టే జరుగుతుంది అని బయపడ్తూ ఎవరు అని అరిచాను, దానికి అటు నుండి రామ్ ఇటు రా కిటికీ దగ్గరకి రా త్వరగా రార అని అనగానే కిటికీ వైపు చూసా అక్కడ ఎవరు లేరు. మెల్లిగా బెడ్ దిగి కిటికీ దగ్గరకి వెళ్లి చూస్తే అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. అపుడే డోర్ని మల్లి ఎవరో కొడ్తున్నారు. అది కూడా నా పేరుతో పిలుస్తూ ఎవరు అని అడిగితే న పేరు కేశవ నాకు వార్డెన్ ఈ రూమ్ ఇచ్చాడు అని చెప్తాడు. సరే అని నేను వెళ్లి తలుపు తెస్తే తాను సీరియస్గ చూస్తూ లోపలి వచ్చి బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వోచి ఆలా మంచం పైన పడుకున్నాడు. అపుడే కరెంటు వోచి ఫ్యాన్తిరగడం మొదలైంది నేను ఆలా చూస్తూనే నిద్ర పోయాను ఒకగంట తరువాత ఎవరో ఏడుస్తున్న చప్పుడు వినిపించి ఎవరా అని చూస్తే పక్కన బెడ్ పైన కేశవ ఏడుస్తూ ఉన్నాడు ఏమైంది అని అడిగితే తాను ఇంకా గట్టిగ ఏడుస్తున్నాడు. ఏమైంది బ్రో అని మల్లి అడగగానే ఏడుపు ఆపేసి, మోసం చేసాడు, బ్రో ఒక అమ్మాయి ని రెండేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న కానీ నా స్నేహితుడు చేసిన మోసానికి తట్టుకోలేక చచ్చిపోదామనుకుంటున్న అని ఈ ఫ్యాన్ కి ఉరి వేసుకుంటా అంటూ పైకి లేచాడు. నేను భయం తో తన మొహం చూస్తే అది మనిషి ల లేదు చచ్చిన శవం ల ఉంది, నేను భయం తో బిగుసుకుపోయా తాను మాత్రం నన్ను ఏ మాత్రం పాటించుకోకుండా ఫ్యాన్ కి తాడు తో ఉరి వేసుకున్నాడు. ఆలా ఫ్యాన్ కి వేలాడుతూ రాము అని నన్ను చూస్తూ నవ్వుతున్నాడు. అల నవ్వుతు నా పై పాడటానికి వస్తున్నాడు నాకు భయమేసి త్వరగా తలుపు తీసి కిందకి పరిగెత్తా అక్కడ సీనియర్ రూమ్ కనిపించటం తో తలుపు కొట్ట. ఎంత కొట్టిన ఎటువంటి సమాధానం లేదు. అపుడు వెనక నుండి రాము అని పిలుపు వినిపించగానే చాల బయమేసింది పక్కకి తిరిగి చూడాలన్న ధాయిర్యం సరిపోవట్లేదు, మల్లి పిలిచారు రాము అని ఈ సారి వార్డెన్ గొంతు, కొద్దిగా భయం తగ్గి పక్కకి చూస్తే నిజంగానే వార్డెన్ ఉన్నాడు. అర్ధరాత్రి ఇక్కడ ఈ డోర్ ఎందుకు కొడ్తున్నావ్ అని అడిగాడు. అపుడు నేను ఆ వార్డెన్కి అంత చెప్పి భయమేసి సీనియర్ కి చెప్దామని ఇలా వచ్చాను అని చెప్పా, దానికి ఆ వార్డెన్ సీనియర్ ఆహ్బా? బాబు ఇంకా హాస్టల్ కి ఎవరు రాలేదు, అయినా తలుపుకి తాళం వేసి ఉంది చూడలేదా అని అడిగాడు. చూస్తే నిజంగానే తాళం వేసి ఉంది. అంటే ఆ సీనియర్ కూడా దేయమేనా అని బయమేసింది, అపుడు ఆ వార్డెన్ నిన్ననే ఒక అబ్బాయ్ ఒచ్చాడు కదా నీ రూమ్ కి, కాలవలేదా బాబు అని అనే సరికి, బాబాయ్ తాను కూడా దయమే అని చెప్పా. అపుడు వార్డెన్ నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది బాబు. నీకు ఒక విషయం చెప్పాలి మూడు సంవత్సరాలకు ముందు సీనియర్స్ రెండో అంతస్థులో ఉండేవారు అందులో కేశవ్ అనే అబ్బాయ్ నీ రూమ్ లో నే ఉండేవాడు, చాల మంచివాడు మంచిగా చదివేవాడు. తాను ఒక అమ్మాయి ని ప్రేమించాడు అది చెప్పేందుకు దైర్యంలేక తన స్నేహితుడిని సహాయం చేయమని అడిగాడు. ఆ అమ్మాయి చాల అందంగా ఉంటుంది. ఆ స్నేహితుడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి తానే పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి కేశవ నీ రూమ్ లో నే ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయాడు, కొన్ని రోజులకే ఆ స్నేహితుడు కూడా గుండె ఆగి చనిపోయాడంట. అప్పటి నుండి రాత్రులు ఇక్కడ కేశవ ఆత్మ తిరుగుతుంది అని అంటుంటారు బాబు కానీ నేను ఎపుడు చూడలేదు, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. నువ్వు ఈ రోజు కి ఇక్కడే ఉండు రేపు పొద్దున లేచి ఆలోచిద్దాం అని అన్నాడు. నేను ఇక్కడ ఉండలేను బాబాయ్ ఈ ఒక రోజు నీ రూమ్ లో పడుకొని రేపు వెళ్ళిపోతా అని చెప్పి వార్డెన్ రూమ్ లో పడుకొని తరవాత రోజు వేరే హాస్టల్ కి వెళ్ళిపోయా.

