ప్రేరణ గీతం
ప్రేరణ గీతం
పంతం ఎందుకు? పంతం ఎందుకు?
ప్రాణం పోదా చిటికలో!
పంతం ఎందుకు? పంతం ఎందుకు?
ఎగిసిపడే అలలను చూసి నేర్చుకో.. వెనుతిరగడం.
భయం ఎందుకు? భయం ఎందుకు?
తీర్చుకోమా భూమి ఋణము తృణములో!
భయం ఎందుకు? భయం ఎందుకు?
అస్తమిస్తున్న సూర్యుని చూసి నేర్చుకో.. ఉదయించడం.
కోపం ఎందుకు? కోపం ఎందుకు?
కలిసిపోమా మట్టిలో క్షణములో!
కోపం ఎందుకు? కోపం ఎందుకు?
గర్జించే మేఘాన్ని చూసి నేర్చుకో.. శాంతించడం.
