ముఖాముఖి
ముఖాముఖి

1 min

408
ఒక పెద్ద సంస్థ లో ఒక ఉన్నత పదవి కోసం ముఖాముఖి పరీక్ష నిర్వహించబడింది...అందరూ తమ తమ ఫైళ్లు పట్టుకొని ఉన్నారు...అందరూ అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు...నాకు రాదు....నాకు వచ్చినది కేవలం మాతృ భాష అయిన తెలుగు మాత్రమే... ఆ కంపెనీ లో అనర్గళంగా ,ప్రేమగా క్లయింట్ లతో మాట్లాడేందుకు భర్తీ చేయబడుతున్న పోస్టు అది...అంతమంది నీ చూశాక ఆశ వదులు కున్నా...కానీ ప్రయత్నం తప్పు కాదు గా
ఆశ్చర్యం గా ....వచ్చిన అందరిలో నేను మాత్రమే ఎంపిక అయ్యాను...మాతృ భాషలో మాట్లాడటం రానందు వల్ల సరయిన భావవ్యక్తికరణ లోపించింది అందరిలో.. మాతృ భాష మీద పట్టు లేకుంటే ఏ భాష మీద పట్టు రాదు అని వారు తెలుసుకోలేక పోయారు. నా భాష లోఉన్న మాధుర్యం ఆ సంస్థ అధినేత నీ కట్టిపడేయడమే దానికి కారణం...తెలుగు భాష లో ఉన్న మాధుర్యం మరే ఏ భాష లో వుంది మరి...