నాన్నే నా రియల్ హీరో
నాన్నే నా రియల్ హీరో
హద్విత congratulations America లో మంచి ఉద్యోగం వచ్చింది ఎప్పుడు వెళుతున్నావు, పార్టీ ఎప్పుడు అని తోటి స్నేహితులు అడగటం మొదలు పెట్టారు.. కానీ హద్విత మొఖం లో ఎలాంటి ఆనంద ఛాయలు కనిపించడం లేదు
..
తన మదిలో బిజినెస్ లో నష్టపోయి దీనంగా, నీచహాయాస్థిలో ఉండటం, అనారోగ్యం తో అమ్మ మంచానికి పరిమితం అవడం ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి..
తన ఫ్రెండ్స్ గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు అప్పుడు అంది చిన్నగా
నేను ఎక్కడికి వెళ్లడం లేదు. ఆ జాబ్ నేను చేయాలి అనుకోవడం లేదు అనే సరికి అందరు షాక్ అయ్యారు..
అవును నాకు ఇప్పుడు ఉద్యోగం, డబ్బులు ముఖ్యం కాదు నన్ను గుండెల్లో పెట్టుకొని పెంచిన నా తండ్రి, నా వెన్నంటే ఉన్నా నా తల్లీ ఇలాంటి కష్టాల్లో ఉన్నపుడు వాళ్లని వదిలి నేను వెళ్ళాను
. నాన్న వ్యాపారం లో దివాళా తీసి అప్పుల్లో ఉన్నారు. అప్పు ఇచ్చిన వారందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఏమి చేయాలో తెలియని నిచ్చహాయ స్థితిలో ఉన్నాడు. అమ్మ అనారోగ్యం తో మంచాన ఉంది ఈ టైమ్ లో నేను వాళ్ళని విడిచి వెళ్ళలేను నేను. నేను ఎప్పుడు అద్దంలో చూసుకున్నా మా నాన్న రూపమే నాకు కనిపించేది, నా నీడలో కూడా నాన్న తోడుగా ఉండేవాడు. ఇప్పుడు నేను వాళ్ళని వదిలి వెళ్లి ఎలా ఉద్యోగం చేయగలను .అని చెప్పాను.. ఫ్రెండ్స్ అందరు మౌనంగా ఉండిపోయారు.
ఇంట్లో నాన్న, అమ్మ కూడా ఎంతో ఆనందంగా నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు నా బంగారు తల్లీ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ దేవుడు చూపించాడు అంటూ పొంగిపోతున్నారు.. మౌనంగా ఉన్నాను.. ఇంటి తల్లీ మౌనంగా ఉన్నావు అంటున్నారు. అప్పుడు చెప్పాను వాళ్ళతో నేను ఎటు వేళ్లను ఇక్కడే మీతో ఉంటాను అని చెప్పాను. నా మాటలు విని కొంతసేపు మౌనంగా ఉండి ఇలా అన్నారు.. నిన్ను కస్టపడి చదివించింది. నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉండటాన్ని మేము చూడాలనే కదా తల్లీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కాదని ఎందుకు ఆలా అంటున్నావు. నాన్న నా చదువు నాకు ఉద్యోగాన్నే కాదు మంచి సంస్కారాన్ని కూడా నేర్పింది.. చదువులో గెలిచానని ఉద్యోగం కొరకు నేను విదేశాలకు వెళితే సంస్కారం లో నేను ఓడిపోయినట్టే కదా. నాన్న నేను నీ కూతుర్ని చదువులో ఓడిపోను, సంస్కారం లో ఓడిపోను. నేను ఇక్కడే మీతో ఉంటూ ఉద్యోగం చేస్తాను.. ఉద్యోగం ఏందీ నాన్న ఒకటి కాకపోతే మరొకటి దొరుకుతుంది. కానీ మీరు నాకు దొరకరు. నేను మీతో ఉంటూ మిమ్మల్ని పోసించే శక్తి మీ కూతురికి ఉంది నాన్న. అని చెప్పేసరికి నాన్న, అమ్మ నన్ను కౌగిలించుకొని ముద్దుల్లో నింపేశారు. అప్పుడు మళ్ళీ చెప్పాను ఇదే నాన్న ఇంత స్వచ్ఛమైన మీ ప్రేమను దూరం చేసుకొని నేను ఉండలేను...
ముగింపు. ఆస్తులు అంతస్థులు మాత్రమే కాదు బలమైన బంధాలు అంతకన్నా ముఖ్యం..
మీ.. బడే రమేష్
