STORYMIRROR

Sruthi .A

Inspirational

2.0  

Sruthi .A

Inspirational

మనిషి తన సంతోషాన్ని కోల్పోతున్నాడు

మనిషి తన సంతోషాన్ని కోల్పోతున్నాడు

4 mins
64

అలా కొద్దిసేపు మాట్లాడదామా

ప్రతిరోజు మనం ఏదో ఒక ఆలోచనలో ఉంటాము కదా ఎప్పుడు ఎందుకు ఎలా ఏమి చేయాలి అని అసలు మనం కోరిన జీవితం మనం జీవిస్తున్నామా? 
ఒక్కరోజు
అసలు ఒక్క రోజు అంటే ప్రతి మనిషి జీవితం ఒక్క రోజుతోనే మొదలవుతుంది అది ఒక్కరోజులోనే ముగిస్తుంది ప్రతి మనిషి తలంచేది ఏమిటి నేను జీవితాన్ని ముగించే లోపు ఏదైనా సాధించాలి లేదు అంటే ఏమైన చేయాలి ఒక వ్యక్తి తన అనుకున్నది చేయడానికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా ప్రతి ఒక్కరూ ఇలా అంటారు నాకంటూ ఒకరోజు వస్తుంది అని 
కానీ చాలామంది తమ లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్తారు అది మీకు తెలుసా ఎందుకు అలా చేస్తారు మీరు చెప్పగలరా? 
నేను చెప్తాను మీరు కూడా ఆలోచించండి 
ఒక తండ్రి మరియు కొడుకు ఒకరోజు పొలానికి వెళ్తున్నారు ప్రయాణం సాగుతుంది చీకటిగా ఉంది అప్పుడు తండ్రి లైట్ వేశాడు మధ్యలో తండ్రి నీవు ముందుగా వెళ్ళు అని కొడుకుని అన్నాడు అప్పుడు కొడుకు భయంతో అడుగులు వేస్తున్నాడు పొలం గమ్యంలో సాగుతున్నారు మధ్యలో ఒక పురుగు వచ్చింది. అప్పుడు కొడుకు పరిగెత్తుకొనే తండ్రి దగ్గరికి వెళ్తాడు తండ్రి ఇలా అంటాడు అది పురుగు అని అప్పుడు కొడుకు మళ్లీ నడవడం మొదలు పెడతాడు 
మార్గంలో వెళ్తుండగా మళ్లీ ఒక జంతువు వస్తుంది అప్పుడు తండ్రి అది జంతువే అని అంటాడు మనం కూడా మన జీవితంలో మనం లక్ష్యంగా ఎంచుకున్న మార్గంలో చాలా పరిస్థితులు అవమానాలు నీవు చేయలేవు అని ఒకరు చెప్పారని ఏదో చదివామని మా నా స్నేహితులు చేశారని ఇలా తమ లక్ష్యాన్ని తీసుకుంటారు కానీ అలా కాదు అలా తమ లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్తారు లక్షము అన్నది ప్రయాస ఆలోచన మొండితనం అవసరం
 
మనసును అదుపులో ఉంచుకో 

చాలామంది ముఖ్యంగా యవనస్తులు ఏదో చెయ్యాలి ఆలోచించడం జరుగుతుంది కానీ అది మంచిది కాదు ఎందుకంటే చేయాలి  మొదటగా అసలు నీవంటే ఏమిటి అసలు ఎప్పుడైనా నీ సొంతంగా నిన్ను నీవు చూసుకుని నవ్వా ఒక్కరు నవ్విస్తే కానీ ఒకరు సంతోష పెడితే కానీ అలా కాదు నీవు ఎప్పుడైనా నీకు నీవు ఇష్టపడేవా ఒక్కసారి నీకు నచ్చిన నట్లు జీవించావా
మనం ఒక వ్యక్తికి కానీ ఒక దానికి ఎప్పుడు ఆకర్షణ కాకూడదు నీవు ఎప్పుడైతే ఒకదానికి ఆకర్షింపబడావు అంటే అప్పుడు నీకు నీవు వెతుక్కోవడం మానివేస్తా  అసలు నీలో ఏమి ఉంది అనేది నీకు తెలియదు 
అందమైన ఆలోచనలు 
సంతోషం ఎక్కడ వెతకాలి ఎక్కడ దొరుకుతుంది 
మీరు ఎప్పుడైనా సంపూర్ణంగా చూశారా గమనించుకున్నారా అయితే మీరు ఇప్పుడు సంతోషంగా ఉంటారు చాలాసార్లు మనం సమస్య సమయాన్నిబట్టి మనం సంతోషాన్ని కోల్పోతాం కదా 
ఇప్పుడు ఎక్కువమంది తమ చేయాలి అనుకున్నది చేయకపోవడం వలన లేదు అంటే చేసినది విజయం దొరకపోవడం వలన సంతోషాన్ని కోల్పోతారు 
సంతోషాన్ని మన జీవితంలో ఎలా అనుభవించాలి 
రండి చూద్దామా ఒకసారి నవ్వండి సంతోషమనేది ఒక వ్యక్తిని ఒక నూతన స్వభావం లోకి తీసుకుపోవడం ఈ విధంగా చాలామంది ఎప్పుడు సమస్యల్లో లేదు అంటే ఓటమి అప్పుడు సంతోష పడడం మానేస్తారు 
జీవితంలో మనం ఏమి చేస్తే సంతోషం వస్తుంది 
చాలామంది సంగీతం లేదా  వంట చేయడం లేదా ఫ్రెండ్స్ తో మాట్లాడటం వలన సంతోషపడతారు కదా జీవితంలో ఇది కూడా  కొన్ని రోజులు సంతోషం అనేది మన అనుభూతి కాదు ఎందుకు ఎవరో వచ్చి నువ్వు ఇలా అని చెప్తే నమ్ముతావు కదా కాదు నీలో సంతోషం ఉంది అది నీకు సరిపోయే సంతోషం కన్న ఎక్కువగా ఉంది ఒంటరిగా ఆలోచించు నీలో ఏమి సమస్యను కోల్పోతున్న అనేది తెలుస్తుంది 

నియమాన్ని ఉల్లంఘించండి

నియమాన్ని ఉల్లహించాలి అనేది చాలా ఇది ఒక పెద్ద మాట ఎందుకు అంటే సమయం అయిపోయిందని లేని వయసు అయిపోయింది అని నీకు సమయం లేదు అని ఇవి నియమాన్ని లో పని చేయవు ఒక వ్యక్తి సాధించాలి అంటే నియమాన్ని ఉల్లహించాలి ఉదాహరణకు 
ఒక గ్లాసును ముగ్గురు దగ్గర మూడు గ్లాసులు ఉన్నాయి మొదటి వ్యక్తిన్నీ ఎలా అన్నాడు ఈ గ్లాసును ఎలా నీవు చూడగలవు మొదట వ్యక్తి ఎలా అన్నాడు గ్లాసులో స్ట్రా  వేసి జోస్ కి ఉపయోగించగలము 
రెండో వ్యక్తి
అన్నాడు గ్లాసు కీ ఒక కప్ పెట్టు ఆ కప్ కీ వోల్ పెట్టు అందులో స్ట్రా పెడితే చాలా బాగుంటుంది అని 
మూడవ వ్యక్తి ఇలా అన్నాడు
ఎందుకు గ్లాస్ డిజైన్ చేంజ్ చేసి పెడితే ఎలా ఉంటుంది అన్నాడు ఇక్కడ నీ ఆలోచన అనేది ఎలా ఉపయోగిస్తున్నావు ఒక అంశాన్ని నీవు ఏ విధంగా చూస్తున్నావు ఆలోచిస్తున్నావు ప్రతిరోజు అందరు ప్రయాణం చేసే మార్గంలో వెళ్లకూడదు ఒకరు చూపిన మార్గంలో వెళ్ళకూడదు ఒక మార్గం నీవు ఎంచుకోవాలి దానిలో నమ్మకముగా పనిచేయాలి ఒకరి సుఖంలో ఎప్పుడూ బతకకూడదు

ఒంటరితనం

ఒంటరితనం చాలా విషయాలు నేర్పిస్తుంది నీవు ఏంటి అని తెలియజేస్తుంది అది చాలామంది ఒక సమస్యగా చూస్తారు కానీ మనం అందరితో ఉన్న దానిని కన్నా ఒంటరి ప్రయాణం చేసినప్పుడు మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది నీలో ఉన్న వ్యక్తిని బయటకు తీస్తుంది నీ ప్రవర్తన బయటకు తీస్తుంది జీవితంలో ఏ ఏమి చేస్తాను ఏమి చేయబోతున్నాము అని ఈ ఒంటరితనం నిర్ణయిస్తుంది అది ఒక సమస్య కాదు నేను ఒంటరిగా అయ్యానని ప్రతి ఒంటరితనంలో ఒక పాట నేర్చుకోవాలి ఒక వ్యక్తిని బాగు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది నీకు ఓపికలో నేర్పిస్తుంది ఒంటరి బహుమానం లాగా ఉపయోగించుకోవాలి దానిని సమస్యల చూడకూడదు 

మీ నమ్మకం ఎలా కోల్పోతారు కారణం

నేను గొప్ప వ్యక్తిని అవుతాను ఒక బిజినెస్ పర్సన్ అవుతాను ఇది ఒక ఆలోచన మాత్రమే ప్రయాణం కాదు ఆలోచన అనేది ఆశ మాత్రమే ప్రయాణం కాదు అసలు ఎందుకు నేను గొప్ప వ్యక్తి కావాలని మనిషి తలుస్తాడు తనకన్నా ఎవరో ఎక్కువగా జీవిస్తున్నారు అందుకు తాను ఏదో చేయాలి అని ప్రయాణం చేస్తున్నాడు ఇలా ఆలోచించినప్పుడు మీ నమ్మకాన్ని కోల్పోతారు ఆలోచన మాత్రమే ఉంటుంది ఎదుటి మనిషిని చూసి మనం ఎప్పుడూ పని ఆలోచన చేయకూడదు తనలా నేను కూడా కావాలి అని నీలో ఏ యొక్క సామర్థ్యం ఉందో దానిని గుర్తించు దానిని ఒక ప్రయాణం కష్టపడి పని చెయ్ నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అది ఏమిటి అని అంటే చాలామంది పెద్ద పెద్ద ఆలోచనలు చేయడం అదే జీవితంగా తీసుకోవడం పెద్ద బిజినెస్ మాన్ అనుకోని ఒక లక్ష్యం పెట్టుకుంటారు దానికోసం శ్రమిస్తారు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు దానికోసం కష్టపడతారు కానీ చివరికి దాన్ని పొందుకోరు అప్పుడు ఏం చేయాలి నేనంటాను మనం దేనినైతే లక్ష్యంగా ఎంచుకొని శ్రమిస్తాము దానిని మనం పొందలేనప్పుడు నీ ఆలోచన నీవు చేయాల్సిన పని ఇంకొకటి ఉందని మనం నిర్ణయించుకోవాలి ఇప్పుడు నీవు చేయాలి అనే ఆలోచన నీకు రాదు ఎందుకు అని అంటే నీ ఆలోచన నీకున్న ప్రతి శక్తి దాని మీద పెట్టేసి ఇంకొక ఆలోచన చేయడానికి రాదు నీవు అనుకున్నది సాధించలేదు అని అంటే నీవు పనికిరావు అని అర్థం కాదు నేను చేయాల్సింది ఇంకొకటి ఉంది అని నీవు ఆ యొక్క లక్ష్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకటి కొత్తగా ఆలోచించి ప్రయత్నం చేసినప్పుడు నీకు సహాయకరంగా ఎవ్వరూ ఉండరు ఎందుకు అని అంటే నీవు అనుకున్నదే చేయలేకపోయావు మళ్లీ ఇంకొకటి మొదలు పెడుతున్నావా అంటారు అప్పుడు నీకున్న బలమంత పోగు చేసి దానికోసం శ్రమించి ప్రేరణ చేసుకుని ముందుకు సాగాలి మొండితనం నీలో వస్తుంది చాలామంది మొదటి ప్రయత్నం మంచిది భావిస్తారు మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యావు అంటే రెండో ప్రయత్నం అనేది ఈ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది
 
ఈ ప్రపంచంలో ఓటమి అనేది లేదు 

ఓటమి నీవు అంగీకరించావు అంటే నీవు ఏమి ప్రయత్నం చేయలేదు అని అర్థం చాలామంది ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకొని విజయాన్ని సంతోషిస్తారు
నీ చుట్టుపక్కల ఉన్నది నిజమా సత్యమా కాదనేది ఒకటే ఒకటి తెలిపేది ఓటమి 

చివరి మాట 

నీ జీవితంలో ఏమి జరిగినా ఇది నేను చేయలేను అనే పరిస్థితి జీవితంలో వచ్చిన నీ శక్తినినంత పోగుచేసుకుని నేను ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలు పెడతాను అని లే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద బాధపడాల్సిన విషయం ఏదీ లేదు ఏదైనా సాధారణంగా తీసుకో సాధారణంగా వదిలిపెట్టు నేను చెప్పేది ఎప్పటికీ నీ సంతోషాన్ని కోల్పోవద్దు.


Rate this content
Log in

Similar telugu story from Inspirational