వృక్ష విలాపం...
వృక్ష విలాపం...
పార్వతీపురం అనే గ్రామంలో కిట్టు అనే కట్టెలు వ్యాపారి ఉండేవాడు. కిట్టు చాలా స్వార్థపరుడు. "అందరూ అమ్మేదానికన్నా నేను ఎక్కువ కట్టేలు కొట్టి అమ్ముకోవాలి"అని అనుకునేవాడు. అలా ఒకరోజు కిట్టు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ చెట్లన్నింటిని మెల్లమెల్లగా కొడుతున్నాడు, కొంతసేపటికి కిట్టుకి ఆకలి వేసింది. అక్కడ ఒక నేరేడు చెట్టు కనిపించింది. నేరేడు పండ్లను తెంపి కిట్టు తిని తన ఆకలి తీర్చుకున్నాడు. మళ్ళీ పని మొదలేట్టాడు అన్ని చెట్లు నరుకుతుండగా హఠాత్తుగా కిట్టుకి ఒక శబ్దం వినిపించింది. అదేంటంటే చెట్టు ఏడుస్తుంది. కిట్టుకి ఆశ్చర్యమేసింది. "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు. చెట్టు ఏడుస్తూ! నువ్వు ఇన్నీ చెట్లను నరికేసావు నా స్నేహితులందరినీ నాకు దూరం చేశావు, చివరికి నీ ఆకల్ని కూడా నేనే తీర్చాను కదా అలాంటిది నీ స్వార్థం కోసం నన్ను నరికేస్తావా? నా చెట్టు మీద ఎన్నో పక్షులు తన గూటిని కట్టుకొని జీవనం సాగిస్తున్నాయి,అలానే ఎంతోమంది పిల్లలు నా చెట్టు కిందకు వచ్చి ఆడుకుంటారు, మరియు ప్రాణవాయువును కూడా నేనే అందిస్తాను, వర్షాలు పడేటట్టు చేస్తాను, అలాంటిది నన్నే నరికేస్తావా?" అని బాధతో అడిగింది. దానికి కిట్టు "నన్ను క్షమించు మిత్రమా! నా కళ్ళు తెరిపించావు, నా స్వార్థం కోసం ఆలోచించాను కానీ మీ వల్ల ఎంతో ఉపయోగం ఉందని తెలుసుకోలేక పోయాను" అని అన్నాడు. చివరికి చెట్టు" నా స్నేహితులు లేని జీవితం నాకు వద్దు నన్ను కూడా నరికేసి నీ వ్యాపారం ఇంకా పెంచుకో" అని చెప్పింది. కిట్టు ఏడుస్తూ "నువ్వు చనిపోతూ కూడా నా గురించి ఆలోచించావు, ఇప్పటినుంచి నా వ్యాపారాన్ని వదిలేస్తాను, ఈ స్థలంలోనే ఎన్నో చెట్లనునాటి నా జీవితాన్ని సార్థకం చేసుకుంటాను" అని అన్నాడు.
