మగువా లోకానికి తెలుసా నీ విలువ
మగువా లోకానికి తెలుసా నీ విలువ
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
పరుగులు తీస్తావు ఇంటా బయట..
అలుపని రవ్వంతా అననే అనవంటా..
వెలుగులు పూస్తావు వెళ్లే దారం
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
నీ కాటుక కనులు విప్పారకపోతే.. ఈ భూమికి తెలవారదుగా..
నీ గాజుల చేయి కదలాడకపోతే.. ఏ మనుగడ కొనసాగదుగా..
ప్రతి వరుసలోను ప్రేమగా..
అల్లుకున్న బంధమా.. అంతులేని నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరనీ.. ఆదిశక్తి రూపమా..
నీవు లేని జగతిలో దీపమే వెలుగునా..
నీదగు లాలనలో, ప్రియమగు పాలనలో..
ప్రతి ఒక మగవాడు పసివాడేగా..
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా..
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వే
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..
ఎంత గొప్ప బావం ఉంధి ఈ పాటలో.. ఎంత గొప్పగా చెప్పారు ఆడవాళ్ళ గురించి...
అదేంటో ఎక్కడ విన్నా ఇదే పాటనే మరి..
బావం నచ్చి వింటున్నారా.. ట్రెండ్ గా మారిందని వింటున్నారా మరి...
ఆటో లో ఇదే సాంగ్ వస్తోంది.. బట్ అదే ఆటో లో పక్కనే ఉన్న ఒక అమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తున్నడు ఒకడు...
బస్ స్టాప్ లో ఎవరో ప్లే చేస్తున్నారు ఇదే సాంగ్..
అదేంటో ఆ గ్రూప్ లో ఉన్నవాడే పక్కన ఉన్న అమ్మాయిల బ్యాచ్ లో అమ్మాయిలని కామెంట్ చేస్తున్నడు...
యూ ట్యూబ్ లో కొన్ని మిలియన్ టైమ్స్ విన్నారు ఇదే సాంగ్.. అదేంటో ఎవరైనా ఒక అమ్మాయి ఇదే సాంగ్ ప్లే చేసి తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే.. కొంత మంది... కొంత మంది మాత్రమే ఇస్తారు వల్గార్ కామెంట్స్...
మగువ మగువ అని మీరే హం చేస్తుంటారు సాంగ్.. అదే మగువ మీ కల్ల ముందు ఒంటరిగా వెళుతూ ఉంటే ఆగవు మీ నోర్లు.. అదేంటో మరి...
మరి ఆడపిల్ల విలువ మీకు తెలీదా.. ఒక అమ్మాయిని కామెంట్ చేసేకి ఎక్కడ లేని ఎనర్జీ ఉత్సాహం వచ్చేస్తుంది ఏంటో మరి...
మరి మీ ఇంట్లో ఉన్న అమ్మ అక్క చెల్లి లాగానే పక్కన వాళ్ళ ఆడపిల్లలు అని ఆలోచించరు కథ...
పొరపాటున ఒక అమ్మాయ్ పీరియడ్ అయ్ మీ కళ్ళల్లో పడితే అదేదో మీరు నవ్వుకోవడానికి చూసే కామెడీ వెబ్ సిరీస్ లాగా అందరికీ చెప్పి చెప్పి మరీ నవ్వుతారు...
ఎం మీ ఇంట్లో అక్క చెల్లి అమ్మ లేరా.. వాళ్ళు పీరియడ్స్ అవ్వరా...
అమ్మతనం దేవుడు అమ్మాయికి ఇచ్చిన గొప్ప వరం.
ఆ అమ్మతనం ఎ మీ వంశాన్ని నిలబెట్టి మీ ప్రతిరూపాన్ని భూమి మీదకి తీసుకొస్తుంది....
ఇంకా...
ఒక అమ్మాయ్ మీకు నచ్చితే చాలు.. వాళ్ళకి ఇష్టాలు ఉండవా.. ప్రేమించమని విసిగించడం.. ప్రేమించకపోతే చంపేయడం..
ఎం అమ్మాయిలు అంటే అంత చులకనా అయిపోయింద ..
ప్రాణం తియ్యడం అంత ఈజీ న... నీ ప్రేమకి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి బ్రతికే అర్హత లేదా.. అల తన ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు ఎవరు ఇచ్చారు...
ప్రేమిస్తే అర్థం అయ్యేలా చెప్పు.. ఒప్పుకోకపోతే సైలెంట్ గా ఉండు.. నీకు నచ్చిన అమ్మాయికి నువ్వు నచ్చలని రాజ్యాంగంలో రాసుంద.. నీకేం రైట్ ఉంధి తన లైఫ్ నీ నాశనం చేసే కి....
ఇంకా...
అమ్మ నాన్న..
20 ఇయర్స్ మీ అమ్మాయిని కంటికి రెప్పల చూసుకుంటారు.. తీసుకెళ్ళి ఒక 420 చేతిలో పెడతారు.. వాడు నరకం చూపించి చంపేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పి చక్కగా రెండో పెళ్లి చేసుకుని మీ ముందే తిరుగుతాడు...
ఇంకా..
ఒక అమ్మాయి ఈవెనింగ్ టైం లో బయటికి వచ్చిందంటే ఏమైన చేయొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈవెనింగ్ బయటికి వచ్చింది..
అది తన జాబ్ కోసం ఆర్ వాళ్ల ఇంట్లో ఆ అమ్మాయి అవసరం ఎంటి ఇవన్నీ ఎం పట్టవు ..
ఎందుకంటే మనం అంతకంటే ఎక్కువ ఆలోచించలేము...
ఇప్పుడు మనం మన సమాజం గురించి మన గురించి మన ప్రభుత్వం లో ఉన్న చట్టాల గురించి అలానే మాన్ బాధ్యత గురించి మాట్లాడుకుందాం...
మనం చాలా గొప్ప వాళ్ళం ఎందుకంటే మన కల్ల ముందు ఎదైన జరుగుతుంటే మనం రెస్పాండ్ అవ్వం.. కానీ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి వాటి కింద పెద్ద పెద్ద్ధ కామెంట్స్ పెడతాం...
స్వప్నిక, ప్రణీత మీద వరంగల్ లో ఆసిడ్ అటాక్ జరిగింది.. ఎం న్యాయం చేయలేదని మహిళ సంఘాలు దుమ్మెత్తి పోశారు...
నెక్స్ట్ డే ఆ ఆసిడ్ ఆటాక్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు.. అప్పుడు అదే మహిళ సంఘాలు అల ఎలా చంపేస్తారు అని ప్రభుత్వాన్ని తప్పు పట్టారు...
ఎదైన తప్పు చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే తప్పు చెయ్యాలి అనే ఆలోచన కొంచెం మందికి ఐనా రాదు...
ఇక ఢిల్లీ లో జరిగిన నిర్భయ కేసు, హైదరాబాద్ లో జరిగిన దిశ కేస్.. నిర్భయ ఆక్ట్ వచ్చాక అలాంటి ఆటాక్స్ జరగలేదా????
మరి నిర్భయ ఆక్ట్ అంటే భయం లేదా...
మరి దేనికీ ఆ ఆక్ట్??
మరి దిశ ఆక్ట్ తెచ్చక అలాంటి అటాక్స్ జరగలేదా??
మరి స్పెషల్ ఆక్ట్ ఎందుకు?
ఒక్క ప్రభుత్వమే ఇలాంటి తప్పులు జరగకుండా ఆపగలద?
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలానే ప్రభుత్వానికి మన వంతు సాయం చేస్తేనే ఎదైన మార్పుని మన భావితరాల వారికి మనం ఇవ్వగలం.. స్వఛ్చమైన సమాజాన్ని ఇవ్వగలం...
మార్పు నీతోనే మొదలు పెట్టు...
అమ్మాయి కి ధైర్యం గా ఉండటం ఎలానో చెప్పు..
ఎలాంటి పరిస్థితులు వచ్చిన నీకు మేమున్నాం అనే శ్దైర్యన్ని ధైర్యాన్ని అమ్మాయిలో వచ్చేలా అమ్మాయిని మోటివేట్ చెయ్...
ఎవరైనా తనతో తప్పుగా ప్రవర్తిస్తే ఇంట్లో చెప్తే ఎం అంటారో తప్పుగా అనుకుంటారేమో అనే ఆలోచనలో కాకుండా.. ఎం జరిగిన నా నాన్న నా అన్న నా తమ్ముడు..మా అమ్మ నాకు తోడుగా ఉంటారు అనే నమ్మకం కలిగించు...
అలానే ఒక అమ్మగా నీ కొడుక్కి అమ్మాయిల గొప్పతనం చెప్పు.. అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తే నీ తల్లి తో తప్పుగా మాట్లాడినంత పాపం అని చెప్పు...
అమ్మాయితో ఎలా మాట్లాడాలో.. అమ్మాయిలో ఒక అమ్మను ఎలా చూడాలో చిన్నతనం నుండి నేర్పు..
నీ చిన్నప్పటి నుండి నీ లైఫ్ లో నువ్వు వేరే అబ్బాయిల ద్వారా పడిన బాధలను నీ కొడుక్కి చెప్పు.. వేరే అమ్మాయ్ కూడా మన ఇంట్లో అమ్మ అక్క లాంటిదే అని తెలిసేలా చెప్పు....
ఎందుకు రాదు మార్పు...
ఎలాంటి వెధవ అయిన తల్లితో తప్పుగా ప్రవర్తించ లేడు గా...
నువ్వు ఇంకొకరిని బాధ పెట్టినట్లు.. నీ తల్లిని నీ చెల్లిని రేపు నీ కూతురిని నీ లాంటి వాడు ఇంకొకడు ఇలానే బాధ పెడతాడు అని తెలిస్తే ఒక్క క్షణం ఆలోచించ డ
వంద మందిలో ఒక్కడు ఆలోచించ డా....
మార్పు ఎక్కడి నుండో రాదు.. మనలో నుండి మాత్రమే మొదలవుతుంది..
మన ఆలోచనల్లో నుండే మార్పు మొదలవ్వాలి...
మొదటగా మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి...
డియర్ సొసైటీ...
ఒక అమ్మాయికి ఎదైన అన్యాయం జరిగితే...
అది ఎదైన కానివ్వండి..
అమ్మాయి మీద ఆసిడ్ ఎటాక్ అవ్వొచ్చు...
అమ్మాయ్ మీద రేప్ అటెంప్ట్ అవొచు..
అమ్మాయ్ లవ్ లో మోసపోయి ఉండొచ్చు..
వాళ్ళకి న్యాయం చేయాలని చాలా కష్టపడి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తాము..
రోడ్ లు ఎక్కి ధర్నాలు చేసి మరి న్యాయం జరగాలని కోరుకుంటున్నాముఅంటారు...
బై గొడ్స్ గ్రేస్ ఆ అమ్మాయి ఆ ఆసిడ్ ఎటాక్ లో ఫేస్ కాలిపోయి బ్రతికింది.. రేప్ అటెంప్ట్ లో ప్రాణాలతో పోరాడి బ్రతికింది..
సొసైటీ లో ముందులాగ తిరగగలద.. మనం తిరగ నిస్తమ...
మనం ఎవరం ఔతే ఆ అమ్మాయిల కి న్యాయం జరగాలని ధర్నాలు చేశామో... అందరూ కాదు కొందరు.. కొందరు మాత్రమే..
ఇపుడు ఆ అమ్మాయిలు వంక చూసే చూపులు ఉంటాయి చూడండి..
బాబోయ్ నిజం గా వాళ్ళు ఆ అటాక్స్ నుండీ ప్రాణాలతో పోరాడి గెలిచరంటే వాళ్ళకి మనం తోడుగా ఉండి మేమంతా మీకోసం ఉన్నాం అని ధైర్యాన్ని నింపాలి.. అంతే కానీ..
ఆసిడ్ ఎటాక్ అయన అమ్మాయ్ ఫేస్ చూసి నాకు భయమేసింది.. అని ..మా పిల్లలు నిన్ను చూసి భయపడుతున్నారు అని ఇలాంటి మాటలు.. అంటూ ఇంకా ఇంకా వాళ్ళని మానసికంగా చంపేస్తున్నారు..
మనకి ఆ రైట్ ఎవరు ఇచ్చారు..
ఇలా ఒకటి కాదు చాలానే ఉన్నాయ్...
ప్రతి ఒక్కరికీ వాళ్ళకి నచ్చినట్లు బ్రతికే హక్కు ఉంధి ఇక్కడ..
కానీ అమ్మాయికి మర్రేజ్ అయితే భర్త అత్త మామలు ఎంత సాధిస్తున్న ఓర్చుకుని ఉండమంతరు.. ఎందుకో తెల్సా..
డివోర్స్ తీసుకుని అమ్మ గారి ఇంటికి వస్తే పక్కన వాళ్ళ సూటి పోటి మాటలు , భర్త వదిలేసిన అడది అని చిల్లర వెధవలు చేసే చెత్త కామెంట్స్(అందరూ కాదు కొందరు) ని తట్టుకుని నిలబడి సొసైటీ లో బ్రతకలేదు అని..
కానీ పేరెంట్స్...
మీ అమ్మాయ్ ప్రాణం లేని శవంగా మీ ఇంటికి రావడం కంటే..
డివోర్స్ తీసుకుని మీ కల్ల ముందు ప్రాణాలతో ఉండటం మంచిదే కదా..
మేము ఇలాంటి నరకం నుండి బయటపడి మ ఇంటికి వెళ్తే మా అమ్మ నాన నన్ను నా పిల్లలని కలలో పెట్టుకుని చూసుకుంటారని నమ్మకాన్ని ఇవ్వండి చాలు..
ఈ సొసైటీ చనిపోయిన నీ కూతుర్ని తిరిగి ఇవ్వలేదు గా..
సో
మార్పు మంచిదైతే చాలు.. మన ఇంటి నుండే మొదలు పెడతాం...
అబ్బాయిలకి అమ్మయిల విలువ తెలియ చేపుధం...
అన్న కి చెల్లి కష్టాల్లో ఉంటే తోడుగా ఉండి ధైర్యం చెప్పడం లో తోడుగా ఉంధం ..
భర్త కి భార్య విలువ..తెలిసేలా పెంచండి మీ కొడుకుని..
అందరూ అబ్బాయిలని తప్పు పట్టట్లేదు...
కొంచెం మందికి మాత్రమే ...
మనం మన ఇంటి నుండే ఒక మంచి సమాజాన్ని నిర్మించేందకు తొలి అడుగు వెద్ధము...
ప్రభుత్వానికి మన వంతు సహాయం చేద్దాం...
థాంక్స్....
ఎవరిని అయిన బాధ పెట్టింటే సారి...
