Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Yashaswee Nemmani

Drama

4.8  

Yashaswee Nemmani

Drama

ఒక మిత్రుడి జ్ఞాపకం

ఒక మిత్రుడి జ్ఞాపకం

6 mins
3.1K


వంట ఇంటిలో గిన్నెలు పడ్డ శబ్దం విని నిద్రలేచాడు గిరీశం. గడియారం పొద్దున ఎనిమిది కొడుతుంది. ఎంత లేపిన వీడు లేవడు, అనుకుంటూ వంటింట్లోంచి సాంబార్ కలిపిన గరిటతో గిరీశం దగ్గరికి వస్తూ, లేచావా నాయనా ఆకాశంలో సూర్యుడు వచ్చి కుడా రెండు గంటలు అయింది. కాలేజీకి టైం అవుతుంది రా ఇంత వేళ వరకు నిద్ర పోతే ఎలా? అనింది గిరీశం అమ్మ కాత్యాయిని.


ఒక్కసారిగా ఉసేన్ బోల్ట్ పరుగు ప్రారంభించేటప్పుడు ఉండే అంత వేగంతో పక్కలో నుంచి దూకి బాత్రూంలోకి వెళ్లి కాలకృత్యాలు అన్ని నిర్వర్తించుకొని బట్టలు వేసుకుంటూ అమ్మా ఆకలి అంటూ డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేస్తూ ఆల్రెడీ రెడీ గా పెట్టిన ఇడ్లీ సాంబార్ హడావుడిగా తిన్నామా లేదా మ్రింగామాఁ అనే లాగా తింటూ ఉంటే కాత్యాయని మొట్టికాయ వేసి మెల్లగా తిను అని చెప్పినా వినకుండా ఆల్రెడీ లేట్ అయింది అమ్మ అంటూ ఒక రెండు ఇడ్లీలు తిని ఆ ప్లేట్ లోనే చేతి కడుక్కుని లేచి పక్కనే ఉన్న టిఫిన్ బాక్స్ ని తీసుకొని కాలేజ్ బ్యాగ్ లో పెట్టేసి, కంఠాభరణం ఐడి కార్డుని మెడలో వేసుకుని, కొక్కానికి వేసిన బైక్ తాళంచెవిని తీసుకుని, గడియారం వంక చూస్తూ, ఇంకా పదిహేను నిమిషాలే ఉంది సురేశంగాడు వచ్చాడో లేదో అని మనసులో అనుకుంటూ బూట్లు వేసుకొని అమ్మ వెళ్తున్న బాయ్ అంటూ రెండవ అంతస్తు నుంచి మెట్లు దిగుతు బయలుదెరాడు గిరీశం. ఇంతలో ఆగరా అని కాత్యాయని అరుపు వనపడినది. ఏంటమ్మా లేట్ అవుతుంది అన్నాడు గిరీశం. కొత్తగా ఏముంది రోజు లాగానే హేల్మెట్ మరిచావు. పెట్టుకుని వెళ్ళు అంటూ మళ్ళీ ఒక మొట్టికాయ వేసింది కాత్యాయిన. సారి అమ్మ అన్నాడు గిరీశం. జాగ్రత్తగా వెళ్లి రా అంది కాత్యాయని. బాయ్ బాయ్ అమ్మ అంటూ మెట్లు అవరోహణ చేస్తూ నిష్క్రమించాడు గిరీశం.


కిందకు దిగుతూ బైక్ పార్కింగ్ లోకి రాగానే ముఖము పైన కుంకుమ బొట్టుతో, ప్యారాచూట్ ఆయిల్ దట్టంగా పెట్టిన జుట్టుని ఒక చేత్తో సరిచేసుకుంటూ, మరో చేత్తో మొబైల్ ని పట్టుకొని, ఎప్పుడూ లైట్ రిఫ్లెక్షన్ తో తళ-తాళా మెరిసే కళ్ళజోడులో నుంచి ఏదో మొబైల్లో చూస్తూ పెదవుల పైన చెదరని చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు బైక్ దగ్గర సురేశం. ఎంత సేపు అయ్యింది రా వచ్చి సురేశం అన్నాడు గిరీశం. ఒక పావుగంట అవుతు ఉంది అన్నడు సురేశం. అవునా? లేట్ అయింది రా సారీ వెయిట్ చేయించినందుకు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు గిరీశం. ఫరవలెదులే ఎలాగో నాకు బైకు నడపరాదు, మన కాలేజ్ రూట్ లో ఆటోలు బస్సులు అంత ఈజీగా దొరకవు. నీతో వెయిట్ చేయించుకోవటం నాకూ ఇనెవిటబల్ అంటూ నవ్వుతు బైక్ వెనక కూర్చున్నాడు సురేశం. ఇంకో పది నిమిషాల్లో రీచ్ అవుతమ్లే కాలేజీకి అంటూ కాంచనగంగా ఇంజనీరింగ్ కాలేజీకి రైయి మంటూ బయలుదేరారు ఇద్దరు.


నాకు ఫ్రీగా నీ బైక్ పైన రోజు వెళ్ళటం గిల్టీ గా ఉంది రా అన్నాడు గిరీశంతో సురేశం. భలేవాడివి రా ఎలాగో నేను వెళ్ళే దారిలోనే నిన్ను తీసుకెళ్తున్న నీకోసం ఏమి స్పెషల్ గా వేరే దగ్గరికి వెళ్లడం లేదు కదా? నిజానికి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే కాస్త కాలక్షేపంగా ఉంటుంది. ఇద్దరం వెళ్లడంలో నా స్వార్థం కూడా ఉందిలే. ఇంక ఎప్పుడూ అలా అనకు రా స్టుపిడ్ అన్నాడు గిరీశం. అలా కాదురా నాకు నీ బైక్ లో పెట్రోల్ పోయించడానికి కూడా అవకాశం ఎప్పుడూ ఇవ్వవు కదా? డబ్బులు ఇచ్చినా తీసుకోవు అన్నాడు సురేశం. అరేయ్ అలా అంటావ్ ఏంట్రా నేను ఎప్పుడూ అయినా అడిగాన నిన్ను? నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వడానికి అన్నాడు గిరీశం. అలా కాదు రా అని సురేశం అనే లోపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యానికి అనగా కాలేజీ కి చేరుకున్నారు గిరీశం సురేశం. ఇదే సమయంలో కాలేజీ గేట్ దగ్గర సీటీ కొడుతూ గేట్ మూయమని సెక్యూరిటిగార్డ్కి సిగ్నల్ ఇస్తున్న పిటీ సార్ని గమనించి త్వరగా గెట్‌ మూసే లోపు వెల్లిపలికి దూసుకెల్తూ పార్కింగ్లో బైక్ పార్క్ చేసి హడావిడిగా క్లాస్రూంలోకి వెళ్లిపోయారు ఇద్దరు.


మధ్యాహ్నం మూడున్నర కావస్తుంది. గిరీశం సురేశం ఇద్దరూ క్లాసెస్ ముగించుకొని బైక్ పైన ఇంటికి తిరోగమనం సాగించార. మళ్లీ పొద్దున మాట్లాడిన విషయాన్ని మాట్లాడబోతున్న సురేశంని గమనించి ఇంకా ఆ విషయం మరచిపో అని సీరియస్ గా అన్నాడు గిరీశం. దానితో ఇష్టం లేకపోయినా సైలెంట్ గా ఉండి పోయాడు సురేశ. అలా కాలేజీలో జరిగిన ఇచ్చులు-కచ్చకాయలు విషయాలను మాట్లాడుకుంటూ గిరీశం ఇంటికి చేరుకున్నారు గిరీశం మరియు సురేశం. ఇంకా ఇద్దరు కాసేపు అలానే సుమారుగా ఒక ఐదు పది నిమిషాల పాటు రోజూ లాగానే మాట్లాడుకున్న తరువాత గిరీశం బైక్ పార్క్ చేసి మెట్లు అధిరోహించాడు వెనక వేసుకున్న బ్యాగు తలపై నుంచి తీసిన హెల్మెట్ ఒక చేతిలో , మరో చేత్తో తాళంచెవితో సురేశంకు బాయ్! సి యు టుమారో అని చెపుతూ . . అలాగే రా థాంక్యూ సి యు టుమారో బాయ్ అంటూ మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి షేరింగ్ ఆటోలో బయలుదేరాడు సురేశం.


ఇలా ప్రతిరోజు సుమారుగా ఒక సంవత్సరం పాటు గా గిరీశంతో కాలేజీకి వెళ్లి వచ్చేవాడు సురేశం. గిరీశం ఏనాడు ఒక్క రూపాయి అడిగేవాడు కాదు సురేశంని. అదే సమయంలో సురేశంకి ఊరికే అలా గిరీశం బైక్ పైన వెళ్లి రావడం కుడా నచ్చేది కాదు కానీ గిరీశంతో అనేవాడు కాదు ఎలాగో గిరీశం ఒప్పుకోడు అని తెలిసి.


అలా కొన్ని రోజులు గడిచాక కాంచనగంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఇండస్ట్రియల్ టూర్ కి స్టూడెంట్స్ని నార్త్ ఇండియాకి తీసుకు వెళుతున్నారు. టూర్ మేనేజర్ టూర్కి వచ్చే స్టూడెంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. దానికి గిరీశం పేరు ఇవ్వలేదు అని గమనించిన సురేశం గిరీశంని అడిగాడు ఏరా నువ్వు పేరు ఇవ్వలేదట ఇండస్ట్రియల్ టూర్ కి. ఏమి? అవును రా నాకు అదే టైంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. నేను రావడం కుదరదు అన్నాడు సురేశంతో గిరీశం. ఏం ఫరవలెదులే ఫంక్షన్కి అంకుల్ ఆంటీ వాళ్ళు వెళతారు. టూర్ కి వెళ్దాం మనం. నీ మనీ నేను కడతాను. ఎంజాయ్ చేద్దాం అన్నాడు సురేశం. భలేవాడివి రా నాకు కుదరదు కాబట్టి రావటం లేదు అంటున్నాను. డబ్బులు లేక కాదు అని చెప్పి నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు గిరీశం.


అలా గిరీశం లేకుండానే సురేశం మిగిలిన సహ విద్యార్థులతో వెళ్ళాడు టూర్కి. చూస్తూ ఉండగానే 15 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు లాగానే కాలేజీ కి వెళ్లడానికి బైక్ దగ్గరికి వచ్చాడు గిరీశం. అక్కడ సురేశం ఆనందంగా ముఖముపైన మందహాసముతో గిరీశం కోసం వేచి చూస్తూ కాలేజీ బ్యాగ్ తో ఉన్నాడు. ఏరా టూర్ బాగా జరిగిందా అన్నాడు గిరీశం. నువ్వు రాకుండా ఏం బాగా జరుగుతుంది రా అని ఏదో పరిహాసంగా అన్నాడు సురేశం. చాలు లేవోయ్ బాగా ఎంజాయ్ చేశారు అని తెలుస్తుంది నీ ముఖంలో అన్నాడు గిరీశం.


ఇంతలో బ్యాగ్ లోంచి ఏదో తీసి గిరీశం చేతికి ఇస్తూ ఇది నీ కోసం కరోల్ బాగ్ ఢిల్లీలో తీసుకున్నాను అన్నాడు సురేష్ సురేశ. ఏంట్రా ఇది అన్నాడు గిరీశ. ఏమీ లేదుర! చూడు కదా! ఓపెన్ చెయ్యి అన్నాడు సురేశం. దాన్ని ఓపెన్ చేస్తూనే ఏదో టీషర్ట్లాగా ఉందే అని గెస్ చేసుకుంటూ ఓపెన్ చేశాడు గిరీశం. నేను ముందే గెస్ చేశా టీషర్ట్ అని అన్నాడు గిరీశ. నచ్చిందా నీకు? సరిపోతుందా? అని వెనక్కి తిరుగు అని ఫుల్ హ్యాండ్ రౌండ్ నెక్ లివైజ్ టీషర్ట్ని నా చేతిలో నుంచి లాక్కుని నా భుజాలకి కొలత చూస్తూ పర్ఫెక్ట్ గా ఉంటుంది నీకు అని నా వైపు చూస్తూ ఆ టీషర్ట్ని నాకు అక్కడే వేయించాడు గర్వంగా ఆనందంగా సురేశం. నేను ఎందుకు తెచ్చావ్ రా నాకు అని గిరీశం తో అనబోతుంటే, మరు మాట్లాడనివ్వకుండ ఆపేసి కాలేజీ కి లేట్ అవుతుంది కదా అంటూ గిరీశాన్ని బైక్ వద్దకు వెనక నుంచి నెట్టుతూ, పద -పద పద-పద అంటు మాట్లాడ నివ్వకుండా చేసి కాలేజీకి బయలుదేరడానికి బలవంతం చేశాడు ప్రేమగా సురేశం. ఏమీ మాట్లాడకుండా చిరు మందహాసంతో పద వెళ్దాం అన్నాడు గిరీశం మిత్రుడికి తిరిగి ఇవ్వడానికి తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అన్న ఆనందాన్ని గర్వాన్ని ప్రేమను సురేశం ముఖములో గమనిస్తూ .


కట్ చేస్తే, నాలుగు సంవత్సరాలు గడిచింది. గిరీశం ఇంజనీరింగ్ తర్వాత వేరే రాష్ట్రానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లి తన కెరీర్లో బిజీ అయిపోయాడు. అదే సమయంలో సురేశం బీటెక్ తర్వాత వేరే కాలేజీలో మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ చేశాడు. కాలానుగుణంగా గిరీశానికి సురేషానికి మధ్య ఫోన్ కాల్స్, మెసేజెస్ కూడా చాలా తగ్గిపోయాయి. ఏదో బర్త్ డే ఎల్లప్పుడూ, న్యూ ఇయర్ అప్పుడు తప్పితే పెద్దగా చెప్పుకోదగిన కమ్యూనికేషన్ లేకుండా పోయింద. ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా ఇద్దరి మధ్య కొంత దూరం అయితే ఏర్పడినది.


ఒకరోజు పొరుగు రాష్ట్రం నుంచి ఇంటికి వస్తున్నా గిరీశానికి సురేశం ఫ్రెండ్ సందేశ్ కనపడ్డాడు. హే గిరీశం! ఎలా ఉన్నావ్? బాగున్నావా? ఇప్పుడే నా రావడం పొరుగు రాష్ట్రం నుంచి అన్నాడు సందేశ్. అవును సందేశ్! రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తున్నాను. ఇదిగో మధ్యలో నువ్వు కనబడ్డావు అన్నాడు హుషారుగా గిరీశం. అలాగా అంటూనే సందేశ్ ఏదో చెప్పబోతూ మొఖము నిరాశ గా పెట్టి పాపం రా సురేశం అన్నాడు. వాడు ఉంటే బాగుండేది కదా అన్నాడు.


వాడికి ఏమయిందిరా అన్నాడు ప్రశ్నార్థాకమైన ముఖముతో గిరీశం? అయ్యో నీకు తెలియదా ఇంకా ? సుమారుగా ఒక ఆరు మాసాల కిందట మే నెలలో వాడు చనిపోయాడు రా అన్నాడు సందేశ్ దిగ్భ్రాంతిగా. అదేంటి అలా అంటున్నావ్ నువ్వు చెప్పేది నిజమేనా అంటూ సీరియస్ గా చూసాడు సందేశాన్ని గిరీశం? నీకు తెలియదేమో నేను చాలా బాధపడ్డాను వాడి గురించి తెలుసుకొని వాడు ఎప్పుడూ మనతో చెప్పనేలేదు వాడికి అలా ప్రాబ్లం ఉంది అని అన్నాడు సందేశ్. గిరీశానికి ఏమి అర్థం అవడం లేదు , సందేశ్ చెప్పేది నమ్మలెకపోతునే, ఏం ప్రాబ్లం వాడికి? నాతో ఎప్పుడూ చెప్పలేదే అన్నాడు గిరీశం. వాడికి పుట్టుకతో ఒకే కిడ్నీ తో పుట్టాడంట. వాడికి చిన్నప్పటి నుంచే హెవీగా స్ట్రయిన్ అయ్యే పనులు గాని, ఆటలు కానీ అందుకే ఆడేవాడు / చేసేవాడు కాదట. మనతో క్రికెట్ ఆడడం అంటే ఇష్టం లేదు నాకు అని అనే వాడు తప్ప మనకు అసలు నిజం ఎప్పుడూ చెప్పలేదు వాడు. మనము ఎంత వెక్కిరించిన, పరిహాసం చేసిన, ఎల్లప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాడే తప్పా , వాడికి డాక్టర్స్ ఆడకూడదు అని చెప్పారు అని, వాడి కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా చేయటం లేదు అని, జాగ్రత్తగా ఉండాలి అని మనతో ఎప్పుడూ చెప్పలేదు కదా అన్నాడు సురేశంగాడు అన్నాడు సందేశ్. సందేశ్ చెప్పేది వింటూనే కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ దిగ్బ్రాంతితో ఇది నిజమేనా అన్నట్టు సందేశం వైపు చూస్తూ నివ్వెరపోయాడు గిరీశం.


అలా చెబుతూ సందేశ్ , వాడికి అన్నీ ముందే తెలుసు రా కానీ మనకు ఎప్పుడూ చెప్పలేదు అదే బాధగా ఉంటుంది. ఫైనల్ గా ఒక రోజు కిడ్నీ కంప్లిట్ గా ఫెల్యర్ అవ్వటం వలన వాడు మనకు, వాళ్ళ అమ్మానాన్నలకు తీరని లోటుని మిగిల్చి వెళ్ళాడు. హిస్ ప్లెస్ కెనాట్ బి ఫిల్డ్ అంటూ సురేశంని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు సందేశ్. ఇది నమ్మలేక మౌనంగా సందేశ్తో ఏమీ మాట్లాడకుండా అలా నడుచుకుంటూ వెళుతూ తను వేసుకున్న లివైజ్ ఫుల్ హ్యాండ్స్ రౌండ్ నెక్ టీషర్ట్ని ముద్దాడు కుంటూ, ఆ టీషర్ట్ని గట్టిగా కౌగిలించుకుంటూ వెళ్ళిపోయాను అని.. ఈ కథని రాసి ప్రపంచానికి చదివి వినిపించి, నా మిత్రుడు సురేశం యొక్క చెదరని చిరునవ్వుని పరిచయం చేసే అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ కథ నా మిత్రుడు సురేశంకి అంకితం. ఇక సెలవు అంటూ కాంచనగంగా ఇంజనీరింగ్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గిరీశంచే వ్రాయబడిన "ఒక మిత్రుడి జ్ఞాపకం" కధ చెబుతూ ఆశ్రు నయనాలతో , మిత్రుడి జ్ఞాపకాలతో , చెమ్మగిల్లిన కళ్ళని దస్తితో తుడుచుకుంటూ పోడియమ్ విడిచి స్టెజ్ మీద ఉన్న కుర్చీ లో కూర్చుండిపోయాడు కధలోని ప్రధాన పాత్రదారి గిరీశం.


Rate this content
Log in

Similar telugu story from Drama