హోప్ ఈజ్ ది బెస్ట్ ...గ్రీడ్ ఈజ్ ది వరస్ట్ ...
హోప్ ఈజ్ ది బెస్ట్ ...గ్రీడ్ ఈజ్ ది వరస్ట్ ...
ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది జీవితం లో ఉన్నతి స్థాయికి ఎదగాలని అలాగే నాకున్న ఆశ నన్ను నిరాశలో ముంచింది ...నన్ను అనాధ శరణాలయంలో పడేసింది ఇదే నా స్టోరీ మీరు వినండి ...నా పేరు రామ్ నేనొక పల్లెటూరిలో పుట్టి పెరిగాను ...చిన్నప్పుడు నువ్వు ఏమి అవుతావు రా అని మా మాస్టారు అడిగితే ..మీలా టీచర్ ని అవుతాను సర్ అని చెప్పాను అదే నాకు జ్వరం వచ్చి డాక్టర్ దగ్గర కి వెళ్తే అతను అదే ప్రశ్న అడిగారు కాని నా సమాధానం మారింది ...నేను డాక్టర్ ని అవుతాను సర్ అన్నాను ...మరి ఇంటికి వచ్చాక మా లాయర్ మామయ్య వచ్చారు మరల అదే ప్రశ్న నాకు ఎదురైంది ...నేను లాయర్ అవుతాను అని చెప్పేశా ...ఇవన్నీ చూసిన మా నాన్న ...నా కొడుకు చాలా గొప్పవాడు ...ఇన్ని జాబులు ఒకేసారి చేసేస్తాడు నాకు అన్ని విధాలుగా సమాజంలో పేరు వస్తుందని మురిసిపోయాడు ...ఇంటికి వచ్చాక మా నాన్న వాళ్ళ స్నేహితులు ఇద్దరు రైతులు వచ్చారు ...ఏరా రాము అంతా సాఫీగా ఉందా ఆరోగ్యం అని అడగగా ...ఆ ఉంది నేనే డాక్టర్ ని కదా ...నాకు ఎలాగైనా బాగుంటుంది అని అమాయక ముఖంతో చెప్పేసాను. వాళ్ళందరూ నవ్వుకున్నారు నేను మా నాన్న కూడా వాళ్ళతో కలిపి నవ్వేసామ్ ...పదవ తరగతి పాస్ ఐపోయాను ...పై వృత్తులన్ని చెయ్యాలంటే ఏ గ్రూప్ చదవాలా అని అందరిని అడుగుతూనే ఉన్నాం ...కొందరు మేథ్స్ గ్రూప్ అని , కొందరు సైన్స్ గ్రూప్ అని , మరికొందరు సోషల్ గ్రూప్ అని చెబుతున్నారు ...ఇలా అందరూ చెబుతూనే ఉన్నారు ...మేము వింటూనే ఉన్నాం ...ఇలా వాళ్ళు చెప్పడం , మేము వినడం ...జరుగుతూనే ఉన్నాయ్ ...కాని నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వలేదు ...అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కాని నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వలేదు ...కొన్ని సంవత్సరాలకి నేను ఎంట్రన్స్ టెస్ట్ లకి అర్హత కోల్పోయాను ...మా నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను ...మా నాన్న మాత్రం మన పరువు పోగూడదు అందుకే నువ్వు టీచర్ , డాక్టర్ మరియు లాయర్ అవ్వాలిరా అంటున్నాడు ...అప్పుడు ఎవరో మా నాన్నకి చెప్పారంట వేరే దేశంలో ఐతే మీ అబ్బాయి అన్ని రంగాలలో రాణించే అవకాశం వస్తుంది అన్నాడంట ...ఇది విన్న మా నాన్న వెంటనే పొలం అమ్మేసి బంగారం అమ్మేసి ఒక ఏజెంటుని పట్టుకొని దుబాయ్ పంపేశాడు ..మా నాన్న రైతు నుండి కూలి ఐపోయాడు ...నేను దుబాయ్ లో ఏజెంటు తాలూకా వాళ్ళని కలిసాను ...వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు అది ఎంత బాగుందంటే వర్షం పడితే మన శరీరం లో తడవని భాగం వెతుక్కోవడం కష్టం , ఎండాకాలమైతే బాడీ పై నీడ ఎక్కడ పడిందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ...జ్వరం వస్తే డాక్టర్ అక్కర్లేదు మన టాబ్లెట్స్ మనమే వేసుకోవాలి ...అక్కడ భాష అర్ధం కాక ...కొన్ని రోజులు విని విని నేనే టీచర్ లా.. మా స్నేహితులు కి అక్కడ లోకల్ భాష నేర్పేవాడిని ...కొన్నిరోజులకి పని లేదు ...మరి ఆహారం ఎలా వస్తుంది ... అందుకే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో వ్యవసాయం చేసాను ...మొత్తానికి నేనొక రైతులా ఫీల్ ఐయ్యాను ...ఆ వ్యవసాయ ఉత్పత్తులతో నేను బిజినెస్ చేసి బిజినెస్ మాన్ ఐయ్యాను ...ఈ కష్టాలన్నీ మా నాన్నకి చెప్పలేదు ...కాని నేను అన్ని వృత్తులలో సెటిల్ ఐపోయాను అని చెప్పేసాను ...మా నాన్న చాలా హ్యాపీ ..కాని నేను డబ్బులు పంపించే స్థితిలో లేను ..ఐనా మా నాన్న ఎడ్జెస్టు ఐపోయాడు ...చివరికి మా నాన్న డబ్బులు లేక అనాధ ఆశ్రమం లో జాయిన్ ఐపోయాడు ...కాని అనాధ ఆశ్రమంలో జాయిన్ ఐనట్టు నాకు గాని నా ఊరు వాళ్లకి చెప్పలేదు ...ఊరు వాళ్ళతో మా అబ్బాయి దగ్గరకి వెళ్తున్నాం అని అబద్ధం చెప్పాడు ...కాని దూరంగా ఉన్న అనాధ ఆశ్రమం లో జాయిన్ ఐయ్యాడు కాబట్టి ఎవరికి తెలియలేదు ...నేను నాకు మంచి దారి చూపని ఏజెంట్ ని లీగల్ గా ఎదుర్కోవడానికి ఒక లాయర్ లా అన్ని లా బుక్స్ చదివేసాను ... మొత్తానికి నేను లాయర్ కూడా ఐపోయాను ...ఇలాగే మా పక్కనే ఉన్న తెలుగు కుర్రాడు రాజు వాడి స్టోరీ చెప్పాడు ...వాళ్ళ నాన్న వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్లు కాని వాళ్ళ అబ్బాయి పొరుగు దేశంలో ఉన్నాడని చెప్పుకోవడానికి వాళ్ళు అదే ఏజెంటుని పట్టుకొని మోసపోయారు ...రాజు తల్లిదండ్రులకి డబ్బు ఉన్నప్పటికీ కొడుకు ఎక్కడ లేడని బాధతో కుంగిపోతే ఎవరో చెప్పారని అనాథాశ్రమంలో అన్ని సౌకార్యాలు బాగున్నాయని ఆటలు పాటలు కూడా వయసుతో సంబంధం లేకుండా ...మీ బాబు లాంటి వాళ్ళతో ఆడుకోవచ్చని చెప్పేసరికి ...వాళ్ళ ఆస్తి మొత్తం ఆ అనాధ ఆశ్రమానికి రాసేసి అదే ఆశ్రమంలో ఏమీలేని అభాగ్యులులా జాయిన్ ఐపోయారు ...నిజానికి రాము , రాజు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే కలిశారు ...అప్పుడు కూడా మనసొప్పక వాళ్ళ జరిగిన కథలు చెప్పుకున్నారు ...నిజానికి దుబాయిలో రాము రాజు కలిసి ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు కి తెలియదు ...వాళ్ళు ఏజెంట్ ద్వారా అక్కడ లాక్ ఐపోయారు ...వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ దూరం గా ఉన్న ఆశని దగ్గర గా ఉండే దురాశలా మార్చుకుని ఆశ్రమంలో లాక్ ఐపోయారు ...చివరగా వృద్ధాశ్రమములో ఉన్న రాజు తల్లిదండ్రులు , రాము అమ్మ చనిపోయారు ...అప్పుడు రాము తండ్రి ఈ ప్రపంచానికి వాళ్ళ జీవితం తెలియాలని ఒక గుణపాఠం కావాలని ...పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ వృద్ధాశ్రమం ద్వారా చేయిస్తూ బయట ప్రపంచానికి తెలిసేలా ...మన ముఖ్య మంత్రి కి తెలిసేలా చేస్తే ... తర్వాత ప్రధాని మంత్రి దృష్టికి తీసుకెళ్తే ...అప్పుడు దుబాయ్ లో ఉన్న ఇండియన్ రిప్రెజెంటేటివ్ ద్వారా ...రాము రాజు ని ఇండియా కి రప్పిస్తారు ...అప్పుడు అన్ని న్యూస్ చానెల్స్ లో వీళ్ళ గురించే రావడం తో ...రాము వాళ్ళ ఊరు రాము తండ్రితో కలిపి వెళ్ళిపోయాడు ...రాజు అదే వృద్ధాశ్రమానికి అధికారిగా ఉండి విధులు నిర్వర్తిస్తూ గడిపేస్తున్నాడు ...రాము మాత్రం తనకి ఉన్న టీచర్ రైతు , డాక్టర్ మరియు లాయర్ గా నేర్చుకున్న అనుభవాన్ని ఉపయోగిస్తూ కాలం గడిపేస్తున్నాడు ...ఇట్లు మీ శ్రేయోభిలాషి రామ్
