Cherala Raman

Inspirational


4.8  

Cherala Raman

Inspirational


పచ్చునూరు

పచ్చునూరు

2 mins 640 2 mins 640

  

హైదరాబాద్ లో మంచి పేరున్న యువవ్యాపారులు సుదర్శన్, పండరి  సిరిసిల్ల దగ్గరలో పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఏ గ్రామంలో భూమి, నీళ్లు లోటు లేకుండా ఉంటాయో తెలుసుకున్నారు. పచ్చునూర్ అయితే తమకు అన్నిరకాల అనుకూల ప్రదేశమైన సిద్ధమయ్యారు.

              పొద్దున 8గంటలకు కారు వేగంగా దూసుకుపోతున్నది. పచ్చని చీర పరిచినట్టుగా కనుచూపు మేర పచ్చునూరు అందాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్ సంపత్ ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉంది. ఇంటి ముందున్న ముసలమ్మ వాళ్లు పొలానికి వెళ్లారని చెప్పింది. సర్పంచ్ అయి ఉండి ఇంత పొద్దున్నే పొలానికి వెళ్లడమేందని ఓ పిల్లగాన్ని తీసుకొని కారులోనే పొలం దగ్గరికి వెళ్లారు. కూలొల్లు పాట పాడుకుంట కలుపు తీస్తుంటే సంపత్ గడ్డి అంతా గడ్డ మీద తెచ్చి పొస్తున్నడు. కారు చూసి కాళ్లు, చేతులు కడుక్కొని వారి దగ్గరికి వెళ్లాడు.

        సుదర్శన్, పండరి సంపత్ కు నమస్కరించి.. వచ్చిన విషయాన్ని చెప్పారు. వెంటనే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడం నాకే కాదు, మా రైతులు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇక్కన్నుంచి వెళ్లిపోండి అని రెండు ముక్కల్లో విషయం చెప్పాడు. ఇద్దరు ఒక్కసారి షాక్ తిన్నారు. సంపత్ నుంచి అలాంటి రియాక్షన్ వస్తుందని వారు ఊహించలేదు. ఫ్యాక్టరీ పెడితే ఇక్కడి వాళ్లకే ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు అభివ్రుద్ది అవకాశాలు పెరుగుతాయి.... ఇలా సర్పంచ్ ను నమ్మించే పని మొదలుపెట్టారు. వారి మాటలకు సర్పంచ్ చల్లబడ్డాడు. సరే రేపు పొద్దునొకసారి గ్రామ సభ ఏర్పాటు చేసిన ప్రజలకు నచ్చజెపుతా.. వారు ఒప్పుకుంటే నాకేం అభ్యంతర లేదన్నాడు. దీంతో తాము వచ్చిన పని అయినట్టే అని వారిద్దరు సంతోషంగా వెనుదిరిగారు.

                  గ్రామ పంచాయి ముందు ప్రజలందరు గూమిగూడారు. ఫ్యాక్టరీ విషయం చెప్పగానే కొందరు వద్దు అంటే.. కొందరు కావాలన్నారు. సర్పంచ్ వద్దన్న వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. భూమిఇచ్చిన వారింటికో ఉద్యోగం ఇస్తారట.. నష్టపరిహారంగా డబ్బులు కూడా ఇస్తారు. దీంతో పిల్లలకు మంచి చదువులు చెప్పించొచ్చు. అట్నే మరెక్కడైన భూమి కొనుక్కోవొచ్చని చెప్పాడు. కొందరు కాదని వారించారు. చాలా ప్రాంతాల్లో అభివ్రుద్ది పేరుతో ఫ్యాక్టరీ పెడితే ఊరు వల్లకాడు అయింది... ప్రజలు ఉన్న ఊరును విడిచివెళ్లారని వాదించినా ఫ్యాక్టరీ కట్టే ప్రదేశం భూములున్న వారు ముందుకు రావడంతో వారు కూడా సర్దుమణిగారు.

                 ఫ్యాక్టరీ మొదలు కావడంతో పనులు చకచక నడిచాయి. అందరు సంబరపడ్డారు. చెప్పినట్టుగానే నష్టపరిహారం, ఇంటికో చిన్నదో పెద్దదో ఉద్యోగం ఇచ్చారు. ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తున్నది. కాని చూస్తుండగానే ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతంలో నీటి కరువు మొదలైంది. నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోవడం, తాగడానికి కూడా మంచి నీళ్లు కొనే పరిస్థితి ఏర్పడింది. పదేళ్లలో సకాలంలో వానలు పడక, తాగుసాగునీరులేక ఊరు మనిషిలాగే బొక్కలు తేలినట్టుగా మోడుబారిపోయింది.

            ఈ పదేళ్లు చదువుల కోసం పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లిన యువత అక్కడ కొచ్చి చూసి షాక్ గు గురైంది. పచ్చునూరు అంటే పచ్చని ఊరు అలాంటిది బొక్కల బొందగా మారిందని బాధపడ్డారు. వారంత కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి.. తిరిగి తమ ఊరును బతికించుకునేందుకు నడుం బిగించారు. ఫ్యాక్టరీ కాలుష్య పరిస్థితులు ప్రభుత్వానికి వివరించి దాన్ని మూసివేయించారు. పడ్డ ప్రతి వాన చుక్కను ఒడిసిపట్టి నిల్వ చేయించారు. మొక్కల నాటకం వేగవంతంగా పూర్తి చేసి బాధ్యతగా పెంచి పెద్ద చేసేలా ప్రజలు తెలియజెప్పారు. ప్రజలు కూడా తాము చేసిన తొందరపాటును తొందరగానే అర్థం చేసుకున్నారు. యువత చేస్తున్న కష్టానికి తమ వంతు సహాయం అందించారు.

            ఫ్యాక్టరీలో పనిచేసి రోగులుగా మారిన వారికోసం.. ఫ్యాక్టరీనే హాస్పటల్ గా మార్చి నాణ్యమైన వైద్యం అందించారు. దీంతో క్రమక్రమంగా ప్రజలు మారడం మొదలు పెట్యటారు. దీంతో ఊరు మారింది. మరో నాలుగైదు సంవత్సరాల్లో పచ్చనూరు అనే పేరుకు తగ్గట్టుగా పచ్చని ఊరుగా మారింది    


Rate this content
Log in

More telugu story from Cherala Raman

Similar telugu story from Inspirational