అడ్డపు గోడలు – ఉచిత సలహాలు (భాగం 2)
అడ్డపు గోడలు – ఉచిత సలహాలు (భాగం 2)
రచన: బడే రమేష్
"సమస్య మనది కానంత వరకు మనస్సు స్పందించదు - నిజాన్ని తెలుసుకున్నప్పుడే మానవత్వం మేల్కొంటుంది"
ఊరి జనాలందరి సలహాలు పూర్తయ్యే వరకు శంకరయ్య ఓపికగా విన్నాడు. చివరగా ఆయన పెదవులపై ఒక సన్నని నవ్వు చిందించాడు. "అందరి సలహాలు అయిపోయాయా? అయితే ఇప్పుడు అసలు నిజం చూడండి" అంటూ, ఆ పెట్టె పైభాగంలో ఉన్న ఆ నల్లని సన్నటి తెరను ఒక్కసారిగా తొలగించాడు.
పెట్టె లోపల ఏముందో ఇప్పుడు అందరికీ స్పష్టంగా కనిపించింది. అది చూడగానే ఊరి వాళ్ళంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. భయంతో నోళ్లు వెళ్లబెట్టారు.
ఆ పెట్టె లోపల ఒక పెద్ద రాయి ఉంది. కానీ, ఆ రాయి కింద అందరికీ కనిపించకుండా ఒక పదునైన, పెద్ద ఇనుప ముల్లు అమర్చి ఉంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే... ఆ పెట్టె లోపల ఒక మనిషి చేయి ఉంది. ఆ చేయి మరెవరిదో కాదు... రామయ్యది! ఆ పెట్టె వెనుక భాగంలో ఒక రహస్య ద్వారం ద్వారా రామయ్య కూర్చుని ఉన్నాడు. జనాలంతా ఆ పెట్టెలోకి చేయి పెట్టి రాయిని నొక్కి చూస్తున్న ప్రతిసారీ, ఆ బరువుకు ఆ రాయి కింద ఉన్న పదునైన ముల్లు లోపల ఉన్న రామయ్య చేతిలోకి బలంగా గుచ్చుకుని రక్తం దారాలంగా కారుతోంది. రామయ్య ఆ నొప్పిని భరిస్తూ, కళ్లల్లో నీళ్లను ఆపుకుంటూ, పెదవి విప్పకుండా అక్కడ కూర్చుని ఉన్నాడు.
అది చూసి సుబ్బారావు, సూరయ్యలతో పాటు ఊరి జనాల గుండెలు జారిపోయాయి.
(తరువాయి భాగం త్వరలో ...)
