Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Aswini " sanketh "

Drama Classics Inspirational

5.0  

Aswini " sanketh "

Drama Classics Inspirational

నిను చూడాలని..

నిను చూడాలని..

6 mins
571


విజయ్: అరుణా,అరుణా.. నా షేవింగ్ కిట్టు ఎక్కడ పెట్టావు..??

అరుణ: అబ్బా,అక్కడే పెట్టా చూడండి..మీ బ్యాగ్ పక్కనే..

విజ్జు: మరి నా గోల్డ్ వాచ్ ఎక్కడ పెట్టావు??

అరుణ: అది మీ బ్యాగ్ లోనే పెట్టేసా..

విజ్జూ: మరి లాస్ట్ మంత్,నే కొనుక్కున్న లైట్ బ్లూ కలర్ షర్ట్..??

అరుణ: ఏంటండీ..మీ హడావిడి..ఇందాకటి నుండి చూస్తున్నా..మీరు వెళ్ళేది మీ ఫ్రెండ్ పెళ్ళికా, లేక మీరు మళ్లీ పెళ్లి చేసుకోడానికా??🤔🤔

విజయ్: అబ్బా!! మళ్లీ పెళ్లి!! ఆ మాట ఎంత బాగుందోయి..చేసుకునేదా మళ్లీ పెళ్లి..??

అరుణ: ఆ చేసుకోండి.. అప్పుడు గనక విరగదు అప్పడాల కర్ర అంటుంది..

విజయ్: హా..హా..అప్పడాల కర్రేగా పోతే పోయింది.. మళ్లీ కొనుక్కుందాం లే !! అంటాడు చిలిపిగా నవ్వుతూ..

అరుణ కూడా, భర్త నవ్వుతో శ్రుతి కలుపుతూ..త్వరగా వచ్చేయండి..నేను మీరు లేకుండా ఒంటరిగా ఉండలేను అంటుంది..

విజయ్బార్య నడుం పై చేయి వేసి..దగ్గరకి లాక్కుని.. లేత మందారాల్లా వున్న పెదాలను అందుకొని..త్వరాగానే వచ్చేస్తా అంటూ.. బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు..

***********

విజయ్ బస్సు ఎక్కి, సీట్ చూసుకుని కూర్చుని,ఫోన్ తీసి అందులో డిగ్రీ ఫ్రెండ్స్ గ్రూప్ తీసి.. నేను స్టార్ట్ అయ్యాను.. ఇప్పుడే బస్సు ఎక్కాను అని msg పెట్టీ..

యూట్యూబ్ ఓపెన్ చేసి,తనకి ఇష్టమైన ఇళయరాజా పాటలు యియర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ వుంటాడు..

ఇంతలో టుయి, టుయి మని మెసేజ్ బీప్ సౌండ్స్ రావడంతో వాట్సప్ ఓపెన్ చేసి చూస్తాడు..

ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకటే మెసేజెస్ వస్తూ వుంటాయి..

"ఏరా,రాను అన్నావు..ఇప్పుడెలా వస్తున్నావు" ..- అని ఒకడు..

"ఆఫీస్,బొంగు,బోషానం..అన్నావు"..- ఇప్పుడు లేదా ఆఫీస్ అని మరొకడు..

" అర్థమయ్యింది లేరా!!" ..- అని మరొకడు..

"ఏమర్థమయ్యింది రా!!.."- అని ఇంకొకడు..

ఇలా వరసగా మెసేజెస్ వస్తున్నాయి..

ఆఖరుగా.." నాకు తెలుసు బా.. సుజాత వస్తుంది అని వస్తున్నావు..అంతే తప్ప, నా పెళ్లి అని రావటం లేదు కదరా!! నమ్మక ద్రోహి!!రా!! రా!! నీ పని చెప్తా!! " -

అని పెళ్ళికొడుకు నుండి మెసేజ్..

ఇలా అన్ని మెసేజెస్ చదువుతూ..నవ్వుకుని..అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అంటూ.. మెసేజ్ చేసి, నెట్ ఆపి..ఫోన్ చేతితో పట్టుకుని కళ్ళు మూసి కుంటాడు విజయ్..

కళ్ళల్లో ఏదో బాధ మెదిలి..ఫోన్ స్క్రీన్ ఆన్ చేసి.. గెలారీ లోకి వెళ్లి, ఒక ఫోటో తీసి.. ఆ ఫోటో పై చేత్తో రాస్తూ..

నిన్ను జీవితంలో ఒక్కసారి అయినా.. మళ్లీ చూడాలి అని, వస్తున్నా..నువ్వు వస్తున్నావు కదూ !! అంటాడు..

ఇంతలో బస్సు స్పీడ్ గా వెళ్లేసరికి, కొంచం ముందుకు తుళ్ళి.. మళ్లీ సర్దుకుని కూర్చుని, విండో లోంచి బయటికి చూస్తూ.. గత స్మృతులలోకి వెళ్తాడు..

విజయ్ డిగ్రీ చదివే రోజుల్లో సుజాత అని తన క్లాస్ మేట్ నీ ఇష్ట పడతాడు..

సుజాత కూడా విజయ్ నీ ఇష్ట పడుతుంది..కానీ ఒకరికి ఒకరు చెప్పుకోరు.. అది క్లాస్ లో అందరికీ తెలుసు..క్లాస్ లో వుండే ఒక అమ్మాయి ద్వారా ఈ విషయం సుజాత అమ్మగారికి కూడా తెలుస్తుంది..

ఇలా వుండగా వాళ్ళ డిగ్రీ ఫైనల్ యియర్ ఎగ్జామ్స్ వస్తాయి..

ఒక రోజు ఎగ్జామ్ అయిపోయాక సుజాత,విజయ్ తో..నేను నీతో ఒక విషయం చెప్పాలి..ఎగ్జామ్ అయిపోయాక పక్కనే వున్న పార్క్ కి ఒక సారి రాగలవా!! అంటుంది..

విజయ్, సరే అంటాడు..

ఎగ్జామ్ అయిపోయాక సుజాత పార్క్ లో విజయ్ కోసం ఎదురు చూస్తూ వుంటుంది..ఇంతలో విజయ్ అక్కడికి వస్తాడు..

సుజాత, ఇంక విషయం దాచి పెట్టిన ప్రయోజనం లేదని..విజయ్ తో,నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు..

విజయ్: మంచిదేగా..

సుజాత: కానీ,నాకు ఇష్టం లేదు..నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మా అమ్మతో కూడా చెప్పా..వాళ్ళు దానికి ఒప్పుకోలేదు..

నీకు కూడా నాపై ఇష్టం వుంది అని నాకు ఎప్పటి నుండో తెలుసు..అందుకే ఆడపిల్లని అయినా, సిగ్గు విడిచి అడుగుతున్నా..

మనం ఎక్కడికి అయినా, వెళ్లి పెళ్లి చేసుకుందాం!! అంటుంది..

విజయ్: అదేంటి సుజి,నువ్వు అలా ఎలా అణుకున్నావు..నువ్వు అంటే నాకు ఇష్టమే.. కానీ, అది ప్రేమ కాదు..అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు అంటాడు..

సుజి: మరి నువ్వు చూసే చూపులు..నాతో మాట్లాడే మాటలు..అంటుంది కళ్ళల్లో ఉరుకుతున్న గంగా,గోదావరి లను అత్యంత కష్టం మీద ఆపెస్తూ..

విజయ్: సారి,సుజి..నా చూపులు,నా మాటలు నీకు తప్పుగా తోచినట్టు వున్నాయి..అంతే గాని, నాకు నీ పై ప్రేమ లేదు.. అని వెనక్కి తిరిగి చూసే సరికి అక్కడ సుజి లేదు..

అల్లంత దూరంలో శోక సముద్రంలో.. మునుగూతూ వెళ్తుంది..

విజయ్ నిలబడిన చోటే కూలబడి పోయి.. సారి, సుజి!! నీకు అబద్ధం చెప్పా..నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ..కానీ, నా ప్రేమ.. నీకు ఆకలి తీర్చదు..నీకొక మంచి లైఫ్ కూడా ఇవ్వదు..

కానీ మీ అమ్మగారూ!! చెప్పినట్టు.. ఆ అమెరికా సంబంధం , పెళ్ళికొడుకు నిన్ను సుఖంగా చూసుకుంటాడు..నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాడు..

పైగా నాతో వచ్చేస్తే, నీ కుటుంబాన్నికి దూరం అవుతావు..అదే, ఆ అబ్బాయిని చేసుకుంటే.. నీ వారు నీ దగ్గరే వుంటారు అంటూ.. గుండెలు అవిసేలా ఏడుస్తూ.. ముందు రోజు జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు..

ముందు రోజు సుజి అమ్మగారు!!విజయ్ దగ్గరకు వచ్చి.." మా సుజి నిన్ను ప్రేమిస్తుంది అంట అంటారు"..

విజయ్,ఆనందానికి అవధులు ఉండవు..

ఇంతలో ఆమె" మా సుజి నిన్ను పెళ్లి చేసుకుంటే అది ఆనందంగా మాత్రమే వుంటుంది..అదే మేము తెచ్చిన అమెరికా సంబంధం చేసుకుంటే అది సుఖంగా,సంతోషంగా వుంటుంది.."

పైగా నీతో అది లేచిపోతే.. మా ఆయన పరువు పోయింది అని, దాన్ని చంపే రకం కాదు..తనని తాను చంపుకునే రకం..ఇధి.. నేను, దానికి కూడా చెప్పవచ్చు..కానీ అది వినే పరిస్థితుల్లో లేదు..

అందుకే నీకు చెప్తున్నా..నువ్వు అంటే నాకు అయిష్టత లేదు..అలాగని ఇష్ఠతా లేదు..

మీ కులం వేరు,మా కులం వేరు..పైగా అంతస్తులు కూడా వేరు..

నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న దానిని..నీకు మంచి ఏదో.. చెడు ఏదో ..తెలుసు అని అనుకుంటున్నా..

చివరిగా ఒక మాట.. నీ తల్లి లాంటి దాన్ని అడుగుతున్నా!! నా, తాళిని నాకు దూరం చేయకు అంటూ.. ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు..

అది గుర్తు వచ్చిన విజయ్ ఆంటీ!! మీ తాళికి ఏమీ కాదు..అలాగే మీ కూతురికి, మీరు అనుకున్నంటే, మీకు నచ్చిన సంబంధమే చేయండి.. అని మనసులో అనుకుంటూ..

సుజి ఒక్క సారి నిన్ను చూడాలని వుంది ..అని గట్టిగా బయటికి అంటూ.. కూర్చున్న చోటే ఏడుస్తూ వుండిపోతాడు..

***********

బస్సు కుదుపుల వల్ల,గత జ్ఞాపకాల నుండి బయటికి వస్తాడు..ఇంతలో బార్య అరుణ నుండి ఫోన్ రావడం తో ఎత్తి, చెప్పారా!! అంటాడు..

అరుణ: ఎక్కడి వరకు వెళ్ళారు??

విజయ్: ఆల్మోస్ట్ వచ్చేసినట్టు వున్నా!!

అరుణ: అక్కడికి వెళ్ళాక.. నన్ను మరచి పోకండి..నాకు అప్పుడప్పుడు కాల్ చేయండి అంటుంది..

విజయ్: నవ్వుతూ..సరే, బై..అని ఫోన్ పెట్టేసి..అరుణ పరిచయం గుర్తు తెచ్చుకుంటాడు..

సుజి కి దూరం అయి, ఆ ఊరిలో వుండలేక.. పట్నం వచ్చి, పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు..

అక్కడే మన అరుణ కూడా వర్క్ చేస్తుంది..అరుణ ఒక అనాథ..చిన్నప్పటి నుండి అనాథ ఆశ్రమంలో పెరిగి ఇప్పుడు ఉద్యోగం వచ్చాక లేడీస్ హాస్టల్ లో వుంటూ ఉద్యోగం చేస్తుంది..

అరుణ అంత, అందమైనది కాదు..నార్మల్ రంగు.. అయినా, తన మాట తీరు ఎవ్వరినీ అయినా ఇట్టే ఆకర్షించేస్తుంది..

అలాగే విజయ్ నీ, కూడా అకర్షిస్తుంది..అసలు జీవితం లో పెళ్లే వద్దు అనుకున్న విజయ్.. అరుణ పై ఇష్టాన్ని పెంచుకుని, పెద్దలలో చెప్పి పెళ్లి చేసుకుంటాడు..

మొదటి రాత్రి అరుణతో తన లవ్ విషయం అంతా చెప్తాడు..

అప్పుడు అరుణ " ఒక మగాడి జీవితంలో ఎందరు ఆడవాళ్ళు అయినా వుండవచ్చు.. కానీ, ఒక భర్త జీవితంలో భార్యకి మాత్రమే చోటు వుండాలి.. అలా వుండేలా నేను చూసుకుంటా అంటుంది.."

విజయ్ : ఎలా?? అంటాడు..

అరుణ: ఇలా అంటూ.. విజయ్ గుండెలపై పడుకుని.. నీ ప్రేమని మరచి పోయేంత, ప్రేమని నేను పంచి అంటూ..బుగ్గని కొరుకుతుంది..

విజయ్: రాక్షసి!! నిన్ను అంటూ..అరుణనీ చుట్టేస్తాడు..

అలా అప్పటి నుండి ఇప్పటి దాకా అరుణ విజయ్ మనసుని ఆక్రమించుకుంది..

కానీ,వారం క్రితం విజయ్ డిగ్రీ ఫ్రెండ్, తన పెళ్లి కార్డ్ ఇచ్చి తప్పకుండా రావాలి అని చెప్తూ.. సుజాత ఇక్కడే వుంది అంట.. పెళ్లికి తను కూడా వస్తాను అన్నాధి!! అంటాడు..

అప్పటి నుండి మళ్లీ విజయ్ కి సుజాత గుర్తు వచ్చి.. ఒక్కసారి నిన్ను చూడాలని అనుకుని.. పెళ్లికి బయలు దేరతాడు..

ఇంతలో స్టాప్ రావడంతో విజయ్ బస్సు దిగి.. ఆటో చూసి పెళ్లి మండపానికి వెళ్తాడు..

అక్కడకి వెళ్ళగానే విజయ్ నీ ఫ్రెండ్స్.. అందరూ చుట్టూ ముట్టేసి..ఎన్ని రోజులు అయ్యింది రా!! నిన్ను చూసి.. అని చుట్టేస్తూ వుంటే..


ఇంతలో, అక్కడికి ఫ్రెండ్స్తో నవ్వుతూ వస్తున్న సుజి నీ, చూస్తూ వుండి పోతాడు..విజయ్..

సుజి కూడా విజయ్ నీ చూసినా, చూడనట్టు వెళ్ళిపోతుంది..

అవును మరి.. కోపం వుంటుందిగా ఆ మాత్రం..కోరి వచ్చిన ప్రియ సఖిని!! కాదంటే ఎవ్వరికైనా కోపం వస్తుంది..

అందునా తన లాంటి అందమైన అమ్మాయిలకు ముక్కు మీదే వుంటుంది కోపం..

అనుకుంటూ.. మనసులో నవ్వుకుంటాడు విజయ్..

పెళ్లి అంతా సుజాత ,విజయ్ అస్సలు మాట్లాడుకోరు..పెళ్లి అయి పోయాక ఎవరింటికి వారు వెళ్లి పోతుంటే..

సుజాత వచ్చి, విజయ్ చేతికి ఒక పేపర్ ఇచ్చి..ఇందులో నా ఫోన్ నంబర్ వుంది..నీతో మాట్లాడాలి అని వుంది..నీకు వీలైతే ఫోన్ చెయ్ అంటు.. కళ్ళల్లో నీళ్ళు రాగా.. అక్కడ వుండలేక వెళ్ళిపోతుంది..

వెళ్తున్న సుజాతని చూస్తూ..నీవు ఒకరికి బార్యవి అయినా,ఇద్దరి బిడ్డల తల్లివి అయినా నాకు మాత్రం "నా మొదటి ప్రేమ దేవతవు అంటూ".. అక్కడే నిలబడి సుజాత కార్ వెళ్ళే వరకూ చూస్తూనే వుంటాడు..

ఇంతలో వెనుక నుండి ఫ్రెండ్స్ అరేయి!! ఫోన్ నంబర్ ఇచ్చింధిగా..ఇంకేం అంటూ.. ఆట పట్టిస్తుంటే.. విజయ్,నవ్వుతూ ఊరుకోండి రా !! అంటూ.. తను కూడా వెళ్ళే సమయం అవ్వడంతో అందరికీ వీడుకోలు చెప్తూ.. అక్కడి నుండి వెళ్లి పోతాడు..

బస్సు ఎక్కిన విజయ్, చేతిలో భద్రంగా వుంచుకున్న కాగితాన్ని తెరిచి అందులో సుజాత దస్తురిని ముద్దు పెట్టుకుని..నిన్ను,ఒక్కసారి అయినా మళ్లీ చూడాలి అనుకున్నా..చూసా, అది చాలు ఈ జన్మకి అని అనుకుంటూ..


ఆ కాగితాన్ని మడిచి విండో లోంచి బయటికి విసిరేసాడు..

"అది గాలికి ఎగురుతూ.. వీడుకోలు ప్రియతమా!! అన్నట్టు.. దూరంగా ఎగిరిపోతుంది.."

***********

ఇంటికి వచ్చిన విజయ్ డోర్ బెల్ నాక్ చేస్తే తలుపు తీసిన భార్య, కాసి చూస్తూ వుంటాడు..

ఏంటి ??అలా, చూస్తున్నారు శ్రీవారు!! అంటుంది అరుణ..

విజయ్: నా కొరకై ఇలకు చేరిన " దేవకన్య " నీ చూస్తున్నా అంటాడు..

అరుణ: భర్త తలపై చేయి వేసి జుట్టు అంతా చేతితో పాముతు..మీకు బాగానే వుందా!! లేక తలకి దెబ్బ ఏమైనా తగిలిందా !! అంటూ జుట్టు అంతా వేతుకుంతుంది దెబ్బ కోసం..

విజయ్: భార్య అమాయకత్వానికి నవ్వు వచ్చి..నాకు ఏమి అవ్వలేదు రా!! ఎందుకో నిన్ను చూసి రెండు రోజులు అయ్యింది కదా!! అందుకే అంటాడు.. నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ..

అరుణ: అబ్బా!! వదలండి..ఇంటి బయట ఏంటి?? మీ వేషాలు అంటుంది.. కొంచం సిగ్గు పడుతూ..

విజయ్: ఓ అదా!! నీ బాధ!! అంటూ..అరుణనీ రెండు చేతులతో ఎత్తుకుని.. అయితే ఇక్కడ వద్దులే, అంటాడు.. లోపలికి తీసుకు వెళ్తూ..

అరుణ సిగ్గుల మొగ్గై భర్త గుండెలలో ఒదిగి పోతుంది..

కథ సమాప్తం..

మొదటి ప్రేమని మరచి పోవడం అంత సులభం కాదు..కానీ,అదే గుర్తు పెట్టుకునీ, వుండకుండా జీవితం లో ముందుకు వెళ్ళాలి..అదే జీవితం..


ముక్కు సూటిగా,ఏటువంటి ప్రలోభాలకు లొంగకుండా వున్న వాడే అసలైన మనీషి..

ఆ దేవుడు, మన కోసం పుట్టించిన వారిని.. మన దగ్గరకి తప్పకుండా చేరుస్తాడు..

"మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్' అని ఊరికే అనలేదుగా!!..

ఏమంటారు?? ఫ్రెండ్స్??

మీ అభిప్రాయాలని నాకు తెలియ చేయండి..


Rate this content
Log in

Similar telugu story from Drama