STORYMIRROR

RJ PRETTY PRATHYUSHA

Inspirational

4  

RJ PRETTY PRATHYUSHA

Inspirational

నాన్న తో నేను

నాన్న తో నేను

6 mins
254

నాన్న తో నేను

 ఆదివారం అంటే చాలు తెలియని బద్ధకం నా మైండ్లో ఈజీగా వచేస్తుంది, బెడ్ మీద నుండి లేచి కూర్చొని ఫోన్ చుస్తే కళ్ళు నలుపుకున్నాను, పేపర్ చదవడం మానేసి ఫేస్బుక్ చూసే రోజులు కదా! అలాగే అలవాటులో అన్ని యాప్స్ ఓపెన్ చేసి చూసి, గూగుల్ వైపు వెళ్లి నా పేరెంట్స్ పేరులు సెర్చ్ చేసి చూడటం మొదలు పెట్టాను.

    నేను నా పేరెంట్స్ కి దూరమై చాల కాలం అయిపోయింది. గత 15 సంవత్సరాలుగా నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయిన, వాళ్ళ మీద నాకున్న ప్రేమ, కేర్ ఇప్పటికి అలాగే ఉండిపోయాయి. మా అమ్మ పేరు సెర్చ్ చేసినప్పుడు తన డాన్స్ క్లాస్సేస్ గురించి, తన పేరు మీద ఉన్న చర్చి అలాగే కమ్యూనిటీ బులెటిన్ బోర్డ్స్ ఇలా ఎప్పుడు కనపడే జనరల్ ఆర్టికల్స్ కన్పించాయి. అది చూసి "హమ్మయ్య! అమ్మ బావుంది" అని అనుకున్నాను. తర్వాత వెంటనే మా నాన్న పేరుతో వెతకడం మొదలుపెట్టాను. సంస్మరణ బిజినెస్ పేరుతో దహనం లేదా ఖననం సర్వీసెస్ ఇచ్చే వెబ్సైటు ఒకటి ఫస్ట్ కనపడింది. అందులో నాన్న పేరుతో ఒక ఫోటో కూడా లేదు ఎవరో చిన్న అబ్బాయివి ఇంకొన్ని ముసలాయన ఉన్నవి కనపడ్డాయి.

   ఒకవేళ ఇది నాన్న గురించా అన్పించింది !! అయ్యుండొచ్చు కాకపోవచ్చు, ఈ షాక్ నుండి నన్ను నేను బైటకి తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది తన సంస్మరణ అయ్యుండదు కానీ అవును అనే ఆలోచన నా మనసులో నుండి పోవడం లేదు. సరిగ్గా ఒక నెల క్రితం ఎందుకో నాకే తెలియని ఆలోచన నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదు, ఎదో పని వత్తిడి లేదా అందరిలా ప్రపంచంలో ఉన్న మహమ్మారి వలన ఏమో అనుకున్నాను. నాన్నలా నాకు సలహాలు ఇచ్చే ఒక మంచి సన్నిహితుడు మరణించడంతో, అవి అయన దూరమవ్వడం వల్ల అయ్యుండొచ్చు, బహుశా నా ఆలోచన తప్పు అనిపించింది.

           ఆ తెల్లవారు జామున నేను ఇంకా నాన్న గురించి ఆన్లైన్ పేపర్ లో వెతకాలి అనుకున్నాను, అప్పుడే అనుకోకుండా ఆ సంస్మరణ సెక్షన్ లో నాన్న పేరు కనిపించింది, అంతే నేను షాక్ అయిపొయాను, చివరికి నాన్న చావు ఒక నెల తర్వాత ఇలా తెలుసుకోవాల్సింది అని చాల బాధపడ్డాను. బహుశా దీనివల్లేనే ఒక నెల క్రితం నాకు ఆలా ఎప్పుడు రాని ఆలోచన, ఆందోళన వచ్చి ఉంటాయి అనుకున్నాను. నన్ను నేను సముదాయించుకున్నాను. నాన్న పేరు కింద ఇంకా మా వంశంలో బ్రతికి ఉన్న వారి పేర్లు, నా పేరు (మా నాన్న నుండి వచ్చింది, ఇంటి నుండి బైటకి రాగానే మార్చేసుకునాన్ను) ఇంటిపక్కనే ఉన్న వారు, చుట్టాలు అందరి పేరులు ఉన్నాయి. అసలు మా నాన్న చనిపోతే నన్ను ఎవరు ఎందుకు పిలవలేదు??? నేను ఆయనని పట్టించుకోనా? నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదా? అని నాలో నేను మదన పడ్డాను.

కేవలం గూగుల్ ద్వారానే నా పేరెంట్స్ గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని కొన్ని ఏళ్ళ క్రితం నుండి నేను భయపడినట్లే, జరిగింది. కానీ ఇలాంటి సందర్భం వచినప్పుడు అయిన నా అనుకున్న వాళ్ళు కచ్చితం నాకు చెప్తారు అనే ఆశా అయితే ఉండేది. కానీ మా నాన్న గారి పేరు కింద రాసిన విషయాలు అన్ని చదువుతుంటే నాకు తెలిసిన, నాతో ఉన్న వ్యక్తి ఈయన కాదు కదా అనే ఆలోచన నన్ను ఆలోచనలో పాడేసాయి.

ఆయనొక మాత సంబంధాలు గౌరవించే వారిగా, మంచి పొరుగింటి వారిగా, మంచి స్నేహితుడిగా, గొప్ప నాన్న అని కొంతమంది అయన గురించి అక్కడ రాశారు. నిజానికి నాకు అయన ఆలా పరిచయం లేని వ్యక్తి, ఇలాంటివి చదువుతున్నపుడు కోపం, బాధ నాలో పొంగిపోయాయి. నాకు తెలిసిన నాన్న ఒక్కసారిగా నాకు గుర్తొచ్చారు. నేను బాగా చిన్నగా ఉన్నపుడు "నువ్వొక దేనికి పనికి రాని దానివి" అని అన్న మాట నాకు ఇంకా గుర్తుంది. నేను చేసిన చిన్న తప్పు అయినా ఒక నేరంలా చూసేవారు "ఎందులోనూ నీకు ఎలాంటి ప్రావిణ్యం లేదు, ఇవన్నీ టైం వేస్ట్ పనులు ఆపేయ్ " అని నన్ను అనేవారు. ఇవి నా మనసులో అలాగే ఉండిపోయాయి, ఇప్పటికి గుర్తు చేసుకుంటే భాదగా ఉంటుంది. ఇలాంటి మాటలు అప్పుడే కాదు ఆయన నా చిన్నప్పటినుంచి నా ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో నన్ను అంటూనే ఉండేవారు. ఎందులో అయినా ఫెయిల్ అయితే అది నా మొహం మీద రుద్దేవారు, ఓడిపోతానేమో అనే భయంతోనే చాలా ఎక్కువ గడిపేశాను, ప్రొఫెషనల్గా ఎక్కడ ఎలాంటి సక్సెస్ ను నేను చూడలేకపోయాను.


  ఒకవేళ చదువు గురించి చాలా కేర్ గా ఉండి ఉంటే ఇంత బాధ పడాల్సిన అవసరం లేదని, నేను ఒక చదువు రానిదాన్ని, దేనికి పనికిరాని, ఎలాంటి కల్చరల్ ఆక్టివిటీస్ లో కూడా టాలెంట్ లేని దానిని అనేవారు. "ఒకవేళ నీ లైఫ్ లో నీకు ఏదైనా ఉద్యోగం వచ్చిన గాని దానికి నువ్వు చాలా తక్కువ జీతంతో పని చేస్తూ ఉంటావు, నీ పక్కన అందరూ ఎప్పుడు కోపంగా, ఇబ్బంది పెట్టే వారే ఉంటారు" అని అంటూ ఉండేవారు. పైగా నేను లావుగా ఉంటాను అని, బద్దకంగా ఉంటాను అని, ఎలాంటి ఫోకస్ లేకుండా లైఫ్ లో ఉంటాను అని, పియానో పట్టుకొని టైం వేస్ట్ చేస్తున్నానని, నన్ను డిసప్పాయింట్ చేస్తూ ఉండేవారు. నా మొదటి ప్రేమలో నేను విఫలమైనప్పుడు కూడా "నీకు మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నావా నీలాంటి వారికి ఇలానే జరుగుతుంది. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా ఆ జీవితంలో కూడా నీకు ఎలాంటి సంతోషం ఉండదు ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి" అని అంటూ ఉంటే వారు.

నేను చదువుకోడానికి ఇంటి నుండి యూనివర్సిటీ కి బయలుదేరుతున్నప్పుడు కూడా నాన్న " ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే మళ్లీ తిరిగి వెనక్కి రావాలి అని మాత్రం ఆలోచించకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, ఒక సొంత ఉద్యోగం తెచ్చుకో అందులో వచ్చే జీతంతోనే బతుకు నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకో" అని అన్నారు


ఇలా ఆయన నన్ను ఎన్నో మాటలు అంటూ నన్ను బాధ పెడుతూనే ఉన్నారు.

తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇలా ఉండే మనస్తత్వాన్ని పిల్లలు కోరుకోరు. పిల్లల్ని బాగా పెంచాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేలాగా తీర్చిదిద్దాలని అనుకుంటారు. వాళ్లలో ఉన్న చిన్న టాలెంట్ అయినా గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేసి ముందుకు పంపించాలి అనుకుంటారు. నా విషయంలో అలా జరగలేదు. మాటలు పడుతూనే నా చిన్నతనం అంత గడిచిపోయింది.

ఆ తర్వాత నా మీద నేనే కాన్ఫిడెన్స్ కోల్పోయాను నేనెవరితోనూ మంచిగా ఉండనేమో అనే ఆలోచన బాగా బలంగా ఉండిపోయింది. అందుకే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. నా టీనేజ్ అంతా పియానో వాయించుకుంటూ లేదా నాకు ఇష్టమైన పెంపుడు జంతువులతో ఆడుకుంటూ గడిపే దాన్ని.

ఒకవేళ నేను ఫ్రెండ్షిప్ చేసిన అది నా వైపు నుంచి మాత్రమే ఉండేది. ఎందుకో తెలియదు అందరూ నన్ను వాడుకుంటున్నారు అని అనిపించేది.ఇచ్చింది తిరిగి చేయాలి అనే లాగా నా ఫ్రెండ్ షిప్స్ అన్ని ఉండేవి. నా జీవితంలో నేను ఓడిపోతానేమో అనే భయంతోనే ఎక్కువ గడిపేసాను. అందుకే కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం లేదా వాటిని ప్రయత్నించడం పూర్తిగా మానేశాను.


    కొంచెం పెద్దయిన తర్వాత నా జీవితంలోకి కూతుర్ల చూసుకుని, ఒక తండ్రి లాంటి సన్నిహితుడు నాకు దొరికారు. మా అమ్మమ్మ తాతయ్యల తర్వాత నాకు అంత ప్రేమ అందించింది ఆయన మాత్రమే. నాలో ఉన్న చిన్న టాలెంట్ ని అయినా గుర్తించేవారు. నేనేం చేయగలను అనేది నాకు తిరిగి గుర్తు చేస్తూ ఉండేవారు.

నేను మంచిదాన్ని అని, తెలివిగల అమ్మాయిని అని, ఎలాంటి విషయం అయినా సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలనని నాకు చెప్పిన మొదటి వ్యక్తి ఆయనే. మొదట్లో నేను ఆయన్ని కూడా నమ్మేదాన్ని కాదు, కానీ ఆయన కళ్ళల్లో నా గురించి చూస్తున్న ఆలోచనలు చేస్తుంటే నన్ను నేను నమ్మేలా చేశాయి. ఒక ప్రేమగా ఉన్న తండ్రి ఎలా మాట్లాడుతారో ఆయన నాతో అలా మాట్లాడేవారు ఎందులో అయినా ఫెయిల్ అయితే నన్ను చూసి ఎగతాళి చేయకుండా, అందులో నుంచి ఏం నేర్చుకోవాలి తర్వాత ఏం చేయొచ్చు అనేది నేర్పించేవారు.


  నాకు కావలసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆయనే ఇచ్చారు. అలా నా తర్వాత చదువుకి కావాల్సిన యూనివర్సిటీ కి ధైర్యంగా ముందుకు అడుగు వేసేలా చేశారు. ఒకవేళ ఆయన నా లైఫ్ లో లేకపోతే నేను ఇంత ఎదిగేదాన్ని కాదేమో, అలాగే ప్రేమగా చూసే తల్లిదండ్రులు ఉంటారు అనే విషయాన్ని కూడా నమ్మేదాన్ని కాదేమో అనిపించేది. నాన్న గురించి రాసిన విషయాలన్నీ చదువుతున్నప్పుడు ఆయనతో అందరికీ ఉన్న మంచి రిలేషన్షిప్ గురించి మాత్రమే మాట్లాడారు. ఒకవేళ ఆయన నాతో మంచిగా ఉండు ఉంటే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఆయనతో మాట్లాడకుండా ఉండేదాన్ని కాదేమో అని అనిపించింది.


   కానీ అక్కడ రాసిన ప్రతి ఒక్కటి నిజమే అయి ఉండొచ్చు . ఆయన నిజంగానే ఒక మంచి స్నేహితుడు అయ్యుండొచ్చు, ఒక మంచి పొరుగింటి వాడు అయ్యుండొచ్చు, ఒక మంచి తండ్రి కూడా అయ్యుండొచ్చు, నాతో మాత్రం కటువుగా, తనకు నచ్చింది మాత్రమే జరగాలి అని ఆలోచించే వ్యక్తిగా, దుర్భాషలాడే వ్యక్తిగా, పిల్లల్ని పట్టించుకోని తండ్రిగా మాత్రమే ఆయన నాకు తెలుసు. మన లైఫ్ లో ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ల గురించి మనకున్న మంచి మెమరీస్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. కొన్ని ఏళ్లగా నేను నా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, వాళ్లు నన్ను బాధ పెట్టిన.. నా జీవితంలో ప్రతి ఒక్కటి నేను యాక్సెప్ట్ చేస్తూనే వచ్చాను. నా తండ్రి నాతో ప్రేమగా ఉండి ఉంటే ఇంకా ఎంత బాగుండేదో అని మాత్రమే ఊహించుకునే దాన్ని.

అలాగే ఒక కూతురికి తండ్రి నేర్పించే పాఠాలు, ఆయనతో కలిసి వేసే అడుగులు, కలిసి ప్రయాణం చేసే దూరాలు, అన్నిటికన్నా ఆయన ప్రేమ ఉండి ఉంటే నేను ఇంకా సక్సెస్ ఫుల్గా ఉండేదాన్నేమో.

మా అమ్మమ్మ చనిపోయే ముందు నేను మా నాన్న తో మాట్లాడిన చివరి మాటలు చాలా మంచిగా ఉన్నాయి. అవి మాత్రమే నాకు ఆయన్ని మంచి తండ్రిగా గుర్తు చేశాయి. మనం కావాలి అనుకున్నట్లు అందరూ మన లైఫ్ లో ఉండరు, ముఖ్యంగా నా లైఫ్ లో నా తండ్రి నాతో లేరు, అయినా పర్వాలేదు అనుకున్నాను. ఎవరు ఎలా ఉంటే అలానే వాళ్లని మనం మన జీవితంలో యాక్సెప్ట్ చేయాలి వాళ్లు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం వాళ్ళని తిరిగి బాధపెట్టాలి అనే ఆలోచన కూడా రాకుండా ఉండడమే ఎంతో గొప్పది. జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే - కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అనుకుంటూ ముందుకు సాగిపోవాలి.



Rate this content
Log in

More telugu story from RJ PRETTY PRATHYUSHA

Similar telugu story from Inspirational