STORYMIRROR

Aruna

Inspirational

4  

Aruna

Inspirational

వసంతం

వసంతం

1 min
0

వేకువ కోసం ఎదురుచూసే ఆ కళ్లు.. సమయం రాగానే తలంటు స్నానమాచరించి, తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని నిశ్చయించుకున్నాయి. నిత్యం తాను ఆరాధించే ఆ పరమశివుడే మేల్కొలిపి.. ఆ వేకువ జామున అందంగా అలంకరించిన పొదరింటికి, కొత్త వెలుగులు తీసుకొచ్చాడు.
​ఆ చీకటిని చీల్చి వెలుగు దీపాలు వెలిగించే తన పేరే 'వసంత'.
​అందం లేదని ఆగిపోని వనిత.. ఆస్తి లేదని కుంగిపోని నారి.. కేవలం తన ఆశయం కోసం, తన మనసులో నిర్మించుకున్న కలల కోటకు మహారాణి ఈ వసంత. పచ్చని పల్లెటూరులో పెరిగి, ప్రేమ అనురాగాలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ కలల రాణి గురించి, ఆమె సాగించిన పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకుందాం

చాలామంది అంటుంటారు.. 'ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది? పది కాలాల పాటు పచ్చగా ఉండే ఒక ఇంటికి కోడలిగా వెళ్తే చాలు కదా' అని. కానీ, నా మనసు మాత్రం ఆ మాటలను ఒప్పుకోదు.
​నా పేరు వసంత. ఈ పచ్చని పొలాలు, ఈ పెంకుటి ఇళ్లు.. ఇవే నా ప్రపంచం. కానీ నా కళ్లు మాత్రం ఈ ఊరి పొలిమేరలు దాటి, ఆ పెద్ద చదువుల వైపు చూస్తున్నాయి. నాన్న కష్టపడుతుంటే చూడలేక ఒక పక్క మనసు లాగుతున్నా.. మరోపక్క నా చదువు నా భవిష్యత్తుకే కాదు, నాలాంటి ఎందరో ఆడపిల్లలకి ఒక ధైర్యం అవ్వాలని నా ఆశ.
​మొన్న నాన్నతో 'పీజీ చేస్తానమ్మా' అని చెప్పినప్పుడు ఆయన కళ్లల్లో ఒక రకమైన భయం చూశాను. అది నా మీద నమ్మకం లేక కాదు.. నన్ను చదివించే స్తోమత లేదన్న బాధ. ఆ రాత్రి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. కానీ ఆ కన్నీళ్లు నా ఆశయాన్ని ఆపలేవు.
​నా ప్రయాణం ఇక్కడే ఆగిపోతుందా? లేక నా కలల కోసం నేను పోరాడాలా? నాన్నను ఎలా ఒప్పించాలి? అన్నీ వచ్చే ఎపిసోడ్‌లో మీకు చెబుతాను.. వింటారు కదూ?"


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More telugu story from Aruna

వసంతం

వసంతం

1 min വായിക്കുക

Similar telugu story from Inspirational