SPANDAN

Drama Crime

4.6  

SPANDAN

Drama Crime

హత్య

హత్య

1 min
450


మనమంతా హంతకులమే అని బజారమ్మ తన కూతురు గంజాయితో అనింది. ఒక్కసారిగా ప్రశ్నార్ధకంగా చూసింది గంజాయి. ఏంటో అమ్మ నీ మాటలు అర్ధమే కావు అని నిట్టూర్పుతో అంది. బజారమ్మ ఒక సున్నితమైన నవ్వు నవ్వి, నీకు భ్రమాజం అన్నీ అర్ధం చేయిస్తుంది. కానీ నేనాపాటికి ఉంటానో ఉండనో అంది. 

గంజాయి 18 సంవత్సరాల భ్రమల వయసులో వుంది. గడిచిందంతా గడ్డుకాలం, భవిష్యత్తంతా స్వర్ణమయం అని కలలు కనే కమాయకత్వం. చేతిలో పొత్తకాల సంచి, మనసంతా వాటిని ఎప్పుడు వదిలించుకోవాలా అనే గంపెడంత ఆశ. అలా ఆశల ఊహలలో ఊరేగుతుంటే పొగగొట్టం పరిచయమయ్యాడు. పొగకి, గంజాయికి భ్రమాజం సెట్ చేసిన సంగతులు బాగా కలిసాయి. గులాధిపత్యం, మత్తుం, దాసభక్తి, గాత్రం మున్నగు ముసుగులు సెట్ అయ్యాయి. చివరికి సైడ్ హీరో, హెరాయిన్ లు కూడా కలవడం కాకతాళీయమో లేక ద్రోకర్ మాయో అర్ధం కాక ఆ గమ్మత్తులో మురుస్తుండగానే కసేజి చరమాంకానికి చేరింది. కలలు నిజం చేసుకునే కాలం ఆసన్నమయ్యిందని మనసులు ఉవ్విళ్ళూరుతున్నాయి. ఆ పాడు సర్టిఫికెట్ కాలేజోడుతగలబెడితే, భ్రమాజం భగ భగలలో ఎప్పుడు ఆహుదవదామా అని గంజాయి, పొగకి ఒకటే ఆత్రుత. 

అన్నీ కుదిరి, పెద్దల మందలు ఒప్పుకోవడం వల్ల మొత్తానికి పొగవంశాంకుర కొనసాగింపుకు పునాది పడింది. గంజాయి సాంస్కృతిక మర్యాదక త్యాగానికి అవకాశం ఇచ్చినందుకు మనసులో భ్రమాజానికి కృతఙ్ణతలు చెప్పుకుంది. 

సంసార చదరంగం మొదలయ్యింది. కలలు కల్లలు కావడం మొదలయ్యింది. బజారమ్మ మాటల అంతరార్ధం గంజాయికి అర్ధం అవ్వడం మొదలయ్యింది. బాధ్యతల బరువులు, అసమానత్వపు అరుపులు, అదే తరతరాల సంపదలనే బుజ్జగింపులతో బ్రతుకు బోధపడింది. 

గంజాయికి పాప పుట్టింది. ఎప్పటిలాగే జీవితాన్ని అర్ధం చేయించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, జనజీవన స్రవంతిలో కలవడానికి మనసును ఎలా హత్యగావించాలో తర్ఫీదు ముమ్మరమయింది. పాప వాస్తవం నుండి పారిపోవడానికి ఊహాలోకాలలో విహరించడం మొదలెట్టింది. గంజాయి నిట్టూర్పుగా మనమంతా హంతకులమే అనేసింది గోడకు వేళాడుతున్న బజారమ్మ బొమ్మకేసి చూస్తూ. 

«జీవన మజలీ పునరావృతం»



Rate this content
Log in

More telugu story from SPANDAN

Similar telugu story from Drama